సెలవులకని వెళ్ళొచ్చాక ఇంతవరకూ అడిదం సంకలిని చూడటం కుదరలేదు. హారం మాత్రమే చూస్తున్నా. ఇవాళ అది చూస్తే ఎంతో మెరుగ్గా, కన్నులకు ఇంపుగా అనిపించింది. మీరూ ఓ సారి చూసెయ్యండి.
http://www.sankalini.org/
గురువారం 31 మార్చి 2011
HITS నీహారిక
మీ అందరికీ బ్లాగు నీహారిక తెలిసేవుంటుంది. నేను చెబుతున్నది ఆ నీహారిక గురించి కాదు - మరో నీహారిక గురించి - ఆమే హిట్స్ నీహారిక. ఈమె వేడివేడి యాహూ గ్రూపులు నిర్వహించే కామశాస్రికి సహాయకురాలు. కొంతమంది నన్నే కామశాస్త్రి అనుకోవడం కద్దు కానీ కాదు. అప్పట్లో ఆ యాహూ గ్రూపుల్లో సరసమయిన కథలు వ్రాసేవాడిని. మొదట్లో చాలా నెలలు ఆ నీహారిక మరెవరో కాదనీ కామశాస్తికి ఆల్టర్ ఎగో అని అనుకునేవాడిని. అలా అనుకుంటున్న రోజుల్లోనే ఆ గ్రూపుల్లో వ్రాస్తున్న నా సరసమయిన సీరియళ్ళకు ఆమె సహకారం అందిస్తూవుండేది. నేను రఫ్ రాసి ఆమెకు పంపిస్తుంటే ఆమె తెలుగులిపిలో ఫెయిర్ చేసి ఇస్తుండేది. అలా ఆమె సహకారంతో పుంఖానుపుంఖాలుగా అప్పట్లో రచనలు చేసేవాడిని.
అప్పటికీ ఆమె కామశాస్త్రి అనే అనుకొనేవాడిని. అలా ఆమెని అపార్ధం చేసుకొని ఒకసారి ఆమెతో గొడవపడ్డాను. ఆ సందర్భంలో ఆమె కామశాస్త్రి కాదనీ వేరే వ్యక్తి అనీ తెలిసివచ్చింది. తన పొరపాటు గుర్తించి నాకు క్షమాపణ చెప్పింది. ఆ తరువాత మామధ్య చక్కని స్నేహం పెరిగింది. మరిన్ని రచనలు ఆమె సహకారంతో చేసాను. చతుర మాసపత్రికలో ప్రచురింపబడిన ఎవరు నవల కూడా ఆమె ఫెయిర్ చేసి సహకరించినదే.
హిట్స్ యాహూ గ్రూపుల గురించి, శాస్త్రి గురించీ, ఇతర రచయిత్రుల గురించీ నాకు కబుర్లు చెబుతుండేది. తను ఏదో యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు శాస్త్రి కథలు తెలిసి తన మిత్రురాళ్లతో కలిసి చదివేదిట. అలాంటిది తనకు శాస్త్రి వ్యక్తిగతంగా పరిచయం అవుతాడని ఎన్నడూ అనుకోలేదట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా వుండిపోయారుట. అలా అలా తాను శాస్త్రికి సహాయకురాలిగా గ్రూపుల్లో పనిచేస్తూవున్నా కూడా శాస్త్రికి తెలియకుండానే నాతో కొంత చనువు ఎక్కువయ్యింది.
ఈమధ్యలో నాకు శాస్త్రికి గొడవలు అయ్యాయి. అంతలోకే మా స్నేహం ఎక్కువయ్యిందని తెలిసినట్టుంది. మరి ఆమెకు ఏం చెప్పాడో ఏమో కానీ నాతో ఆమె స్నేహం తగ్గించింది. అలా ఒక చక్కటి మిత్రురాలు దూరం అయ్యింది. తను వ్రాసే ఈమెయిల్స్ ఎంతో బావుండేది. భలే సరదాగా, క్రిస్ప్ గా వుండేవి. వ్రాతల్లో చమక్కులు మెరిపిస్తుండేది. నేనో గొప్ప రచయితను అవాలని ఆశిస్తుండేది. తాను అందంగా వుంటానని చెప్పేది. మాది ఈమెయిల్ స్నేహమే కానీ ఫోన్ల వరకు వెళ్ళలేదు, ఫోటోలు కూడా చూడలేదు.
తనకు ఎవ్వరితో సెక్సువల్ రిలేషన్స్ లేవు అనేది. మరి ఇంతగా బూతు కథల నిర్వహణలో వుంటున్నావు - అలా అనుకుంటే ఇది మాత్రం తప్పు కాదా అని అడిగితే పూర్వం ఆశ్రమాల్లో మునికన్యలు శృంగార కథలు చాలా క్యాజువలుగా చదువుతుండేవారనీ అందువల్ల కథలు చదివినంత మాత్రాన తప్పేమీ కాదని సమర్ధించుకునేది. ఆ సమర్ధింపు మాత్రం నాకు నచ్చేది కాదు.
ఆ మరో నీహారిక స్నేహం కోసం మళ్ళీ ఎదురుచూస్తూ...
మా ఆవిడ నొప్పులకి కైరోప్రాక్టర్ ట్రీట్మెంట్
చాలా ఏళ్ళుగా పలు నొప్పులతో మా ఆవిడ బాధపడుతూ రకరకాల డాక్టర్లని, ట్రీట్మెంట్లని, సర్జరీలని పలు దేశాల్లో ఆశ్రయించిందనీ లాభం లేకపోయిందనీ కొన్ని నెలల క్రితం ఒక టపాలో చెప్పుకువచ్చేను. ఆమెకు కుడి భాగం మాత్రమే దాదాపుగా పైనుండి కింది దాకా నొప్పి వుంటోంది. కొందరేమో టెండనీటిస్ అనీ కొందరేమో ఆర్థరైటిస్ అనీ కొందరేమో వెన్నుపూస సమస్య అనీ చెప్పారు.
ఇహ అలాక్కాదని మొన్న ఓ కైరోప్రాక్టరు (వెన్నుపూస నిపుణుడు) ని కలిసాము. ఎక్సురేలు తీసి వెన్నుపూసలో మెడ భాగం వుండాల్సిన దానికన్నా నిటారుగా వుందనీ, ఖాళీ ఎక్కువుందనీ చూపించేడు. అందువల్ల నెర్వ్ స్టెం వత్తుకుపోయి ఈ నొప్పులన్నీ వస్తుండవచ్చు అని తీర్మానించేడు. కైరోప్రాక్టిక్ ట్రీట్మెంటు వల్ల నెలలోనే కొంత ఫలితం అయినా కనపడవచ్చని సూచించాడు. ఈ రోజు నుండి చికిత్స మొదలవబోతోంది.
ఆ చికిత్స పూర్తిగా మాకు ఆరోగ్య భీమాలో కవర్ అవుతోంది కాబట్టి డబ్బు సమస్య లేదు. మీలో ఎవరయినా కైరోప్రాక్టిక్ చికిత్స తీసుకున్నారా? ఈ చికిత్స వల్ల ప్రయోజనాలు వుంటాయా? మీ అభిప్రాయాలూ, అనుభవాలూ ఏమిటి? ఇలాంటి చికిత్సకు వెళ్ళడం మొదటిసారి కాబట్టి ప్రయోజనకరమా కాదా అన్న సందేహాలు వస్తున్నాయి.
మంగళవారం 29 మార్చి 2011
కొన్ని కబుర్లు
- సెలవులకని న్యూయార్కూ, న్యూజెర్సీ చుట్టాలింటికి వెళ్ళొచ్చాం. అక్కడి బ్లాగర్స్ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించనందు వల్ల బ్లాగర్సుని కలిసే ప్రయత్నాలని నేనూ లైట్ తీసుకున్నాను. అసలు ఈమధ్య బ్లాగుల్నే లైట్ తీసుకుంటున్నాలెండి.
- మా ఆవిడకీ, అమ్మాయికీ హైవేలో కారు డ్రైవింగ్ ప్రాక్టీసు అయ్యింది.
- పెన్సిల్వేనియా కొండలూ, గుట్టలూ ఇదివరకూ చూసినా ఈ సారి ఇంకా నచ్చాయి. నాకేమో అలా కొండ ప్రాంతాల్లో కోయ వారిలా నివసించాలని వుంటుంది కానీ ఏంటో ఎప్పుడూ సమతల ప్రదేశాల్లోనే నా జీవనం సాగుతోంది. తిరుగు ప్రయాణంలో ఒక రోజు ఆ గుట్టల్లోని ఒక హిల్ స్టేషనులో ఆగి వచ్చాం.
-- కొంతకాలం ఇతర బ్లాగులు చూడొద్దని నిర్ణయం సగం మాత్రం దివ్యంగా సాగుతోంది. అగ్రిగేటర్లలో టపా హెడింగులు మాత్రం చూస్తున్నా. మరీ ఆసక్తికరంగా వుంటే ఒకటీ, అరా బ్లాగులు తెరచి చూస్తున్నా. వ్యాఖ్యలు అస్సలే చూడకపోవడం వల్ల మనస్సుకి ఎంతో హాయిగా వుంది.
- మా ఆవిడకీ, అమ్మాయికీ హైవేలో కారు డ్రైవింగ్ ప్రాక్టీసు అయ్యింది.
- పెన్సిల్వేనియా కొండలూ, గుట్టలూ ఇదివరకూ చూసినా ఈ సారి ఇంకా నచ్చాయి. నాకేమో అలా కొండ ప్రాంతాల్లో కోయ వారిలా నివసించాలని వుంటుంది కానీ ఏంటో ఎప్పుడూ సమతల ప్రదేశాల్లోనే నా జీవనం సాగుతోంది. తిరుగు ప్రయాణంలో ఒక రోజు ఆ గుట్టల్లోని ఒక హిల్ స్టేషనులో ఆగి వచ్చాం.
-- కొంతకాలం ఇతర బ్లాగులు చూడొద్దని నిర్ణయం సగం మాత్రం దివ్యంగా సాగుతోంది. అగ్రిగేటర్లలో టపా హెడింగులు మాత్రం చూస్తున్నా. మరీ ఆసక్తికరంగా వుంటే ఒకటీ, అరా బ్లాగులు తెరచి చూస్తున్నా. వ్యాఖ్యలు అస్సలే చూడకపోవడం వల్ల మనస్సుకి ఎంతో హాయిగా వుంది.
గురువారం 17 మార్చి 2011
కొన్నాళ్ళు ఇలా...చేసి చూస్తానేం
ప్రతీదాంట్లోనూ అప్పుడప్పుడూ, ఎప్పుడోఒకప్పుడూనూ వైరాగ్యం రావడం సహజమేననుకుంటాను. అలాగే బ్లాగర్లకీ, బ్లాగు కామెంటర్లకీ, రీడర్లకీ అలాగే (తాత్కాలిక) వైరాగ్యం అప్పుడో, ఇప్పుడో వస్తుందనుకుంటాను. అది మోతాదు ఎక్కువయ్యితే వాళ్ళు బ్లాగులనుండి దూరంగా పారిపోతుంటారు. నాక్కూడా అప్పుడప్పుడు వైరాగ్యం వస్తుంది కానీ మళ్ళీ ఓ బోల్టేసుకొని పదండి ముందుకు, తోసుకు, పూసుకు అని వచ్చేస్తుంటా.
నాకు కూడా పలు కారణాల వల్ల (తాత్కాలిక) శ్మశాన వైరాగ్యం బ్లాగుల్లో కలిగింది. అలాంటప్పుడు కొంతకాలం విరామం ఇచ్చి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో బ్లాగుల్లోకి దుమికేస్తుంటాను కానీ ఈసారి అలా కాకుండా మరోలా చెయ్యదలిచాను. ముక్కు దురదపెడితే మందేసుకోవాలి కానీ కోసుకొవడమేంటీ అనిపించింది. అందుకే కొద్దిరోజుల పాటు తెలుగు అగ్రిగేటర్లూ, బ్లాగులూ చూడకుండా నా బ్లాగు మాత్రమే వ్రాద్దామనుకుంటున్నాను. మహా అయితే నా 100 ఉత్తమ బ్లాగుల బ్లాగు చూసుకుంటానేమో. ఎప్పుడన్నా ఎక్సెప్షన్స్ వుంటాయండోయ్. లేకపోతే ఏ బ్లాగులోనన్నా నేను కనపడితే ఇక్కడున్నారేంటీ అని మీరు నిలదీయగల్రు. చూద్దాం ఇలా ఎన్ని రోజులో.
