మీ అందరికీ (నా బ్లాగు నుండి) పది రోజులు సెలవులిస్తున్నా!

పండగ చేసుకోండి ఈలోగా. ఓ పది రోజులన్నా వీడి పీడ విరగడవుతుందని సంతోషిస్తున్నారు కదూ..చించండి. ఆ ఆనందంతో నాకు హేప్పీ జర్నీ చెబుదామనుకుంటున్నారు కదూ. నాకు తెలుసు. అయినా వద్దులెండి. అంత శ్రమ మీకెందుగ్గానీ ఏదయినా ప్రత్యేక సందేశం వుంటే మాత్రం తెలియజేయండి. ఈ పది రోజులూ నెట్టూ, బ్లాగులూ, మీరూ లేకుండా ఎలా బ్రతకాలో ఏమిటొ! ఎప్పుడయినా నెట్టు దొరికితే క్లుప్తంగా పలకరిస్తూనే వుంటాను లెండి.

హైదరాబాద్ బ్లాగర్స్, మనం అక్కడ కలుద్దాం.

ప్రస్తుతం విమానాశ్రయంలో వుండి వుండి విమానం కోసం ఎదురుచూస్తున్నాను.

మళ్ళీ కలిసేదాకా సెలవ్!

ఈమె పాదాల కోసం ఎన్నాళ్ళనుండో వెతుకుతూనేవున్నా...

నాకు స్త్రీల అందమయిన పాదాలు అంటే చాలా ఇష్టం. అలాగే నాకు ఆడవారి పాదాలను పరిశీలించడం ఒక హాబీ. ఎవరి పాదాలయినా అందంగా వుంటాయేమోనని గమనిస్తూవుంటాను. అలాగే సినిమా తారలవి కూడా. కొంతమంది సినిమా తారలను వారి పాదాలను చూసే గుర్తుపట్టేయగలను. తెలుగు హీరోయిన్లలో అసిన్, శ్రియల పాదాలు బావుంటాయి.

అయితే మన దేశపు అద్భుత సౌందర్య రాశి ఐశ్వర్య పాదాలని మాత్రం ఇంతవరకూ సరిగ్గా ఏ సినిమాలో కానీ, ఏ ఫోటోలో కానీ చూడలేకపోయాను. ఎన్నేళ్ళనుండో ఆమె పూర్తి పాదాల్ని చూడాల్ని ప్రయత్నిస్తోనే వున్నాను కానీ ఇప్పటివరకూ ఆమె వాటిని నా కంట పడనియ్యకుండా దాచుకుంటూనే వుంటోంది. ఏ సినిమాలోనయినా ఆమె పాదాలు స్పష్టంగా కనిపిస్తే చెప్పండి. లేదా అలాంటి ఫోటో ఎక్కడనయినా కనపడితే నాకు మెయిల్ చెయ్యండి. మీ పుణ్యం ఊరికే పోదు :)


ఐశ్వర్య జాతీయ స్థాయిలో నా అభిమాన నటి, వ్యక్తి. ఇప్పుడు ఇంకా రోబో సినిమాలో ఆమె స్టిల్స్ చూస్తుంటే - మెరుపు వస్త్రాలలో - గ్రహాంతర వాసిలాగా దుస్తులు ధరించి - వాహ్- అంతటి అద్భుత సౌందర్యం ఆరాధించడానికి నా కన్నులు సరిపోవడం లేదంటే నమ్మండి. ఇంతటి ముద్దు గుమ్మ పాదాలు నేను ఇంతవరకూ దర్శించకుండా, మనస్సులో పాదాభివందనం చేయకుండా వుండటం నాకే అన్యాయం అనిపిస్తోంది.

దేశంలో అభిమానులు ఎవరెవరికో గుడులు కడుతారు. ఈ అందాల రాశికి ఇంకా గుడి ఎందుకు కట్టలేదో నాకర్ధం కాదు. లాభం లేదు - ఇక నేనయినా మొదలెట్టాలి. ఐశ్వర్య అభిమానులు ఇంకా ఎవరయినా వుంటే వెంటనే ఆ గుడి కోసం మీ వంతు చందా పంపించండి. శిలా ఫలకం మీద మీ పేరూ చెక్కించ్చేద్దాం.

హ హ. వీళ్ళ అభ్యుదయం అంతవరకే! - 2

కొంతమంది స్త్రీ బ్లాగర్లు ఆలోచించే విధానం, వారి భావాలు ముచ్చటగా అనిపిస్తుంటాయి. కాస్త ప్రొగ్రెసివ్ గా అనిపించి హమ్మయ్య స్త్రీ బ్లాగర్లలో అందరూ బూజు పట్టిన భావాలే వున్న వారే కాకుండా కొద్దిగా మార్పు దిశగా ఆలోచించే వారు కూడా వున్నారే  అని సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఏంటో కానీ హోమో మరియు లైంగిక హక్కుల విషయానికి వచ్చే సరికి మాత్రం సైలెంట్ అయిపోతారు. వచ్చి పోరాటం చెయ్యమనట్లేదు కానీ కనీసం - కనీస మద్దతు కూడా తెలపాలనే స్పృహ వారికి వున్నట్లు అనిపించదు.

అలా అని వారిని ఒత్తిడి చేయడం కాదు - ఎవరి ఇష్టాలకి ఎవరి ప్రవర్తనకి ఎవరు బాధ్యులు? కానీ నాకు అందుగ్గాను విస్మయం చెందే హక్కు వుంది కదా. ఫస్ట్రేషన్ వ్యక్తపరిచే వీలు వుంది కదా. అందరూ పోలో మంటూ మద్దతు ఇవ్వాలని కాదు కానీ ఒక్కరంటే ఒక్కరు ఈ విషయాలని, కనీసం వారి లింగానికి సంబంధించిన లెస్బియన్ విషయాలకయిన, స్పందించడమో, వ్రాయడమో చెయ్యరేం? వారిలో ఆ విషయాల మీద స్పష్టత లేకపోతే ఓ టపా పెట్టి చర్చించవచ్చు, లేదా నాలాంటి బ్లాగుల్లో చర్చల్లో పాల్గొనొచ్చు. ఏమంటే ఎప్పుడూ సెక్సేనా అంటారు? ఏం ఎంతమంది వ్రాస్తున్నారేంటి సెక్స్ గురించి? నేనొక్కడినే ఏదో అప్పుడపుడే కదా. ఎప్పుడయినా, ఏనాడయినా ఇలాంటి విషయాలను బ్లాగుల్లో టచ్ చేసారా మీరూ అప్పుడే ఈ విషయాలపై వైముఖ్యం రావడానికీ?

ఒక్కొకరు తెగ పుస్తకాలు చదువుతారు, చలాన్నీ చదువుతారు. కరివేపాకులా అంతే. నమిలి అవతల పడెయ్యడమే. అంతకు మించి ఆ పుస్తకాలు పనికి రావాయే. ఇలాంటి విషయాలంటే ఎందుకు చిన్న చూపు? స్త్రీలకు ఏదయినా అవమానం జరిగితే ఓ ఘొల్లున మొత్తుకుంటారే! నిస్పృహ ప్రకటిస్తారే! ఇలాంటి విషయాలు, తిండి బట్ట తరువాత ముఖ్యమయిన ఇలాంటి విషయాల్లో కనీసం ఒక్కరయినా స్పందించేవారు ఆడ బ్లాగర్లలో లేకపోవడం, అంత ఆధునిక భావాలు పుణికిపుచ్చుకున్న వారెవ్వరూ లేకపోవడం చూస్తుంటే నిరాశగా అనిపిస్తుంది. బ్లాగుల్లో వున్న ఆడ బ్లాగర్ల అభ్యుదయం అంతా ఒక్క అడుగు ముందు మాత్రమే. సాంప్రాదాయిక ఆలోచనా ధోరణి నుండి ఏ ఒక్క బ్లాగరూ అంతకు మించి ముందుకు వచ్చినట్లు నాకు అనిపించదు. మిగతా విషయాల గురించి ఈ టపా కాదు అని గుర్తుంచుకోవలయును. ఈ టపా విషయానికి సంబంధించి మాత్రమే నేను వ్రాస్తున్నాను. ఈలో ఏ ఒక్కరికయినా ధైర్యం వుంటే లెస్బియన్ ఆంశం గురించి పాజిటివ్ గానో, నెగటివ్ గానో చర్చించండి. అంత దృశ్యం లేదు. మనకెప్పుడూ సొరకాయల కోతలు కావాలి.

