చీటింగ్ చిలియన్!

చిలియన్ గని కార్మికుల రక్షణను శ్రద్ధగా చూసిన వారందరికీ ఈ విషయం తెలిసేవుంటుంది. ఆ గని కార్మికులలో జానీ అనే అతను కూడా వున్నాడు. వాళ్ళింకా భూమిలోపలే చిక్కుబడివున్నప్పుడు గని కార్మికుల కుటుంబీకులు అంతా కలిసి వారి క్షేమం కోసం ప్రార్ధనల్లాంటి విజిల్స్ చేసారు. అక్కడ కుటుంబీకులు వారి కుటుంబసభ్యుని పేరు ఉచ్చరించాల్సివుంటుంది. అలా ఉచ్చరిస్తున్నప్పుడు ఒకరికి ఒకరు తెలియని ఇద్దరు స్త్రీలు జానీ పేరు ఉఛ్ఛరించారు. ఊప్స్!

అలా బయటపడింది అయ్యగారి అసలు వ్యవహారం. మనవాడు పెద్దిల్లు, చిన్నిల్లు ఒకరికొకరికి తెలియకుండా లాగించేస్తున్నాడన్నమాట! దాంతో అసలు భార్యకి మండుకొచ్చింది. మరి మండాక ఊరికే ఊరుకుంటుందా ఏమిటీ? కొత్తామె, పాతేమె ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా అరిచేసుకున్నారు, పోట్లాడుకున్నారు. ఆమె అయినా వుండాలి లేక తనయినా వుండాలి అని అసలు భార్య పాతాళంలో ఇరుక్కున్న మొగుడి బేజా ఉత్తరాలతో  ఫ్రై చేయనారంభించింది. మనవాడు ఏలేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదాయె అనుకున్నాడు పాపం. 

అది సరే గానీ అందరికీ సస్పెన్స్ ఇప్పుడొచ్చింది. ఒక్కొక్క మైనర్ భూమి మీదికి చేరగానే ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతించారు. జానీ యొక్క ప్రియురాలు వస్తే నేను రానని అతని భార్య మొండికేసింది. అందువల్ల అతడిని భూమి పైకి ఆహ్వానించడానికి ప్రియురాలు వస్తుందా లేక భార్య వస్తుందా అని లైవ్ ఫీడ్ చూస్తున్న అందరికీ యమ సస్పెన్సూ. మొత్తమ్మీద ఒక యువతి మాత్రం వచ్చి జానీ బయటకి రాగానే కౌగలించుకుని ముద్దులు పెడుతూ సంతోషించింది. ఆ యువతి ఎవరా అని అందరికీ సస్పెన్స్! తేలిందేమిటంటే ఆ యువతి అతని యొక్క ప్రియురాలు/రెండో పెళ్ళాం.

పాపం ఇప్పుడు ఆ జానీని ఈ ఇద్దరూ కలిసి భూమి మీద కూడా సుఖం లేకుండా చేస్తున్నారేమో. ఆ గొడవలు భరించలేక భూమిలోనే వున్నా బావుండునని అతగాడు అనుకుంటున్నా ఆశ్చర్యం లేదు.  

Johnny Barrios Rojas' rescue was among the most anticipated – if only to see who would be there to greet him.

No. 21 of the men pulled from the collapsed mine, Barrios gained notoriety as the man who had two women at Camp Hope – his wife of 28 years, Marta Salinas, and his mistress of four, Susana Valenzuela.

Salinas apparently knew nothing of the affair until the two women ran into each other amid the tents pitched by family members anxiously holding vigil – and a very public spat ensued.

The 50-year-old Barrios looked around sheepishly Wednesday as he emerged from the rescue tube that elevated him to the Earth's surface, peering through dark glasses as mining officials in red shirts applauded loudly.

Behind him, smiling widely and waiting for him to notice her stood Valenzuela. When he didn't, the round-faced strawberry blonde walked around to face Barrios and gave him a long kiss and hug, weeping into the shoulder of his jumpsuit as he whispered into her ear.

17 comments:

  1. హ హ ... అతి చేస్తే ఎక్కడున్నా ఇబ్బందే కదా !

    ReplyDelete
  2. miniying manmadhudu ....very interesting

    ReplyDelete
  3. మైనింగ్ మన్మధుడు సినెమా టైటిల్ బాగుంది...

    బాలయ్య హీరో..వీరోయిన్స్ ఎవరో మీ అలోచనకే వదిలేసా...

    ReplyDelete
  4. :D

    ఇంకో విషయం ఏమిటంటే చిలీలో కూడా ఒఖ్ఖసారి పెళ్ళి అయితే ఇండియాలాగే విడాకులు తీసుకోవడం మహా కష్టంట. అందుకే రసజ్ఞులు ఏదో విధంగా కిందామీదా పడుతుంటారు.

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. యింక నీ బ్లాగు లోకి రాను అన్నాయ్...రక్త చరిత్ర గాడి పై పోస్ట్ తీసేసినందుకు నా నిరసన... మీరే ఇలా వెనక అడుగు వేస్తె...

    ReplyDelete
  7. @ శ్రావ్య
    అసలు కన్నా కొసరే ఎక్కువయ్యిందన్నమాట. మన మీడియా - ప్చ్.

    @ కాయ
    తమ్ముడూ, తన పొరపాటు సవరించుకుంటా అన్నాక కూడా నేను ఇంకా ఆ టపా వుంచడం భావ్యం కాదనుకున్నాను. ఇంకా చేస్తే అది సవరింపు కోసం ప్రయత్నం కాకుండా వేధింపు అవుతుంది. తను నా రసజ్ఞ బ్లాగు మీద టపా వేసి తొలగించి నప్పుడు నేను కూడా టపా తొలగించడమే సముచితం అవుతుంది.