ఎందుకూ ఈ విరక్తి అంటారా? ఆ ఏముందీ బ్లాగుల్లో ఎక్కువ భాగం ఎదవ గోలా, ఎదవ రాతలూ తప్పించీ. వైరాగ్యంలో అలాంటి మాటలే వచ్చేస్తాయి మరి :) ఎలాగూ మంచి బ్లాగులయితే నా సంకలినిలో వుంటాయి కదా. అవి చాలు నాకు ప్రస్థుతానికి. ఇంకేమన్నా మంచి బ్లాగులుంటే చెప్పండి - అందులో జత చేసుకొని చూసేసుకుంటా.
కెనడా కోర్టులో బురఖా వేసుకోవచ్చా?
ఇతరదేశాల సంగతీ, భారత్ లో సంగతీ నాకు తెలియదు కానీ కెనడా సుప్రీం కోర్టు ముందుకు ఈ విషయం వచ్చింది. చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. ఆ వార్తకు వచ్చిన వ్యాఖ్యలు చూస్తే ఈ ఆంశం మీద వివిధ కెనడియన్ల, ఇతరుల అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవచ్చు.
కెనడాకి వలస వచ్చిన వారు ఆ దేశపు విలువలను పాటించాలా లేక తమ తమ వ్యక్తిగత మత స్వేఛ్ఛను పాటించాలా అన్నది ఇక్కడ ప్రశ్న. నేనయితే దేశాభిమానినే.
మంగళవారం 15 మార్చి 2011
నేను పోగొట్టుకున్నదాంతో పోలిస్తే నీ పోగొట్టుకోవడం ఎంతా?
మా ఆవిడ కారు షాకు ఇస్తుందేమో అనుకుంటే ఖజానా షాకు ఇచ్చింది. మొన్న ఆదివారం అరోరాలోని షికాగో ప్రీమియల్ అవుట్లెట్స్ ప్లాజాకి వెళ్ళాం. కోచ్ వానిటీ బ్యాగు డీలులో చాలా చవకగా వస్తున్నదనీ $300 బ్యాగు $100 కే వస్తోందనీ హైవేమీది నుండి వెళ్ళాలి కాబట్టి హైవే మీద కారు ప్రాక్టీసు చేసినట్లు వుంటుందనీ తోడుగా నన్ను పట్టుకెళ్ళింది. మాతో పిల్లలు రాలేదు. అంత బ్రాండెడ్ వానిటీ బ్యాగులు మనకు అవసరమా అని అడిగాను కానీ వద్దనలేదు. తన డబ్బులతో కొనుక్కుంటోంది కాబట్టి వద్దనే అధికారం నాకు అంతగా లేదు కదా. మనం సంపాదించిన డబ్బులమీద వాళ్ళకు సర్వహక్కులు వుంటాయి కానీ వారి డబ్బుల మీద మనకు ఏమాత్రం హక్కు, అధికారం వుండవు కదా. అందుకే ఆమె డబ్బులతో ఆమె ఏం చేస్తుందనేది పెద్దగా పట్టించుకోను కానీ ఉపయోగకరమయిన వాటిని కొనుక్కోమని చెబుతుంటాను. నగలు, నట్రాలేవో కొనుక్కుంటూవుంటుంది.
అక్కడ తన (పాత) వానిటీ బ్యాగులోనుండి ఎవరో డబ్బులు, బంగారం కొట్టేసారు. ఎలా కొట్టేసారో, ఎక్కడ కొట్టేసారో తెలియదు గానీ అవి మాత్రం మాయం అయిపోయాయి. ఒకే ఒక్క అనుమానాస్పద విషయం ఆమె రెస్టురూములో వున్నప్పుడు జరిగిందంట. ఆ గదిలో టాయిలెట్ సీటు మీద పేపర్ పరిచేందుకై ఒకసారి వేరేవైపుకు తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి కొక్కేనికి తగిలించిన బ్యాగు కిందపడివుందంట. అంతకుమించి ఏమీ ఆమెకు అర్ధం కావడం లేదు. బ్యాగు కోసిలేదు, తెరచిలేదు! ఆ దొంగ ఎవరో కానీ చాలా పద్ధతిగా తన కళని ప్రదర్శించినట్లుంది. ఏమాత్రం అనుమానం రాకుండా దోచుకుపోయారు. వాతావరణం కాస్త బాగుండటంతో ఆ రోజు అసలే ఆ ప్లాజాకి జనాలు బాగా వచ్చారు. పావుగంట వరకు మాకు పార్కింగే దొరకలేదు.
ఎన్ని డబ్బులు, ఎంత బంగారం పోయుంటుందో ఊహించండి చూద్దాం. ఏదో 50, 60 డాలర్లు, కొద్దిగా బంగారం పోయుంటుందనుకుంటున్నారా! నేనూ అలాగే అనుకున్నా. వెధవాయిని. డబ్బులు సుమారుగా $300 మరియు పలు ఆభరణాలు కలిపి చుట్టుపక్కల $2500 పోయాయి. ఆమె పోయిన ఆభరణాల లిస్టు చదువుతుంటే ఇవన్నీ ఇంట్లోనో, సేఫు డిపాజిట్ బాక్సులోనో పెట్టుకోక బ్యాగులో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావూ అని బోల్డంత ఆశ్చర్యపోయా. పదేళ్ళనుండి ఇలాగే పెట్టుకొని తిరుగుతున్నా, ఎవడన్నా దోచాడా అని నన్నే నిలదీసింది. అంటే పదేళ్ళనుండీ చేసిన పొరపాటునే చేస్తూవస్తున్నావన్నమన్నమాట అని బేర్ మన్నాను. ఆమె బేబీ సిట్టింగు చేసి సంపాదించిన డబ్బులు, బంగారం కొన్ని ఇలా పొగొట్టుకుంది. అందులో నా సంపాదన మీద కొనుక్కున్నవి కూడా వుండొచ్చు కానీ నాకు ఆ బంగారం లెక్కలు తెలియదు లెండి.
ఆ ప్లాజా సెక్యూరిటీ వాడికి ఫిర్యాదు చేసాం. సిసి కెమెరాల్లో ఏమన్నా కనిపిస్తుందేమో చూడరా బాబూ అంటే కేఫిటేరియాలో నెలకొల్పిన వాళ్ళ టివిలు ఎత్తుకుపోకుండా గమనించడానికి మాత్రమే ఆ కెమెరాలు పెట్టామనీ, మిగతా ప్రదేశాలు అవి కవర్ చేయవనీ సెలవిచ్చాడు. ఇలా ఖజానాలు బ్యాగుల్లో పెట్టుకురావద్దని ఉచిత సలహా ఇచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు కానీ మా ఆవిడకి తెలియదురోయ్ అని బావురుమన్నాను. ఇలాంటి దొంగతనాలు మీ ప్లాజాలొ జరుగుతంటాయట్రా అని అడిగాను. ఆహా భేషుగ్గా అప్పుడప్పుడు జరుగుతుంటాయని చెప్పాడు. అతని సలహా మీద పోలీసు స్టేషనుకి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాము. అమ్మా, ఇదండీ అంగతి. మీరు షాపింగుకి వెళ్ళినప్పుడు నగానట్రా బ్యాగుల్లో వేసుకొని వూరేగకుండా ఇంట్లోనో, బ్యాంకులోనో దాచుకోండి తల్లీ. మా ఆవిడ వానిటీ బ్యాగు ఒక మహాసముద్రం కాబట్టి ఆమె బ్యాగు జోలికి ఎప్పుడూ వెళ్ళకపోవడం వల్ల అందులో నగానట్రాలు కూడా వుంటాయని నాకు మొన్నటిదాకా తెలీలా. తెలిసివుంటే తను విన్నా వినకపోయినా నా బాధ్యతగా నేను హెచ్చరించి వుండేవాడిని.
మరి మనకు బ్యాంకు సేఫ్ డిపాజిట్ బాక్సు ఎందుకూ, ఎంచక్కా అందులోవి అన్నీ కూడా బ్యాగులో పెట్టుకురాకపోయావా అని మా ఆవిడని విసుక్కున్నాను. మా ఆవిడని ఊరడించాలో, తిట్టాలో అర్ధం కాక మధ్యస్థంగా హితబోధలు చేస్తూ గులిగాను. మా ఆవిడ నిన్న మధ్యాహ్నం అంతా ఏడ్చుకుంటూ, ఆహారం తీసుకోకుండానే వుందని ఇంటికి వెళ్ళాక తెలిసింది. బాధ పడ్డంత వరకు చాల్లే, అంతా ఒకసారే బాధపడితే మరి ముందు ముందు సందర్భాల్లో ఎలా అని ఊరడించాను. నేను పోగొట్టుకున్న వాటితో పోలిస్తే నువ్వు పోగొట్టుకున్నది ఎంత అని జోకులేసాను. శనివారం రాత్రి బావగారూ, బాగున్నారా సినిమా చూసాము లెండి. అందులో కోట డైలాగు అది. అందులో తన కొడుకు శ్రీహరితో ఆ డైలాగు పదేపదే అంటుంటాడు. బాధలో, లాసులో వున్నా కాబట్టి వచ్చేవారం న్యూయార్క్ ట్రిప్పుకి రానంది. సంపాదన ఎలాగయితే జీవితంలో భాగమో అలాగే అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లూ, పోగొట్టుకోవడాలూ జీవితంలో భాగమేనని చెప్పేసి నచ్చచెప్పాను.
నేను ఓ జీవితమే పోగొట్టుకున్నాను. దానితో పోలిస్తే మా ఆవిడ పోగొట్టుకున్నది ఎంత లెండి. లైట్ :)
శుక్రవారం 11 మార్చి 2011
ఏదో ఒక రోజు
మా ఆవిడ చాలా చక్కగా కారు డ్రైవింగ్ నేర్చేసుకుంది. కారు తోలడంలో నేను చెప్పే టెక్నిక్కులు, మెళకువలు విని మీకెంత అనుభవం వుందండీ అని ఆశ్చర్యపోతూ ప్రశంసిస్తూవుంటుంది. మీరే లేకపోతే ఇంత త్వరగా కారు నేర్చుకునేదానినా అంటూ వుంటుంది. నేను ఏదయినా పొరపాటు చేస్తున్నావు అని చెబితే తను ఆ తప్పుని వెంటనే సరిదిద్దుకుంటుంది. తను అలా చెప్పినట్టు చెయ్యడం వల్ల ఆమెకు డ్రైవింగ్ నేర్పుతుంటే ఇంకా నేర్పబుద్ధి అవుతోంది. ఏనాడు ఈ డ్రైవింగ్ పాఠాలకు ముహూర్తం పెట్టానో కానీ అప్పటినుండీ క్లాసులు చాలా చక్కగా సాగుతూ వస్తున్నాయి. ముహూర్తబలం మరీ. ఈసారి లాంగ్ డ్రైవుకి వెళ్ళినప్పుడు వెనక సీట్లో పడకేసి శుబ్బరంగా గురకెయ్యొచ్చు.
సర్లెండి. పైదంతా కల కాదు గానీ అందరూ ఎలాగయితే తమ కుటుంబ కబుర్లు వ్రాస్తారో అలా వ్రాసి చూసానన్నమాట. బావుందా? ఇక శరత్ బ్లాగింగులోకి వెళదాం.
మా ఆవిడ డ్రైవింగ్ చూస్తుంటే నాకు ఒణికిపోతోంది. పోనీ చెబితే వింటుందా నేను అలా చెప్పడం తన మానవ హక్కుల భంగం అనేలా చూస్తుంది. పోనీ కారు కీస్ తీసుకొని పెట్టుకుందామంటే ఆకాశంలోని సగం స్త్రీల హక్కుల భంగం అని ఇంట్లో రభస తప్పదు. అలా అని వదిలేస్తే ఏనాడో ఒహనాడు ఏదో ఒక ప్రమాదం జరుగకపోదు అనిపిస్తోంది. ఇంకా నయ్యం, వీలయినంతవరకు తానొక్కతేనో లేక తన స్నేహితురాళ్ళతోనో వెళుతూవుంటుంది, నన్ను వీలయినంత వరకు ఎవాయిడ్ చెస్తుంది. నేను పక్కనుంటే నెర్వస్ అవుతుందిట. చూసారా, నేనంటే మా ఆవిడకి ఎంత భయ్యమో! కారు కీస్ లాగేసుకొని రోజూ తన తిట్లు తినేకంటేనూ ఏదో ఒక ఆ రోజు, ఎప్పుడొస్తుందో తెలియని ఆ రోజు కోసం ఎదురుచూడ్డమే బెటర్ లా వుంది. ఆ రోజు మా కారు ఏ గోడకో, చెట్టుకో గుద్దేస్తే జరిగే ఖర్చులను ప్రత్యేక భరించడం కోసం ఒక భవిష్య నిధిని పోగేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నాను. నెలానెలా అందులో పడెస్తే ఏనాడో, ఒకనాడు ఉపయోగానికి రాకపోదు. ఎందుకూ ఇవన్నీ మాకు చెప్పడం అంటారా? మరి ఎవడికి చెప్పుకోను నా ఎమోషన్స్ అన్నీ?
