ఈ ప్రశ్న వీవెన్ తన బ్లాగులో వేసారు:
http://veeven.wordpress.com/2010/02/24/poll-telugu-consumption/
- నాకు ఇతరులు తమ జీవితాల్లో నేర్చుకున్న పాఠాలు, గుణ పాఠాలు కావాలి. ఎందుకంటే అనుభవం లేక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఇతరులు ఆ పొరపాట్లు చేయకుండా అందరికీ ఆ అనుభవాలు చెప్పాలనిపిస్తుంది. అలాగే ఇతరుల అనుభవాలనుండి నేర్చుకోవాలనిపిస్తుంది.
- నాకు ఇతరులు తమ జీవితాల్లో నేర్చుకున్న పాఠాలు, గుణ పాఠాలు కావాలి. ఎందుకంటే అనుభవం లేక జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఇతరులు ఆ పొరపాట్లు చేయకుండా అందరికీ ఆ అనుభవాలు చెప్పాలనిపిస్తుంది. అలాగే ఇతరుల అనుభవాలనుండి నేర్చుకోవాలనిపిస్తుంది.
- బ్లాగు ప్రపంచం ఉటోపియా వంటి భ్రమ గొలుపుతున్నది. అది వాస్తవానికి దూరంగా వుంటుంది. ప్రతి ఒక్కరూ తమ గురించి, తమ కుటుంబం గురించి మంచి విషయాలే వ్రాస్తున్నారు. మా నాన్న గొప్పవారనీ, నా మొగుడు చక్కనివాడనీ అలా అలా వ్రాస్తుంటారు. మీ నాన్న మీ మక్కెలు ఎలా విరగదీసారో, మీ ఆయన ఎలా కాల్చుకుతిన్నారో అవి కూడా వ్రాయండి. అందులో ఇతరులు నేర్చుకోవాల్సిందేమయినా వుంటే తెలపండి. బహిరంగంగా వ్రాయలేకపోతే అజ్ఞాతంగా వ్రాయండి.
- అందరూ కవితలు తెగ వ్రాసేస్తున్నారు కానీ కథకులు తక్కువగా వున్నారు. వ్రాసిన ఒకరిద్దరూ కూడా సాంఘికమయిన విషయాల మీదనే వ్రాస్తున్నారు. మిస్టరీ, ఫాంటసీ, అపరాధ పరిశోధన లాంటివి ఎవరయినా వ్రాస్తే చూడాలని, చదవాలని వుంది.
- ప్రపంచం ఎంత అడ్వాన్స్ అవుతున్నా పెద్ద సంకలినులు కొన్ని, కొన్ని విషయాలలో ఇంకా చాదస్తంగానే వుంటూ వస్తున్నాయి. ఉదాహరణకు LGBT లాంటి విషయాలు. అలాంటివి అభివృద్ది చెందిన దేశాల్లో క్యాజువలుగా చర్చించే విషయాలవి (ఆయా కుటుంబాలలో చాదస్తం లేకపోతే). అటువంటి విషయాలు బ్లాగుల్లో సాధారణంగా చర్చించే పరిస్థితి రావాలి. తెలుగు బ్లాగు ప్రపంచం బాగా మడికట్టుకొని వుంది. మడిలోంచి బయటకి రావాలి. నీతులు వల్లించడం కాకుండా తమతమ అనుభూతులు చక్కగా, స్వేఛ్ఛగా పంచుకోగలగాలి.
ప్రస్తుతానికయితే ఇవే ముఖ్యంగా స్పురణకు వస్తున్నాయి. ఇంకా ఏమయినా ఆలోచనలు వస్తే తెలియజేస్తాను. అలాగే మీరు బ్లాగుల్లో ఏం కోరుకుంటున్నారో తెలియజేద్దురూ.