    ఈ బ్లాగుల్లో స్నేహం ఆంశాల ప్రాతిపదికన వుండాలి. నేను ఎన్నో వ్రాస్తుంటాను, ఎన్నో చేస్తుంటాను. అందులో ఏ ఒక్కటొ నచ్చక ఇలా అలిగేస్తే ఎలా?

    ReplyDelete
  8. ఓహ్ పైన నా కామెంట్ లో టైపో తో అర్ధం మారిపోయింది ఇది కరెక్టు
    ---------------------
    ఇది చదువుతుంటే హైదరాబాద్ మల్కాజ్గిరి లోననుకుంటా జరిగిన సంఘటన గుర్తొచ్చింది . ఆయన పేరు గుర్తు రావటం లేదు గాని ఆఫ్ఘనిస్తాన్ లో ఇంజనీరు గా పనిచేస్తుంటే కిడ్నాప్ చేసి చంపేశారు . ఆయన బాడీని ఇంటిని తీసుకోచ్చినాక ఇలాగే నానా రగడ చేసారు . మొదటి వైఫ్ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్లు గుర్తుంది . కాని ఆ మొత్తం సంఘటనలో నాకు ఆయన తండ్రిని , పెద్ద భార్య పిల్లల్ని చూస్తే (రెండో ఆవిడ కి చాల చిన్న పాప) నిజం గా పాపం అనిపించింది . ఆయన చనిపోవటం కన్నా ఈ సినిమా ఎక్కువ రోజులు నడిసింది టివిలల్లో.

    ReplyDelete
  9. @ శ్రావ్య
    నాకయితే అది వింటుంటే వారి అందరి పిల్లల మీద జాలి అనిపించినా మొదటి భార్య పిల్లల కంటేనూ రెండో భార్య పాప మీద ఇంకా జాలిగా వుంది. చిన్న పాప కాబట్టి.

    ReplyDelete
  10. నిజమే కాని పెద్ద భార్య పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ గురించి అందరూ ఏమి మాట్లాడుకుంటున్నారో అర్ధం చేసుకొనే వయస్సు లో ఉన్నారు, స్కూల్లో గాని , బయట ఫ్రెండ్ తో కలిసినప్పుడు గాని అంత ఫ్రీ గా ఉండలేరేమో అని నా అనుమానం . ఇక చిన్న పాప కొంచెం పెరిగే సరికీ అందరూ ఈ విషయం గురించి మర్చిపోతారు , కాకపొతే తండ్రి లేని లోటు ఎవరో తీర్చలేరు అనుకోండి కాని గుడ్డిలో మెల్ల కదా అని నా ఉద్దేశం .

    ReplyDelete
  11. @ శ్రావ్య గారు: అతని పేరు సూర్యనారాయణ .. పాపం రెండో భార్య కి మొదటి పెళ్లి గురించి చెప్పకుండా చేస్కున్నాడు .. తరువాత పెద్ద భార్య చిన్న భార్య వాళ్ళని దగ్గరికి తీస్కోవటం తో కథ సుఖాంతం అయ్యింది ...

    అన్నాయ్ : ఇంకా అతను తెలంగాణా పేరు ని అదే విధం గా ఉచ్చారిస్తున్నాడు .. అదేం పద్దతి ..

    వాడి బాగులో నా కామెంట్ :
    "ఇంత ఎగురుతున్నావ్ .. తెలంగాణా వస్తే నువ్వు నరకటం మాని నిన్ను నువ్వే నరుక్కోవాలి తప్పదు.. అడవి మనిషి లా ఉన్నావు ఏ ఊరు రా నీది .. "

    ReplyDelete
  12. @ కాయ
    "తరువాత పెద్ద భార్య చిన్న భార్య వాళ్ళని దగ్గరికి తీస్కోవటం తో కథ సుఖాంతం అయ్యింది ... "

    గ్రేట్. పెద్ద భార్య మనస్సు ఎంత మంచిదో కదా. అటువంటివారు అరుదు.

    సో, రక్త చరిత్ర తెలంగాణా పేరు ఇంకా అలానే ఉఛ్ఛరిస్తున్నాడంటావు. హ్మ్. ఎప్పుడూ నేనే రక్త చరిత్రను బేబీ సిట్టింగ్ చేసుకుంటూ కూర్చోలేను కాబట్టి ఇంకా ఎవరయినా తెలంగాణా వారు తమ ఆత్మాభిమానం బ్లాగుల్లో కాపాడుకోవడం కోసం ఈ విషయంలో శ్రద్ధ చూపితే బావుంటుంది.

    ReplyDelete
  13. @ kaaya
    ఆంధ్రా వారు కానీ, సమైక్యాంధ్రా వారుకానీ ఆ విషయంలో శ్రద్ధ చూపితే ఇంకా బావుంటుంది.

    ReplyDelete
  14. @కాయ గారు మొత్తానికి కథ సుఖాంతం అయ్యిందన్నమాట . నాకు ఆ న్యూస్ చూసేటప్పుడు మాత్రం భలే చిరాకేసేది , తాలిబాన్లు కిడ్నాప్ చేసి చంపేస్తే అసలు ఇంకా మన వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళ సంగతేమిటో ఆ సీరియస్ ఇష్యూ ని వదిలేసి ఈ గోల 24 గంటలు చూపిస్తుంటే .

    ReplyDelete