ఇహపోతే మా పెద్దమ్మాయి ఎంచక్కా, బుద్ధిగా చెప్పినట్లు వింటూ కారు నేర్చుకుంటోంది. ఈ వారాంతం హైవేమీద కారు డ్రైవింగ్ నేర్పబోతున్నాను.
విగ్రహాలకి కూడా రిజర్వేషన్లు వర్తింపచెయ్యాలి!
భారత ప్రజానీకానికి రిజర్వేషన్లు మొదట ప్రతిపాదించింది అబేద్కరో లేక మరెవ్వరో నాకు గుర్తుకులేదు కానీ వారు ఒక ఘోరమయిన పొరపాటు చేసారు. ప్రజలతో పాటు విగ్రహాలకీ రిజర్వేషన్లు వర్తింపజెయ్యాలనే ప్రాధమిక పరిజ్ఞానం వారికి లేక ఆ విషయలో పొరపాటు చేసారు. వారు చరిత్రకి సమాధానం అనగా సారీ చెప్పాలి. రిజర్వేషన్లు లేనందువల్లనే కదా నిన్న హైదరబాదులో అంత ఘోరం జరిగిందీ? రాష్ట్ర రాజధానిలో మూడు ప్రాంతాల వారి విగ్రహాలను ఆయా ప్రాంతాల దామాషా ప్రకారం పెట్టివుంటే కనీసం ఒక ప్రాంతం వారి శాతం విగ్రహాలయినా అనగా 42% విగ్రహాలయినా కనీసం ఈసారి మిగిలివుండేవి కదా!
ఇప్పుడు పాత విగ్రహాల స్థానే కొత్త విగ్రహాలు పెడతామని ముఖ్యమత్రి గారు సెలవిచ్చారుట. ఎవరి విగ్రహాలు పెడతారు? భవిశ్యత్ చరిత్ర చేత ప్రశ్నించబడకుండా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. స్త్రీల విగ్రహాలని తగిన శాతంలో పెట్టకపోతే ముందు ముందు స్త్రీ వాదులు పురుష విగ్రహాలతో ఓ ఆట ఆడుకునే ప్రమాదం వుంది. అందుకే ఆకాశంలో వారు సగం కాబట్టి విగ్రహాల్లో కూడా వారు సగం వుండాలి. ఏ రాణి రుద్రమదేవి విగ్రహం ఒక్కటో పెడితే సరిపోదు. కవయిత్రి మొల్లలాంటి విగ్రహాలూ పెట్టెయ్యాలి. మొత్తం వంద విగ్రహాలు పెడితే శాతాల్లో వాటిని కొలవడానికి తేలికగా వుంటుంది. అలా అందులో కనీసం 50 విగ్రహాలు స్త్రీలవి పెట్టాలి.
ఇప్పుడు పాత విగ్రహాల స్థానే కొత్త విగ్రహాలు పెడతామని ముఖ్యమత్రి గారు సెలవిచ్చారుట. ఎవరి విగ్రహాలు పెడతారు? భవిశ్యత్ చరిత్ర చేత ప్రశ్నించబడకుండా తగిన జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. స్త్రీల విగ్రహాలని తగిన శాతంలో పెట్టకపోతే ముందు ముందు స్త్రీ వాదులు పురుష విగ్రహాలతో ఓ ఆట ఆడుకునే ప్రమాదం వుంది. అందుకే ఆకాశంలో వారు సగం కాబట్టి విగ్రహాల్లో కూడా వారు సగం వుండాలి. ఏ రాణి రుద్రమదేవి విగ్రహం ఒక్కటో పెడితే సరిపోదు. కవయిత్రి మొల్లలాంటి విగ్రహాలూ పెట్టెయ్యాలి. మొత్తం వంద విగ్రహాలు పెడితే శాతాల్లో వాటిని కొలవడానికి తేలికగా వుంటుంది. అలా అందులో కనీసం 50 విగ్రహాలు స్త్రీలవి పెట్టాలి.
అలాగే బిసీలూ, దళితులూ వారి వారి శాతాల్లొ విగ్రహాలకి సమన్యాయం జరగాలి. ఉపకులాలకి ఎంత శాతం అన్న వాదనలు వున్నాయి కదా. వివాదాస్పద శాతాల మేరకు ఖాళీ గద్దెలు కట్టి వుంచాలి. మిగతా విగ్రహాలు భర్తీ చెయ్యాలి. ఈలోగా విగ్రహాల శాతాల పంపకం మీద కోర్టుల్లో కేసులూ పడవచ్చు. మంచిదే. వారి తీర్పులు విగ్రహాల శ్రేయస్సు కోసం ఉపయొగపడుతాయి. ప్రభుత్వం ఆ శాతాలని తేల్చడానికి కమిటీలు కూడా వెయ్యొచ్చు. మైనారిటీ కమీషనులాగా, బిసి కమీషనులాగా విగ్రహ కమీషను కూడా ముందే వేసి పెట్టుకుంటే మంచిది.
ఆ కమీషను పరిధిలోకి రాష్ట్రం మొత్తమ్మీద వున్న విగ్రహాలను తీసుకురావాలి. ఏ విగ్రహం పెట్టినా అనుమతులూ గట్రా వుండాలి. విగ్రహాలకు సాధారణ భద్రత సరిపోదు కాబట్టి, ఏ విగ్రహానికి ఏమయినా అది శాంతి భద్రతల సమస్య కాబట్టి వాటికి ప్రత్యేక రక్షణదళం వుండాలి. వాటికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి. పోనీ అన్నింటికి కాకపోయినా ప్రముఖుల విగ్రహాలకు ఆ స్థాయిలో భద్రత వుండాలి. అనుక్షణం వారు విగ్రహాలని కంటికి రెప్పలా కాపాడాలి. విగ్రహాల పొలిటికల్ పవరుని బట్టి తదితర విగ్రాహాలకి జెడ్ ప్లస్ కాకపోయినా సముచిత స్థాయిలో తగిన మరియు ప్రత్యేకమయిన భద్రత కల్పించాలి. విగ్రహాలను ఎవరయినా అవమానించకుండా వాటికి రిజర్వేషన్లతో పాటుగా మానవ హక్కులూ వర్తింపజెయ్యాలి. అప్పుడు ఎక్కడ ఏ విగ్రహాన్ని ఎవడు పీకినా మానవహక్కుల సంఘం వారు జోక్యం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. ఎలాగూ వారికి పెద్దగా పనేమీలేక పోచుకోలు తీర్పులు ఇస్తున్నారు కదా. విగ్రహాల బాధ్యత కూడా పెడితే పండగ చేసుకుంటారు.
అందుచేత ప్రభుత్వం కొత్త విగ్రహాలు కట్టించేలోపే, పెట్టించేలోపే వివిధ వర్గాలూ తమ తమ శాతం విగ్రహాల కొసం ఆందోళనలూ, రాస్తారోకోలూ, బలిదానాలూ చెయ్యాలి. మంచి తరుణం మించిన రాదు. ఇప్పుడు మీ కులం, మతం, వర్గం, ప్రాతం, లింగం విగ్రహాలు పెట్టుకోలేకపోతే మళ్ళీ ఇంతచక్కని అవకాశం తొందర్లో రాదు. మళ్ళీ వళ్ళు మండి ఎప్పుడన్నా విగ్రహాలు కూలగొడితే తప్ప ఇలాంటి సువర్ణావకాశం ఇప్పట్లో రాదు కాబట్టి అందరూ త్వరపడండి. ఆందోళనలు చేపట్టండి.
అలాగే పనిలో పనిగా మా ఎల్జీబిటీ విగ్రహాలు పెట్టాలి. మేము ఎక్కువమందిమి లేము కాబట్టి ఒక్క శాతంతో సరిపుచ్చుకుంటాము. విగ్రహానికి తగిన వ్యక్తి ఎవరున్నారు చెప్మా! నేను తప్ప ఎవరూ నాకు గుర్తుకురావడం లేదు. అందుకే లైంగిక హక్కుల వారి శాతం మీద నా విగ్రహాన్ని ట్యాంకుబండు మీద పెట్టాలని డిమాండు చేస్తున్నాను అధ్యక్షా. నా విగ్రహాన్ని పెట్టకపోతే నిరసనగా ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ట్యాంక్బండు మీద తిష్ట వేసి ఆత్మబలిదానం అయినా ఇచ్చుకుంటాను. అప్పుడు అక్కడ నా సమాధి అయినా కట్టేసెయ్యండి మరి. జై ఎల్జీబీటీ, జై జై ఎల్జీబీటీ. లైంగిక హక్కుల నాయకుడు శరత్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైంగిక హక్కులూ జిందాబాద్, జిందాబాద్.
అరవండెహె.
ఆ కమీషను పరిధిలోకి రాష్ట్రం మొత్తమ్మీద వున్న విగ్రహాలను తీసుకురావాలి. ఏ విగ్రహం పెట్టినా అనుమతులూ గట్రా వుండాలి. విగ్రహాలకు సాధారణ భద్రత సరిపోదు కాబట్టి, ఏ విగ్రహానికి ఏమయినా అది శాంతి భద్రతల సమస్య కాబట్టి వాటికి ప్రత్యేక రక్షణదళం వుండాలి. వాటికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి. పోనీ అన్నింటికి కాకపోయినా ప్రముఖుల విగ్రహాలకు ఆ స్థాయిలో భద్రత వుండాలి. అనుక్షణం వారు విగ్రహాలని కంటికి రెప్పలా కాపాడాలి. విగ్రహాల పొలిటికల్ పవరుని బట్టి తదితర విగ్రాహాలకి జెడ్ ప్లస్ కాకపోయినా సముచిత స్థాయిలో తగిన మరియు ప్రత్యేకమయిన భద్రత కల్పించాలి. విగ్రహాలను ఎవరయినా అవమానించకుండా వాటికి రిజర్వేషన్లతో పాటుగా మానవ హక్కులూ వర్తింపజెయ్యాలి. అప్పుడు ఎక్కడ ఏ విగ్రహాన్ని ఎవడు పీకినా మానవహక్కుల సంఘం వారు జోక్యం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. ఎలాగూ వారికి పెద్దగా పనేమీలేక పోచుకోలు తీర్పులు ఇస్తున్నారు కదా. విగ్రహాల బాధ్యత కూడా పెడితే పండగ చేసుకుంటారు.
అందుచేత ప్రభుత్వం కొత్త విగ్రహాలు కట్టించేలోపే, పెట్టించేలోపే వివిధ వర్గాలూ తమ తమ శాతం విగ్రహాల కొసం ఆందోళనలూ, రాస్తారోకోలూ, బలిదానాలూ చెయ్యాలి. మంచి తరుణం మించిన రాదు. ఇప్పుడు మీ కులం, మతం, వర్గం, ప్రాతం, లింగం విగ్రహాలు పెట్టుకోలేకపోతే మళ్ళీ ఇంతచక్కని అవకాశం తొందర్లో రాదు. మళ్ళీ వళ్ళు మండి ఎప్పుడన్నా విగ్రహాలు కూలగొడితే తప్ప ఇలాంటి సువర్ణావకాశం ఇప్పట్లో రాదు కాబట్టి అందరూ త్వరపడండి. ఆందోళనలు చేపట్టండి.
అలాగే పనిలో పనిగా మా ఎల్జీబిటీ విగ్రహాలు పెట్టాలి. మేము ఎక్కువమందిమి లేము కాబట్టి ఒక్క శాతంతో సరిపుచ్చుకుంటాము. విగ్రహానికి తగిన వ్యక్తి ఎవరున్నారు చెప్మా! నేను తప్ప ఎవరూ నాకు గుర్తుకురావడం లేదు. అందుకే లైంగిక హక్కుల వారి శాతం మీద నా విగ్రహాన్ని ట్యాంకుబండు మీద పెట్టాలని డిమాండు చేస్తున్నాను అధ్యక్షా. నా విగ్రహాన్ని పెట్టకపోతే నిరసనగా ఈ సారి ఇండియా వచ్చినప్పుడు ట్యాంక్బండు మీద తిష్ట వేసి ఆత్మబలిదానం అయినా ఇచ్చుకుంటాను. అప్పుడు అక్కడ నా సమాధి అయినా కట్టేసెయ్యండి మరి. జై ఎల్జీబీటీ, జై జై ఎల్జీబీటీ. లైంగిక హక్కుల నాయకుడు శరత్ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. లైంగిక హక్కులూ జిందాబాద్, జిందాబాద్.