ఇక కవులూ, కళాకారులూ, రచయితలూ. వారూ అంతే ఇలాంటి విషయాలని నన్నంటుకోమాకు నామాల కాకీ అన్నట్టుగా ఛీత్కరిస్తారు. వుంటానికి వున్నారు ఓ పెద్ద పండితులూ, మేధావులు. అరిగిపోయిన రికార్డుల్లా పిడివాదాలని తిప్పి తిప్పి వ్రాయడానికీ, ఎప్పుడో 1930 ల్లొ వ్రాసిన పుస్తకాలు చదివి తాద్మాత్యం చెందడానికి. ఆ పుస్తకంలో ఏం గొప్పాగా వ్రాసాడూ, ఈ సినిమాలో ఏం గొప్పగా తీసాడూ అని తత్వ విచారణ చేయడం మినహా సమకాలీన ఆంశాలు ఏమిటీ, వ్రాటిమీద స్పందిద్దాం, వ్రాద్దాం, కవితలల్లుదాం, పాటలు కడదాం, కథలు వ్రాద్దాం అన్నది వుండదు.

ఎప్పుడూ పాడిందే పాటరా పాసుపళ్ళ దాసరీ అన్నట్లుగా చెప్పిన విషయాలనే, తెలిసిన విషయాలనే తిప్పి తిప్పి చెబుతూ తన్మయత్వం చెందుతుంటారు. ఎందుకు ఇతరులకి ఇలాంటి విషయాలు పట్టవు? ఒకసారి కాకపోతే ఒకసారయినా అసలు ఈ విషయం ఏమిటీ, ఈ విషయాల మీద మన స్టాండ్ ఏమిటీ ఎవ్వరయినా తెలిపారా? వారంతా గొప్ప గొప్ప మేధావులు, కళాకారులు కాబట్టి ఇదంతా వారికి స్లీజీ టాక్. నేను అంటున్న విషయాలకి అరకొర మినహాయింపులు లేవని కాదు కానీ అవన్నీ స్వల్పం. వీరందరి కన్న సామాన్య జనం నయం. వారికి అభిజాత్యాలు వుండవు కాబట్టో ఏమో కొందరు అనామకులు, అంతగా పేరు లేని వారు వచ్చి పాజిటివ్ గానో, నెగటివ్ గానో స్పందించి వెళతారు. కొంతమంది ఎంచక్కా భుజం తట్టి వెళతారు.

ఈ అభ్యుదయ దృక్పధం వున్నవారికంటే సాంస్కృతిక దృక్పధం వున్నవారే నయం అనిపిస్తుంది ఇలాంటి విషయాల్లో. సరదాగా నయినా ఇలాంటి విషయాలను ఏక్సెప్ట్ చేస్తూ కామెంట్లలో వ్యక్తపరుస్తుంటారు. ఈ అభ్యుదయ వాదులకు సరదాగా తీసుకునేంత స్పోర్టివ్‌నెస్ కూడా వుండదు. ఇలాంటి స్లీజీ విషయాలా అని ముఖం గంటు పెట్టుకొని, సీరియస్సు ఫోజుల్లో వుంటారు. బ్లాగుల్లో నాకు వున్న మిత్రుల్లో ఎక్కువమంది భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవించేవారే అయినా వారిలో హోమోఫోబియా కనిపించదు. ఎవరు భావాలు వారివి అని ఏక్సెప్ట్ చేసి సరదాగా నాతో ఆ విషయాలు ప్రస్థావిస్తుంటారు. ప్రొగ్రెసివ్గా ఆలోచించేవారు చాలామంది సరదాగా కూడా ఆ ఆంశాల్ని టేకప్ చేయగా చూడలేదు.
 
ఇతర బ్లాగర్లని ప్రశ్నించడానికి నీకున్న అర్హత, స్థాయి ఏమిటి అని ఎవరయినా నన్ను అడగవచ్చు. అంత లేదు అని నాకూ తెలుసు. ఇక్కడ ఒకరు చెబితే మరొకరు వినడం వుండదని తెలుసు. ఏదో నా నిరాశ, నిస్పృహ ఇలా వ్యక్తం చేసుకుంటున్నానంతే.
 
(అయిపోయింది)

హ హ. వీళ్ళ అభ్యుదయం అంతవరకే! - 1

ఈసారి సనాతనవాదులని, సాంస్కృతిక వాదులనీ, మతవాదులనీ వదిలేద్దాం. కాస్తో కూస్తో అభ్యుదయం వైపుగా చూసే వారిలో అభ్యుదయం ఎంతవుందో చూద్దాం. వారి తరహా ఎలా వుంటుందంటే మతవాదులకన్నా, మనువాదులకన్నా ఒక అడుగు ముందుకు వేసి హమ్మయ్య చాలా సాధించేసాం, చాలా ప్రోగ్రెసివ్ మెంటాలిటీ మనది, సెబ్బాస్ అని వారి భుజాలు వారే చరచుకుంటారు.

కాస్తో కూస్తో మంచి భావాలే వున్నాయే అని కొద్దిరోజులు అనుకున్నామా కులగజ్జి రూపంగానో, మరో విధంగానో బయటపడి మనల్ని నాలుక కొరుక్కునేట్లుగా చేస్తారు కొంతమంది. మరి కొంతమందికి హక్కుల మీద మంచి గౌరవమే వుంటుంది అని వారిని గౌరవించబోతామా వారికి హక్కులంటే కేవలం మావోయిస్టుల హక్కులు మాత్రమే హక్కులు అన్నది తేటతెల్లం చేస్తారు. మరికొంతమంది అభ్యుదయ మేధావులు అనుకుంటామా వారిలోని మేధావితనం మేడిపండు అయిపోయి ఏ సంకుచిత ఆశం దగ్గరో గిరికీలు కొడుతుంది. ఇహ కొంతమంది కవులూ, కళాకారులు కళని ప్రజల కోసం అనుకుంటూ కష్టపడుతున్నారులే అని ప్రశంసించే లోపుగానే ఏదోరూపేణా వారిలోని చెదలు పట్టిన ఆత్మన్యూనత బయటకి కనపడుతూ వుంటుంది.

ఇహ ఇన్నయ్య గారు లాంటి హేతువాదులూ, నాస్తిక కేంద్రం నాస్తికులూ మంత్రాలూ, తాయెత్తుల వ్యతిరేకత దగ్గరే ఆగిపోతారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నాస్థికత్వాన్నీ, హేతువాదాన్ని మలచుకోలేక అక్కడే ఆగిపోవడం వల్ల కొన్ని దశాబ్దాలుగా ఆ ఉద్యమాలకి ప్రజాదరణ లేకుండా అయ్యింది . నా చిన్న తనంలో అలాంటి ఉద్యమాలు ఉధృతంగా నడవడం నేను చూసాను. ఇప్పటికీ కూడా ఈ వాదులు అవే ఆంశాలని వల్లెవేస్తూ బోరు కొట్టిస్తుంటారు.

ఇహ స్త్రీ వాదులు స్త్రీల హక్కులు మాత్రమే హక్కులు అంటూ కూపస్థమండూకంలా, పిడివాదంతో పడికట్టు పదాలతో యుద్ధం చేస్తూ ఆ లోపల్లొతుల్లొనే వుండిపోతారు. వేరే ఉద్యమాలకు, హక్కుల పోరాటాలను గుర్తించాలనే స్పృహ వుంటున్నట్లుగా అనిపించదు.  ఆ హక్కుల వారికి తాము అనుకున్నవే హక్కులు. తాము అనుకోనివి దోపిడీ.


