బ్యాంకులకు ఇళ్ళు వదిలెయ్యడం అన్నది మా ఇల్లినాయ్ రాష్ట్రానికి కూడా బాగానే పాకిందట. శుభం.
అతి గొప్ప సూపర్ కంప్యూటర్ టైటిల్ యు ఎస్ నుండి చైనాకి వెళ్ళింది. ఆశ్చర్యం ఏముంది? రేపో మాపో ఆ టైటిల్ ఇండియాకీ దక్కుతుంది. అన్నట్టు ఇండియా సూపర్ కంప్యూటరుని పూణేలో నేను దర్శించాను.
మాల్దీవ్సు లో ఒక విదేశీ జంటకు పెళ్ళిచేస్తూ నిర్వాహకుడు ఆ జంటకి తెలియని భాషలొ మంత్రాల్లాంటివి చదువుతూ మీకు పుట్టబోయే సంతానం బాస్టర్డ్స్ కానూ అనీ ఇంకా చాలా చాలా తిడుతూ దీవించేడంట. ఇప్పుడు దానిపై మాల్దీవులలో పెద్ద దుమారం చెలరేగుతోంది. మాల్దీవియన్స్ అంతా ఆ పెళ్ళి పూజారిని తిట్టేస్తున్నారు - తమ దేశానికి తలవంపులు తెచ్చినందుకుగాను.
http://www.bbc.co.uk/news/world-south-asia-11644328
ఆ మధ్య చదివిన విషయం ఒకటి గుర్తుకువుంది. యు ఎస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడు 10% ఉద్యోగాలని తొలగించే సూచనలు వున్నాయంట. బ్యాంకు ఉద్యోగస్తులూ జాగ్రత్త.
వాహనాల జాతకం మీద శర్మ గారు పోస్టు వేసారు కానీ చదవలేదు. హ్మ్. ఇలా అన్నింటికీ జాతకాలుంటాయంటే నా చెప్పుల జాతకం ఏంటో తెలుసుకొవాలి. అసలే వచ్చేది హార్ష్ వింటర్. ఐసుమీద చెప్పు జారిందనుకోండి నా జాతకానికి ఎసరు వస్తుంది.
డ్రీంస్ మొదలయిన వారి కథనాలను వింటుంటే ఆరెంజ్ పాటలు ఓ రేంజులో వున్నట్లున్నయ్యే. అన్నీ కూడా హీరో సోలో సాంగ్సేనుట.
తన్‌హాయి 34 వ భాగం వేసారు కల్పన గారు కానీ ఇంతవరకు నేను ఒక్క భాగమూ చదవలేదు. సోషల్ నవల్స్ మీద ఆసక్తి బొత్తిగా తగ్గింది నాకు. ఆ నవల పేరుకి అర్ధం చెప్పమంటే ఇంతవరకూ కల్పన గారు చెప్పలేదు నాకు. అఫ్సర్ గారిని ఆ అర్ధం అడుక్కోమన్నారు! మా నాన్న హిందీ పండిట్/లెక్చరర్. అందుకే హిందీలో పరమ శుంఠని నేను.

రోజంతా సరికొత్త వార్తలతో వ్యాఖ్యలతో ఈ టపాని తాజీకరిస్తుంటాను (సరి అయిన పదమేనా ఇది?).