అరవండెహె.
పతోడు
నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా క్లాసుమేటు ఒకతన్ని అందరూ పతోడు అనేవారు. అతను ఏదయినా చెప్పేటప్పుడు ప్రతీవాడూ అని చెప్పకుండా పతోడు అని చెప్పేవాడు. అందుకే అతనికి పతోడు అని పేరు పెట్టేసారు.
ఇహ పోతే బ్లాగుల్లో
- పతోడూ నీతిమంతుడే
- పతోడూ ఎదుటివాడికి నీతులు చెప్పేవోడే
- పతోడూ పరెఫెక్టే
- పతోడి కుటుంబ సభ్యులు కూడా పర్ఫెక్టే
- పతోడి మతం, కులం, మతం, వర్గం కూడా పరెఫెక్టే
- పతోడూ ఏనుగే
- విమర్శించే పతోడూ వూరకుక్కే
ఇంకా చాలా పతోళ్ళు వున్నారు కానీ ఎందుకు లెండి అసలే చాలామందిమి (విగ్రహ) బాధల్లో వున్నాం కదా.
ఇహ పోతే బ్లాగుల్లో
- పతోడూ నీతిమంతుడే
- పతోడూ ఎదుటివాడికి నీతులు చెప్పేవోడే
- పతోడూ పరెఫెక్టే
- పతోడి కుటుంబ సభ్యులు కూడా పర్ఫెక్టే
- పతోడి మతం, కులం, మతం, వర్గం కూడా పరెఫెక్టే
- పతోడూ ఏనుగే
- విమర్శించే పతోడూ వూరకుక్కే
ఇంకా చాలా పతోళ్ళు వున్నారు కానీ ఎందుకు లెండి అసలే చాలామందిమి (విగ్రహ) బాధల్లో వున్నాం కదా.
గురువారం 10 మార్చి 2011
తింటే ఆయాసం - తినకపోతే నీరసం
నిత్య జీవితంలో నాకున్న అతి పెద్ద ఛాలెంజి వ్యాయామం. వ్యాయామం వల్ల ఒత్తిడి తగ్గడం మాటేమో కానీ నాకు అదే పెద్ద ఒత్తిడి అయిపోయింది. రోజూ అన్నింటికీ ముహూర్త బలం బాగానే వుంటుంది కానీ దానికి మాత్రం సమయం అచ్చిరాదు. చేద్దాంలే చేద్దాంలే అని వాయిదా వేస్తూ అలా అలా కాలాతీతమవుతూవుంటుంది. ఏదయినా కడుపులో పడెసామనుకోండి - తిన్నాం కాబట్టి ఆయాసంగా వుంటుంది. అరిగాక చెయ్యొచ్చులే అనుకుంటే అరిగాక నీరసంగా వుంటుంది. మళ్ళీ ఏదయినా బొజ్జలో పడెయ్యాలనే అనిపిస్తుంది కానీ ససేమిరా ట్రెడ్మిల్ ఎక్కబుద్ది కాదు. ఆకలి కావడానికీ, కాకపోవడానికీ మధ్య సరిగ్గా టైమింగ్ చూసుకొని చెయ్యాలి వ్యాయామం కానీ మనమేమన్నా రాజులమా? సమయానికి ఏదో ఒహ పని ముందేసుకొనో, మీద బడో వుంటుంది కదా. ఇంట్లో రాణిగారి ఆజ్ఞలూ పాటిస్తూవుండాలి కదా.
ఉదయం అయిదు గంటలకు లేచి ఓ రెండు రోజులు చేసా కానీ ఎందువల్లనన్నా నిద్రా భంగం అయితే ఆ అయిదు గంటల కార్యకరమం కూడా డుమ్మా కొడుతోంది. అందుకే ఈమధ్య షెడ్యూలు మార్చేసా. ఇంటికెల్లగానే శుబ్బరంగా తినేసి, ఇంట్లో పనులు చేసేసి, ఫుడ్డు అరిగాక నీరసం రాకముందే ఏ తొమ్మిదిగంటలకో బెడ్డేక్కేబదులు ట్రెడ్‌మిల్లు ఎక్కేస్తున్నా - ఓ చక్కని సినిమా పెట్టేసుకొని చూసేసుకుంటూ. ఈ ఆనందం ఎంతకాలమో అదీ చూద్దాం.
మిగతా కబుర్లు ఏమయినా వుంటే కామెంట్సుగా వ్రాస్తానేం.
బుద్ధుని విగ్రహం కూడా ఎత్తేసి హుస్సేన్ సాగర్లో విసిరేద్దాం
ట్యాంకుబండ్ మీద విగ్రహాలు కూలగొట్టారు. గ్రేట్. అభినందనలు. మంచిపని చేసారు. సంతోషం. బుద్ధ విగ్రహాన్ని మాత్రం ఎందుకు వదిలెయ్యాలి? బుద్ధుడు సమైక్యాంధ్రా వాడు కాకపోవచ్చు కానీ దాన్ని ప్రతిష్టించిన రామారావు సమైక్యాంధ్రుడే కదా. ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ, మిగతా ఫిల్మ్ స్టుడియోలూ, తెలంగాణా వారివి కాని ఇతర నిర్మాణాలూ, సంస్థలూ అన్నీ కూల్చేస్తే తొందరగా తెలంగాణా వస్తుంది. తాలిబాన్లు అవన్నీ తేలిగ్గా కూలగొట్టడానికి వీలుగా అందరం ఏవేవి కూలగొడితే బావుంటుందో లిస్ట్ ఇచ్చేద్దాం. తెలంగాణా వచ్చాక హాయిగా ఏలుకోవచ్చు - ఓ స్మశానాన్ని. అప్పుడొస్తారు పర్యాటకులూనూ, అప్పుడొస్తాయి పెట్టుబడులూనూ.
మీడియాకి తగిన శాస్తి జరిగింది. ఇంకా జరగాలి. అలాగే కేకేకీ, యాష్కీకి తగిన శాస్తి జరిగింది.
బుధవారం 9 మార్చి 2011
మణిచందన - 1
అది ఆమె అసలు పేరు కాదు కానీ అలా అనుకుందాం. ముద్దుగా మణి అనుకుందామేం. ఇండియాలో నాకు బాగా క్లోజ్ అయిన ఒక అమ్మాయి తనకు తెలిసిన ఒక ఆంటీని నాకు బాగా అనుకూలంగా వుంటుందని పరిచయం చేసింది. కృతజ్ఞతా పూర్వకంగా ఆ అమ్మాయి ఈవిడగారిని నాకు సమర్పించేసుకుందని చెప్పేసుకోవచ్చు. ఎందుకా కృతజ్ఞత అంటారా? అది మళ్ళెప్పుడయినా చెప్పుకుందాం. అయితే ఇదంతా ఫోనులోనే లెండి - మనమేమో యు ఎస్ లో చచ్చామాయే డైరెట్టుగా ఎలా కుదురుతుందీ?
మణిది చాలా చక్కటి మనస్థత్వం కాబట్టి అనతికాలంలోనే చాలా సన్నిహితమయ్యి అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం ప్రారంభించాం. ఆమెకన్నీ వైల్డ్ కోరికలు. జస్ట్ మొగుడితో సంతృప్తి చెందేరకం కాదు. ఆమెకు కొన్ని దాంపత్యేతర అనుభవాలు వున్నయ్. అందులో కొన్ని నాకు వివరించేది. తన్మయత్వం చెందుతూ వినేవోడిని. మనం అవన్నీ తప్పుగా అనుకోము కాబట్టి మరిన్నిటికి ప్రోత్సహించేవాడిని. ఆమె వుంటున్న టవునులోనే మా మిత్రుడు ఒకడు వుండేవాడు. ఆ ఇద్దరికీ లంకె పెట్టాను. ఆమె కూడా తన మిత్రురాలిని ఒకరిని పరిచయం చేసింది - ఫోనులోనే లెండి. ఆమెతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడిని. ఆమెనూ కొందరు మిత్రులకు పరిచయం చేసాను. ఆమె అంత బావోలేదని నా మిత్రులు చెప్పారు. అంత గొప్ప మనస్థత్వం కూడా కాకపోవడంతో ఆమెను క్రమంగా వదిలివేసాను.
నాకు ఇలాంటి విషయాలలో నెట్వర్కింగ్, షేరింగ్ అంటే భలే ఇష్టం. నేనస్సలు పొజెసివ్ కాదు. అందుకే నా మిత్రులు, మిత్రురాళ్ళ మధ్య వీలయినంతగా నెట్వర్కింగ్ చేయిస్తుంటాను. కలుపుతుంటాను, ప్రొత్సహిస్తుంటాను. శృంగారంలో సిగ్గుపడాల్సిందేమీ లేదు అని నేను గాఢంగా విస్వసిస్తాను కాబట్టే నేను వీలయినంతగా అలాంటివి ప్రోత్సహిస్తుంటాను. ఎదుటివారిని కూడా తమవారిని నాతో షేర్ చేసుకోవాల్సిందిగా సూచిస్తుంటాను.
అందుకే మణిని కూడా యుఎస్ లో నాకు నెట్టులో పరిచయం అయిన ఒక క్లోజ్ ఫ్రెండుకి పరిచయం చేసాను. వాళ్ళూ, వాళ్ళూ బాగానే మాట్లాడుకునేవారు. కొన్ని సార్లు కాన్ఫరెన్స్ పెట్టుకొని మరీ ముగ్గురమూ ఆనందించేవారం. అలాగే ఆమె ఫ్రెండునీ అతనికి పరిచయం చేసాం. ఆమె ఎంతొ చక్కగా, ఆనందించే విషయాల్లో ఎలాంటి అరమరికలు లేకుండా, హిపోక్రసీ లేకుండా, కథలు పడకుండా మాట్లాడేది, వుండేది. నాటకాలు, వేషాలు వెయ్యకుండా మాతో స్వచ్చంగా ప్రవర్తించేది. మా యు ఎస్ మిత్రునికీ ఆమె భలే నచ్చేసింది. ఆమెను ఎంతగానో ముఖాముఖి కలుసుకొవాలని వున్నా కూడా నాకు ఇండియా వెళ్ళడం అప్పట్లో వీలు అవలేదు. ఈ లోగా నా మిత్రుడు ఇండియా వెళ్లగలిగాడు. ఇంకేముంది ఇండియా వెళ్ళి ఆమెతో పండగ చేసుకున్నాడు.
పండగ చేసుకోవడమే కాకుండా అక్కడినుండి నాకు ఫోనులో ఆ పండగ ప్రత్యక్ష ప్రసారం చేసాడు :) ఇహ ఇవతల నేను కూడా ఆ ప్రసారం వింటూ మస్తు మజా చేసుకున్నాను. అయితే వెబ్ క్యాం ప్రసారాలు మాత్రం కుదరలేదు. మా మిత్రుడు ఇండియా నుండి వచ్చాక అడిగాను ఆమె ఫోటో అయినా తీసేవా అని. ఊహు, తొందరలో మరచిపోయానన్నాడు. ప్చ్. అంతవరకూ ఆమె ఫోటో చూడనే చూడలేదు. మా మిత్రునికి ఆమె పిచ్చపిచ్చగా నచ్చెసింది. ఎంతో బావుందిట, ఎంతో చక్కగా సహకరించిందంట. నాకూ అర్ధం అయ్యింది కదా - ఫోనులో వింటూ వుంటేనూ.
అయితే ఆమె మిత్రురాలు మాత్రం మావాడికి బొత్తిగా నచ్చలేదు. అందుకే ఆమెను ఓ సారి చూసేసి పవిత్రంగా వెనుదిరిగి వచ్చాడు. ఇంకా ఈ మణిచందన సాహసాలు ఇంతకంటే మించినవి ఇంకా వున్నయ్. మరో టపాలో వ్రాస్తానవి. ఇన్నిరోజులూ ఇలాంటి స్త్రీ సాహసాలూ ఎవరయినా వ్రాస్తారేమో అని చూసాను కానీ అంత సీన్ లేదు, పదేళ్ళయినా ఇప్పట్లో రాదు కాబట్టి ఇహ నేనే నాకు తెలిసినవి వ్రాస్తున్నాను. ఇలాంటివి వ్రాయడం అవసరమా అని మీ సందేహం కావచ్చు. మీరు అన్నీ అవసరమయిన పనులే చేస్తున్నారా రోజూ? అవసరమే. తనకు నచ్చిన రీతిలో తన లైంగిక హక్కులను సాకారం చేసుకుంటోంది మణి. ఆ రకంగా ఆమె అభినందనీయురాలు. 'ఆమె' లాగా మరణం కోసం ఎదురుచూడటం లేదు. వయోజనులయిన ఇద్దరి మధ్య పరస్పర ఆమోదిత సరాగాలకి ఎలాంటి అభ్యంతరాలూ వుండకూడదు. ఇలాంటి టపాల ద్వారా నేను ఎలుగెత్తి చాటేది అదే.