స్త్రీల హక్కులంటూ ఉద్యమాలు చెయ్యకపోయినా కాస్త ప్రోగ్రెసివ్గా ఆలొచించేవారుంటారు. అలాంటివారి ప్రొఫయిల్లో ఏ చలం పుస్తకాలో అభిమానం అని వ్రాసుకోగానే కాస్త విశాలభావాలు వున్నాయే అనుకుంటాం. కానీ వారి భావాలు చలం పుస్తకాలని అనుభవించేవరకే ఆగిపోతాయి. ఆచరణలో మాత్రం మళ్ళీ సనాతనత్వమే. ఎంత సేపూ 1940 ల్లోని చలాన్ని పట్టుకొని వేలాడటమే తప్ప చలం ఈ రోజుల్లో వుంటే ఎలా ఆలోచించేవాడూ అన్న స్పృహ వుండదు.
 
ఇహ మనస్సుల్లో సనాతనమయినా అభ్యుదయ రచయితల పుస్తకాలు చదివి మేధావులయ్యెవారు వుంటారు. వీరు ఆచరణలో కానీ, వేరే విధంగా గానీ చేసేదేమీ వుండదు కానీ పాత గొప్ప పుస్తకాలని అదే పనిగా చర్చిస్తూ ఎంత ప్రొగ్రెసివ్గా ఆ పుస్తకం వ్రాసేడూ అంటూ దానికి పేజీలు పీకడంతోనే సరిపుచ్చుకుంటారు.


ఇహ తీవ్ర పర్యావరణ వాదులు గట్రా వుంతారు. అభివృద్ధిని తిరస్కరించడమె వారికి అభ్యుదయం. వారికంటే బూజు పట్టిన భావాలున్నవారే నయం అనిపిస్తుంది. కనీసం వారు ఎక్కడ వున్నారో అక్కడే వుంటారు. ఈ సో కాల్డ్ అభ్యుదయ మేధావులు సమాజ హితం పేరిట సమాజాన్ని వెనక్కి మరల్చేందుకు యత్నిస్తుంటారు. ఇలాంటి వారంతా ప్రభుత్వం కానీ US కానీ ఏదిచెస్తే అది వ్యతిరేకించడమే ప్రోగ్రెసివ్ మెంటాలిటీ అనుకుంటారు.

ఇంతకూ ఈ నా ఏడుపు అంతా దేనికని కదా మీ సందేహం. ఇన్ని ఏళ్ళుగా గే హక్కుల గురించీ, లైంగిక హక్కుల గురించీ వ్రాస్తూ వస్తున్నానే. ఒక్క అభ్యుదయ బ్లాగరయినా పట్టించుకున్నాడూ? అంటే ఏదో ఉరికివచ్చి మా గ్రూపులో చేరి, తామూ గేలుగా మారి, మా ఝండా పట్టుకోమనడం లేదు కానీ తోటి ఉద్యమాలకి కనీసం ఎప్పుడయినా, ఒక్కరయినా నైతిక మద్దతు ఇచ్చారూ? ఏం అభ్యుదయం వారిది? ఏదో ఒకటి పట్టుకొని ఇహ అందులో ప్రజలు అభివృద్ధి చెందితే చాలనుకుంటే ఎలా?

పౌరహక్కుల కోసం ఆరాటపడేవారికి లైంగిక హక్కులు మానవ హక్కులుగా కనిపించవెందుకు అని నిగ్గదీసి ప్రశ్నిస్తున్నాను. ఎప్పటికప్పుడూ మీ పౌరహక్కుల లిస్టుని అప్డేట్ చేసుకోవడం తెలియదనుకోవాలా? ఎప్పుడో మావో చెప్పినవే మానవహక్కులు అనుకుంటె ఎలా? ఈ లైంగిక హక్కులు పోలీసు హక్కులు కావే - మీరు అసహ్యించుకోవడానికీ? కెక్యూబ్, హరి దోర్నాల, ప్రవీణ్ లాంటి వారు లైంగిక హక్కులను బూతు హక్కులుగా తృణీకరిస్తారెందుకూ?


ఎక్కడ స్త్రీ సమస్యలు వున్నా, స్త్రీలు అవమానం చెందినా మనం సానుభూతి ప్రకటిస్తాం. వారికి తోడుగా నైతిక మద్దతు అయినా ఇస్తాం. కానీ స్త్రీ వాదులు లెస్బియన్ ఉద్యమాలని ఎందుకు గుర్తించడం లేదు? లెస్బియన్ హక్కుల గురించి వ్రాస్తున్నప్పుడయినా ఎందుకు స్పందన వుండటం లేదు? స్త్రీల హక్కులు అంటే ఏవో కొన్ని వ్రాసుకొని వాటిని బైబిల్ లాగా పఠించడమేనా లేక బయట ఇంకా స్త్రీలకు ఏం అవసరం వుంది అని సత్యావతి లాంటి వారు కళ్ళు తెరచుకోని చూసేది వుందా లేదా?

(ఇంకా వుంది)

ఏపిల్ పండ్లనూ, ఆరంజ్ పండ్లనూ పోల్చి ఎగతాళి చేస్తున్న భవదీయులు!

కొద్ది వారాల క్రితం ఇండియా నుండి ఒక ఏపిల్ పండు US లో పని చేయడానికి వచ్చింది. ఇక్కడ అన్నీ చాలావరకు ఆరంజ్ పళ్ళే వున్నాయి. ఆ ఏపిల్ పండు తనకీ ఆ ఆరంజు పండ్లకీ తేడాలు చూడటం మొదలు పెట్టి ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. నేనిలా వున్నాను మరి ఆరంజు పండు అలా వుందేమిటి అని ఛీత్కరిస్తుంటే మరి కొన్ని ఇండియా ఏపిల్ పళ్ళు కూడా వంతపాడనారంభించాయి.


 
ఇండియా నుండి వచ్చిన ఏపిల్ పండు ఎవరో మీకు అర్ధమయ్యి వుండవచ్చు. వారే శ్రీమాన్ భవదీయులు చక్రవర్తి. వారు నాకు మిత్రులే కాబట్టి ఇంతకన్నా నేను వారిని ఎగతాళి చేస్తే నేనూ వారిలా ఏపిల్ పండునయ్యే అవకాశం వుంది. అందుకే వద్దులెండి కానీ క్రింది లింకు చూడండి :)

ఈ ఫోటొ పంపించేవాడు!

ఓ మూడేళ్ళ క్రితం న్యూజెర్సీలో వుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ బెంచ్ మీద వున్న రోజులవి. మాలో ప్రవీణ్ అనే మిత్రుడు చాలా చిలిపి. ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇష్టం. చామంది మగవారిని ఆడపేరుతో చాట్ చేస్తూ ఆడుకునేవాడు. అది పెద్ద విశేషం కాదనుకోండి. కానీ మావాడు కొన్ని రోజులు అలా ఏడిపించాక తన సెల్ ఫోను నంబర్ కూడా ఇచ్చి వెంటనే ఫోన్ చెయమనేవాడు. అవతలవారు ఆదరాబాదరాగా ఫోన్ చేస్తే మనవాడు ఆడగొంతుతో తియ్యగా మాట్లాడితే అవతలి వారు ఐసయిపోయేవారు.

అలా అప్పుడప్పుడూ వారితో స్త్రీ స్వరంతో మాట్లాడుతూవుండేవాడు. ఇంత హొయలు ఒలకబోస్తూ మాట్లాడుతున్న ఈ అమ్మాయి చూడ్డానికి ఇంకా ఎంత బావుంటుందో అని ఇతని ఫోటో తెగ అడిగేవారు . ఏడిపించీ, ఏడిపించీ, ఊరించి, ఊరించి చివరికి ఈ క్రింది ఫోటో పంపేవాడు. అలా ఈ ఫోటో బాగా గుర్తుండిపోయింది. కొన్ని రోజుల క్రితం ఎందుకో గూగుల్లో ఫోటోలు చెక్ చేస్తుంటే ఈ ఫోటో కనపడి ఆ రోజులు గుర్తుకువచ్చాయి.

