వాహ్ వాహ్ వాహ్ వాహ్ వాహ్ ద్రౌపదీ!!!!!



ద్రౌపది చదివేసాము. నవల గురించి వివరంగా మా అభిప్రాయాలు మరో సారి. నవల మొత్తానికీ నాకు బాగా నచ్చిన పేరా ఒకటుంది. అది 7'5' వ పేజీలో వస్తుంది. నవలలో అదే మొదటి శృంగార ఘట్టం అని ఒక సమీక్షలో చదివాను.





ద్రౌపది కంటే కూడానూ ద్రౌపది గత జన్మ అయిన ఇంద్రసేన జన్మ నాకు బాగా నచ్చింది. ఆ జన్మలో చాలా కాలం సినిమా కష్టాలు పడినప్పటికీ ఆ కష్టాలకు గానూ చివరికి పొందిన ఫలితం (నా దృష్టిలో) ఉత్కృష్టమయినది. ఆ ఆనందం ఎక్కువసేపు లేకపోవచ్చు కానీ ద్రౌపది తన జీవితకాలంలో పొందలేని శృంగారానందం ఆ కాసేపట్లో పొందింది.



ఆ పేరా ఇక్కడ ఇవ్వొచ్చు కానీ శృంగారాన్ని కూడా బూతు అనుకునే పెద్దమనుషులు, ప్రబుద్ధులూ ఖండిస్తారు కాబట్టి అందులో సింబాలిక్ గా పువ్వుల మీద వున్న చివరి వాక్యాన్ని మాత్రం ఈ నవల చదవని, చదవలేని వారికోసం అందిస్తాను:





అయిదు తుమ్మెదలు ఒకే పూవులోని మకరందాన్ని ఏకకాలంలో గ్రోలుతున్నాయి.

6 comments:

  1. I did not read that novel

    But i know about Indrasena.. Vere novel lo chadivinatlu gurthu.. she will be given eternal happiness by 5 avatars right.. i remember..

    aa varnana kuda adbutham. asalu boothu emi undadhu andhulo.. oorkey veella godava kaakapote.. :))

    ReplyDelete
  2. కానీ శృంగారాన్ని కూడా బూతు అనుకునే పెద్దమనుషులు, ప్రబుద్ధులూ ఖండిస్తారు!!!!

    ఏవరు వారు???

    ReplyDelete
  3. కానీ శృంగారాన్ని కూడా బూతు అనుకునే పెద్దమనుషులు, ప్రబుద్ధులూ ఖండిస్తారు!!!!


    EVVAD....VAAD...DEEVANA GAAD.....

    ReplyDelete
  4. ఎవరు గురు? చెప్పు కేసేద్దాం. ముందే రెండు నేలలుగా పని ఎక్కువై జివితం లో కేసులేయక బోర్ కొడుతోంది.. కమాన్ టెల్ మీ.. i will case them...

    ReplyDelete
  5. @ వేను
    ఇంద్రసేన గురించి ఇతర రచనలూ చదవాలనిపిస్తోంది మీరు వ్రాసింది చూస్తుంటే.

    కొంతమంది చాదస్తులకు తాము అనుకున్నదే శృంగారం - ఇతరత్రా అంతా బూతు. ఏం చేస్తాం - Life is not fair!

    @ పవన్, కర్ణుడు, శశాంక్
    ఎక్కడయినా అలాంటివారు కొంతమంది వుంటుంటారుకదా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి కెలికేంత\కెలికించుకునేంత ధైర్యం నాకు లేదు లెండి :)

    ReplyDelete
  6. drowpadi naval bagundi

    ReplyDelete