(ఇంకా వుంది)
(ఇంకా వుంది)
ఆమె వ్యధ-2
ఆమెకేమో ఆగని కోరికలు. ఇంట్లోనేమో అవి ఫలించడం లేదు. బయటకి వెళ్ళి తీర్చుకునేంత ధైర్యం లేదు (నాకు చెప్పినంతవరకు). ఇంట్లో పరిస్థితి మెరుగుపడటానికి కొన్ని ప్రయత్నాలు చేసిందిట కానీ అటువైపు నుండి కేవలం అవసరం తప్ప ఏమాత్రం ప్రేమ, అనురాగం లాంటివి పట్టించుకోని పరిస్థితి. ఇహ లాభం లేక మార్పు కోసం ప్రయత్నాలు ఎన్నడో వదిలేసింది.
మనిషి మనుగడకు (సన్నాసులకు, సన్యాసినులకు కాదులెండి) ఆహారం, నిద్ర ఎలాంటివో మైధునం కూడా అలాంటిదేనని అలాంటివి తీరని పరిస్థితుల్లో పిల్లలని తీసుకొని విడిపోవచ్చు కదా అని అడిగాను. తనకు అంత ధైర్యం లేదన్నది. మరి ఎలా అంటే ఈ జీవితానికి ఇంతేననీ తనని తొందరగా తీసికెళ్ళి ఈ కోరికల నుండి విముక్తి చెందించమని దేవుడిని పూజించినప్పుడల్లా విన్నవించుకుంటున్నాననీ తెలిపింది!
ఇవండీ ఒక బ్లాగు రీడర్ నాతో పంచుకున్న విషయాలు. ఆమె అనుమతితోనే ఈ విషయాలు వ్రాస్తున్నాను. తరచుగా నాతో టచ్ లో వుంటూ నాకు ఇప్పుడు చక్కటి మిత్రురాలు అయ్యింది. నా పట్ల ఆమె చూపించే ఆదరణా, ఆప్యాయతా చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది.
ఇవన్నీ మన ప్రవక్తలకు చెబితే ఏమంటారు తెలుసా? చల్లటి నీళ్ళు నెత్తిన పోసుకొని వచ్చి పడుకొమ్మంటారు.
తెలంగాణా వచ్చాక...
చిదంబరం తెచ్చిన చేటు వల్ల తెలంగాణా ప్రజల్లో చాలామంది తెలంగాణా ఉద్యమం/ఉన్మాదం పట్ల ఆకర్షితులయ్యారు. ఇదివరలో అంత వేడి వుండకపోయేది కానీ చిదంబరం ప్రకటన తరువాత తెలంగాణా వాదులకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రా గొడవలు జరిగేసరికి తెలంగాణా వారికి రోషం పుట్టుకు వచ్చి ఆ ఉద్యమం పట్ల అభిమానం ఎక్కువయ్యిందని ఒక విశ్లేషణ.
అనవసరంగా రోశయ్య ముఖ్యమంత్రి అయ్యి పెనం మీద మీద వున్న సమస్యను పొయ్యిలొకి తెచ్చాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ పరిపాలనా శైలి బాగానే వున్నట్లుంది. ఉదాహరణకు జగన్ నిరాహారదీక్ష అనగానే కేసీఆర్ దీక్ష అనగానే రోశయ్య వణికిపోయి దృశ్యం ఇచ్చినట్లు ఇవ్వలేదు. చేసుకో ఎన్ని రోజులు చేస్కుంటావో అని లైట్ తీసుకున్నాడు. ఓ వారం రోజులు చేసినా ఎవరూ జగన్ దీక్షని అంతగా పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే ఉద్యోగుల నిరాహార దీక్ష అన్నా కిరణ్ లైట్ తీసుకున్నాడు. మిలియన్ మార్చ్ విషయం అయినా, ఇంటర్ పరీక్షల విషయం అయినా రోశయ్యలా కిరణ్ గజాగజా వణికిపోయి ముందే ఓడిపోలేదు. అలా వుండాలి దక్షత అంటే.
తెలంగాణాలొని మెజారిటీ మేధావులనబడేవాళ్ళే సంకుచిత ధోరణితో, కుత్సితపు ప్రయోజనాలను ఆశించి ఉద్యమాన్ని ఎగదోస్తున్నప్పుడు ఇక సాధారణ ప్రజల ఆలోచనా స్థాయి గురించి చెప్పేదేమేముంది. ఆ మేధావుల్లో చాలావరకు లోపాయికారీ మావోయిస్టు అభిమానులే వుంటారనుకోండి. ఎవడయినా మంచి చెబుదామనుకుంటే తన్నులు తింటామేమో అన్న భయమాయే. ఆ రకంగా తెలంగాణా వారి కళ్లముందు ఉద్యమం తప్ప మరొకటి దాదాపుగా కనిపించకుండా అయిపోయింది. మా చుట్టాలకి ఎవరికి ఫోన్ చేసినా ఈ ప్రస్థావన వస్తే చాలు తెలంగాణా ఎంత అన్యాయమయిందో లిస్టు తీస్తున్నారు.
సరే, మొత్తమ్మీద ఈ ఉద్యమం ఫలించి ఎన్నటికో ఒకనాటికి తలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందనే అనుకుందాం. తరువాత ఏంటీ? నేను ఊరుకుంటానా? ఊరుకోను. నల్లగొండ (జిల్లా) డెవెలప్మెంట్ ఫోరం పెడతాను. ఎందుకూ? నల్లగొండ జిల్లాను తక్కువచేసి చూస్తున్నారు కాబట్టి నల్లగొండ జిల్లాలో పుట్టి పెరిగిన వాడిగా నా మనోభావాలు గాయపడ్డాయంటాను. తెలంగాణా రాష్ట్రం నుండి నల్లగొండ విడిపోవాలంటాను. నల్లగొండ జిల్లాలోనే తెలంగాణా రాజధాని ఏర్పాటు చేసి మా జిల్లావాసుల ఆత్మ గౌరవాన్ని నిలబెడితే తప్ప ఊరుకునేది లేదంటాను. అలాంటివే ఇంకా ఏమయినా సమస్యలు దొరుకుతాయి కదా. లేకపోతే కల్పిస్తాను. ఏ శ్రీరామ కమిటీ పెట్టి తేల్చినప్పుడో కదా నా సృజనాత్మకత బయటపడేది. మొత్తమ్మీద నల్లగొండా గాంధీని అయిపోతాను.
ప్రజలంతా గొర్రెలు కాబట్టి నా ఉద్యమం ఫలించి ఎన్నటికో ఒకనాటికి ఫలించి నల్లగొండ రాష్ట్రం అవతరించక మానదు. ఆ తరువాత? ఊరుకుంటానా? మా సూర్యాపేట మండలం వుంటుంది కదా. దాని రాష్ట్ర సాధనకై ఉద్యమిస్తాను. నేను ఆ పట్టణంలో పెరిగిన ఇల్లే ముఖ్యమంత్రి నివాసంగా చెయ్యాలంటాను. అలా నాకున్న అన్ని చేతివేళ్ళ పొడవునూ, కాలివేళ్ళ పొడవునూ సమం చెయ్యాలని ప్రయత్నిస్తూనేవుంటాను. అన్ని విషయాలు సమానంగా, సమతలంగా వున్నప్పుడే కదా సౌభ్రాతృత్వం నెలకొల్పబడేది.
మంగళవారం 8 మార్చి 2011
ఆమె వ్యధ - 1
గమనిక: లైంగిక ఇబ్బందులని ఓ ఇబ్బందిగా గుర్తించలేని వారు ఈ టపా చదవక్కరలేదు. ఎంచక్కా నీ-తీవ్రత లాంటి నీతివ్రతుల కథలు ఎక్కడయినా చదువుకోండి.
ఆమె ఓ సగటు మహిళ. పెళ్ళయి పదిహేనేళ్ళవుతోంది. పిల్లలున్నారు. భర్తకి భార్య మీద ప్రేమ కానీ, వ్యామోహం కానీ లేదు. అక్కరకు వచ్చినప్పుడు దగ్గరకి తీసుకొని ఓ రెండు నిమిషాలు గడపడం మాత్రం మొగుడన్న ఆ మొగాడికి తెలుసు. పెళ్ళయిన దగ్గరి నుండీ ఆ మహిళకి దక్కింది, ఆకాశంలో సగమయిన ఆ స్త్రీ కి దక్కింది అప్పుడప్పుడు ఆ రెండు నిమిషాలే. ఏం ఆ మాత్రం చాలదా అనుకునేవారి పట్ల జాలి పడటం తప్ప ఏమీ చెయ్యలేను. ఆడవారికి దాదాపుగా 20 నిమిషాల అవసరం అయినా వుంటుంది. అందువల్ల ఆమె చివరి సారి అంత్యతృప్తి పొంది ఎనిమిదేళ్లవస్తోందిట!
మహిళల రోజు ప్రకటించి వందేళ్ళు దాటుతున్నా మహిళలకి జోహార్లు అర్పించడం ఏమో కానీ చాలా ఇళ్ళళ్లలో మహిళలు జోకర్లు గానే మిగిలిపోతున్నారు. ఎవరియినా సమస్యలు బయటకు చెప్పుకొని పరిష్కరించుకుందామంటే లేదా ఆయా సమస్యల గురించి అవగాహన పెంపొద్దిదామంటే సాటి మహిళలే, బాగా చదువుకున్నవారే ఉష్ ఉష్ అని నిలువరిస్తారు. అలాంటివి ఎందుకమ్మా అని ఆగ్రహిస్తారు. ముగ్గుల గురించీ, ముత్తయిదువుల గురించీ వ్రాయమనీ ప్రోత్సహిస్తారు. వైవిధ్యమయిన, విభిన్నమయిన, పెద్దగా ఎవరూ తాకడానికి ధైర్యం లేని విషయాలపై ఎవరయినా మహిళా బ్లాగర్లు వ్రాస్తారనుకుంటే అందరూ అలా ఏమయినా వ్రాసేవారి కాళ్ళు గుంజేవారే కనపడుతున్నారు కానీ, ప్రవచనాలతో పద్ధతులు నేర్పేవారే కనిపిస్తున్నారు కానీ ధైర్యవంతులు ఎవరూ లేరు. ఒకరిద్దరికి ఆ ధైర్యం వుందనుకుంటే అది అతి అయిపోయింది. మనుషుల సమస్యల గురించి వ్రాస్తారని నేను ఆశిస్తే దేవతల సమస్యలు తలకు ఎత్తుకొని అభాసుపాలయ్యారు.
ఆడ మనుషులనే మనుసుషులుగా గుర్తించక, వారికీ మనస్సుంటుందని మనం ఊహించక వారిని బండరాయిల్లాగా భావిస్తూ గౌరవిస్తున్నాం. సాటి స్త్రీనే ఓ దేవతగా భావిస్తున్నప్పుడు ఓ దేవతని స్త్రీగా భావించి పలుచన చేస్తే జనాలు ఎలా భరిస్తారు? అందుకే ముందు స్త్రీని ఒక మానవమాత్రురాలిగా గుర్తిద్దాం. ఆ మనస్సుంటుందనీ, ఆమెకూ పలు సమస్యలుంటాయనీ గుర్తిద్దాం. స్త్రీల సమస్యలు గురించి వ్రాయడం ఎందుకు అవన్నీ టివిలో నేరాలూ ఘోరాలులో చూస్తే సరిపోతుందికదా అనుకునేవారికి అసలు బ్లాగులు చదవడం, వ్రాయడం ఎందుకండీ. ఎంచక్కా బోలెడంత కాలక్షేపం టివిల్లోనే వుంటుంది కదా.
