హ హ. వీళ్ళ అభ్యుదయం అంతవరకే! - 1

ఈసారి సనాతనవాదులని, సాంస్కృతిక వాదులనీ, మతవాదులనీ వదిలేద్దాం. కాస్తో కూస్తో అభ్యుదయం వైపుగా చూసే వారిలో అభ్యుదయం ఎంతవుందో చూద్దాం. వారి తరహా ఎలా వుంటుందంటే మతవాదులకన్నా, మనువాదులకన్నా ఒక అడుగు ముందుకు వేసి హమ్మయ్య చాలా సాధించేసాం, చాలా ప్రోగ్రెసివ్ మెంటాలిటీ మనది, సెబ్బాస్ అని వారి భుజాలు వారే చరచుకుంటారు.

కాస్తో కూస్తో మంచి భావాలే వున్నాయే అని కొద్దిరోజులు అనుకున్నామా కులగజ్జి రూపంగానో, మరో విధంగానో బయటపడి మనల్ని నాలుక కొరుక్కునేట్లుగా చేస్తారు కొంతమంది. మరి కొంతమందికి హక్కుల మీద మంచి గౌరవమే వుంటుంది అని వారిని గౌరవించబోతామా వారికి హక్కులంటే కేవలం మావోయిస్టుల హక్కులు మాత్రమే హక్కులు అన్నది తేటతెల్లం చేస్తారు. మరికొంతమంది అభ్యుదయ మేధావులు అనుకుంటామా వారిలోని మేధావితనం మేడిపండు అయిపోయి ఏ సంకుచిత ఆశం దగ్గరో గిరికీలు కొడుతుంది. ఇహ కొంతమంది కవులూ, కళాకారులు కళని ప్రజల కోసం అనుకుంటూ కష్టపడుతున్నారులే అని ప్రశంసించే లోపుగానే ఏదోరూపేణా వారిలోని చెదలు పట్టిన ఆత్మన్యూనత బయటకి కనపడుతూ వుంటుంది.

ఇహ ఇన్నయ్య గారు లాంటి హేతువాదులూ, నాస్తిక కేంద్రం నాస్తికులూ మంత్రాలూ, తాయెత్తుల వ్యతిరేకత దగ్గరే ఆగిపోతారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నాస్థికత్వాన్నీ, హేతువాదాన్ని మలచుకోలేక అక్కడే ఆగిపోవడం వల్ల కొన్ని దశాబ్దాలుగా ఆ ఉద్యమాలకి ప్రజాదరణ లేకుండా అయ్యింది . నా చిన్న తనంలో అలాంటి ఉద్యమాలు ఉధృతంగా నడవడం నేను చూసాను. ఇప్పటికీ కూడా ఈ వాదులు అవే ఆంశాలని వల్లెవేస్తూ బోరు కొట్టిస్తుంటారు.

ఇహ స్త్రీ వాదులు స్త్రీల హక్కులు మాత్రమే హక్కులు అంటూ కూపస్థమండూకంలా, పిడివాదంతో పడికట్టు పదాలతో యుద్ధం చేస్తూ ఆ లోపల్లొతుల్లొనే వుండిపోతారు. వేరే ఉద్యమాలకు, హక్కుల పోరాటాలను గుర్తించాలనే స్పృహ వుంటున్నట్లుగా అనిపించదు.  ఆ హక్కుల వారికి తాము అనుకున్నవే హక్కులు. తాము అనుకోనివి దోపిడీ.


