న్యాయమూర్తులూ - మీరే కావాలి పోలీసు అధికారులు!

పోలీసుల పని పోలీసులని చేయనివ్వకుండా శాంతి భద్రతలని భుజాన ఎత్తుకొని మహా బాగా కర్తవ్య నిర్వహణ చేసేందుకై జర్నలిస్టులు పోలీసులో చంకల్లో వుంటారు. మనది ఎంబెడ్డెడ్ జర్నలిజం అయ్యింది. దాని గురించి మరోసారి చర్చిద్దాం. ఇక హైకోర్టు న్యాయమూర్తులు - ముఖ్యంగా తెలంగాణా జడ్జిలు పోలీసుల తలమీద కూర్చొని శాంతి భద్రతలు కాపాడుతునారు. భేష్! అభినందనలు.

విద్యార్దుల మీద, జర్నలిస్టుల మీద లాఠీ చార్జి చేసినందుకు హైకోర్టు పోలీసులను తీవ్రంగా తిట్టేసింది ఈ వార్తలన్నీ చూసాక చాలా సంతోషం అనిపించింది. లా & ఆర్డర్ ఎలాగూ పోలీసుల వల్ల కావడం లేదు. దానిని రక్షించడానికి, నిలబెట్టడానికి మనకు న్యాయమూర్తులున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో రక్షణకు దిక్కేదీ అని బెంగపడ్డ నాలో చక్కని ఆశ చిగురించింది. మన న్యాయాధీశులు వుండగా ఇక మనకు బెంగ ఏల.             

ఎవరి పరిధుల్లో వారు ఉండక అస్థమానూ పోలీసుల వ్యవహార శైలిపై జాగరూకతతో వుంటూ పోలీసులని నిభాయిస్తూ, నగర శాంతిభద్రతలే ధ్యేయంగా పని చేస్తూ వస్తున్న న్యాయాధీశుల కర్తవ్య దీక్షని మన అందరం మెచ్చుకోవాలి. డి జి పి ని వెంటనే పీకి వేసి హైకోర్టు ప్రధాన న్యాయాధికారిని డి జి పి గా చేస్తే మనం వారి సేవలను గుర్తించినట్లవుతుంది. ఇంకా మిగతా అసిస్టెంటు, అడిషనల్ డి జి పి లను గట్రా పీకి వేసి ఆ పదవులను హైకోర్టు జడ్జిలకు వెంటనే ఇవ్వాలి. ఆ విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిందిగా హోం మంత్రి సబితమ్మను నేను డిమాండు చేస్తున్నాను. 

6 comments:

  1. I lost faith on state hight court.I never see high court responding so fast.
    only trustable court is supreme court.

    ReplyDelete
  2. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కంటే గూడా పోలీసులు ఎలా స్పందించారో మనుసున్న మనుషులకు అర్థం కావడం లేదు.ఆడ పిల్లల గదుల్లోకి ఆ రాత్రి వెళ్ళి లైట్లు తీసివేసి చితకబాడం,రబ్బరు బుల్లెట్లతో ఫైర్ చేయడం ఏ చట్టం చెప్పిందో మీలాంటి విజ్ఞులకే తెలియాలి.మీడియా వాళ్ళ వాహనాన్ని మేమే తగులబెట్టినామని స్వయంగా ఏసిపి రామాంజనేయులే చెప్పాడు.చట్టం చేటులోకి తీసుకొని తాము మనుషులమేనన్న స్పృహ లేకుండా సాటి మనుషులన్ను అంతా ఘోరంగా గాయ పరిస్తే అది తప్పన్న వారిని మీరు తప్పు అంటున్నారు.రేపు మీకు అదే పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడడానికి మరో గొంతుక మిగిలి ఉండకపోవచ్చు.

    ReplyDelete
  3. వీర గోనె,
    లైట్లు తీసేసి బాదడం అని మీరంటుంటే , మోలెస్టెడ్ అని 3రోజుల తరువాత కాంగ్రెస్ ఎం.పి లు అంటున్నారు! కాంగ్రెస్ ఎంపి లకు మాత్రమే ఎలా తెలిసింది?! జర సోచాయించవలసిన విషయం. ఆ కొట్టింది ఆందోళన కారులను, అమ్మాయిలను కాదులే! వాళ్ళ అరుపులు పెడబొబ్బలు చూస్తే అమ్మాయిల్లా ప్రవర్తించారా?! అచ్చోసిన ఆటవికుల్లా ప్రవర్తించారు. పోలీసులను , జెసి ని మెచ్చుకుని మెడలివ్వాల్సిన విషయం... ఆ తెలబాన్ల ఆగడాలకు ఫైరింగ్ చేయాల్సింది.

    శంకర్

    ReplyDelete
  4. It appears that The High Court judge made hasty comments against DGP and in comparing situation to the actions of General Dayyar; the comments are obitur, it damaged the morale of the government and police department. High court's comments are widely pubished in print and electronic media and gave fodder to Nagam and Harishrao to pillory the governemnt

    ReplyDelete
  5. ఈ వీరగోని గాడు ఒకడు వెళ్ళి చూసొచ్చినట్టు చెప్తున్నాడు.ఆ judges కూడా ఏదో ragging చేసినట్టు ప్రశ్నలు అడిగారు. తెలంగాణ వచ్చేది చచ్చేది లేదు మద్య లో ఈ పనికి మాలిన తల నొప్పులు ఒకటి.

    ReplyDelete
  6. ఈ పోస్టుకు స్పందించిన మాడీ, వీరగోని, శంకర్, అజ్ఞాత, తెలుగు వాడు లకు ధన్యవాదాలు.

    ReplyDelete