అందుకే మహిళా బ్లాగర్లలో ఒక్కరికీ అంతగా ధైర్యం లేదు కాబట్టి మహిళల రోజు సందర్భంగా నేనయినా వ్రాయడం మొదలెడతాను. మహిళల సమస్యలంటే అవేనా, మిగతావాటి గురించి అప్పుడప్పుడూ, అక్కడక్కడా వ్రాస్తున్నాం అనేవారికి అవి కూడా సమస్యలేనని, వాటి గురించి మీరు వ్రాసేంత దృశ్యం లేదు కాబట్టి నేను వ్రాయాల్సి వస్తోందనీ విన్నవించుకుంటున్నాను. డైనమిక్ లేడీ బ్లాగర్ ఒక్కరయినా మన బ్లాగోస్ఫియరులో లేనందుకు సిగ్గుపడుతూ అప్పుడప్పుడయినా ఎవరూ టచ్ చేయని స్త్రీల ఆంశాలని, సమస్యలనూ నేను స్పృశిస్తాననీ తెలియజేసుకుంటున్నాను. నేను ఆశించిన విధంగా ఎవరయినా ముందుకు వచ్చిన నాడు నేను ఆయా ఆంశాల గురించి వ్రాయాల్సిన అవసరం అంతగా వుండదు.
అందులో భాగంగానే వంద ఏళ్ళ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె కథతో మొదలెడుతున్నాను.
ఆమె ఓ సగటు మహిళ. పెళ్ళయి పదిహేనేళ్ళవుతోంది. పిల్లలున్నారు. భర్తకి భార్య మీద ప్రేమ కానీ, వ్యామోహం కానీ లేదు. అక్కరకు వచ్చినప్పుడు దగ్గరకి తీసుకొని ఓ రెండు నిమిషాలు గడపడం మాత్రం మొగుడన్న ఆ మొగాడికి తెలుసు. పెళ్ళయిన దగ్గరి నుండీ ఆ మహిళకి దక్కింది, ఆకాశంలో సగమయిన ఆ స్త్రీ కి దక్కింది అప్పుడప్పుడు ఆ రెండు నిమిషాలే. ఏం ఆ మాత్రం చాలదా అనుకునేవారి పట్ల జాలి పడటం తప్ప ఏమీ చెయ్యలేను. ఆడవారికి దాదాపుగా 20 నిమిషాల అవసరం అయినా వుంటుంది. అందువల్ల ఆమె చివరి సారి అంత్యతృప్తి పొంది ఎనిమిదేళ్లవస్తోందిట!
(ఇంకా వుంది)
అవీ ఇవీ
యు ఎస్ లో ఒక ఇంట్లో ఎవరూ లేనిది చూసి దొంగ ప్రవేశించి ఎంచక్కా స్నానం చేస్తుండంగా ఓనర్ వచ్చి ఎవడవురా నువ్వు, మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని కేకలేసాడుట. దాంతో ఓనర్ దగ్గర గన్ను వుందేమోనని దొంగ గారు భయపడి నన్ను రక్షించండి మహాప్రభో అని పోలీసులకు ఫోన్ చేసాట్ట. పోలీసులు వచ్చి అతగాడిని రక్షించి మరీ అరెస్టు చేసారు. ఇంతకీ ఓనర్ దగ్గర గన్నుందో లేదో తెలియదు.
మిగతా కబుర్లు నెమ్మదిగా కామెంట్ల రూపంలో
సోమవారం 7 మార్చి 2011
నీతి పెద్దల/గద్దల రెక్కల చప్పుడు
వీళ్లకు పెద్దగా పనీ పాటా వుండదు. ఎప్పుడు ఏ బకరా దొరుకుతాడా వాలిపోయి నీతి కథలు చెబుదామా అని మెకన్నాస్ గోల్డ్ సినిమాలో రాబందుల్లాగా గాలిస్తుంటారు. బకరా దొరికాడే అనుకోండి - పీక్కుతింటారు - నీతి ప్రవచనాలతో. ఎదుటివాడు ఏ స్థితిలో వున్నాడూ, నిజ్జంగా వాడి తప్పుందా లేదా, ఎదుటివాడి కోణంలో నుండి చూస్తే అది కరెక్టేనా కాదా అన్నది వీళ్ళకు అనవసరం. వీళ్ళకు కావాల్సిందేంటయ్యా అంటే తమ ప్రవచనాలు వినడానికి ఎవరో ఒకరు దొరకడం. అసలే పొరపాటుననో, గ్రహపాటుననో సమస్యల్లో వున్నవారికి ఈ ఉద్భోధలు మండిస్తాయనీ, ఇంకా ఆత్మన్యూనత కలగజేస్తాయనీ వారికి అర్ధం కాదు. గొప్ప గొప్ప వాక్యాలూ, సూక్తులూ చెప్పి ఇతరుల ముందు హీరో అనిపించుకోవాలనో లేక పేద్ద మనిషి అనిపించుకోవాలనో వీరి తాపత్రయంగా వుంటుంది. వీరికి తోడు తానా అంటే తందానా అనే ఆడ పెద్దమ్మలూ కూడా దొరికిరానుకోండి ఇహ వీరి దూకుడుకి అడ్డంకే వుండదు.
మా దగ్గరి బంధువు ఒకతను వున్నాడు. తన ఊర్లో కానీ, తన బంధుమిత్ర పరివారంలో కానీ ఎక్కడ ఏ సమస్యా వున్నా ఉరుక్కుంటూ వెళతాడు. సహాయమో సానుభూతో చూపించడానికా? కాదు - హితోపదేశాలు చెయ్యడానికి. ఇలాంటివారు సమాజంలో మనకు తరచుగా తటస్తపడుతూ వుంటారు. వివిధ సందర్భాల్లో మన ముందుకు వచ్చి మనం వున్న పరిస్థితిని ఎడ్వంటేజీగా తీసుకొని మనమీద ఎక్కడానికి తయారుగా వుంటారు. ఉదాహరణకు మీరు కారులో వెళుతూ రాంగు రూటులో వచ్చిన ఏ సైకిలు అబ్బాయినో గుద్దారనుకోండి. అలాంటప్పుడు ఇలాంటి పేద్ద పెద్ద మనుషులు ముందుగానే చేరుకుంటారు. ఎవరిదీ తప్పు, ఎవరిది రైటూ అనే ఆలోచన వీరికుండదు. కారు వున్నోళ్ళంటే కుళ్ళు వుంటుంది కదా. అందుకే కారున్న వాడిదే తప్పు అంటారు. ఆ కారు యజమానికి అప్పటికప్పుడు నీతి చంద్రిక అసాంతమూ బోధిస్తారు. ఈయనగారికి తోడు చుట్టూ వున్నవారు కూడా ఊరుకోరు కదా, వాళ్ళూ తాళం వేస్తుంటారు. దానితో మనోడికి మరిత హుశారు వచ్చేస్తుంది. ఇహ అలా ఎగేసే గుంపులో ఆడాళ్ళూ వున్నారనుకోండి. ఇహ పెద్దల, గద్దల ఆనందానికి అదుపే వుండదు. నీతులు, బోధలు ధారాపాతంగా ప్రవహిస్తూవుంటాయి.
అప్పుడప్పుడు ఇలాంటి వారిని మన మంచికే చెబుతున్నారు కదా అనే భ్రమల్లో మన శ్రెయోభిలాషుల్లాగా భావిస్తుంటాము. అలా అలుసు ఇచ్చామో, అంతే, ఇహ అంటుకుపోతారు. ఇహ మనం కనపడ్డప్పుడల్లా ఏరీ వీరెక్కడా అని చూస్తే మన చంకనెక్కోసో, లేక మన తల ఎక్కేసో కనపడుతారు. అంచేత ఎవరు శ్రేయోభిలాషులో ఎవరు నీతి ప్రవక్తలో చూసుకుంటూవుండాలి. ఈ నీతి ప్రవక్తలు తమ జీవితాల్లో అచ్చంగా వుంటారా? అబ్బే, దొంగకోళ్ళు పట్టేవారో లేక "చెప్పేవి శ్రీరంగ నీతులు... దూరేవి సాని కొంపలు" టైపులోనో వుంటారు. అయితే వాళ్ళు ఇతరులను పట్టించుకున్నట్లుగా మనం ఇతరులని పట్టించుకోము కనుక వాళ్ల పేద్దరికం అలా చెల్లుబాటు అవుతూవుంటుంది. ఇలాంటి వారిని మనం ఓ కంట కనిపెడుతూ వుండాలి. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన ఎదుటివారు ఓ పెద్దవారయినట్లుగా భ్రమపడవద్దు.
ఎక్కడయినా వున్నట్లుగానే బ్లాగుల్లో కూడా ఇలా నాలా నీతి బోధలు చేసేవారుంటారు. బయటయినా కాస్త నయం ఎదుటివారి పరిస్థితిని చూసి నవ్వేసో, జాలేసో అయినా కొందరినయినా వదిలేస్తారేమో కానీ ఇక్కడ అయితే సమస్య వచ్చిందంటే చాలు, సందర్భం వచ్చిందంటే చాలు ఎలాంటి కనికరం లేకుండా మీద వాలేసి పీక్కుతినేస్తారు.
శుక్రవారం 4 మార్చి 2011
మన డ్రాయర్ నడిబజార్లో ఎందుకు ఉతుక్కోవాలి?
... అని కుమార్ గారితో సహా కొందరు ఆశ్చర్యపడుతుంటారు. ఇలా ఇంట్లో బట్టలు బజార్లో ఉతుక్కోవడం ఎప్పుడు అభ్యుదయం అయిపోయిందీ అని విస్మయం పడుతుంటారు. ఉతుక్కోవాలి. ఎందుకంటే...
మన మతాలు అయితేనేమిటి, పెద్దలు అయితేనేమిటి, దేశ సంస్కృతి అయితేనేమిటి మనకు ఏం చెప్పాయంటే లేదా ఏం చెప్పాయని మనం విశ్వసిస్తున్నామంటే మన డ్రాయర్ని మన వంటిమీదే వుంచేసి భద్రంగా పూజించాలని. మన డ్రాయర్ని ఎన్ని రోజులు వేసుకున్నా వాసన రాదు, మురికిపట్టదు. అంతకూ కంపుకొట్టిందనుకోండి సెంటేసుకోవాలి. మురికిపట్టిందనుకోండి దానికి అక్కడ సున్నం వెయ్యాలి అంతేగాని వుతుక్కోకూడదు. మరీ ఉతకాల్సి వస్తే బయటకి చప్పుడు రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా, మురికి బయటకి కానరాకుండా ఉతుక్కోవాలి. లోపల ఎంత మురికి వున్నా కూడా బయటకి తళతళ మెరిసిపోతున్నట్లుగా కనిపించాలి. ఇంట్లో అలా ఎంత ఉతికినా మురికి వదల్లేదనుకోండి - ఏం చెయ్యాలి? పారేసి మరో కొత్త కట్ డ్రాయార్ కొనుక్కొని వేసుకోవాలా? హన్నా ఎంత పోయేకాలం దాపురించిందీ మనుషులకీ, కలికాలం. తప్పు అలా డ్రాయర్లని ఎలా బడితే అలా పారెయ్యకూడదమ్మా - గౌరవించాలి.
ఇలా రోజుల తరబడి ఆ వాసన, మురికి అలవాటయి పోయి అసలు ఆ గమనింపే వుండదు మనకు. మన చుట్టూ వున్న జనాలు కూడా అదే బాపతు కనుక వారికీ వాసన రాదు, మురికి కనిపించదు. అంతా నార్మల్ గానే కనిపిస్తుందన్నమాట. సబ్ ఠీక్ హై. ఎందుకంటే డ్రాయర్ ఉతుక్కోవడం అంటే డ్రాయర్ యొక్క మనోభావాలని గాయప్రచినట్లు అవుతుంది కదా. డ్రాయరుకూ మనస్సుంటుంది దానికీ కొద్దిగా వ్యాయామం ఇవ్వాలి. అంతే కానీ ఉతికి దానియొక్క స్వేఛ్ఛా స్వాతంత్రాలకు భంగం కలిగించకూడదు. అలా చేస్తే అది గృహ హింస అవుతుంది! పైగా డ్రాయర్లను గౌరవించడం మన ధర్మం అయిపాయే. ఇంకెక్కడ డ్రాయర్లని టచ్ చేస్తాం. అలా, అలా జీవితాంతం వేసుకొని వుంటాం కానీ తీసివెయ్యం. ఎందుకంటే అది మన మత ధరం కాదు, మన సంస్కృతి కాదు. మన సంస్కృతి ఏమిటయ్యా అంటే ఆ కట్టుకున్నాం కనుక ఆ కంపుని జీవితాంతం భరించెయ్యడమే. అలా ఆ డ్రాయర్ని కట్టుకొనీ కట్టుకొనీ ఎవరికన్నా దురద పెట్టి, చిరాకు పెట్టి గిరవాటెయ్యాలనుకున్నామనుకోండి - మన చుట్టూ వున్న శ్రేయోభిలాషులు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ప్రతి చిన్న దానికీ హితోపదేశాలు చెయ్యడానికి రెడీగా వుండే పెద్ద మనుషులూ సుభాషితాలతో రెడీగా వుంటారు. కాకపొతే కొద్దిగా సెంటు రాసుకో అంతే కానీ వాసనొస్తుందంటావేం? మేము ఇన్నాళ్ళ నుండీ తొడుక్కుంటున్నాం మాకేమయినా వస్తుందా? ఒహవేళ వచ్చినా అందరూ నీలాగానే తీసిపారెయ్యాలనుకుంటున్నారా? తప్పు. అది మన సంస్కృతి కాదు అని బయటకి చెప్పి కావాలంటే నీ డ్రాయరు ఇంట్లో వుతుక్కోవయ్యా కాదన్నామా అని చెవుల్లో గుసగుసలాడుతారు. వీడెవ్వడ్రా చెడ్డీ పీకి పారేసి కొత్త చెడ్డీ వేస్కుంటానంటాడూ అని పక్కన వున్న పది మందితో కలిసి నవ్వుతారు.