స్త్రీల హక్కులంటూ ఉద్యమాలు చెయ్యకపోయినా కాస్త ప్రోగ్రెసివ్గా ఆలొచించేవారుంటారు. అలాంటివారి ప్రొఫయిల్లో ఏ చలం పుస్తకాలో అభిమానం అని వ్రాసుకోగానే కాస్త విశాలభావాలు వున్నాయే అనుకుంటాం. కానీ వారి భావాలు చలం పుస్తకాలని అనుభవించేవరకే ఆగిపోతాయి. ఆచరణలో మాత్రం మళ్ళీ సనాతనత్వమే. ఎంత సేపూ 1940 ల్లోని చలాన్ని పట్టుకొని వేలాడటమే తప్ప చలం ఈ రోజుల్లో వుంటే ఎలా ఆలోచించేవాడూ అన్న స్పృహ వుండదు.
 
ఇహ మనస్సుల్లో సనాతనమయినా అభ్యుదయ రచయితల పుస్తకాలు చదివి మేధావులయ్యెవారు వుంటారు. వీరు ఆచరణలో కానీ, వేరే విధంగా గానీ చేసేదేమీ వుండదు కానీ పాత గొప్ప పుస్తకాలని అదే పనిగా చర్చిస్తూ ఎంత ప్రొగ్రెసివ్గా ఆ పుస్తకం వ్రాసేడూ అంటూ దానికి పేజీలు పీకడంతోనే సరిపుచ్చుకుంటారు.


ఇహ తీవ్ర పర్యావరణ వాదులు గట్రా వుంతారు. అభివృద్ధిని తిరస్కరించడమె వారికి అభ్యుదయం. వారికంటే బూజు పట్టిన భావాలున్నవారే నయం అనిపిస్తుంది. కనీసం వారు ఎక్కడ వున్నారో అక్కడే వుంటారు. ఈ సో కాల్డ్ అభ్యుదయ మేధావులు సమాజ హితం పేరిట సమాజాన్ని వెనక్కి మరల్చేందుకు యత్నిస్తుంటారు. ఇలాంటి వారంతా ప్రభుత్వం కానీ US కానీ ఏదిచెస్తే అది వ్యతిరేకించడమే ప్రోగ్రెసివ్ మెంటాలిటీ అనుకుంటారు.

ఇంతకూ ఈ నా ఏడుపు అంతా దేనికని కదా మీ సందేహం. ఇన్ని ఏళ్ళుగా గే హక్కుల గురించీ, లైంగిక హక్కుల గురించీ వ్రాస్తూ వస్తున్నానే. ఒక్క అభ్యుదయ బ్లాగరయినా పట్టించుకున్నాడూ? అంటే ఏదో ఉరికివచ్చి మా గ్రూపులో చేరి, తామూ గేలుగా మారి, మా ఝండా పట్టుకోమనడం లేదు కానీ తోటి ఉద్యమాలకి కనీసం ఎప్పుడయినా, ఒక్కరయినా నైతిక మద్దతు ఇచ్చారూ? ఏం అభ్యుదయం వారిది? ఏదో ఒకటి పట్టుకొని ఇహ అందులో ప్రజలు అభివృద్ధి చెందితే చాలనుకుంటే ఎలా?

పౌరహక్కుల కోసం ఆరాటపడేవారికి లైంగిక హక్కులు మానవ హక్కులుగా కనిపించవెందుకు అని నిగ్గదీసి ప్రశ్నిస్తున్నాను. ఎప్పటికప్పుడూ మీ పౌరహక్కుల లిస్టుని అప్డేట్ చేసుకోవడం తెలియదనుకోవాలా? ఎప్పుడో మావో చెప్పినవే మానవహక్కులు అనుకుంటె ఎలా? ఈ లైంగిక హక్కులు పోలీసు హక్కులు కావే - మీరు అసహ్యించుకోవడానికీ? కెక్యూబ్, హరి దోర్నాల, ప్రవీణ్ లాంటి వారు లైంగిక హక్కులను బూతు హక్కులుగా తృణీకరిస్తారెందుకూ?