కొద్దిరోజులయాక అతనూ మరో ఫ్రెండు ప్రసాద్ కలిసి నన్ను కూడా ట్రిక్ చేద్దామని చూసారు. ఒక ఆంటీ పేరుతో నాతో చాట్ చేసి కాస్సేపు నమ్మించినా కొద్దిసేపట్లో సంథింగ్ రాంగ్ అని వారిని కనిపెట్టేసాను కనుక సరిపోయింది. లేకపోతే వాళ్ళిద్దరూ నన్ను ఎంత ఆడుకునేవారొ - నన్ను హమాయకుడిని చేసేసి!

శరత్ - పేరు గొప్ప ఊరు దిబ్బ

ఈ శరత్ గాడు బావుంటాడా, బావుండడా అని ముసుగు ఫుటో పెట్టిన దగ్గరి నుండీ కొద్దిగా చర్చ మొదలయ్యింది. అది అంతర్జాతీయ సమస్య కాకముందే కాస్త క్లారైటీ ఇవ్వాలని ఈ పోస్టు.

అందరికీ లాగే నా యవ్వనంలో నాకు కొంతమంది అమ్మాయిలు బంధుమిత్రులుగా వుండేవారు. నా ఆజానుబాహుత్వంతో కాకపోయినా నా రొమాంటిక్ మాటలతో కొంతమందినయినా కట్టి పడేస్తుండేవాడిని. అలా తెగ ఇంప్రెస్ అయిపోయి నా గురించి తమ స్నేహితురాళ్ళకి తెగ బాగా చెప్పేవారు. ఎప్పుడన్నా అలాంటి స్నేహితురాళ్ళను కలిసినప్పుడు వారు శరత్ అంటే ఏంటో ఊహించుకున్నాం- వీడేంటీ ఇలా పొట్టిగా ఇలా వున్నాడు అని మా లేడీ బంధుమిత్రులతో గుసగుసలాడేవారుట.

అది విని నన్ను నేను కాకుండా నన్ను పుట్టించిన అమ్మానానలను తిట్టుకునేవాడిని. అలా అలా ఆ వ్యాఖ్యలు అలవాటయి పోయి మొత్తమ్మీద నా పొట్టితనం మార్చలేను కాబట్టి అంగీకరించేసాను. అలా అంగీకరించాక ఇహ నాకు దానివల్ల బాధ కాకుండా నవ్వు వస్తుండేది. నా ఎత్తు 5' 3'' మాత్రమే. నా బరువు 52 కేజీలు. ఇంకా గొప్ప పర్సనాలిటీ వుండమంటే ఏం వుంటుంది చెప్పండి? హేండ్సం అని పిలిపించుకునే భాగ్యం ఈ జన్మకి లేదు కాబట్టి వచ్చే జన్మలో చూసుకుందాం. అప్పుడు మీరు కూడా మళ్ళీ బ్లాగర్లై పుట్టండేం! అప్పుడు చూసుకుందాం.

నా పెళ్ళయిన రెండో రోజు మా ఆవిడ ఇలా అంది "వైట్ బాగానే వున్నావు కానీ ఇంకొద్దిగా హైట్ వుంటే బావుండేది". మన చేతుల్లో లేని విషయం కాబట్టి లైట్ తీసుకున్నాను. అయితే నన్ను పొట్టోడు, పొట్టోడు అని గేలిచేయడం మొదలెట్టింది. మరి రెండు సార్లు నన్ను పెళ్ళి చూపుల్లో చూసావు కదా ఎందుకు పెళ్ళి చేసుకున్నావు అని అడిగాను. మా నాన్న చేసుకొమ్మని చెప్పాడూ అంది. మరి నువ్వు కూడా పొట్టిదానివే కదా అంటే ఆడాళ్ళు పొట్టిగా వుండొచ్చు పర్లేదూ అంది. ఆమె ఎత్తు 5'1''. నా తల ఎక్కడ కొట్టుకోవాలో, పెట్టుకోవాలో అర్ధం కాలేదప్పుడు. నేను పొట్టివాడిననే విషయం ఎప్పుడో మరచిపోయాను - నువ్వు మళ్ళీ కెలక్కు అని స్ట్రిక్టుగా వార్నింగ్ ఇచ్చాను. అప్పటినుండీ నన్ను గేలిచేయడం మానివేసింది.

క్రితం సారి ఇండియా వెళ్ళినప్పుడు కొంతమంది బాల్య మిత్రులు వారి ఇళ్ళళ్లకు రమ్మన్నారు. వారి ఇళ్ళళ్లకు వెళ్ళి చాలా ఏళ్ళు అయ్యింది. నేను వెళ్ళాక నన్ను చూసి వారి పిల్లలు డిజప్పాయింట్ అయ్యారు. శరత్ అంటే యు ఎస్ నుండి వస్తున్నాడంటే ఎలా వుంటాడో, ఎంతెత్తు వుంటాడో, ఎంత బావుంటాడో అనుకున్న వారంతా నా పిట్ట ప్రాణం చూసి పెదవి విరిచారు. మళ్ళీ మా అమ్మా నానలను తిట్టుకున్నాను.

అయినా శారీరకంగా బావుండటంలో ఏం వుంది లెండి, మనస్సు బావుండాలి కానీ కదా. మరి నా మనస్సు మరీ విశా...లం కదా. ఇంకా లోటేం వుంది. సినిమాలలో పొట్టి కమెడియన్లను గేలి చేస్తున్నప్పుడు మనస్సు చివుక్కుమంటుంది కానీ ఏం చేస్తాం - మనమూ నవ్వుతాం. ఏడవలేక నవ్వుతాం :)) ఇలాగే. ఇప్పుడు ఇండియా వెళుతున్నా కాబట్టి కొంతమంది బ్లాగర్లను కలుస్తాను కాబట్టి వారు నాముందే పెదవి విరిచేయకుండా ఇలా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నానన్నమాట ;)

చచ్చిన చేపని నీళ్లలో వేస్తే మునుగుతు౦దా? తేలుతు౦దా?

వేణువు బ్లాగులో నేమో వాలి తోక ఎ౦త పొడవు సుగ్రీవుని తోక ఎ౦త పొడవు అని కొలుస్తున్నారు. నాగమురళి బ్లాగులోనేమో ఏదో రామారావుకి ఈకలు పీకుతున్నారు. మనమేమో మలక్కు లాగా మేధావుల౦ కాదాయే - ఆ చర్చల్లో పాల్గొనడానికి. కానీ అలా౦టి గ౦భీరమయిన విషయాలు చర్చి౦చక పోతే మన ఇమేజీ గ్రాఫు పడిపోదూ? వీడు రోజూ పాటలే పాడుతాడు కానీ మలక్కు లాగా మోకాల్లో కూడా వీడికి కనీస౦ కోడి  బుర్ర  కూడా లేదు అని జనాలు ఓ ఘోర౦గా అపోహ పడే ప్రమాద౦ వు౦ది కాదూ!

అ౦దుకే ఎలాగబ్బా అని ఆలోచి౦చగా ఆలోచి౦చగా నాకెక్కడో వాచిపోయి౦ది. అప్పుడు బ్లాగు తల్లి ప్రత్యక్షమయిపోయి "ఎదవా, సన్నాసీ, కన్నా హి౦త చిన్న విషయ౦ గురి౦చి అ౦తగా వాయగొట్టుకోవడ౦ ఎ౦దుకు నాయనా, నేనున్నాను కదా" అని ముద్దుగా తిట్టేసి ఈ పరమ గ౦భీరమయిన కాపీ ప్రశ్న ఒహటి సెలవిచ్చి అ౦తర్ధాన౦ అయిపోయి౦ది. మరి నా ప్రశ్నకి సమాధాన౦ దొరకలేదనుకో౦డి నా పైత్య౦ ఇ౦కా ఎక్కువయిద్ది. దాన్ని మళ్ళీ మీ మీదే రుద్దబుద్దవుద్ది. అ౦దుకే మరి మర్యాదగా నా ప్రశ్నకి సమాధాన౦ ఇవ్వ౦డే౦!

