పట్టాలు పీకి పందిరెయ్యాలి మరియు ఈరోజు కబుర్లు


(కబుర్లు ఎప్పటికప్పుడు కామెంటుగా కూడా వేస్తుంటాను)

తెలంగాణా వాదులు పల్లెలన్నీ పట్టాల మీదికి వచ్చి పడుకోవాలని ఏదో ఆరాటం/పోరాటం చేసారు కదా. అలా 12 గంటలు, 13 గంటలు చెయ్యకుండా ఆ పల్లెల్లోంచి పోయే పట్టాలన్నీ పీకేసి పందిరేసుకున్నారనుకోండి - అప్పుడు ఉద్యమం ఇంకా ఘాటుగా వుండదూ?

తెలంగాణా ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ అదీ జీతాలు తీసుకుంటూనే చేస్తున్నారు కదా. బావుంది. నా అభిప్రాయం ఏంటంటే అది ప్రైవేటు ఉద్యోగులు కూడా చెయ్యాలి. ఎలాగ అంటే మీరు బ్యాంకుకు వెళ్ళి డబ్బు డిపాజిట్ చెయ్యాలనుకోండి - రసీదు మీకు, డబ్బులు ఉద్యోగులకి. అలాగే డబ్బు బ్యాంకు నుండి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఫార్మ్ మీరు ఫిలప్ చేస్తారు - డబ్బు వాళ్ళ జేబుల్లోకి. అలాగే మీరు భోజనం చేద్దామని ఏ రెస్టారెంటుకో వెళ్ళారనుకొండి. బిల్లు, ఖాళీ ప్లేటు మీకు - డబ్బులు అక్కడ పనిచేసేవారికి. ఇలాంటి సహాయ నిరాకరణ ఎలా వుంటుందంటారు?  అప్పుడు మీరు ఏం చేస్తారు?

గత పన్నెండేళ్ళుగా డెంటిస్టులు సుతిమెత్తగా నన్ను తిడుతూనేవున్నారు - డెంటల్ ఫ్లాస్ రోజూ రెండు సార్లయినా చేస్తూవుండమని. పళ్ళు తోమడమే మహా ఎక్కువ ఆ పైన ఫ్లాసింగొకటా అన్చెప్పి వారి మాటలు ఎన్నడూ సరిగ్గా వినిపించుకున్న పాపాన పోలేదు. ఈ మధ్య దంత క్షయంతో డబ్బు క్షయం అవుతోందని బెదిరిపోయి మొదలెట్టా. సింకు ముందట నిలబడి చేస్తూ వుంటే సమయం వృధా అవుతోందని, బోరింగుగా వుందని ఒక డిస్పోజబుల్ గ్లాసులో నీళ్ళు తెచ్చుకొని నోటికింద పెట్టుకొని ఫ్లాసింగ్ చేస్తూ టివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. ఆ పుణ్య కార్యక్రమం ఏదో బాతురూములో చేసుకోవచ్చు కదా అని మా ఆవిడా, అమ్మలూ సన్నగా గులుగుతున్నా, గొణుగుతున్నా ఆ ఆనందంలో వినిపించుకోవడమే లేదు నేను. ఇప్పుడు ఫ్లాసింగ్ అలవాటయ్యి అది ఏనాడయినా చెసుకోకపోతే ఎదోలా అనిపిస్తోంది నాకు. భేశ్, మంచి అభివృద్దే! 

ఆ మధ్యొక సారి ఇలాగే డెంటల్ ఫ్లాసింగు మీద ఓ టపా వ్రాసి అలాగే పనిలో పనిగా నా బ్లాగులు చదువుతూ మెంటల్ ఫ్లాసింగ్ చేసుకొమ్మని సలహా ఇచ్చాను. నా సలహా జోకా సీరియస్సా అని అడిగారెవరో. ఏం చెప్పమంటారూ?

12 comments:

  1. సహాయ నిరాకరణ కి దోపిడీకి తేడా ఉండొద్దా గురువు గారూ, ..
    గవర్నమెంటు కి కష్టం అయ్యేలా చేస్తే అది ప్రజలకి పరోక్ష నష్టమే కానీ.. కళ్ళు తెరిపించటానికి అదే మార్గం .. ఇంకేం చేయగలరు .. మీకెలాగూ విజయావాడ గర్ల్ ఫ్రెండ్స్ పై ప్రేమ తగ్గదు.. సమైక్యాంధ్ర మోజు తీరదు...

    ReplyDelete
  2. @ కాయ
    ఒకవైపు జీతాలు తీసుకుంటూ మరొకవైపు సహాయ నిరాకరణ అంటే దోపిడీ చేస్తున్నట్లే. తెలంగాణా వాదులే అని కాదు, అది ఎవరు చేసినా దోపిడే. నిజంగా, నిజాయితీగా చేసే సహాయ నిరాకరణలో జీతాలు అందుకోవడం వుండకూడదు.