ఎక్కడ స్త్రీ సమస్యలు వున్నా, స్త్రీలు అవమానం చెందినా మనం సానుభూతి ప్రకటిస్తాం. వారికి తోడుగా నైతిక మద్దతు అయినా ఇస్తాం. కానీ స్త్రీ వాదులు లెస్బియన్ ఉద్యమాలని ఎందుకు గుర్తించడం లేదు? లెస్బియన్ హక్కుల గురించి వ్రాస్తున్నప్పుడయినా ఎందుకు స్పందన వుండటం లేదు? స్త్రీల హక్కులు అంటే ఏవో కొన్ని వ్రాసుకొని వాటిని బైబిల్ లాగా పఠించడమేనా లేక బయట ఇంకా స్త్రీలకు ఏం అవసరం వుంది అని సత్యావతి లాంటి వారు కళ్ళు తెరచుకోని చూసేది వుందా లేదా?

(ఇంకా వుంది)

28 comments:

  1. Excellent post. చాల మౌలిక మైన ప్రశ్నలు లేవనెత్తారు.(ఆలోచించే వారికే అనుకోండి)!

    I will try and write a post on some of these fundamental questions.

    ReplyDelete
  2. వ్యక్తి స్వేచ్చ లోకి ఇవన్ని రావా ?
    అయినా లైంగిక హక్కులు అంటే ఏంటి ?. అందరికి అవేర్నెస్ తీసుకొచ్చినా... లేక చట్టప్రకారం పోరాడి చట్టం చేయించిన సరిపోతుంది కదా !!! అవునా అనుకునే వాళ్ళు అవునా అనుకుంటాం... అది కూడా చేయని వాళ్ళు పని చేస్కుంటారు ... ఇదసలు పెద్ద పట్టించు కోవాల్సిన అంశమే కాదు ..నవ్వుకు పోతాం కానీ పెద్ద వ్యతిరేకించం ...

    ReplyDelete
  3. మీరేదో ఘనకార్యం చేస్తున్నట్టు ... దానిని తోటి బ్లాగర్లు గుర్తించడం లేనట్లు మాట్లాడతారేంటి!? 'గే' మనస్తత్వం కలిగి ఉండడం ప్రకృతి విరుద్దం, అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండి తోటి వారి నుండి మద్దతు కోరడం అంటే అది తప్పుడు భావన . మీరు చేసే తప్పును సమాజం చేత అమోదింపచేసుకోవాలనుకోవడం మరింత తప్పు. మళ్ళీ దానికి ' మానవ హక్కులు ' అని Tag తగిలించడం దారుణమైన తప్పు. జంతువులు కూడా ( వాటికి తెలిసినా) ఈ పని చేయవు కదా!? ఒకవేల అవి చేసినా దానిని సమర్ధించవచ్చు. ఎందుకంటే వాటికి మనలా జ్ఞానం లేదు కాబట్టి . బహుశా క్లోనింగ్ చేసిన జంతువులు కూడా ఈ పని చేయవు . అలాంటప్పుడు మీరెలా చేయగలుగుతున్నారు !?. పైగా ఈ విషయాన్ని మానవ హక్కుల జాబితాలో వేయడం అంటే అది మన్నించరానిది.

    ReplyDelete
  4. గే/లెస్బియన్/బైసెక్సువల్ -- వీరి సెక్సువల్ ప్రిఫరెన్స్ ఆధారంగా ప్రభుత్వాలు వివక్ష చూపితే అది హక్కుల ఉల్లంఘనే. అయితే మిగిలిన విషయాల్లో మిగతా మానవులకందరికీ వున్న హక్కులు వీరికి కూడా ఉన్నయి కదా. Just Decriminalize చేస్తే
    సరి పోదా?

    ఉద్యమించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? శరత్ గారు నేను అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను.

    ReplyDelete
  5. మరి శరత్ అభ్యుదయం ఎంతవరకు?