మా ఇంటి గోడ పక్కన మా గ్రూపు పాట!

ఇది కూడా స్లీజీ పోస్టే, బుద్ధిమంతులు ఎవరన్నా వుంటే కిందికి వెళ్ళకండి. వోక్కే!

అవి సూర్యాపేటలో వుంటున్న రోజులు. కొత్త బస్సు స్టాండ్ దగ్గర్లో కొత్తగా మా ఇల్లు కట్టినందువల్ల చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు వుండకపోయేవి. మా ఇంటి పక్కన ఒక వైపు ఖాళీగా వుండేది. ఆ స్థలమ్లో మా ఫ్రెండ్సు తో కలిసి ఓ ఓండ్ర   పెడుతూ గోడ మీద కాలెట్టి  గ్రూపుగా పాట పాడుతుండేవాడిని.  వేసవి కాలమ్లో పైన డాబా మీద పడుకునే వారం కాబట్టి రాత్రి పూట పైనుండి క్రిందికి వినిపిచ్చేలాగా మా గానామృతం సాగుతూవుండేది. 

మరో వైపు మా ఇంటి ఎదురుగా ఓ బ్రతకలేని బడిపంతులుకు అందమ్లో ఆణిముత్యాల్లాంటి అరడజను ఆడపిల్లలు వుండేవారు. వారిని చూసి కూడా కుర్రాడినయిన నేను లైను వేయకపోతే వారి మనోభావాలు తీవ్రంగా గాయపడి డిప్రెషనుకు గురవుతారని ఎంతో పెద్దమనసు చేసుకొని అందులో నాకు తగిన అమ్మాయిని చూసుకొని లైను వేయడం మొదలెట్టాను. అలా అలా మా స్నేహం పెరిగింది. మా తొట్టి గ్యాంగును కూడా ఆమెకు పరిచయం చేసాను. అలా అలా ఆ అమ్మాయి వాళ్ళింటి ముందు నిలబడి మమ్మల్ని గమనిస్తూవుండటం, మేము ఆమె అమ్మా, నానలకీ తెలియకుండా ఏవేవో సైగలు చేస్తుండటం జరుగుతూవుండేవి. 

అదలా వుండగా ఒక శుభముహూర్తాన ఆమెకో చక్కని డవుట్ వచ్చింది. అలాంటి డవుట్ వస్తే మనస్సులో పెట్టుకోవాలా! అలా కాకుండా మమ్మల్ని ఈ విధంగా అడిగేసింది " మీరందరూ రోజూ మీ ఇంటి ప్రక్కనే ఎందుకు పాట పాడుతారు?"   హ్మ! ఆమె బాధ మాకు అర్ధమయ్యింది. ఆమె బాధని తొలగించాలని అందరమూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. పాపం, ఆడపిల్ల. అందునా బంగినపల్లీ మామిడి పండు వంటి ఆడపిల్ల అలా బాధపడుతుంటే ఎవరయినా చూస్తూ ఊరుకోలేరు కదా. పైగా మా మనస్సులు మహా మెత్తనాయే. 

సరే, అని ఒక రోజు ముహూర్తం నిర్ణయించాం. ఆమె వారి ఇంటిముందు నిలబడి చూస్తుండగా వాళ్ల ఇంటి వైపు వెళ్ళాము. మేము అటువైపు ఎందుకు వస్తున్నామా అని ఆసక్తిగా మాకేసి చూడనారంభించింది. చటుక్కున వారి ఇంటి పక్క గోడ వైపు తిరిగాము. వాళ్ళింటి పక్కన కూడా బోలెడంత ఖాళీ స్థలం వుండేది. ఆమెకు కనిపించనంత దూరం వెళ్ళి వాళ్ళింటి పక్కన అందరం కలిసి గ్రూపుగా పాట పాడి వచ్చాము. తిరిగి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి ఆమె ఇప్పటికయినా సంతోషంగా వుందో లేదో అని చూసాను!

అక్కడే ఆగిన ఆడ లేడీ బ్లాగర్స్ - 2

ఇంతకుముందు టపాలో నేను ప్రస్థావించినటువంటి విషయాలు బహిరంగంగా చెప్పుకోలేకపోతే సీత గారిలా అజ్ఞాతంగా అయినా చెప్పుకోవచ్చు. చెప్పడం, అలాంటి సమస్యలను వెలికితీయడం, చర్చించడం, పరిష్కారాలు వెతకడం అన్నవి కాలక్షేపానికి కాలక్షేపం ఇవ్వడంతో పాటుగా, మెదడుకి పదును పెడుతాయి. కొందరికి పరిష్కారం చూపిస్తాయి. మీ ఇంట్లో సొరకాయ ఎంత పొడుగు వుంది, మా ఇంట్లో సొరకాయ ఇంత పొడుగు వుంది, పంట పొలాల్లో పాట లాంటి నా టపాలాంటి చచ్చు పుచ్చు  టపాల కన్నా అవి చాలా వరకు బెటర్.

సరే, అవి వ్రాస్తే మాకేంటి? అని అడుగుతున్నారు. ఇపుడు మీరు వ్రాస్తున్నవి చదివితే మాకేంటి అని అడుగుతున్నాను నేను! ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్రాస్తారు అన్నది నిజమే. అందరూ అలాంటివి వ్రాయాలని కాదు గానీ కొందరయినా , ఒక్కరయినా వ్రాయట్లేదే అన్నదే నా చర్చ. పోలోమంటూ అందరూ కడివెడు కడివెడు కన్నీళ్ళు బ్లాగుల్లో కుమ్మరించినా ఏడుపుగొట్టు సినిమాల్లా మళ్ళీ బ్లాగులోకానికి కూడా దూరంగా వుండాల్సివస్తుంది. అంచేతా, మై డియర్ లేడీ బ్లాగర్స్, అందరినీ వ్రాయమని ఉచిత సలహా ఇవ్వలేదు, కొందరినన్నా వ్రాయమని కోరాను - వైవిధ్యం కోసం. ఓక్కే? అవన్నీ వ్రాయడం కష్టం కదా - చేతులూ, వేళ్ళూ, కళ్ళూ ఎంత నొప్పెడతాయీ. హమ్మో అన్ని త్యాగాలు చేయాలా అన్నది వారి మరో ప్రశ్న. వద్దు, అన్ని త్యాగాలు చేసి త్యాగమూర్తులు కావద్దు. నిజంగా వ్రాయలనుకున్నవారు ఆ నొప్పులకు సిద్ధమయే వుంటారు. వ్రాస్తే మాకేం వస్తుంది అన్నది ఒక ముఖ్యమయిన ప్రశ్న. ఇప్పుడేం వస్తోందేం? ఎవరయినా టిక్కెట్లు పెట్టి కొనుక్కొని చదువుతున్నారా? ఇప్పుడేం వస్తోందో అవి వ్రాస్తే ఆ వచ్చేవేవో ఇంకా బాగా వస్తాయి. గ్యారంటీ. లిస్టు చెప్పండి - బ్లాగులు వ్రాయడం వల్ల మీకు కలుగుతున్న ఉపయోగాలు.