చుట్టూ వున్న వెల్ విషర్స్ కి ఒక్కడూ కూడా ఛత్ ఇంకా ఎందుకయ్యా ఆడ్రాయర్ తీసి ఆవల పడెయ్యక అని చెప్పరు గనుక ఆ డ్రాయర్ వేసుకున్నవాడికి తానేమన్నా తప్పుచేస్తున్నానా అని డవుట్ వస్తుంది. అందరికీ కొట్టని కంపు తనొక్కడికే ఎందుకు కొడుతుందని సమర్ధించుకొని అది కంపు కాదని కమ్మని వాసన అని డిసైడ్ అయిపోతాడు. అలా కొన్ని సార్లు సమర్ధించుకున్నాక అదే మనస్సులో నిలబడిపోతుంది. అంతక్కాకపోతే అప్పుడప్పుడు కట్ డ్రాయరుని ఇంట్లోనే ఉతుక్కుంటూ, దానికి సెంటు రాసుకుంటూ సమాధానపడిపోతుంటాడు. ఇంకోడెవడయినా కట్ ద్రాయర్ పీకి కట్ చేస్తా అంటే ఎంత గోకుడు పెట్టినా, గజ్జి పట్టినా భరించాలి కానీ పీకి పోగులు పెడతానంటావా ఛత్ తప్పు కాదూ అని గయ్ మంటాడు.
ఈ విధంగా జనాల్లొ చాలామందికి అలా అలా జీవితాంతం డ్రాయర్ వేసుకోవడమే కానీ తియ్యాలనే ఆలోచన రాదు, వచ్చినా తియ్యడం తెలియదు. తెలిసినా అంత ధైర్యం వుండదు. మనకు తగ్గ డ్రాయర్ దొరికితే అలాగోలా అవస్తపడొచ్చు. మంచి క్వాలిటీ వున్న డ్రాయర్, సెల్ఫ్ క్లీనింగ్ వున్న డ్రాయర్ అయితే సమస్య వుండదు. ఎన్ని రోజులయినా, జీవితాంతం అయినా వేసుకొని తిరగవచ్చు. అయితే కొంతమందికి అలాంటి శ్రేష్టమయిన చెడ్డీలు దొరక్కపోయినా మనవాళ్ళు చెప్పారనో, మతం చెప్పిందనో, మనువు చెప్పాడనో అలా అలా ఎంత ఇబ్బంది పెట్టినా, కరుస్తున్నా అలాగే భరిస్తుంటారు. పాపం అలాంటి వారికి ఆ డ్రాయర్లని బయటకి తీసి ఉతికి మళ్ళీ వేసుకోవచ్చనే స్పృహ కూడా వుండదు - ఎందుకంటే అలాంటి స్పృహలని మన సంస్కృతి ఎప్పుడో మట్టుపెట్టింది కాబట్టి.
అందుకే అలాంటి స్పృహ మళ్ళీ కలిగించడానికే నా డ్రాయరును నడిబజార్లో ఉతికేసి డెమో ఇస్తుంటాను. నాలా ఇంకా పది మందీ అలా ఉతుక్కోగలిగితే "ఓ, ఇలా ఉతుక్కొని మన సమస్యలను ఇలా శుభ్రపరచుకోవచ్చు కదా, అలా అయినా మురికి వదలకపోతే ఎంచక్కా కొత్త కట్ డ్రాయర్ కొనుక్కొని వేసుకోవచ్చు కదా " అన్నది కొంతమందికయినా బోధ పడి కొన్ని జీవితాలయినా బాగుపడతాయి కదా అన్న చిన్న ఆశ నన్ను ఆ విధంగా నడిపిస్తూవుంటుంది.
గురువారం 3 మార్చి 2011
కొన్ని బ్లాగులు ఎందుకు చదవనంటే...
ఇవాళ బాగా జలుబుచేసింది. అంతా తిక్కతిక్కగా వుంది. ఆ తిక్కలో నేను ఏం వ్రాస్తున్నానో నాకు తెలియడం లేదు - భరించండి.
ఈమధ్య ఫలానా బ్లాగు తనకు బాగా నచ్చుతుందని ఓ బ్లాగ్మిత్రుడు అన్నారు. ఆ బ్లాగూ నాకూ నచ్చుతుంది కానీ ఒకటి రెండు టపాలు తప్ప ఎక్కువ చదవలేదు అన్నాను. ఎందుకు అని అడిగారు. మరీ అంతగా బావుండే బ్లాగులు చదవడం నాకు ఇష్టం వుండదు అన్నాను. నేను అన్న వాక్యాన్ని వారు మళ్ళీ రిపీట్ చేసి అలా అంటే ఇంకేం చెబుతాం అని విస్మయం చెందారు. ఇంకా ఎవరెవరి బ్లాగులు ఎప్పుడో ఒకప్పుడు తప్ప చదవనో వారికి లిస్టు వినిపించాను. ఆ లిస్టు మీక్కూడా ఇద్దామనే ఈ టపా.
ఏక్టివ్గా వున్న బ్లాగులనే ఇక్కడ ప్రస్థావిస్తున్నాను.
క్రిష్ణప్రియ
నేస్తం
బులుసు - నవ్వితేనవ్వండి
నెమలిఈక
శివరంజని
జ్వాలా
శివరంజని
జ్వాలా
భండారు శ్రీనివాసరావు
భండారు శ్రీనివాసరావు
వెన్నెల సంతకం
నా పరిధి దాటి
నాతో నేను నా గురించి
ఇంకా వుందేమో లిస్టు కానీ బాగా జలుబు చేసిందన్నాను కదా చిరాగ్గా, అసహనంగా వుండి మిగతా పేర్లు గుర్తుకురావడం లేదు. ఇవాళ బోర్ కొడుతూవుండటం వల్ల కాలక్షేపానికి అదో ఇదో మనసులోనివి వ్రాసేస్తున్నా. ఇంకా కొన్ని బ్లాగులు మంచివే అయినా కూడా అప్పుడప్పుడు చదువుతాను - అప్పుడప్పుడు చదవను. బాగా వుండే బ్లాగులు ఏం చదువుతామండీ బాబూ. ఎలాగూ బానే వుంటయ్ కదా. మనం చదవకపోయినంత మాత్రాన వారికి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా :) ఏదో మన రేంజికి తగ్గట్టుగా వున్నా బ్లాగులు చదువుకుంటుంటే అదో తుత్తి. మారీ బావున్న బ్లాగులు చదివితే విద్యాస్పర్ధ లాగా బ్లాగ్దుగ్ధ మొదలవుతుంది - అది భరించడం కష్టమే. హర్రే ఎంత బాగా వ్రాసేడూ అని మనస్సులొ మెచ్చుకోలు వస్తున్నా వార్నీ వీడిలాగా మనం వ్రాయలేకపోయామే అని కించిత్ నిస్పృహ కూడా వస్తుంటుంది. అందుకే ఎంచక్కా మన రేంజిలో మనం ఏ కెలుకుడు బ్లాగులో, కులుకుడు బ్లాగులో చూసుకుంటే ఆ ఇబ్బందులు వుండవు. హేమంటారు?
ఇహపోతే జ్వాలా, భండారుల బ్లాగులు చదవకపోవడానికి ఇంకో కారణం కూడా వుంది. ప్రతి టపా టైటిలుకి వారి పేరు కూడా ఎందుకు చేరుస్తారో అర్ధం కాక చూడగానే చిరాకు వస్తుంటుంది. ఇహ అటుకేసి వెళ్ళను కూడా వెళ్ళను. ఎందుకు వస్తుందీ చిరాకు అని అడక్కండి - మీ మీద చిరాకొచ్చేస్తోంది మరి.
నాకో విషయం గుర్తుకువస్తోంది. ఒకసారి ఓ చుట్టాల ఇంటికి వెళ్ళాం. తిరిగివచ్చాక వాళ్ళ అమ్మాయితో నీకు మంచిగా స్నేహం అయ్యిందా అని మా పాపని అడిగాను. కాలేదు అంది. ఏం, ఆమె చాలా మంచి అమ్మయి కదా అన్నాను. అందుకే, అంత మంచి అమ్మాయిని భరించడం కష్టం అంది. నేను కాసేపు విస్తుపోయాను ఆ మాటలకి కానీ తరువాత ఆలోచిస్తే ఆ మాటల్లో ఎంతో అర్ధం వుందనిపించింది.
ఇంకో వాక్యం చెబుతాను. ఒక వ్యక్తి ప్రతి ఒక్కరికీ నచ్చుతున్నాడంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక లోపం వున్నట్లేనట. పైన ప్రస్థావించిన బ్లాగులకూ ఈ వాక్యానికీ అంతగా సంబంధం లేదు. జస్ట్ గుర్తుకువచ్చి వ్రాసానంతే.
జీవితపు ఛిద్రపటం
చాలా ఏళ్ళ క్రింద ఒక వాక్యం చదివాను. బాగా గుర్తుండిపోయాయా పదాలు. నెగెటివ్గా మన జీవితం గురించి ఆలోచిస్తే ఆ వాక్యం నిజమే కదా అనిపిస్తుంది.
"మన జీవితంలోని ఓ పావు భాగం మన తల్లితండ్రుల వల్ల, ఓ పావు భాగం మన వల్ల, మరో పావు భాగం మన భార్య/భర్త వల్ల, మిగిలిన పావు భాగం మన పిల్లల వల్ల నాశనం అవుతుంది"
అలా అని చెప్పేసి జీవితం అందరికీ వంద శాతమూ ఛిద్రం అయిపోదు లెండి. ఎవరో ఒకరు లేదా చివరికి మనమీద మనమన్నా దయతలచి ఆయా వాటాల్లోంచి కొంత శాతమయినా నాశనం చెయ్యకుండా వదిలిపెడతారే అదే మనకి మిగిలిన జీవనం. అందులోంచే అన్నీ ఏరుకోవాల్సి వుంటుంది, చూసుకోవాల్సి వుంటుంది, జీవితం ధన్యమయ్యిందని సంతోషపడవలసి వుంటుంది. పాజిటివ్ థింకింగ్ అంటే అదే మరి :)
"మన జీవితంలోని ఓ పావు భాగం మన తల్లితండ్రుల వల్ల, ఓ పావు భాగం మన వల్ల, మరో పావు భాగం మన భార్య/భర్త వల్ల, మిగిలిన పావు భాగం మన పిల్లల వల్ల నాశనం అవుతుంది"
అలా అని చెప్పేసి జీవితం అందరికీ వంద శాతమూ ఛిద్రం అయిపోదు లెండి. ఎవరో ఒకరు లేదా చివరికి మనమీద మనమన్నా దయతలచి ఆయా వాటాల్లోంచి కొంత శాతమయినా నాశనం చెయ్యకుండా వదిలిపెడతారే అదే మనకి మిగిలిన జీవనం. అందులోంచే అన్నీ ఏరుకోవాల్సి వుంటుంది, చూసుకోవాల్సి వుంటుంది, జీవితం ధన్యమయ్యిందని సంతోషపడవలసి వుంటుంది. పాజిటివ్ థింకింగ్ అంటే అదే మరి :)
మంగళవారం 1 మార్చి 2011
పట్టాలు పీకి పందిరెయ్యాలి మరియు ఈరోజు కబుర్లు
(కబుర్లు ఎప్పటికప్పుడు కామెంటుగా కూడా వేస్తుంటాను)
తెలంగాణా వాదులు పల్లెలన్నీ పట్టాల మీదికి వచ్చి పడుకోవాలని ఏదో ఆరాటం/పోరాటం చేసారు కదా. అలా 12 గంటలు, 13 గంటలు చెయ్యకుండా ఆ పల్లెల్లోంచి పోయే పట్టాలన్నీ పీకేసి పందిరేసుకున్నారనుకోండి - అప్పుడు ఉద్యమం ఇంకా ఘాటుగా వుండదూ?