    గేల హక్కులంటూ హడావిడి చేసే శరత్ , తండ్రీ కూతుళ మద్య సంబందాలు లాంటి INCEST హక్కుల గురుంచి ఎందుకు పోరాడటం లేదు అని వాళ్ళు అనుకుంటారు కదా? మరి వాళ్ళ గురుంచి పోరాడని మీరు సూడో అభ్యుదయవాదే కదా? అలాగే గుర్రం , కుక్కలు గాడ్డ్ర్దలతో sex చేసే వారి హక్కులకోసం మీరెందుకు పోరాడటం లేదు. వాటిని సమర్దిస్తూ ఎందుకు రాయడం లేదు? మీ దృష్టిలో మీ అభ్యుదయం ఎంతవరకు?

    ReplyDelete
  6. ఉద్యమాలన్నీ అర్థం చేసుకునే చేస్తున్నారా? అసలు బ్రెయిన్ వుండటమే తప్పు అని చైనాలో మావో అందరికీ తీయించేశాడట. అందుకే దాన్ని రెవల్యూషన్ అన్నారు.

    ReplyDelete
  7. చిన్న సందేహం శరత్ గారూ,

    సనాతన వాదుల్లో సమైఖ్య వాదులున్నట్లే అభ్యుదయ వాదుల్లో తెలంగాణా వాదులు ఉంటే అందులో అభ్యంతరమేమిటీ? అభ్యుదయ వాదం, తెలంగాణా వాదం ఏమయినా మ్యూచుయల్లీ ఎక్స్‌క్లూజివ్ గ్రూపులా?

    ReplyDelete
  8. ఛా మీరు ఇలాంటి లాజిక్ ప్రశ్నలు వెయ్యొద్దు....మన శరత్ గారు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తారు...లేకపోతే తలాతోకాలేని తర్కాలు చెప్తారు....!! ఆస్సలు ఉధ్యమమంటే గే ఉధ్యమం ..... ఈయన గారు ఎలాగు గే కాబట్టి అందరు గేలనే సమర్థించండి అని చెప్పాలని చూస్తున్నట్టున్నారు ...

    ReplyDelete
  9. ఇచ్చాపూరితంAugust 16, 2010 at 7:06 AM

    నిజానికి తనకు లేని బ్రెయిన్ తన దేశ ప్రజలకు ఎందుకు ఉండాలని మావో ఆ పని
    చేశాడు. ఒకానొక శుభముహూర్తంలో ప్రనాగాడికి ఈ విషయం తెలిసింది.
    పరిగెత్తుకుంటూ జూడా నాదెండ్ల దగ్గరకు పరిగెత్తాడు. నాకు వెంటనే మెదడు
    తీసేయి నీకు 100 కు 200 ఇస్తాను అని చెప్పాడు. నాదెండ్ల స్కాన్ చేసి
    అవాక్కయి అద్భుతాన్ని చూసినట్తు మార్తాండ వైపు చూసాడు. నీకా అవసరం లేదు
    నీ తలకాయలో అసలు మెదడే లేదు అన్నాడు. అందుకే వాడిలా దిక్కుమాలిన కథలు
    ఆడియోలు విడియోలు...

    ReplyDelete
  10. idi modatido rendodo comment mee blog lo sariga gurtu ledu... ee post bagundi.. mana desam lo sex anna mata paiki matladadanike sankocham... alantidi hakkula kosam poratam anedi kala... gay/ lesbo gurinchi tarvata poradochu mundu manava hakkula kosam poradadam.........