అదే విషయం మొగాళ్ళకి చెప్పొచ్చు కదా అంటారు. ఇది ఎలా వుంటుందంటే పక్కోడికి చాక్లెట్ ఇచ్చావు నాకెందుకు ఇవ్వలేదు అని ఫిర్యాదు చేసినట్లు. నాతో సహా ఇంకో ఇద్దరయినా అప్పుడప్పుడయినా వ్రాస్తున్నారు. అందులో ఓకటి సంకలినిల్లో రాకపోవచ్చు. పేర్లొద్దు లెండి - మళ్ళీ ఎదవ గొడవ మొదలవుతుంది. వారు అన్నీ కాకపోయినా, ప్రతీసారి కాకపోయినా అప్పుడప్పుడయినా కాస్త వైవిధ్యం కురిపిస్తున్నారు. ఇహ మిగతావారంటారా? నువ్వెవడివి బే మాకు చెప్పడానికి - పంజూసుకో అంటారు. మీరయితే మెత్తని హృదయం కాబట్టి తిట్టినా సరే దెబ్బలు తగలవు. అందుకే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నాను. ఎందుకు ఎందుకు అంటే ఏం చెప్పమంటారు మరి? ప్రతి అడుగూ ఆలోచించీ చించీ వేస్తామా? కొన్ని అడుగులు అలా అలా అలవోకగా పడుతాయి. కుడికాలు ముందు వేస్తే ఎడమకాలు అలుగుతుందా? ఏది ముందు, ఎవరు ముందు అనేది ముఖ్యం కాదు - ఇసయం, ఇసయం ముక్కెం.

మరి మీరు మాత్రం అన్నీ వ్రాస్తున్నారా అన్నది కొందరి ప్రశ్న. నేను పబ్లిగ్గా వ్రాస్తున్నాను. నాకో కుటుంబమూ వుంది. అందువల్ల నేను ఎంత వ్రాసుకున్నా 10% మాత్రమే వ్రాయగలను. 90% రహస్యాలు, సమస్యలు నేను వ్రాయలేను. అదే అజ్ఞాతంగా వ్రాసివుంటే కేవలం 10% కప్పిపుచ్చి మిగతా 90% వ్రాయడానికి అవకాశం వుండేది. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళి స్వేచ్చగా వ్రాసుకుందామనుకున్నా కుదరదు. నా శైలి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈజీగా మీరందరూ గుర్తుపడతారు. ఇహ రౌడీ అయితే ఈ బ్లాగులో ఎన్ని చుక్కలు వున్నాయి, ఆ బ్లాగులో ఎన్ని చుక్కలు వున్నాయి లెక్కలు పెడతారు :)  

ఇహ ఆ పది శాతం విషయాలు కూడా కేవలం నా గురించి మాత్రమే వ్రాసుకోగలను. నా దగ్గరి వారి గురించి వ్రాయడానికి వారికి ఇష్టం వుండాలి కదా. వారూ మీలాంటి గొర్రెలే కాబట్టి వారు అందుకు ఇష్టపడరు, అనుమతించరు. అలా అనుమతి ఇవ్వకపోయినా వ్రాసే గట్స్ లేవా అంటే అది గట్స్ కి సంబధించిన విషయం కాదు. ఒకరి అనుమతి లేకుండా ఒకరిని గుర్తించేలా బయటకి చెప్పకూడని విషయాలు వ్రాయడం నా దృష్టిలో భావ్యం కాదు. మీ దృష్టిలో భావ్యం అయివుండవచ్చు.

నా గురించి నేనే చాలా వరకు బాధ్యుడిని కాబట్టి నా గురించి కొంతయినా వ్రాసుకోగలుగుతున్నాను. మిగతా ఎవ్వరూ అలాంటివి వ్రాయలేని పరిస్థితుల్లో ఆ మాత్రమూ ఎక్కువే. అయితే అప్పుడప్పుడయిన్న నా బ్లాగుల్లో ఇతరుల వివరాలు మార్చి నాకు తెలిసిన ఆడవారి సరదాలూ, వ్యధలూ, సవాళ్ళూ, శృంగారాలూ ఏకరువు పెడదామనుకుంటున్నాను. ఏం చేస్తాం మరి, మీలో ఎవరూ సరిగ్గా ముందుకు రాకపోతే?

అలాంటివి ఎవరూ వ్రాయకపోతే కొత్తగా వచ్చేవారు బ్లాగుల్లో చాలా పద్ధతిగా వుండాలేమో అని భ్రమపడాల్సివుంటుంది. నెట్టులో వున్న గొప్ప విషయం ఎనానిమిటీ. అనవసరంగా పబ్లిక్ బ్లాగరయ్యానేమో అనిపిస్తుంది. ఈ లేకి అజ్ఞాతల చిరాకుకు మంచి మందు మనం కూడా అజ్ఞాతంగా వ్రాయడమే. నేను కూడా అలా అజ్ఞాతంగా కామెంట్లు వ్రాసివుంటే నేను వేసిన చిన్న చిన్న సన్నాయి నొక్కులకు కూడా ఈరోజు ఇలా సౌమ్య నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడానికి అవకాశం వుండేది కాదు. ఏం చేస్తాం - కామెంట్లన్నీ పబ్లిక్ గానే వెయ్యాలనేది నా కమిట్మెంట్. అందువల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు వస్తుంటాయి. సరే.

సొ, పబ్లిక్ బ్లాగర్లకి అంత స్వేఛ్ఛ లేదు కానీ ఎనానిమస్ బ్లాగర్లకి పూర్తి స్వేఛ్ఛ అని కాదు గానీ చాలావరకు స్వేఛ్ఛ వుంది. మన మనసంతా బ్లాగులో పరిచే అవకాశం వుంది. అందువల్ల నెట్టులోని ఎననిమిసిటీని ఎడ్వంటేజీగా తీసుకొని ఎవరయినా తమ మనస్సును విప్పిచెప్పాలనుకుంటే వారికి ఇదే నా అభినందన. అలా అని ఏది వ్రాసినా చెల్లుతుంది అని కాదు. చట్టవ్యతిరేకమయిన వ్రాతలు వ్రాస్తే ప్రభుత్వం దగ్గర అజ్ఞాతల ముసుగులు తీసి బయటపడేసే పద్ధతులు వుంటాయి. మాకేం వస్తుంది, మాకేం లాభం లాంటి శషభిషలకు పోకుండా వ్రాయాలనిపించింది, పరచాలనిపించి పరిచేయడమే.

ఓ సాధారణ జీవనం గడపడానికీ, ఓ సాహసోపేతమయిన జీవితం గడపడానికి ఎలాంటి తేడా వుందో అలాగే సాధారణ వ్రాతలు వ్రాయడానికీ, సాహసమయిన వ్రాతలు వ్రాయడానికీ మధ్య అలాంటి తేడా వుంటుంది. మీకు బ్లాగుల్లో థ్రిల్ రైడ్ కావాలంటే సాహసోపేతంగా వ్రాయండి, మొగుడి చంకనెక్కడమే పెద్ద థ్రిల్ రైడ్ అనుకుంటే మామూలుగానే వ్రాస్తుండండి. ఛాయిస్ వుంది - ఛాన్స్ తీసుకోండి.

(అయిపోయింది)

అక్కడే ఆగిన ఆడ లేడీ బ్లాగర్స్ - 1

కొంతకాలం క్రితం నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రకటన చేసాను. రోమాంటిక్ విషయాలే కాకుండా రాజకీయాలూ, హాస్యం, రచనలూ, ఆరోగ్యం వగైరాల గురించి కూడా వీడియోలు రూపొందిస్తా అని చెప్పాను. అప్పుడొక కామెంటర్ ఇలా అన్నారు "అవన్నీ రెగ్యులర్ మీడియాలో వచ్చే విషయాలే. ఇంటర్నెట్టులో వున్న అడ్వంటేజ్ ఏమిటంటే పెద్దగా పరిమితులు లేకపోవడం. దానిని అడ్వంటేజీగా తీసుకొని రెగ్యులర్ మీడియా ఇవ్వని, ఇవ్వలేని విషయాలను మీరు అందించండి". ఆ సూచన నాకు బాగా నచ్చింది.

