వీవెనుడి నవ్వందం

నవ్వు + అందం = నవ్వందం - సువర్ణ దీర్ఘ సంధి.
నిజానికి 'స'వర్ణదీర్ఘ సంధి వుంటుంది కానీ 'సు'వర్ణదీర్ఘ సంధి అంటూవుండదు. 8,9 తరగతుల్లో సంధులు చెప్పమంటే పొరపాటున మా క్లాసుమేటు పేరు సువర్ణ కలిపి అలా చెబితే క్లాసు అంతా ఘొల్లున నవ్వేది. సంధుల మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ప్రతీదాన్నీ సువర్ణదీర్ఘ సంధి అంటుంటాను. పైది కూడా అలాంటిదే. 

సరే అసలు విషయానికి వద్దాం. కూడలి నిర్వాహకులు వీవెన్ అందరికీ సుపరిచితమే కదా. వారి ఫోటో తొలిసారి ఏదో పత్రికలో చూసాననుకుంటా. ఆ ఫోటో అంత బావోలేదు. ఆదిమ మానవుడికి దగ్గర్లో వున్నారు ఆ ఫోటోలో. ఆ తరువాత కూడా వేరే ఫోటో లేనట్లు అదే ఫోటో మళ్ళీ పత్రికల్లో రిపీట్ అయ్యింది. ఈ-తెలుగు గ్రూపు ఫోటోల్లో చూస్తుండేవాడిని కానీ గుంపులో గొవిందాలాగా వుండేవారు.

కొంతకాలం తరువాత ఒకసారి వారికి ఫోను చేసి మాట్లాడాను. కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లుగా ముక్తసరిగా, పొడిపొడిగా మాట్లాడారు. కూడలి నిర్వాహకులు కదా బాగానే అనర్గళంగా మాట్లాడుతారేమో అనుకున్న నాకు అసంతృప్తి కలిగింది. అలా మాట్లాడేవారితో ఎక్కువసేపు ఏం మాట్లాడుతాం. మాట్లాడాల్సింది మాట్లాడి ఫోన్ పెట్టేసాను. కొన్ని సార్లు మామధ్య ఈమెయిళ్ళు నడిచినా అవికూడా క్లుప్తంగానే వుంటుండేవి. 

ఇండియాలో జరిగిన తెలుగుబాట కార్యక్రమంలో వారిని కలిసే అవకాశం దొరికింది. బాగానే వున్నారే, ఫోటోల్లో అలా పడ్డారేంటీ అనుకున్నాను. ఈ-తెలుగు వారి కొత్త తెల్ల టీషర్ట్ వేసుకొని వున్నారు కాబట్టి కూడా ఫోటోల్లోకంటే చక్కగా అనిపించారు. వారిది ఫోటోజెనిక్ ఫేస్ అయ్యుండకపోవచ్చు అని అనుకున్నాను. వారితో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆ కార్యక్రమంలో అక్కడక్కడా క్లుప్తంగానే  మాట్లాడుకోగలిగినా ఆ కాస్సేపూ చక్కగా మాట్లాడుకున్నాం.   వారి నవ్వు నచ్చింది నాకు. చక్కగా నవ్వుతారు వారు. అంటే వారు నవ్వితే వచ్చే ధ్వని బావుంటుంది. వారితో ఎక్కువసేపు మాట్లాడ లేకపోయాను కాబట్టి, వేరే విశేషాలు ఏమీ లేవు కాబట్టి వారి గురించి ఎక్కువగా వ్రాయలేకపోతున్నాను. 

13 comments:

  1. నవ్వు + అందం=నవ్వందం.....ఉకార సంధి

    ReplyDelete
  2. హారం ఉపకరణి అలాచెప్పింది. నిజమో కాదా నాకు తెల్వదు.

    ReplyDelete
  3. అది ఉకార సంధి శరత్ గారు

    ReplyDelete
  4. @ భా రా రే, పండు
    వార్నీ, దానికి నిజంగా ఓ సంధి వుందేం. ఏవో రెండు పదాలకి బలవంతంగా సంధి చేసి దానికి మా ఫ్రెండు పేరు పెట్టి అల్పానందం పడుతుంటాను. మీరిలా తుస్సుమనిపిస్తే ఎలా?

    ReplyDelete
  5. నాకు తెలిసి సవర్ణధీర్ఘ సంధి ఎప్పటి నుంచి ఉందో ఉకార సంధి కూడా అప్పటి నుంచే ఉంది.

    ReplyDelete
  6. సవర్ణదీర్ఘ సంధి సూత్రం ఇది
    "అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును"

    దీన్ని సరిగ్గ చెప్పకపోతే మా మాస్టారు చెంపకి ఒకటి అంటించి
    పై సూత్రాన్ని ఇలా చెప్పేవాడు

    "చెంపకి చెయ్యి పరంబగునపుడు కంటి నుండి నీరు ఆదేశమగును"

    ReplyDelete
  7. రవిచంద్ర గారు మరి ఉకార సంధి సూత్రం చెప్ప గలర

    ReplyDelete
  8. @ పండు
    నా పాయింటు సవర్ణ దీర్ఘ సంధి గురించి కాదండీ, 'సు'వర్ణదీర్ఘ సంధి గురించి :)

    @ రవిచంద్ర
    హ హ. మీ మాస్టారుకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా వున్నట్లుందే.

    ఇప్పుడు 'సు'వర్ణదీర్ఘ సంధికి రూల్స్ చెబుతాను:
    ఏ రెండు పదాలకయినా, ఏ ఇతర సంధీ కుదరకపోయినా బలాత్కారం చేసి మరీ కలుపొచ్చు. దానిని సువర్ణదీర్ఘ సంధి అందురూ.

    ReplyDelete
  9. శరత్ మీకు మాత్రం

    "అ - ఇ - ఉ - ఋ లకు "సువర్ణ" ములైన అచ్చులు పరంబగునపుడు "సువర్ణ" మేతెంచును అని మాత్రమే కదా ;-)

    ReplyDelete
  10. వీవెన్ ని వదిలి అందరూ సంధి వెంట పడ్డారేమిటి?

    శరత్ గారూ, క్లుప్తతకు మారు పేరు వీవెన్! మాటలూ, మెయిల్సూ కూడా అంతే! ఒకసారి నేను (రచయితల వర్క్ షాప్ సందర్భంలో అనుకుంటా) ప్రోగ్రామ్ ఎలా చేస్తే బావుంటుందో ఊహిస్తూ, ఉత్సాహంతో పొంగిపోతూ 50 kఈ మెయిల్ రాస్తే.." అలాగే చేద్దాం!" అని జవాబిచ్చారు.

    ReplyDelete
  11. హ హ హ ఐతే ఆయన పేరుని short cut చేసుకున్నట్టు ఆయన కూడా short cut లోనే మాట్లాడతారన్నమాట!

    ReplyDelete
  12. @ భా రా రే
    నాకు అస్సలు తెలుగు వ్యాకరణం గుర్తుకులేదండీ... అంచేత మీరు ఏం చెప్పినా నేను రైట్ అనాల్సిందే మరి.

    @ సుజాత
    సో, వీవెన్ మాటల మనిషి కాకుండా చేతల మనిషి అన్నమాట.

    ReplyDelete