వార్తలు - వ్యాఖ్యలు

బ్యాంకులకు ఇళ్ళు వదిలెయ్యడం అన్నది మా ఇల్లినాయ్ రాష్ట్రానికి కూడా బాగానే పాకిందట. శుభం.

అతి గొప్ప సూపర్ కంప్యూటర్ టైటిల్ యు ఎస్ నుండి చైనాకి వెళ్ళింది. ఆశ్చర్యం ఏముంది? రేపో మాపో ఆ టైటిల్ ఇండియాకీ దక్కుతుంది. అన్నట్టు ఇండియా సూపర్ కంప్యూటరుని పూణేలో నేను దర్శించాను.

మాల్దీవ్సు లో ఒక విదేశీ జంటకు పెళ్ళిచేస్తూ నిర్వాహకుడు ఆ జంటకి తెలియని భాషలొ మంత్రాల్లాంటివి చదువుతూ మీకు పుట్టబోయే సంతానం బాస్టర్డ్స్ కానూ అనీ ఇంకా చాలా చాలా తిడుతూ దీవించేడంట. ఇప్పుడు దానిపై మాల్దీవులలో పెద్ద దుమారం చెలరేగుతోంది. మాల్దీవియన్స్ అంతా ఆ పెళ్ళి పూజారిని తిట్టేస్తున్నారు - తమ దేశానికి తలవంపులు తెచ్చినందుకుగాను.
http://www.bbc.co.uk/news/world-south-asia-11644328

ఆ మధ్య చదివిన విషయం ఒకటి గుర్తుకువుంది. యు ఎస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వచ్చే ఏడు 10% ఉద్యోగాలని తొలగించే సూచనలు వున్నాయంట. బ్యాంకు ఉద్యోగస్తులూ జాగ్రత్త.


వాహనాల జాతకం మీద శర్మ గారు పోస్టు వేసారు కానీ చదవలేదు. హ్మ్. ఇలా అన్నింటికీ జాతకాలుంటాయంటే నా చెప్పుల జాతకం ఏంటో తెలుసుకొవాలి. అసలే వచ్చేది హార్ష్ వింటర్. ఐసుమీద చెప్పు జారిందనుకోండి నా జాతకానికి ఎసరు వస్తుంది.

డ్రీంస్ మొదలయిన వారి కథనాలను వింటుంటే ఆరెంజ్ పాటలు ఓ రేంజులో వున్నట్లున్నయ్యే. అన్నీ కూడా హీరో సోలో సాంగ్సేనుట.

తన్‌హాయి 34 వ భాగం వేసారు కల్పన గారు కానీ ఇంతవరకు నేను ఒక్క భాగమూ చదవలేదు. సోషల్ నవల్స్ మీద ఆసక్తి బొత్తిగా తగ్గింది నాకు. ఆ నవల పేరుకి అర్ధం చెప్పమంటే ఇంతవరకూ కల్పన గారు చెప్పలేదు నాకు. అఫ్సర్ గారిని ఆ అర్ధం అడుక్కోమన్నారు!  మా నాన్న హిందీ పండిట్/లెక్చరర్. అందుకే హిందీలో పరమ శుంఠని నేను.

రోజంతా సరికొత్త వార్తలతో వ్యాఖ్యలతో ఈ టపాని తాజీకరిస్తుంటాను (సరి అయిన పదమేనా ఇది?).

11 comments:

  1. ఆరెంజ్ సినిమాలో హిరో మీలానే నిజాయితీగా అన్నీ నిజాలే మాట్లాడి ఇరకాటంలో పడతాడంట.

    ReplyDelete
  2. Hi friends and Sharat,
    modati roju & modatii show cinema review blog is having some virus issues.. my office system got infected with mallware and unable to open IE... so friends becareful about that blog...

    ReplyDelete
  3. @a2zడ్రీంస్
    హ హ. ఆ విషయం మీ బ్లాగులోనో లేక మరెక్కడో చదివి అదే అనుకున్నాను.

    ReplyDelete
  4. ya.. orange songs are real good.. will serve better when u r driving to office.. ;)

    ReplyDelete
  5. మా నాన్న హిందీ పండిట్/లెక్చరర్. అందుకే హిందీలో పరమ శుంఠని నేను.

    అదేంటో అన్నా. నేను కూడా.. :(

    ReplyDelete
  6. ఈ మధ్య మీ బలాగు కంటే ఈ కింది బలాగులో టైటిల్స్ బాగుంటున్నయ్....

    బనానా - హనీ దోసె అంట ;)
    మీ ఎస్కెపేడ్ మీటింగుల్లో వీటిని ట్రై చెయ్యన్నా!

    http://blossomera.blogspot.com/2010/10/blog-post_4663.html

    ReplyDelete
  7. మీరు టపా రాయడానికి ఏదీ అనర్హం కాదనుకుంటా :)

    ReplyDelete
  8. hilarious!
    మీరు జీకరిస్తూండండి, మేం ఘోంకరిస్తూంటాము!!:)

    ReplyDelete
  9. తన్‌హాయి అంటే ఒంటరితనం.

    ReplyDelete
  10. నేనీ బ్లాగ్లోకానికి కొత్త. రావడం రావడం మీ గురించిన చాలా కామెంట్లూ,పోస్ట్లూ కనపడితే వాటి ఆధారం గా అలా మీ బ్లాగ్ కి వచ్చేశాను. అక్కడక్కడా మీ గురించి ఏదో 'వదిన ' పోస్ట్ రెఫరెన్స్ వినపడుతోంది కాని..అదేంటో అర్థం కావడం లేదు.పోన్లే అడిగితే మీరే చెబుతారని అడిగేశాను...మనసు నొచ్చుకుంటే మన్నించగలరు....

    ReplyDelete
  11. Today, I went to the beach front with my children. I found
    a sea shell and gave it to my 4 year old daughter and said "You can hear the ocean if you put this to your ear." She placed the shell to her ear and screamed.
    There was a hermit crab inside and it pinched her ear.
    She never wants to go back! LoL I know this is totally off topic but I had
    to tell someone!

    ReplyDelete