ఇది కూడా స్లీజీ పోస్టే, బుద్ధిమంతులు ఎవరన్నా వుంటే కిందికి వెళ్ళకండి. వోక్కే!
అవి సూర్యాపేటలో వుంటున్న రోజులు. కొత్త బస్సు స్టాండ్ దగ్గర్లో కొత్తగా మా ఇల్లు కట్టినందువల్ల చుట్టుపక్కల పెద్దగా ఇళ్ళు వుండకపోయేవి. మా ఇంటి పక్కన ఒక వైపు ఖాళీగా వుండేది. ఆ స్థలమ్లో మా ఫ్రెండ్సు తో కలిసి ఓ ఓండ్ర పెడుతూ గోడ మీద కాలెట్టి గ్రూపుగా పాట పాడుతుండేవాడిని. వేసవి కాలమ్లో పైన డాబా మీద పడుకునే వారం కాబట్టి రాత్రి పూట పైనుండి క్రిందికి వినిపిచ్చేలాగా మా గానామృతం సాగుతూవుండేది.
మరో వైపు మా ఇంటి ఎదురుగా ఓ బ్రతకలేని బడిపంతులుకు అందమ్లో ఆణిముత్యాల్లాంటి అరడజను ఆడపిల్లలు వుండేవారు. వారిని చూసి కూడా కుర్రాడినయిన నేను లైను వేయకపోతే వారి మనోభావాలు తీవ్రంగా గాయపడి డిప్రెషనుకు గురవుతారని ఎంతో పెద్దమనసు చేసుకొని అందులో నాకు తగిన అమ్మాయిని చూసుకొని లైను వేయడం మొదలెట్టాను. అలా అలా మా స్నేహం పెరిగింది. మా తొట్టి గ్యాంగును కూడా ఆమెకు పరిచయం చేసాను. అలా అలా ఆ అమ్మాయి వాళ్ళింటి ముందు నిలబడి మమ్మల్ని గమనిస్తూవుండటం, మేము ఆమె అమ్మా, నానలకీ తెలియకుండా ఏవేవో సైగలు చేస్తుండటం జరుగుతూవుండేవి.
అదలా వుండగా ఒక శుభముహూర్తాన ఆమెకో చక్కని డవుట్ వచ్చింది. అలాంటి డవుట్ వస్తే మనస్సులో పెట్టుకోవాలా! అలా కాకుండా మమ్మల్ని ఈ విధంగా అడిగేసింది " మీరందరూ రోజూ మీ ఇంటి ప్రక్కనే ఎందుకు పాట పాడుతారు?" హ్మ! ఆమె బాధ మాకు అర్ధమయ్యింది. ఆమె బాధని తొలగించాలని అందరమూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. పాపం, ఆడపిల్ల. అందునా బంగినపల్లీ మామిడి పండు వంటి ఆడపిల్ల అలా బాధపడుతుంటే ఎవరయినా చూస్తూ ఊరుకోలేరు కదా. పైగా మా మనస్సులు మహా మెత్తనాయే.
సరే, అని ఒక రోజు ముహూర్తం నిర్ణయించాం. ఆమె వారి ఇంటిముందు నిలబడి చూస్తుండగా వాళ్ల ఇంటి వైపు వెళ్ళాము. మేము అటువైపు ఎందుకు వస్తున్నామా అని ఆసక్తిగా మాకేసి చూడనారంభించింది. చటుక్కున వారి ఇంటి పక్క గోడ వైపు తిరిగాము. వాళ్ళింటి పక్కన కూడా బోలెడంత ఖాళీ స్థలం వుండేది. ఆమెకు కనిపించనంత దూరం వెళ్ళి వాళ్ళింటి పక్కన అందరం కలిసి గ్రూపుగా పాట పాడి వచ్చాము. తిరిగి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి ఆమె ఇప్పటికయినా సంతోషంగా వుందో లేదో అని చూసాను!
ఈ పాటల గోల ఇక ఆపేయండి బాబు,చదవలేకపొతున్నాం.
ReplyDeleteఆ పాటపాడ్డం ఏంటో, ఈయన వెళ్ళి ఆమె సంతోషించారో లేదో చూడ్డం ఏంటో అస్సలు బుర్రకెక్కలా...కవులు, భావుకులు ఎవరైనా ఉంటే ఈ పోస్టు చదివి వివరించండి బాబొయ్
ReplyDelete@ అజ్ఞాత - మిమ్మలందరినీ హింసించడమే నా ధ్యేయంగా పెట్టుకున్నప్పుడు అప్పుడే నా పాటలు ఆపేస్తే ఎలాగండీ బాబూ.
ReplyDelete@ నాగార్జున - నాలాంటి మేధావుల రచనలు అలా అలా అలవోకగా అర్ధం కావు నాయనా. కృషి, సాధన చేయాలి. ఆ అమ్మాయి ఏమంది? ఎప్పుడూ మీ ఇంటి పక్కనే పాట పాడతారెందుకూ అంది. అంటే అర్ధం ఏంటీ? వాళ్ళింటి పక్కన ఎప్పుడూ మేము పాట పాడలేదని ఆమె ఫీల్ అవుతోందనే కదా అర్ధం? మరి ఆమె బాధని అర్ధం చేసుకొని ఆ బాధ మేము తీర్చాలా వద్దా?
నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నన్ను బెదిరించి, తరువాత ఆ టపా తీసేసినందుకు నేను మీ బ్లాగ్ ని, సోమవారం రాత్రి వరకూ, లేదా మంగళవారం వరకూ మా ఊరిలో నిషేదిస్తున్నాను..
ReplyDeleteమామగారు సిన్మా లో దాసరి కంటే సీపు గా సే/రాత్తన్నారు!
ReplyDelete@తార - అసలు మీ ఊరిలో కరె౦టు వు౦దేటి?
ReplyDelete@విట్ రియల్ - సిన్మ లోనే సీపుగా వు౦డ౦గలే౦ది బ్లాగులో వు౦టే సెడ్డయ్యి౦దేటి? మామగారు దృశ్యాలు గుర్తుకులేవు.