జీవితపు ఛిద్రపటం

చాలా ఏళ్ళ క్రింద ఒక వాక్యం చదివాను. బాగా గుర్తుండిపోయాయా పదాలు. నెగెటివ్గా మన జీవితం గురించి ఆలోచిస్తే ఆ వాక్యం నిజమే కదా అనిపిస్తుంది.

"మన జీవితంలోని ఓ పావు భాగం మన తల్లితండ్రుల వల్ల, ఓ పావు భాగం మన వల్ల, మరో పావు భాగం మన భార్య/భర్త వల్ల, మిగిలిన పావు భాగం మన పిల్లల వల్ల నాశనం అవుతుంది"

అలా అని చెప్పేసి జీవితం అందరికీ వంద శాతమూ ఛిద్రం అయిపోదు లెండి. ఎవరో ఒకరు లేదా చివరికి మనమీద మనమన్నా దయతలచి ఆయా వాటాల్లోంచి కొంత శాతమయినా నాశనం చెయ్యకుండా వదిలిపెడతారే అదే మనకి మిగిలిన జీవనం.  అందులోంచే అన్నీ ఏరుకోవాల్సి వుంటుంది, చూసుకోవాల్సి వుంటుంది, జీవితం ధన్యమయ్యిందని సంతోషపడవలసి వుంటుంది.   పాజిటివ్ థింకింగ్ అంటే అదే మరి :)

14 comments:

  1. "మన జీవితంలోని ఓ పావు భాగం మన తల్లితండ్రుల వల్ల, ఓ పావు భాగం మన వల్ల, మరో పావు భాగం మన భార్య/భర్త వల్ల, మిగిలిన పావు భాగం మన పిల్లల వల్ల ఆనందంగా అవుతుంది"

    అలా అని చెప్పేసి జీవితం అందరికీ వంద శాతమూ ఆనందంగా ఉండదు లెండి. ఎవరో ఒకరు లేదా చివరికి మనమీద మనమన్నా దయతలచి ఆయా వాటాల్లోంచి కొంత శాతమయినా కొద్దిగా కష్టాలు తెచ్చుకుంటే అదే మనకి మిగిలిన జీవితం అసలు మజా తెలిసేలా చేస్తుంది.

    ReplyDelete
  2. @ వీకెండ్
    మీరు చెప్పిందీ నిజమేలెండి. కష్టాలూ, కన్నీళ్ళూ వున్నప్పుడే కదా సుఖాలూ, సంతోషాల విలువ తెలిసేదీ. జీవిత పయనంలో కనీస కష్టాలు ఎదుర్కోకపోతే సగటు సుఖాలే కష్టం అయిపోతాయి!

    ReplyDelete
  3. అంటే చిద్రంకాని కాని జీవితాలెలావుంటాయి? మీరు చెప్పినవాటికి వేటికీ అందనప్పుడా? అంటే మనక్కూడా మనజీవితం అందకపోతే అది ఆనందంగా వున్నట్లా? అప్పుడసలు ఆ దిక్కుమాలిన జీవితంతో పనేమిటి?

    ReplyDelete
  4. nijame..., 1.meeru parents cheppina pillanu chesukovadam..., 2. meeru OK cheyadam...ishtamunnaa lekunnaa..., 3. mee wife valla..., 4. pillalu goorchi divorce ku venakaadadam...

    ReplyDelete
  5. @ మిర్చి బజ్జీ
    ఆ ఉద్దేశ్యంతో కాదు చెప్పింది. నిజానికి మా పెళ్ళి విషయంలో ఎవరూ నన్ను ఒత్తిడి పెట్టలేదు. అంతా నా ఇష్టప్రకారమే జరిగింది.

    మన తల్లితండ్రుల మూర్ఖత్వంతో మన జీవితం పట్ల కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. అలాగే మనమూ తెలిసీ తెలియక కెరీర్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఇహ తానా అంటే తందానా అనే పెళ్ళాం వస్తే మంచిదే. అలా వచ్చినా ఆమె సలహాలు విని కొన్ని పొరపాట్లు చేస్తాం. లేకపోతే ఎడ్డెం అంటే తెడ్డెం అనే భార్య దొరికితే ఆ ఇబ్బందులు చెప్పనలవి కావు. ఇక పిల్లలూ యథాశక్తి వాళ్ల వంతు కర్తవ్యం వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. ఉదాహరణకు ఏడాదికో జాబు మారుతూ పలు నగరాల్లో వుండాలని వుంటుంది నాకు. తన హైస్కూల్ అయిపోయేంతవరకు ఎక్కడికీ కదిలేది లేదని, ఇప్పటివరకి తిరిగిన ప్రదేశాలు చాలునని మా అమ్మాయి అంటుంది. అలా అలా అన్నమాట.