    ReplyDelete
  11. @ వీకెండ్ పొలిటీషియన్
    మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తుంటాను
    @ తృష్ణ
    వ్యక్తి స్వేఛ్ఛ లోకే వస్తాయి కానీ చాలామందికి అసలు తమకా స్వేఛ్ఛ వున్నట్లు కూడా గమనింపు వుండదు. అవేర్నెస్ తీసుకురాడానికే కదా ఈ ప్రయత్నాలన్నీ? నోరుమూసుకొని, బ్లాగుమూసుకొని, అన్నీ మూసుకొని ఎలా అవేర్నెస్ తీసుకువస్తారో చెబుదురూ. ఇంట్లో కూర్చొని ఏడుపుగొట్టు సీరియళ్ళు చూస్తూ అవేర్నెస్ తీసుకురాలేం. మీ భర్త బై అని తెలిసినప్పుడొ లేదా మీ అబ్బాయి గే అని తెలిసినప్పుడో కూడా ఇలాగే నవ్వుకోగలిగితే సంతోషమే.
    @ సీను
    కొన్ని జంతువులలో స్వయం సంపర్కం వుంది

    ReplyDelete
  12. అందరూ ఏకకాలంలో అన్నీ కావాల్సిన అవసరం లేదు. ఒకే వ్యక్తి ఏకకాలంలో ఫెమినిస్టూ, నాస్తికవాదీ, కమ్యూనిస్టూ, గేహక్కుల కార్యకర్త, ఇన్సెస్టు సంబంధాల సపోర్టరు గట్రా గట్రా గా అవతారం దాల్చనక్కరలేదు. దాల్చనంతమాత్రాన వాళ్ళంతా హిపోక్రైట్లూ కారు, వెనకబడ్డట్లూ కారు. పనికిమాలినవాళ్ళూ కారు. విమర్శించదగ్గవాళ్ళు అంతకంటే కారు. (అసలు ఈ పైన పేర్కొన్నవి అభ్యుదయమనీ, శ్రేయోదాయకమనీ గ్యారంటి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇవి social mainstream తో సంబంధం లేని పేరలల్ భావజాలాలు మాత్రమే. ఇవెప్పటికీ mainstream కాజాలవు) Where and how far can we break a common ground to work with each other ? అదొక్కటే ముఖ్యం.

    ReplyDelete
  13. @ వీకెండ్ పొలిటీషియన్
    డిక్రిమినలైజ్ చెయ్యడానికయినా ఉద్యమించాల్సిందే కదా. దాంతోనే సరిపోదు. స్వలింగ వివాహాలు చట్టబద్దం చెయ్యాలి. స్వలింగ దంపతులు పిల్లలని దత్తత తీసుకోవడం చట్టబద్దం చెయ్యాలి. స్వలింగులను, స్వలింగ జంటలను వివక్ష చేస్తున్న అని చట్టాలలోనూ, విషయాలలోనూ మార్పు రావాలి. ఈ మార్పులన్నీ ఇంట్లో కూర్చొని అరిస్తే రావు కాబట్టి ఉద్యమాలు చేసి మాత్రమే హక్కులు సాధించుకోవలసి వుంటుంది.
    @ శివ భండారు
    ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు వస్తుంటాయి కనుకనే అసలు ఆడ మగా మధ్యా శృంగారాన్ని నిషేధించాలి. అప్పుడు ఏ సమస్యా వుండదు.
    @ అజ్ఞాత
    :)

    ReplyDelete
  14. @ సత్యాన్వేషి
    అభ్యుదయం మరియు సంకుచితత్వం ఒకే ఒరలో ఎలా ఇముడుతాయో నాకు అర్ధం కాదు. ఎనీ వే, టాపిక్ పక్కదారి పట్టకుండా టపా సవరించాను.
    @ ఇఛ్ఛాపూరితం
    :))
    @ప్రేమిక
    స్వలింగ హక్కులు కూడా మానవ హక్కులే. అందువల్ల దీని గురించిన కృషి కూడా మానవ హక్కుల కృషి క్రిందికే వస్తుంది. దీనిని వదిలేసి ఇతర హక్కుల గురించి పని చేస్తున్న వారు కూడా వున్నారు కదా.

    మీరు పూర్తిగా తెలుగులో వ్రాయడం బావుండగలదు. మీ పేరు బావుంది కానీ మీరు స్త్రీనో పురుషుడో అర్ధం కాలేదు.

