కూడలిపై బ్లాగుబడి!



కూడలి మీద బ్లాగుబడి చెయ్యాలనుకుంటున్నాను. అప్పుడెప్పుడో రెండు, మూడు సార్లు నా బ్లాగులని కూడలి నుండి పీకేసారు. నా రసజ్ఞ బ్లాగుని చేర్చుకొమ్మంటే తిరస్కరించారు. అందుకే కూడలి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు వీజీ మెథడ్ బ్లాగుబడి అని ఈమధ్యనే నాకు అర్ధం అయ్యింది. మరి ఇలాంటి బ్లాగ్ కర్మలూ, క్రియలూ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క బ్లాగునయినా బలి ఇవ్వాలి కదా. అందుకే ఒక బకరా బ్లాగుని సూచించండి. నా బ్లాగుని వదిలేసెయ్యండి మహాప్రభో అని ఎవరయినా వేడుకుంటే గనుక వారి బ్లాగు నా బ్లాక్ లిస్టులోంచి తీసేస్తాను. ఇది సక్సెస్ అయితే గనుక అప్పుడు మరో అగ్రిగేటర్ వెనకాల పడతాను.

15 comments:

  1. రసజ్ఞ
    ప్రమాదవనం
    రౌడీరాజ్యం
    బ్లాగ్ వీక్షణం
    అప్పల్రాజ్
    మార్తాండ అన్ని బ్లాగ్లు
    కాగడా
    వీటిలో ఏదోఒకటి సేసెయ్

    కానీ
    పర్ణశాల మాత్రం వద్దు
    సక్కగా రాయి అని సేప్పినాం నిన్నే
    సరే , ఈ పాలికి ఒగ్గేయండి అన్నాడు

    ReplyDelete
  2. గత రెండు రోజులుగా మీ సరదా టపాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది.

    ReplyDelete
  3. నా బ్లాగు పేరుతోనే వర్డ్‌ప్రెస్‌లో ఒక బ్లాగ్ క్రియేట్ చేసాను కానీ వాడట్లేదు. ట్రయల్స్ కావాలంటే అక్కడ వేసుకోండి. ఫ్రీగా. కానీ వున్న బ్లాగుని టచ్ చేయకండే.

    ReplyDelete
  4. @ అప్పూ భాయ్
    మిగతా బ్లాగులన్నీ సరే గానీ నా రసజ్ఞ బ్లాగు నేనే బలి ఇచ్చుకుంటే బ్లాగుబడి పనిచెయ్యదని మా గురువు బ్లాగ్క్షుద్ర గారు సెలవిచ్చారు.

    ReplyDelete
  5. మీ[బ్లాగ్ ]దాని మీద మీరు `చేత`బడి చేస్కొండి గాని మా బ్లాగులమీద మీ చేతపని చేయకండి :)

    ReplyDelete
  6. @ a2zడ్రీంస్
    :)
    @ నరేశూ
    అబ్బా నరేశూ, ఈ కూడలిపై చేసే బ్లాగుబడే ట్రయలు. ఇది వోకే అయితే అప్పుడు మరో దానిపై రియల్ బ్లాగుబడి. మళ్ళీ దీనికి ట్రయల్ బ్లాగులా? కుదర్దు. నాకు పక్కా బకరా
    బ్లాగు కావలయును.
    @kvsv
    ఎప్పుడూ నా (బ్లాగు) పని నేను చేసుకుంటే ఏం బావుంటుంది చెప్పండి - బోరు కొట్టదూ. అందుకే ఓ బకరా (బ్లాగు) పని పడదామని డిసైడ్ అయిపోయా.

    ReplyDelete
  7. అలాగైతే 'రక్త చరిత్ర ' బ్లాగుని టార్గెట్ చేద్దామా...? బూతులు భరించలేకుండున్నా.

    ReplyDelete
  8. ఇంతకీ ఈ మార్తాండ ఎవరు? ఎక్కడికి వెళ్ళినా ఇదే పేరు.. ఎవరి నోట విన్న ఇదే పేరు... ఇంతకీ అయన బ్లాగ్ పేరు ఏమిటి?
    ఈ మార్తాండ గోల చాలనట్టు మధ్యలో కేలికింగ్ అంటు మరొకటి... తెలుగులో రాసే వాళ్ళు వున్నదే కొద్దిమంది. రాయటం రాని మాలాంటి వాళ్ళంతా రాయగలిగిలిన మీలాంటి వాళ్ళ వంక చూస్తునాం. చక్కగా రాస్తారు చదివి అఘోరిద్దాం అని... రోజు మీ అందరి (నిజంగానే అందరి అంటే అందరి అని కాదు )గుమ్మాలు ఆసతో ఎక్కటం ఆనక బూతు/ తిట్ల పురాణాలూ విని విసుగొచ్చి వెనక్కి నిరాశతో వెనక్కి పోవటం. మీ మీ రచనా చాతుర్యాన్ని ఇలాంటి వాటికీ వృధా చేస్తున్నారే పనికి వచ్చే విషయాల మీద కనీసం సరదా/ వినోద కరమైనవి వాటి మీద పెట్టకుండా. మీ ఒక్కరిని కాదు..ఎవరి గుమ్మం ఎక్కినా ఇదే పరిస్తితి నాలాంటి చదువరులకి.. అదేమిటి అని అడిగితె మేము మొదలు పెట్టలేదు పాలనా వారు మొదలు పెట్టారు అంటారు... ఎవరో పనికిమాలిన రాతలు రాస్తే వాటికి మీరంతా సమాధానాలు ఇస్తూ కూర్చోవాల్సిందేనా? ఒకడు పూలు తీసుకుని పూజకు ఆలస్యం అవుతోంది అని పరుగెడుతూ వెళ్తున్నాడు. దారిలో ఎవడో బురద వేసాడు(కావాలనే). పట్టించుకోకుండా వెంటనే పరిగెత్తుకెళ్ళి స్నానం చేసి మళ్ళి పూలు కోసి పూజకు తీసుకెళ్ళాలా లేక పొతే పూలు పూజ వదిలేసి రోజంతా అక్కడే ఒకరి మీద ఒకరు బురద వేసుకుంటు ఉండాలా?ఉన్న కొద్దిమంది తెల్లుగులో రాసే వాళ్ళు దయచేసి తమ సమయాన్ని రచనా సామర్ధ్యాన్ని ఇలా వృధాచేసి మా అందరిని నిరుత్సాహ పరచకండి. ఏదో దారినపోయే దానయ్యని. వీలయితే ఆలోచించండి. లేదంటే వదిలేయోచ్చు. కాకపోతే కొన్నాళ్ళు తరువాత ఈ దారిలో వచ్చే దానయ్యలు ఎవరు ఉండరు, మీరు మీ సహచరులు తప్ప బురద జల్లుకుంటూ.

    పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అన్నది మీకు తెలియనిది కాదు. మీరు చక్కగా మంచి విషయాలు రాస్తున్నంత కాలం, చదివే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. దానికోసం హారాలు, గొలుసులు, కూడళ్ళు, సందులు అవసరం లేదు అని నా అభిప్రాయం.... కొంచెం ఘాటుగా చెప్పనేమో.. కాని ఇన్నాళ్ళ నుంచి ఉగ్గబట్టుకున్నది ఇలా బయట పడేసా... మళ్ళి ఇదేదో ఎ ఆడ వాళ్ళ దాంట్లోనో పెడితే ఎ మలక్కో,మార్తాండ అనో, కాగడనో, కొవ్వొత్తి అనో విషయం వదిలేసి అపరాద నేర పరిశోధన మొదలు పెడతారేమో అని గుండె (మొండి/ బండ) ధైర్యం కల మీ గుమ్మం ముందు పడేశా. ఇక తెలుగు బ్లాగ్ ను అనాధ శవం లా వదిలేసి గొడవ పడతారో లేక అంత కలిసి ( పోనీ విడి విడి గానే ) సొంత పాపలా పెంచి పెద్దచేసి మాకు ఇస్తారో మీ ఇష్టం. మేము పోగొట్టుకునే మంచి సాహిత్యాన్నే కావొచ్చు, కాని మీరంతా ఎం పోగొట్టుకుంటున్నారో ఆలోచించుకోండి.

    ReplyDelete
  9. తర్వాత మాకు నేర్పితే మేము "మాలిక" మీద చేసుకుంటాం

    ReplyDelete
  10. @ RAM CH
    మంచి విషయాలు వివరంగా సూచించారు. విలువైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ధన్యవాదాలు. తప్పకుండా దృష్టిలో ఉంచుకొని వ్రాస్తాను. అయితే ఈ టపా నిజంగా కూడలి మీద ద్వేషంతో కాదనీ, బాణామతుల మీద వ్యంగ్య రచన అనీ, సరదాగా వ్రాసినదనీ మీరు గమనించేవుంటారనుకుంటాను. అయితే నాకో సందేహం. చక్కటి విషయాలు వ్రాసేవారు కూడా చాలామందే వున్నారు కదా. మళ్ళీ నాలాంటివారు కూడా చక్కగా వ్రాయడం అవసరం అంటారా?

    మార్తాండ/ ప్రవీణ్ గురించి వివరంగా చెప్పడానికి ప్ర పీ స స (ప్రవీణ్ పీడిత సంఘ సభ్యులు) అనే సంఘం వుంది. వారు మీకు కావాల్సిన సమాచారం అందిస్తారు లెండి.

    ReplyDelete
  11. మన బ్లాగులని డాక్యుమెంట్ చేయవలసిన అవసరం. కొత్తాగా వచ్చిన ప్రతీ ఒక్కరికి మార్తాండ్ అంటే ఎవరో చెప్పటం బాగో లేదు.

    ReplyDelete
  12. తూచ్చి .. నేనొప్పుకోను, తొండి. బ్లాష్మోరా చేయాలన్నా, బ్లాగుబడి చేయాలన్నా మా బాద్రా కేరాఫ్ బిస్తర్ శ్మశానం కు మాత్రమే హక్కుంది. వాటి పేటెంటు హక్కు మాకే ఉంది.

    ReplyDelete
  13. మీరు ప్రతిపాదించిన బ్లాగుబడి మహాయగ్నం ఒట్టి మూఢనమ్మకమని తేల్చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను శరత్ గారూ. ఇది తెలుగీల్లు మహా నమ్మకంతో విసురుతోన్న సవాలు. శాస్త్రం ఎప్పటికీ నిలుస్తుంది వజ్రంలా.
    వెంకట సుబ్బారావు కావూరి . తెలుగిల్లు

    ReplyDelete
  14. శరత్ గారు ,
    మీ పోస్టు + కామెంటులు భలేగా వున్నాయి....-:)

    ReplyDelete
  15. RAM గారూ చాలా బాగా గడ్డి పెట్టారు కెలుకుడు గాళ్ళకి.

    ReplyDelete