    ReplyDelete
  6. blaagullo sagam kelukudu blaagarla valla , paavu vantu vaallaki support icche kakaa raayulla valla inko paavu vantu emi cheyakundaa vadilese manushula vallaa chedipotay.

    Sivaji

    ReplyDelete
  7. @ కెవిఎస్వి, కుమార్
    :)

    ఇంకో ఉదాహరణ ఇస్తాను. మా నాన్న గారు రైటైర్మెంటు అయిన తరువాత ఎంచక్కా మా ఊరికి వెళ్ళి ఒక ఫార్మ్ హవుజ్ కట్టించుకొని తోటల్లో విహరించుకుంటూ సేద తీరుదాం అనుకున్నారు మా అమ్మానానలు. మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది "వీళ్ళిప్పుడు వెళ్ళి తోటకట్టించుకొని ఊరిని ఉద్ధరిస్తారంట. సూర్యాపేటలోనే వుంటే పొద్దుపోదా ఏం?" అని ఆ ప్రయత్నాన్ని నిరసించారు. అందువల్లయితేనేం, ఎందువల్లయితేనేం మా నాన్నగారి అభిలాష తీరనేలేదు. చెట్లూ పక్షులూ చూస్తూ తన్మయత్వం చెందాలనుకున్నవారు టివి సీరియళ్ళు చూస్తూ కాలం గడిపేసారు. అలా నా తోడ బుట్టిన వారు కొందరు తమ ధర్మాన్ని నిర్వర్తించారు.

    ReplyDelete
  8. @ శివాజీ
    బ్లాగు ఛిద్రపటాన్ని మొన్నే మీ బ్లాగులో అవిష్కరించేరుగా :)

    ReplyDelete
  9. బ్లాగు ఛిద్ర పట౦ పై మీ అభిప్రాయ౦ వ్రాయనే లేదు :)

    ReplyDelete
  10. నేను ఏంబీవర్టుని. కొన్నిసార్లు అలా ప్రపంచాన్ని, బ్లాగులనీ పరకాయిస్తుంటాను కానీ హడావిడి చెయ్యను :)

    ReplyDelete
  11. Is the movie you referred: Journey of hope? Umuda yolculuk (Turkish)?

    ReplyDelete
  12. @ అజ్ఞాత
    అవును. అదే సినిమా. ధన్యవాదాలు. కామెంటులో పూర్తి కథ చెప్పేసాను. అందుకె అది తొలగించి ఎడిట్ చేసి వేస్తాను.
    http://www.imdb.com/title/tt0100470/

    ReplyDelete
  13. @ మినర్వా
    కొన్నిసార్లు మన కవులు చెప్పినట్లుగా ఇలా పాడుకోవాల్సి వుంటుంది "బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్".

    ఇహపోతే ఆ బ్రతుకెందుకు దండగ అన్నారు కదా. కొన్నేళ్ళ క్రితం కెనడాలో మా టర్కిష్ కోలీగ్ ఒక చక్కటి టర్కిష్ సినిమా చూడమని ఇచ్చాడు. ఆ సినిమా చాలా బావుంది కానీ అందులోని వేదనని భరించలేక మధ్యలో కొంత సినిమా ముందుకు దూకించాను. ఆ సినిమా పేరు గుర్తుకులేదు. అందులో శరణార్దులు చిక్కటి చలి కాలంలో తమ దేశం నుండి మరొక దేశానికి దొంగతనంగా, చట్టవిరుద్ధంగా, అధికారులకి దొరకకుండా వెళుతుంటారు. ఆ క్రమంలో... పోలీసు అధికారి ఇంటరాగేట్ చేస్తూ ఇన్ని కష్టాలు పడి ఎందుకయ్యా రావడం అని వాళ్ళని అడుగుతాడు. "ఆశ - బ్రతుకు మీది ఆశ మమ్మల్ని నడిపించింది" అని ఆ కథా నాయకుడు అనడంతో సినిమా ముగుస్తుంది.

    ఎవరికయినా ఈ సినిమా తెలిస్తే, పేరు గుర్తుకు వస్తే చెప్పండి. చాలా చక్కటి చిత్రం.

    ReplyDelete