    ReplyDelete
  15. ఆశయం సంకుచితమైనదా లేక న్యాయమైన హక్కా అనేది చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది.

    ReplyDelete
  16. తృష్ణ అంటే అమ్మాయి పేరా .. ఒహ్హ.. సరే నా భార్య బై ఐతే సరే కాని .. మగవాళ్ళు బై లు కావటం బాలేదు .. మా ఊళ్లలో పెద్దరికపు పోకడలు వ్యవహారాలూ ఎక్కువ.. ఎప్పుడూ అవగాహన, అర్థం, ఆలోచన, ప్రేమ , అనుబంధం, భాద్యతలు లాంటి పదాలే వినిపించేవి ... ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందని .. మా పక్క పల్లె వ్యక్తీ హైదరాబాద్ లో బీ టెక్ చేస్తున్నప్పుడు మంచి స్నేహితుడు అయినప్పుడు చెప్పాడు .. అప్పటికే నేను హస్తప్రయోగం కూడా తప్పు అని తెగ ఫీల్ అవుతూ ఉండేవాడిని .. అయినా.. శరీరపు వాంచలను తట్టుకోలేక చేసుకునే వాడిని ..( వెంటనే నాకు కలిగే జుగుప్స అంతా ఇంతా కాదు .. )అందువల్ల అతను చెప్పిన విషయం .. ఇలా కూడా ఉంటుందా అనుకున్నా..

    మీ కాన్సెప్ట్ జనాభా తరుగుదల లో తప్ప ఎందుకో సరైనది అనిపించటం లేదు నాకు..

    ReplyDelete
  17. @ అజ్ఞాత
    నిజమే. మీరనట్లు అందరికి అన్ని విషయాలలోనూ అభ్యుదయ భావాలు వుండవు. అయితే వీలయినన్ని విషయాల్లో ఆ భావాలు వుండేట్టుగా చూసుకుంటే అది వారి వ్యక్తిత్వానికే శోభ నిస్తుంది. మార్పు అన్నది నిరంతర స్రవంతి. ఎప్పటికప్పుడూ మన భావాలను మోడిఫై చేసుకోకుండా పోతే కొత్త తరం వారికి మనం అనుకుంటున్న ఆధునిక భావాలు కూడా చాదస్తంగా సనాతనంగా అనిపిస్తాయి.

    ఉదాహరణకు రంగనాయకమ్మ, డాక్టర్ సమరం. వారిద్దరూ మార్పుని కోరే ఆభ్యుదయవాదులే. కానీ కాలంతో పాటు వారు కూడా మారలేక వారి కాలంలో వున్న స్వలింగ వ్యతిరిరేకతను వదలలేకుండా వున్నారు. మారుతున్న సమాజంతో పాటు వారు మారలేకుండా వున్నారు కాబట్టే ఇలాంటి విషయాలను అందిపుచ్చుకొని ముందుండాల్సిన స్థానంలో వారు వెనకబడి మాలాంటి వారికి సనాతనంగా అనిపిస్తారు. వారిని ఒకప్పటి మేధావులు గానే గుర్తించాల్సి వుంది కానీ ఇప్పటి సమాజానికి వారు అవుట్ డేటెడ్. వారిలో మార్పు లేకుండటం వల్ల వారి రచనల, భావాల ప్రభావం నెమ్మదిగా కనుమరుగు అవుతూ వుంటుంది.

    ReplyDelete
  18. @ తృష్ణ
    మీరు ఇది కూడా కొన్ని సార్లు ప్రయత్నించి అప్పుడు మీకేమనిపిస్తుందో చెప్పండి ;)

    ReplyDelete
  19. For a change, I have a serious question:


    హద్దుల్లేని శృంగారం అనేది పురాతన భావజాలమా లేక ఆధునికమా?

