తలనొప్పిగా వుంది బాస్

నిన్న సాయంత్రం ఒక  మీటప్ కి వెళ్ళాను. అక్కడ సెర్వర్ డ్రింక్స్ ఏమయినా కావాలా అని అడిగితే ఫ్రూట్ జ్యూస్ ఏమున్నాయి అని అడిగాను. నా ఎదురుగా కూర్చున్న అమ్మాయి నాకేసి విచిత్రంగా చూసినట్లు అనిపించింది. ఓ, అలా పళ్ళ రసాలు తాగడం ఈ మీటింగుల్లో సభ్యత కాదేమోనని ఎందుకయినా మంచిదని ఓ హనికెన్ బీర్ అర్డర్ చేసాను. అది తాగినప్పుడు బాగానే వుంది కానీ ఇంటికి వచ్చాక తలనొప్పి పట్టుకుంది.

ఇదివరలో గజతాగుబోతును కాకపోయినా చిరుతాగుబోతుగా వుండేవాడిని. ఇప్పుడు బీర్ కూడా హరాయించుకోలేకపోతున్నానా అనిపిస్తోంది. బహుశా నేను వాడే మెడిసిన్ కీ, ఆల్కాహాలుకీ పడక తలనొప్పి వచ్చి వుంటుంది. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరం కాకపోయినా వాడకపోవడం మంచిది అని సూచన వుంటుంది.

ఇంకా తలనొప్పి పూర్తిగా తగ్గలేదు కానీ నెమ్మదిగా తగ్గుతున్నట్లుంది. ఇవాళ జయ, మధు మరియు సుమంత్ మాట్లాడి వారి వ్యవహారం సెటిల్ చెయ్యాల్సివుంది కానీ ఈ తలనొప్పితో వాళ్లతో ఏం మాట్లాడగలను? అసలే మా సుమంత్ చెప్పిందే చెప్పి, సాగదీసి, సాగదీసి బేజా ఫ్రై చేస్తాడు. ఇవాళ ఒక ప్రత్యేకమయిన టపా వ్రాయాల్సివుంది కానీ అదీ వాయిదా వేస్తాను.

నాది మామూలు తలనొప్పేకానీ నాకేం సంతాప సందేశాలు పంపించకండి, ఏం.

16 comments:

  1. ఈ కథ ని కంచి కి పంపండి... తర్వాత నా సమస్య ని మీకు వివిరిస్తాను... నాకు మీ సహాయం సలహాల రూపం లొ కావాలి....

    --అభిమానీ---

    ReplyDelete
  2. తగ్గాలంటే ఫుల్ కొట్టాల్సిందే కదండీ:)

    ReplyDelete
  3. ఏంటి శరత్ సర్ మీ కాయ కామెంట్ రాయలేదు?
    వెయిటింగ్ ఇక్కడ!!!
    :)

    ReplyDelete
  4. ఇష్టమైన పనులు చేసేటప్పుడు తలనొప్పి దానంతట అదే పారిపోతుంది. చేయాలనుకున్నది మీకిష్టమైన పనే అయితే వాయిదా వేయకుండా పూర్తి చేయండి.

    ReplyDelete
  5. బీరు తాగుబోతులకు ఇలాగే అవుద్ది. చక్కగా వైన్ కొట్టక ఈ బీరు గోలేందిభయ్ ;)

    ReplyDelete
  6. ప్రతీ రోజూ తాగాలి మరీ...మద్యలో నాగా పెడితే ఇలాగే జరుగుద్ది మరీ...

    ReplyDelete
  7. @ అజ్ఞాత అభిమాని
    కర్సవుద్ది మరి. తృణమో, పణమో సమర్పించుకోవాలి మరి. జస్ట్ కిడ్డింగ్. చెప్పండి - తప్పకుండా ప్రయత్నిద్దాం.

    @ ప్రేరణ
    రాత్రి నుండి హెడ్ఏక్ మొదలయ్యింది కాబట్టి హ్యాంగోవర్ కాదేమో. నా లైఫులో ఒకసారి భయంకరమయిన హ్యాంగోవర్ బారిన పడి ఆ రోజంతా నరకం అనుభవించాను. ఇక లాభం లేదని మా ఇంటి ఎదురుగ్గ వున్న RMP డాక్టర్ దగ్గరికి వెళితే ఓ మాత్ర ఇచ్చాడు. ఠక్కున తక్కువయ్యింది.

    ReplyDelete
  8. @ తిరు
    నాకూ కాయకూ అక్రమ సంబంధం అంటగట్టి నా శీలాన్ని శంకిస్తున్నారు మీరు :)

    @ హరి
    ఇష్టమయిన పనే కానీ మా వాడు సుమంత్ సంగతి మీకు తెలియదులెండి. బుర్ర మహా ఘోరంగా తినేస్తాడు. రెండు నిమిషాల విషయం రెండు గంటల్లో చెప్పేస్తాడు.

    @ భా రా రే
    ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో కొద్దిగా తప్ప అసలీ మధ్య ఏదీ కొట్టడం లేదండీ. అప్పుడయినా రెడ్ వైనే ప్రిఫర్ చేస్తా. నిన్న కంగారులో ఒక్క బీరుకాయతో ఏమవుద్దిలే అని లాగించేసా.