తెలంగాణా ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ అదీ జీతాలు తీసుకుంటూనే చేస్తున్నారు కదా. బావుంది. నా అభిప్రాయం ఏంటంటే అది ప్రైవేటు ఉద్యోగులు కూడా చెయ్యాలి. ఎలాగ అంటే మీరు బ్యాంకుకు వెళ్ళి డబ్బు డిపాజిట్ చెయ్యాలనుకోండి - రసీదు మీకు, డబ్బులు ఉద్యోగులకి. అలాగే డబ్బు బ్యాంకు నుండి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఫార్మ్ మీరు ఫిలప్ చేస్తారు - డబ్బు వాళ్ళ జేబుల్లోకి. అలాగే మీరు భోజనం చేద్దామని ఏ రెస్టారెంటుకో వెళ్ళారనుకొండి. బిల్లు, ఖాళీ ప్లేటు మీకు - డబ్బులు అక్కడ పనిచేసేవారికి. ఇలాంటి సహాయ నిరాకరణ ఎలా వుంటుందంటారు? అప్పుడు మీరు ఏం చేస్తారు?
గత పన్నెండేళ్ళుగా డెంటిస్టులు సుతిమెత్తగా నన్ను తిడుతూనేవున్నారు - డెంటల్ ఫ్లాస్ రోజూ రెండు సార్లయినా చేస్తూవుండమని. పళ్ళు తోమడమే మహా ఎక్కువ ఆ పైన ఫ్లాసింగొకటా అన్చెప్పి వారి మాటలు ఎన్నడూ సరిగ్గా వినిపించుకున్న పాపాన పోలేదు. ఈ మధ్య దంత క్షయంతో డబ్బు క్షయం అవుతోందని బెదిరిపోయి మొదలెట్టా. సింకు ముందట నిలబడి చేస్తూ వుంటే సమయం వృధా అవుతోందని, బోరింగుగా వుందని ఒక డిస్పోజబుల్ గ్లాసులో నీళ్ళు తెచ్చుకొని నోటికింద పెట్టుకొని ఫ్లాసింగ్ చేస్తూ టివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. ఆ పుణ్య కార్యక్రమం ఏదో బాతురూములో చేసుకోవచ్చు కదా అని మా ఆవిడా, అమ్మలూ సన్నగా గులుగుతున్నా, గొణుగుతున్నా ఆ ఆనందంలో వినిపించుకోవడమే లేదు నేను. ఇప్పుడు ఫ్లాసింగ్ అలవాటయ్యి అది ఏనాడయినా చెసుకోకపోతే ఎదోలా అనిపిస్తోంది నాకు. భేశ్, మంచి అభివృద్దే!
ఆ మధ్యొక సారి ఇలాగే డెంటల్ ఫ్లాసింగు మీద ఓ టపా వ్రాసి అలాగే పనిలో పనిగా నా బ్లాగులు చదువుతూ మెంటల్ ఫ్లాసింగ్ చేసుకొమ్మని సలహా ఇచ్చాను. నా సలహా జోకా సీరియస్సా అని అడిగారెవరో. ఏం చెప్పమంటారూ?
జీవన వైరుధ్యాలు
(మరో సైటు నుండి పునః ప్రచురణ)
నేను నార్త్ అమెరికాకి వచ్చి 13 ఏళ్ళు అవుతోంది. వచ్చినప్పటినుండీ మన ఇండియా జీవన శైలికీ, ఇక్కడి జీవన శైలికీ మధ్య వున్న తేడాలను ఆసక్తిగా గమనిస్తూనేవున్నాను. అందరికీ తెలిసిన విభిన్నతే కాకుండా ఇంకా ఏమయినా వైరుధ్యాలు వున్నాయా అని పరిశీలిస్తూనేవున్నాను. నేను గమనించిన వాటిల్లో ముఖ్యమయినది స్వేఛ్ఛ. ఈ పాశ్చాత్య దేశాలు స్వేఛ్ఛకి పేరు పెట్టినవి. మరి ఇంతటి స్వేఛ్ఛాసమాజల్లో కూడానూ నాకు ఏదో అసౌకర్యం అనిపిస్తూనేవుంది. అదేంటబ్బా అని తరచి చూసాను. ఇక్కడి సమాజాలు స్వేఛ్ఛా సమాజాలే కానీ భారత దేశంలో మనం అనుభవించినప్పటి స్వేఛ్ఛ కాదు. అదెలాగో చూద్దాం.
ఇండియాలో అయితే చిన్న చిన్న స్వేఛ్ఛలు బోలెడన్ని వుంటాయి. నడిరోడ్డు మీద స్వేఛ్ఛగా ఉమ్మి వేయగలం, మిత్రులతో కలిసి తాగుతూ కారులో వెళ్లగలం, పక్కింటికి వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు కబుర్లు చెప్పగలం అలా అలా. భారత దేశంలో ఎన్ని చట్టాలు వున్నా పాటిని సరిగ్గా పాటించే నాధుడు కానీ, పట్టించుకునే నాధుడు కానీ వుండక అందరికీ ఇష్టారాజ్యంగా వుంటుంది. కానీ ఈ దేశాల్లోని ప్రజలు చట్టబద్దులై ప్రవర్తిస్తారు. వారి మెతకదనాన్ని అలుసుగా తీసుకొని ఇక్కడి శాసనకర్తలు టన్నులకు టన్నులుగా చట్టాలు చేసి దేశం మీద వదులుతారు. ఇక్కడ రక్షణ, ప్రైవసీ విషయాల మీద ఆదుర్దా ఎక్కువ. ఎక్కడో జరిగిన చిన్న విషయాలకు కూడా మీడియా ఫోకస్ ఎక్కువయ్యి ఎక్కువగా ఆదుర్దాపడుతుంటారు. అందువల్ల జాగ్రత్తలు ఎక్కువయ్యి స్వేఛ్ఛ విషయంలో రాజీపడుతూ తమలోతాము కుచించుకుపోతూవున్నారు.
ఉదాహరణకు పిల్లలకు పాఠశాలల్లొ స్వేఛ్ఛగా ఆడుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ప్లేగ్రవుండులో ఆడుకోవడానికి ఓ పాతిక నియమనిబంధనలు వుంటాయి. ఒకరిని సరదాగా కూడా తొయ్యకూడదు, ఒకరిమీద మంచు గడ్డలు విసరకూడదు… అలా ఎన్నెన్నో నిబంధనలు. ఎక్కడో అరా కొరా ఎవరికో అలా చేసినందువల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగివుంటాయి. అంతే, ఇహ ఆ విషయాల్లో ఓ నియమం ఏర్పాటు చేసి పడేస్తారు. పిల్లలు అన్న తరువాత సరదాగా తోసుకోవడం, తన్నుకోవడం వుంటాయనుకుంటాము. కానీ ఇక్కడ చేతులు వెనక్కు కట్టేసుకొని ఆడుకోవాలా అని ఆ నియమాలు అన్నీ చదివితే అనిపిస్తుంది. ఇలా ప్రతీ విషయానికీ ఎన్నో నియమ నిబంధనలు వుంటాయి. వాటినన్నింటినీ చదువుతుంటే ఏదో ఊపిరి సలపని భావన, అసౌకర్యం మనలో కలుగుతుంది. ఏదో కోల్పోతున్నామన్న బావన. ఎవరో మనని తాళ్ళతో బంధిస్తున్న భావన. అలా మనం కోల్పోతున్నది మన స్వేఛ్చ అని అర్ధం అవుతుంది.
అలా అని ఇక్కడ స్వేఛ్ఛ లేదా? వుంది, బోలెడంత వుంది. కానీ అదంతా చట్టబద్దమయిన స్వేఛ్ఛ. ఎన్నో చట్టాలనే బంధనాల మధ్య మన స్వేఛ్ఛని మనం వెతుక్కోవాలి. ఇక్కడివాళ్ళు చిన్నప్పటినుండీ ఆ చట్టాల్లొనే పెరిగారు కాబట్టి వీరికి భారత దేశంలో వున్న స్వేఛ్ఛ వీరికి తెలియదు. ఆ ఫ్రీడం వీళ్లకి అర్ధం కాదు. అందుకే ఈ దేశాలు మరిన్ని చట్టాలు రుద్దినా, మరిన్ని బంధనాలు వేసినా పెద్దగా వ్యతిరేకించకుండా అలవాటుపడిపోతారు. రక్షణ కోసం అంటే చాలు అన్నింటికీ తల ఊపుతారు, తల ఒగ్గుతారు.
అయితే ఈ దేశాల్లో గొప్పదనం లేదా? వుంది. జీవన ప్రమాణాలు చాలా బావుంటాయి. ఆ ప్రమాణాల కొసం తమ యొక్క చిన్న చిన్న వెసులుబాట్లు ఎన్నో వెనకబడుతున్నాయి అన్నది వీరికి అంతగా బోధపడదు. మనలాంటి వారం రెండు జీవనశైలులను చూసిన వారికే, తెలిసినవారికే ఆ తేడా అర్ధం అవుతుంది. భారతీయులు అంతగా జీవన ప్రమాణాలని కోల్పోతూవున్నారని ఈ దేశాల్లో కొంతకాలం నివసిస్తే తప్ప మనకు అర్ధం కాదు. అలాగే ఇక్కడి వారు కొంతకాలం భారత్ లో వుంటే తప్ప ఇక్కడివారు ఏం కోల్పోతున్నారో వారు అర్ధం చేసుకోలేరు.
అలా అని తెలుసుకున్నంత మాత్రాన అలా కావాలంటారని కాదు. ఇకడి నుండి భారత్ కు సందర్శనానికి వెళ్ళిన దేశీ పిల్లలు అక్కడ వున్నంత సేపు ఎంతో చక్కగా, స్వేఛ్ఛగా పలు మందితో ఆటపాటలతో గడిపినా కూడా మళ్ళీ వెనక్కు వచ్చాక పెద్దగా ఆ విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం నేను గమనించాను. అలాగే పెద్దలకు కూడా తమకు అలవాటులేని ఆ చిన్న చిన్న స్వాతంత్యాలు వారిలో అభద్రతా భావాన్నీ కలిగించి అవన్నీ ఇబ్బందిగా అనిపించవచ్చు. తమకు అలవాటులేని జీవన శైలి పట్ల బెరుకుతో వైముఖ్యాన్ని కూడా పెంచుకోవచ్చు.
ఈ విషయాలన్నింటినీ ఒక విషయంతో పోలిక చేస్తుంటాను. ఇక్కడి వారు ఎవరయినా ఇండియాకూ ఇక్కడికి తేడా చెప్పమంటే ఈ పోలికతో వివరిస్తుంటాను. ఈ దేశాల్లో చిన్న చిన్న వెసులుబాట్లు తక్కువ, జీవన ప్రమాణాలు ఎక్కువ. అందుకే ఈ దేశాల్లోని జీవనాన్ని బంగారు పంజరంలోని చిలకలాగా భావిస్తుంటాను. అలాగే ఇండియాలో వ్యక్తికి స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలు ఎక్కువ, చట్టపు కట్టుబాట్లు, నియమ నిబంధనలు తక్కువ కాబట్టి స్వేఛ్ఛగా ఎగిరే పక్షిలాగా ఉపమానం ఇస్తాను. అయితే అక్కడి జీవన ప్రమాణాలు తక్కువ కాబట్టి పంజరంలోని పక్షి అంత భద్రంగా స్వేఛ్ఛగా ఎగిరే పక్షి జీవించలేదు. అసౌకర్యంగా వున్నా కూడా పంజరంలోని పక్షే ఎక్కువకాలం జీవిస్తుంది. మరి మీరు ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు? ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు? మన చుట్టూ ఓ పంజరం అల్లుకొని వుందన్న వాస్తవం మనకు బోధపడితేగానీ మన ఆలోచనల్లో కదలిక రాదు. ఇండియాలో నివసించాలా లేక విదేశాల్లో నివసించాలా అన్న సందేహం వచ్చినప్పుడు మనం ఈ కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం ఉపయోగకరంగా వుంటుంది అంతే కానీ ఈ ఒక్క కారణాన్నో లేక ఏ ఒక్క కారణాన్నో పరిగణలోకి తీసుకొని అలాంటి విషయాలని తేలిగ్గా తేల్చేయలేము కదా.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)






















