ఏ నవలలోనయినా నవరసాలు వుండొచ్చు కానీ మనకు కావాల్సిన రసాలకి మనం ఎక్కువ అనుభూతి చెందుతాం. అలాగే నాకు నచ్చిన రసాలని నేను ఎక్కువగా అనుభూతి చెందుతాను. గొప్పదో కాదో గానీ బాగా వివాదాస్పదం అయ్యింది కాబట్టి ఈ మధ్య ద్రౌపదిని తీరిక దొరికినప్పుడల్లా చదివేస్తున్నాను. అర్ధభాగం వరకు పూర్తిచేసాను.
అందులో ద్రౌపది - ధ్రర్మరాజుల గురించి ఒక భాగం ధర్మరాజు ఆత్మన్యూనత వుంది. నిన్న అది చదివాక ధర్మరాజు గురించి బాగా నవ్వొచ్చింది. పాపం - యార్లగడ్డ గడ్డ వారు రాజుగారి పరువు పుస్తకంలో పెట్టేసారు. మనం గొప్ప వ్యక్తులు అనుకున్నవారికి కూడా మానవసహజ బలహీనతలు లేదా బలహీనక్షణాలు వుంటాయి అని నొక్కి చెప్పడం రచయిత భావం కావచ్చు. ఆ భావం సమర్ధనీయం కూడా కావచ్చు. నాకు మాత్రం రాజుగారి అవస్థ చూసి భలే నవ్వొచ్చింది.
ధర్మరాజు గారు బ్రతికివుంటే మాత్రం యార్లగడ్డ గారి మీద పరువు నష్టం దావా తప్పకుండా వేసేవారు :) ద్రౌపదికి మొట్టమొదటి సారి తాను శీఘ్రదర్శనం మాత్రమే ఇచ్చాడని అందరికీ తెలిస్తే పరువు పోదూ మరి! రాజు గారు అసలే జూదరి అని ఆల్రెడీ అందరికీ కాస్త లోకువ. దానికి తోడుగా ఇప్పుడు ఇదొకటి. ఇదండీ రాజుగారి లఘుదర్శనం కథా కమీశూ. వివరాలు అడక్కండి - చెప్పడానికి ఇక్కడ బావోదు - పుస్తకం చదివేయండి. అవార్డ్ వచ్చిన పుస్తకంలోని విషయాలు కూడా స్వేఛ్ఛగా వ్రాయలేని పరిస్థితి నాది.
నేను మీ బ్లాగ్ ని ఫాలో అయిపోతున్నాగా....తీరిక చేసుకుని నవల పూర్తి చేయండి:)
ReplyDeleteరవివర్మ painting బాగుంది :)
ReplyDelete@ ప్రేరణ
ReplyDeleteచదివేసామండి. మా అభిప్రాయం త్వరలో.
@ చైతన్య
ఓ. అది రవివర్మ గారిదా!