    ReplyDelete
  3. నోటీస్ ముందే ఇచ్చారు కదా గురువు గారు.. కావాలంటే.... ఉద్యోగాల నుండి తీసెయ్యండి .. ఉద్యోగాల్లో ఉంచి జీతం ఇయ్యం అంటే ఎలా ? ఇదేమన్న ప్రైవేట్ లిమిటెద్ కంపనీ నా.. ఇంతకు ముందు ఎన్నో సార్లు..ఆందోళనలకి జీతాలు ఇచ్చారు.. కార్మిక సంఘం తరపున నోటీస్ వస్తే వీలైతే పరిష్కరించాలి, లేదా చట్టం ప్రయోగించాలి.. అంతే తప్ప మీరలాగే ఉండండి మాకేం ఫర్వా లేదు అంటూ మొండితనం చూపిస్తే ఎలా. ?... మీరు మీ ..

    ReplyDelete
  4. కోయీ హస్ రహా హై
    కోయీ రో రహా హై !
    కడుపు నిండిన జీ బలిసిన బేరం ఒకడిది
    కడుపు మండిన అన్యాయానికి బలైన బేరం మరోకడిది
    చల్నేదో బాల్ కిషన్ !

    ReplyDelete
  5. @ కాయ
    అంతేలెండి. ప్రభుత్వమే గట్టిదయితే ఆ తీరే వేరుగా వుండేది. నేను విదేశాలకి అనగా కెనడాకి వచ్చిన తొలిరోజుల్లోనే అక్కడి ఒంటారియో రాష్ట్ర పోస్టల్ ఉద్యోగుల సమ్మె జరిగింది. ఓ పది పదిహేను రోజులు చూసింది ఆ ప్రభుత్వం. తరువాత ఎంచక్కా బ్యాక్ టు వర్క్ శాసనం చేసిపారేసింది. ఆ శాసనం ఏంటంటే ఆ తరువాత యూనియన్ లీడర్ స్ట్రైక్ చేస్తే రోజుకి $10,000 ఫైన్. ఛోటా లీడర్లు చేస్తే రోజుకి $5000 ఫైన్. సాధారణ ఉద్యోగులు చేస్తే రోజుకి $1000.

    ఇంకెక్కడి సమ్మె?

    ReplyDelete
  6. @ అజ్ఞాత
    బాల్ కిషన్ కౌన్ హై?

    ReplyDelete
  7. బాలకిషన్ ఎవరో తెలియదా ?
    అయితే నువ్వు సగం మాత్రమె తెలంగానోడివి అన్న మాట !
    బాలకిషన్ ఎవరో తెలిదేవర భానుమూర్తిని అడుగు.
    ....
    తెలిదేవర భాను మూర్తి ఎవరు అంటావా
    వదిలేయ్ !

    ReplyDelete
  8. అతడేమన్నా మహాత్మా గాంధీనా, భగత్ సింగా? అంత తెల్సుకోవాల్సిన వ్యక్తా? నర్సింగ్, యాద్‌గిరి, మల్లేష్ తెలుసా? తెలియకుంటే తెలుసుకునిరా.

    ReplyDelete
  9. అతను తెలుసా, ఇతను తెలుసా అని అడుగుతుంటే నాకు ఓ సుబ్బారావు జోకు గుర్తుకువస్తోంది. బజార్లో ఓ సుబ్బారావుని ఓ వెంకట్రావు పట్టుకొని నీకు ఆ ప్రముఖుడు తెలుసా, ఈ ప్రముఖుడు తెలుసా అని కొంతమంది పేర్లు చెప్పి అడిగాడుట. వాళ్లెవరూ నాకు తెలియదు కానీ నీకు సుబ్బారావు తెలుసా అని సుబ్బారావు వెంకట్రావుని అడిగేడుట. సుబ్బారావు ఎవరో తెలియదన్నాడు వెంకట్రావు. "ఇప్పుడే మీ ఇంట్లోంచి బయటకి వచ్చాడు సుబ్బారావు. ఆ సుబ్బారావుని నేనే" అనేసి వెళ్ళిపోయాడు సుబ్బారావు.

    వెంకట్రావు ఇంటికి సుబ్బారావు ఎందుకు వెళ్ళాడో ఇహ మీరు ఊహించుకోవచ్చు :))

    ReplyDelete
  10. Normally Govt. will not give salaries when employees are on strike. More so when they do it on political issues..

    I think Telangana employees are doing the pen down knowing that they won't get salaries..

    ReplyDelete
  11. తెలంగాణా ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ అదీ జీతాలు తీసుకుంటూనే చేస్తున్నారు కదా. బావుంది
    -------
    జీతాలు ఇస్తున్నారని మీకెవ్వరు చెప్పారు. స్వయాన ముఖ్యమంత్రికె దిక్కులేదు. తెలుసుకొని రాయి బాసు

    ReplyDelete
  12. వెంకట్రావు ఇంటికి సుబ్బారావు ఎందుకు వెళ్ళాడో ఇహ మీరు ఊహించుకోవచ్చు :))

    ------
    ఎకసెక్కాలు ఆపు. నీకు సబ్జెక్టు పైన అవగాహాన లెదు ఎదో రాయలన్న ఇంగితం తప్ప అని చెప్పటానికి ఈ కామెంటు చాలు.

    ReplyDelete