    ReplyDelete
  20. మీ వల్ల ఈ పని చేసేవారిని మానసిక దుర్భాలత్వం అనే నా భావన తప్పని పిస్తుంది.. అయినా.. చివరిసారిగా మీరు ఎంత కాలం క్రితం గే సెక్స్ చేసారో తెలుసుకోవచా .. కేవలం చిన్నప్పటి పనిని సమర్దిస్తున్నారని నా డౌట్ ..

    పురాతనం అని చెప్పడానికి నాకు తెలిసి ఏ ఉదంతమూ లేదు గ్రంథాల్లో .. కేవలం పరిస్థితుల ప్రభావమే ..

    ReplyDelete
  21. @ మలక్
    రెండింటిదీ అని నా అభిప్రాయం
    @ తృష్ణ
    నాలుగేళ్ళ క్రితం. అయినా గే ప్రవృత్తి అన్నది నా ఒక్కడి విషయం కాదు కదా.

    ReplyDelete
  22. పురాతనం అని చెప్పడానికి నాకు తెలిసి ఏ ఉదంతమూ లేదు గ్రంథాల్లో
    ____________________________________

    గ్రంధాలలో విచ్చలవిడి శృంగారాన్ని నిషేధించారనే కదా ఈ గొడవంతా? అంటే వాటికి ముందు అది ఉందనేగా? అంటే ఇప్పుడు శరత్ అంటూన్న అభ్యుదయవాదం పురాతన/సనాతన వాదమేకదా? Its not progressive in strict sense, we are planning to go back in time and its actually retrogressive.

    ReplyDelete
  23. Actually Siva Bandaru asked a valid question -

    If you can call others not progressive, why cant the people he mentioned call you retrogressive? Whats your justification for that?

    ReplyDelete
  24. @ మలక్
    నేను వాదాల మనిషినీ, పదాల మనిషినీ, వాగాడంబరం వున్న మనిషినీ కాదు. నేను విషయ ప్రధానమయిన మనిషిని! ఆ విషయం కోసం ముందుకైనా వెళతాను, పక్కకయినా వెళతాను, వెనక్కయినా వెళతాను, గోడ దూకి అయినా వెళతాను. మార్పు కోసం ఎటు వెళ్ళడానికయినా సిద్ధమే. సనాతనులు మార్పు కొసం ఇంకా వెనక్కి వెళ్ళొచ్చు - అభ్యుదయం కోరే వారు మార్పు కోసం ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. మనక్కావల్సింది రిజల్ట్.

    ReplyDelete
  25. సో, ఇది అభ్యుదయం కానక్కరలేదు, అతి పురాతన వాదం, వెనక్కి వెళ్ళడం అన్నా ఓకే కదా?

    ReplyDelete
  26. విచక్షణ ఉన్నది కదా ..అది పనిచేసినంత కాలం ముందుకే ..
    ఎవరు ఎలా తయారు చేయబడితే అలా ప్రవర్తిస్తారు ...ఇక సమాజానికి అవగాహన కల్పించటానికి, చట్టం లో స్థానం .. ఇంకా విరివిగా సాహిత్య లభ్యత .. సరిపోతుంది .. పోరాటాలు చట్టం లో స్థానం కోసం ఐతే చాలు ... సాహిత్యం మిగతా పని చేస్తుంది...

    కాకపొతే గే లని ఒప్పుకుంటారా అని తెలుసు కోవటానికి గే తత్త్వం ప్రయత్నించమనటం (మత మార్పిడి లాంటిది .. హహహ హహః ..) ఎంత వరకు సమంజసం ...

    ReplyDelete
  27. @ Seenu

    జంతువుల్లో స్వలింగ సంపర్కం గురించి క్రింది లింకు చదవండి.
    http://en.wikipedia.org/wiki/Homosexual_behavior_in_animals

    ReplyDelete
  28. @శరత్
    >>మీ పోస్ట్ కోసం ఎదురుచూస్తుంటాను
    Your wait is over. Take a look at my post :)

    ReplyDelete