తెలుగు బ్లాగోస్ఫియరులో ఎంతో మంది ఆడ బ్లాగర్లు వున్నారు. కానీ ఏం లాభం అందరూ వ్రాసేవీ మామూలు మీడియాలో వచ్చేవాటికన్నా పెద్దగా వైవిధ్యంగా వుండటం లేదు. సాధారణ మీడియాలో చెప్పని, చెప్పలేని, చెప్పకూడని విషయాలను ఎంతమంది స్త్రీలు ఈ బ్లాగ్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు? ఏ లేడీ బ్లాగరుని చూసినా పోనీ కొద్దిగా కేడీ అనుకున్న బ్లాగర్లని చూసినా ఏమున్నది గర్వకారణం? స్త్రీ బ్లాగు జాతి చరిత్ర మొత్తం గొబ్బెమ్మలు, ముగ్గుల పారాయణత్వం! ఏ బ్లాగర్ ని చూసినా పాతివ్రత్యమే, హైపోక్రసీనే. భూమిక లాంటి స్త్రీజైన్లూ, కల్పనా రెంటాల లాంటి కొద్ది మంది 'అయిదో గోడ' లాంటి తమ కథలు, నవలల్లో మాత్రం కాస్త ధైర్యంగా వ్రాస్తున్నారు. అయితే ఇక్కడ ఆంశం కథలూ, కవితలూ, నవలలూ కాదు. స్వంత అనుభవాలూ, అనుభూతులూ, ఆలోచనలూనూ.

ఎవరిని చూసినా చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆట ఎట్లా ఆడేవారం, గొబ్బెమ్మలకు ముస్తాబు ఎలా చేసేవారం, పేడ మరియు దానివల్ల ఉపయోగాలు, టమాటా - కోడిగుడ్డు కూరలో ముందు కోడిగుడ్డు వెయ్యాలా లేక టమాటా వెయ్యాలా (హి హీ, ఇది నా సందేహం లెండి - పనిలో పనిగా ఎవరయినా జవాబు ఇవ్వకూడదూ. అది తెలియక మొన్న ఆదివారం ఆ కూర చెడగొట్టుకున్నాను), మా ఆయన ఎంత పొడుగు మల్లెపూలు తెచ్చి ఇచ్చారు, మా ఆయన బంగారం, పెళ్ళి చూపుల్లో ఎన్ని సార్లు ముసుముసి నవ్వులు నవ్వానూ, కోడిగుడ్డుకి ఎన్ని ఈకలుంటాయి లాంటి సాధారణ విషయాలే తప్ప అంతకు మించి దాటి రారే!

మా ఆయన నిన్న ఎన్ని హింసలు పెట్టాడు, ఎవడు తమకి లైన్ వేసాడు, ఎవడు తమని ముందుగా రేప్ చేసాడు, ఏ హీరో అంటే క్రశ్శు, తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు, ప్రేమలో భంగపాట్లు, ఎంతమందిని తాము ప్రేమ పేరుతో మోసం చేసిందీ లేదా తమని ఎంతమంది మోసం చేసిందీ, తాము చూసిన అన్యాయాలు మొదలయినవి ఏవన్నా వ్రాస్తారేమో అంటే ఎవ్వరూ వ్రాయరే.

ఇప్పుడు వున్నవాళ్లనే కాదు, రేపు మా దగ్గరి వారు ఎవరయినా బ్లాగులు ఓపెన్ చేసినా అంతే పరిస్థితి. అందరూ పరిపూర్ణ మహిళలు. ఎవరిలోనూ లోపాలుండవు. తల్లితండ్రులు వీరిని చక్కగా పెంచుతారు, కన్యగా భర్తకి అంకితం అవుతారు. వీరికి ఇతర ప్రేమలూ, రేపులూ వుండవు. చక్కటి పిల్లలని కంటారు. రోజూ వచ్చేప్పుడు మొగుడు మూరెడు మల్లెపూలు తీసుకొని వచ్చి మెడకాయ మీద వున్న జడకాయ మీద తరుముతాడు. వీరికి అందరూ చక్కని మిత్రులే వుంటారు. మగ మేల్ మిత్రులు వుండటం చాలా తక్కువ.

నేను ప్రస్థావించిన విషయాలు మనసు విప్పి వ్రాయాలంటే బాగా ధైర్యం వుండాలి. ఎందుకంటే అజ్ఞాతల నుండీ వెటకారాలు, చాదస్తుల నుండీ ఫత్వాలూ రావచ్చు. అప్పుడు తోటి ఆడ బ్లాగర్లే 'ఛీ ఇది చెడ్డది - ఇది పవిత్రమయిన ఆడ బ్లాగులోకంలో చెడ పుట్టింది' (మగ బ్లాగులోకాన్ని నాలాంటి వారెప్పుడో బలాత్కారం చేసిపెట్టారు కాబట్టి హంత సతీవ్రతం ఇప్పుడు లేదు) అని తమ తమ గుంపులల్లొ చేరి కాకుల్లా పొడిచినా పొడుస్తారు. వారికి తోడుగా చొంగలు కార్చుకునే మగ కాకులు చేరి ఇంకా పొడుచుకు తింటాయి. ఇది గ్యారంటీ.

నిజమే - ఇబ్బందులు వుంటాయి. ఇబ్బందులు వుంటాయనే కదా అందరూ బ్లాగుల్లో నాటకాలాడేది? మనమూ నాటకాలాడొద్దంటే గట్స్ కావాలి. మొండి తెగువ కావాలి. ఎవరేమనుకున్నా ఎదిరించి నిలబడగలిగే స్థైర్యం కావాలి. వాటినే లీడర్షిప్ లక్షణలు అంటారు. కామెంట్లకో, అవహేళనలకో భయపడి నలుగురితో పాటు నారాయణా, పది మందితో పాటుగా ప్రమాదవనంలో గోవిందా అనుకుంటే మీ గొప్పతనం ఏంటీ? అలాంటి అమ్మలక్కలు బోలెడంతమంది వున్నారు. ఇలా అయితే మీరు మీ బ్లాగుల్లో వైవిధ్యం చూపించేదెప్పుడూ, ఎన్నడూ?

ఇప్పుడు వస్తున్నటువంటి ఎక్కువభాగం పోచుకోలు కబుర్లు చదవడానికి, వినడానికీ మనకందరికీ పత్రికలు, పుస్తకాలు, టివి ఛానళ్ళూ వున్నాయి. వాటికోసం బ్లాగుల్లోకే, నెట్టులోకే రానవసరం లేదు. నెట్టులోనయినా స్వేచ్చ వుంది కాబట్టి ఎవరయినా కాస్తో కూస్తో ధైర్యం చేసి హిపోక్రాటిక్ ముసుగులను అవతలపడేసి సామాజిక, ఆర్ధిక, శారీరక, మానసిక, లైంగిక విషయాలను వాస్తవ దృక్పధంతో చర్చిస్తారేమో అంటే అంత దృశ్యం నేడు లేదే! మనస్సు పొరల్లో భూస్థాపితం చేసిన చేదు నిజాలనూ, ఎవ్వరికీ చెప్పలేని మధురానుభూతులనూ, సాధారణ జనం ఖంగు తినే భయంకరమయిన అనుభవాలనూ, నిష్టూరంగా వుండే నిజాలనూ వెలికి తీసి ఎవరయినా బ్లాగుల్లో పరుస్తారేమో అంటే అంత సీన్ లేదే. మరి మగవారు అలా వ్రాయట్లేదా అంటే వారు కూడా వ్రాస్తున్నారు - నేను కూడా వ్రాస్తుంటాను. అయితే మగాళ్ళలో నాలాంటి వారు కొంతమంది బ్లాగులు వ్రాయడంలో వున్న స్వేఛ్ఛని కొంతవరకయినా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారు స్త్రీలల్లో కాగడా ఊప్స్ ఆ పేరు వద్దులెండి - ఎదవ గొడవ - దివిటీ పెట్టి వెతికినా కానరావడం లేదు.

(ఇంకా వుంది)

మా మాంగోరి పచ్చటి పొలాల్లో నేను గొంతెత్తి పాడిన పాట!