    ReplyDelete
  9. తల నొప్పి గా వుందని మోకాళ్ళ ఫోటో వెయ్యక
    పుర్రె ఫోటో వేసినప్పుడే మీకు మందు ఎక్కువయ్యిందని అర్ధం అయ్యింది .
    కానీండి ఎంతైనా భక్త క బీర్ లే గా

    ReplyDelete
  10. @
    ఇంకేం తాగుతాను లెండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా రక్తంలో అవేంటో ట్రైగ్లిసరాయిడ్స్ అట తారాజువ్వల్లా ఆకాశానికి దూసుకుపోతున్నాయి. ఎంతున్నాయి అని అడక్కండి - అది వింటే నాకేమోగాని మీకొస్తుండొచ్చు గుండెపోటు! ఇహ లాభం లేదని ఈమధ్య కూరలు కలుపుకొని పచ్చికూరగాయల భోజనమే చేస్తున్నా. మరి మనకు పెరుగు ఇష్టం కదా ఎలా అని పెరుగు కూడా కూరగాయల్లో కలుపుకొని తింటున్నా.

    స్ట్రెస్ వల్ల కూడా అవి పెరుగుతాయట. మనకున్న స్ట్రెస్సులకు కొదవా ఏంటీ?

    ReplyDelete
  11. అది నా ఉద్దేశ్యం కాదండోయ్!
    ఏదో కాయ కామెంట్లు సరదాగా ఉంటున్నాయనీ, అంతే.

    రవిగారు,
    నొప్పి అక్కడి దాకా పాకిందని కవిహృదయం అయ్యుండొచ్చు. అంతేనా శరత్ జీ?

    ReplyDelete
  12. @ రవి, తిరు
    అవునండీ, అప్పుడు మోకాళ్ళ నుండీ పైపైకి పాకింది నొప్పి, మళ్ళీ నెమ్మదిగా మోకళ్లలోకి వస్తోంది లెండి. నాలాంటి మేధావుల మాటలయినా, చిత్రాలయినా అడ్డగోలుగా అర్ధం చేసుకోవాలి - స్ట్రెయిటుగా అర్ధం కావు - అంటే కిందిది పైకి, పైది కిందికి, ముందుది వెనక్కి, వెనుకది ముందుకి అలా అలా అన్నమాట.

    ReplyDelete
  13. వారం రోజులనుండీ పని చేయక ఒక్కరోజు చేయాల్సి వచ్చె సరికి లేట్ అయ్యింది.. అన్నాయ్.. అయినా.. ఎందుకో కామెంటి పేరు సంపాదించటం బావుంది..

    ముందు ముందు సమాజం ఇంకా విశాలమై మీ స్నేహితుల(అందరూ ?) వ్యవహారాలను అంగీకరిస్తే, కనీసం వ్యతిరేకించక పోతే , చలనం లేని భర్త, చలనం లేని భార్య వేరే తోడు తెచ్చుకోవటం లో తప్పు లేదని గ్రహిస్తారేమో..

    ఏది ఏమైనా సరైన తోడు దొరకటంతోనే కదా నిజమైన జీవితం తెలిసేది

    ఇప్పుడు ప్రభు దేవా,అతని భార్య మరియు నయన్ ల వ్యవహారం పై మీ అభిప్రాయం ఏమిటో అలా ఒక టపా కొట్టండి.. అంతగా డీటేల్స్ లేక పోయినా .. పై పై ఊహ లతో ఒకటి

    ReplyDelete
  14. @ కాయ
    ప్రభు, నయన్ ల గురించి నేను వ్రాస్తే ఏం వ్రాస్తానో అందరికీ తెలుసు కాబట్టి వ్రాయడం అనవసరమేమో :)

    పెళ్ళి ముఖ్యం కాదనీ, మనస్సులు కలవడమే ముఖ్యమనేదే నా ఉద్దేశ్యం. మనస్సులు కలవక మనుషులు మాత్రం కలుస్తున్న ఏ జంట అయినా మళ్ళీ కలిసిపోవడానికి అవకాశాలు వుంటాయి. మనస్సులూ, మనుషులూ కొన్నేళ్ళుగా కలవకపొతే ఇంకెందుకు ఆ పెళ్ళి? ప్రభుదేవా, అతని భార్య మధ్య అనుబంధం ఎంతవరకు వుందో మరి. పిల్లలుంటే ఈ విషయాల్లో పచ్చివెలగకాయలా అడ్డుపడుతుంటారు. అతనికి పిల్లలున్నారనుకుంటాను కదా. భార్యాభర్తలిద్దరూ సామరస్యంగా విడిపోగలిగితే పిల్లల సమస్య కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. అంత సామరస్యమే ఇద్దరి మధ్య వుంటే ఎందుకు విడిపోవాల్సివస్తుందనేది కూడా పాయింటే కానీ అలా విడిపోయిన జంటలు కొన్ని తెలుసు నాకు.

    ఇష్టపడి సంసారం చెయ్యాలి గానీ కష్టపడి సంసారం చెయ్యడం ఏంటో నాకు అర్ధం కాదు.

    ReplyDelete
  15. మీకు తలనొప్పు తగ్గితే మరిన్ని టపాలు వ్రాసి మాకు తలనొప్పి పెంచుతారు ,
    సెటైరు వేసా అన్నాయ్ లైట్ తీస్కో

    ReplyDelete
  16. @ రవిగారు ; కేక

    ReplyDelete