గమనిక: కొందరు ఉత్తమ పురుషలకు ఈ టపా చవుకబారుగా అనిపించవచ్చు. అలాంటివారు బుద్ధిగా స్కిప్ చెయ్యొచ్చు!

ఆ ఊరిలో నా పెళ్ళి పత్రికలు ఇచ్చి మోటార్ సైకిళ్ళ మీద వస్తున్నాము అప్పుడు. ఆ ఊరు మా అత్తవారి ఊరు దాటాక వుంటుంది. "మామా మీ కాబోయే మామగారి పొలాలు ఇవే" అన్నాడు ఒక ఫ్రెండు రోడ్డు పక్కన పచ్చని పొలాలని చూపిస్తూ. "ఆగండి!" అని నేను గర్జించాను ఆ మాటలు వినగానే. ఏం కొంప అర్జంటుగా మునిగిందేమోనని ఆగిపోయారందరూనూ. "అలా మా మామగారి పొలాలను చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోవడమేనా?" అని వారిని నిలదీసి ప్రశ్నించాను.

వాళ్లందరూ అర్జంటుగా నాలుక్కొరుక్కున్నారు కానీ తరువాత ఏం చేయాలో తెలియక బిక్కముఖం వేసి "ఏం చేయమంటావు మామా? మన పాద ధూళితో పావనం చేద్దామా ఆ నేలని?" అని ప్రశ్నించారు. "అంతే కాదు. పాట కూడా పాడాలి. పాటతో నేల సస్యశ్యామలం కావాలి" అన్నాను చిద్విలాసంగా. అదే అదనుగా మావాడు ఒహడు ఓ అని గొంతెత్తాడు. "ఎహె నోర్ముయ్. పాటంటే ఆ పాట కాదు. కాలెత్తి పాడాలి ఈ పాట" అన్నాను చిరాగ్గా. మా వాళ్లంతా తమ అమాయకత్వానికి మరోసారి సిగ్గుపడి మరోసారి సమ్మగా నాలుక కొరుక్కున్నారు.

మోటార్ సైకిళ్ళు దిగి అందరూ ఠీవిగా రాజు వెడలె రవి తేజము లదరగా అన్నట్లు రోడ్డు దిగి ఆ పొలాలలోకి నడవనారంభించారు. నాకు మండుకొచ్చింది. "ఆగండి!" అని మళ్ళీ అరిచాను. మళ్ళీ ఏం కొంప మునిగిందేమోనని గిరుక్కున వెనక్కి తిరిగి క్వెషన్ మార్క్ ఫేస్ పెట్టారు. "ఎవరిదా నేల?" అని నిగ్గదీసి అడిగాను. "మీ మామగారిది" అన్నారు అమాయకంగా. "కదా! మరి ఎవరు పాట పాడాలి అందులో?" అని ఆయాసం అనిపించినా కాస్త శ్రమపడి గొంతు పెంచి అన్నాను. వాళ్ళకి తమ తప్పు తెలిసివచ్చి మరోసారి నాలుక కొరుక్కున్నారు. "కొరుక్కున్నకాడికి చాలు గానీ రోడ్డుకి ఆ వైపు మీరంతా పాట పాడండి" అని వాళ్ళను గెదిమాను.

ఆ తరువాత దర్జాగా ఆ పొలాల్లొకి నడిచి నా పాద ధూళితో పావనం చేసి తాపీగా గొంతెత్తి పాట పాడుకుంటూ పాటపాడి ఆ నేలను సస్యశ్యామలం చేసాను. మా మామ ఎప్పుడన్నా పంటలు బాగా పండినాయని చెప్పినప్పుడల్లా అది నా ఘనకార్యమే అని చెప్పాలన్న కోరికను ఆత్మనిగ్రహం మనకు ఎక్కువ కాబట్టి బలవంతంగా ఏదోలా నిగ్రహించుకునేవాడిని. వారి నాన్నారి పొలానికి నేను చేసిన సేవను మా ఆవిడక్కూడా ఎప్పుడూ చెప్పలేదు - మీకే ముందు చెబుతున్నాను. ఇది చదివాక మీకొక ప్రశ్న మనస్సులొ ఉదయిస్తుందని నాకు తెలుసు. ఎరువు గురించేనా? వద్దులెండి - అలాంటివి మాట్లాడుకుంటే మరీ బావోదు.

ఓ హీరోయిన్ (గతంలో) మా ఇంటికి వచ్చిన వేళ...

సూర్యాపేటలో కొత్తబస్టాండుకి దగ్గర్లోనే నేషనల్ హైవేకి కొద్ది దూరంలోనే మా ఇల్లు వుండేది. సూర్యాపేటలోని ఒక ముఖ్యమయిన రోడ్డు మా ఇంటి మీదుగానే వెళుతుంది. అప్పుడు ఇంటరో, డిగ్రీనో వెలగబెడుతున్నాను. మరి ఆ రోజు ఆదివారమో లేక లేజీ కాలేజీ ఎగ్గొట్టి పడుకున్నానో తెలియదు కానీ మధ్యాహ్నం ఎంచక్కా మస్తు నిద్రపోయాను. 

మా అమ్మ హడావిడిగా నిద్రలేపుతుండటంతో మా కొంపేమయినా అంటుకుపోయిందేమోనని ఉలిక్కిపడి లేచాను. సినిమా స్టార్ జయ... వచ్చిందిరా మనింటికీ, లేరా లేరా అని మా అమ్మ నిద్ర లేపుతోంది. ఎదురుగ్గా ఓ ఆడ ఆకారం నా గదిలోకి తొంగిచూస్తూ చెక్క బీరువాకు అంటించిన సినిమా తారల పోస్టర్లు పరికిస్తూ ఓ ఇంట్లో ఎవరో సినిమా అభిమానులున్నారే అంటోంది. అప్పుడు వెలిగింది నాకు - ఆమె ఎవరో. సంభ్రమాశ్చార్యాలతో పడక మీదినుండి దిగ్గున లేచాను.

'మా చిన్నోడు, సినిమాలంటే బాగా ఆసక్తి' అని నన్ను పరిచయం చేసింది మా అమ్మ. అలాగా అంటూ మా అమ్మ దగ్గర సెలవు తీసుకుంటూ బయటకి నడుస్తోంది ఆమె. ఆమెతో బాటుగా నేను కూడా నిద్రలో నడుస్తున్నట్లుగా బయటకి నడిచాను. ఆమె వెళ్ళి కారులో కూర్చునే ముందు "మద్రాస్ ఎప్పుడయినా వస్తే తప్పకుండా మా ఇంటికి రండి" అని చెప్పింది నాకు. అలాగే అని గంగిరెద్దులాగా తల ఊపాను. కారు వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళిపోయాక మా అమ్మతో పాటుగా ఇంట్లోకి నడుస్తూ "నేనేమయినా కలగంటున్నానా?" అని అమ్మని అడిగాను.  అమ్మ నవ్వి "అదేం లేదు. నిజంగానే వచ్చింది. నువ్వు మెలకువగానే వున్నావు" అంది.  గిచ్చి చూసుకున్నాను. నిజమే. మెలకువలోనే వున్నాను. మరి ఆ ప్రముఖ కథానాయకి మా ఇంటికి ఎందుకు వచ్చింది? ఆమెతో మాకు పరిచయమూ లేదు, స్నేహమూ లేదు, చుట్టరికమూ లేదు! అదే ప్రశ్న మా అమ్మని అడిగాను ఉత్సుకతతో.  మా అమ్మ నవ్వి ఆమె ఎందుకు వచ్చిందో చెప్పనారంభించింది...అమ్మ చెప్పింది అంతా విన్నాక ఆ వచ్చినామేదో నా అభిమాన హీరోయిన్ అయివుంటే ఇంకా సంతోషించేవాడిని కదా అనుకున్నాను.

మీరెవరయినా ఆమె మా ఇంటికి ఎందుకు వచ్చి వుండవచ్చో ఊహించగలరా? పైన కొన్ని క్లూలు ఇచ్చాను.