పతోడు

నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా క్లాసుమేటు ఒకతన్ని అందరూ పతోడు అనేవారు. అతను ఏదయినా చెప్పేటప్పుడు ప్రతీవాడూ అని చెప్పకుండా పతోడు అని చెప్పేవాడు. అందుకే అతనికి పతోడు అని పేరు పెట్టేసారు.

ఇహ పోతే బ్లాగుల్లో

- పతోడూ నీతిమంతుడే

- పతోడూ ఎదుటివాడికి నీతులు చెప్పేవోడే

- పతోడూ పరెఫెక్టే

- పతోడి కుటుంబ సభ్యులు కూడా పర్ఫెక్టే

- పతోడి మతం, కులం, మతం, వర్గం కూడా పరెఫెక్టే

- పతోడూ ఏనుగే

- విమర్శించే పతోడూ వూరకుక్కే


ఇంకా చాలా పతోళ్ళు వున్నారు కానీ ఎందుకు లెండి అసలే చాలామందిమి (విగ్రహ) బాధల్లో వున్నాం కదా.

11 comments:

  1. పతోడూ కామెంట్ రాసేవాడే

    ReplyDelete
  2. మిగిలిన సంకలినుల లో మీ పోస్ట్ రాకముందే మూడు కామెంట్స్ పెట్టా
    యమా ఫాస్ట్ ఇక్కడ

    ReplyDelete
  3. శరత్ అన్నా నా కామెంట్స్ ని పబ్లిష్ చెయ్యి
    ఇంకా మనోల్ల సంకలినులు update అవ్వలేదు

    ReplyDelete
  4. హిహిహి
    నేను మూడు కామెంట్స్ రాసేసాను,
    నువ్వు ఆమోదించావు ,
    కానీ మనోల్ల సంకనిలు నీ పోస్ట్ ని సూపెత్తట్లేదు అన్నా
    ఆడ పోస్ట్ రాస్తే ఈడ సంకలినిలో కనపడాల

    ReplyDelete
  5. వాడుక భాష ని అట్ల గేలి చేయొచ్చా గురువు గారు.. తెలంగాణ ల అందరు ఇట్లనే అంటరు కద.. కాకపోతే మేము ప్రతోడు అంటం..లేకపోతే ప్రతి ఒక్కడు అంటం ప్రతీ వాడు అని అతి తక్కువ గా అంటం....... మీకంటే తెలుగు పుస్తక భాష అలవాటయ్యిందో ఏమో.. లేకపోతే ఏ విజయవాడ ల ఉన్నప్పుడు అలవాటైందో...

    ప్రతోడు క్లాస్ మనిషి లా ఆక్టింగ్ చేసేటొడే ...

    ReplyDelete
  6. @ అప్పి భాయ్
    ఏంటి బాబూ నన్ను బాతురూముకు కూడా వెళ్ళనివ్వవా :)

    (మీ) సంకలినిలో ఏదో పరిపూర్ణత లోపించి చూస్తుంటే పూర్తి తృప్తిగా వుండటం లేదు. లోటు ఏంటో అర్ధం కావడం లేదు. ఇంకా అలవాటు పడాలేమో మరి. ప్రస్థుతానికయితే అప్పుడప్పుడూనూ, బ్యాకప్ గానూ ఉపయోగిస్తున్నాను. హారం తప్ప మరేదీ అంతగా చూడను కాబట్టి దేంట్లో నా పోస్టులు ఎప్పుడొస్తున్నాయో తెలియదు. మీరు చెప్పినట్లుగానే హారంలో అప్పుడప్పుడూ ఆలస్యం అవుతూవుంటుంది. సంకలినిలో వేగంగా వస్తున్నాయన్నమాట. భేష్.

    మీ సంకలినికి చక్కటి అమ్మాయి పేరో లేదా ఐశ్వర్య లాంటి చక్కటి హీరొయిన్ పేరు పెట్టినా బావుండేది :)

    ReplyDelete
  7. @ కాయ
    నేనెక్కడ గేలి చేస్తున్నాను బాబూ? ప్రచారం ఇస్తుంటేనూ!

    ReplyDelete
  8. @ అప్పి
    ఇప్పుడే నేను వ్రాసిన పోస్టు 'విగ్రహాలకి కూడా రిజర్వేషన్లు వర్తింపచెయ్యాలి!' కూడా హారం కంటే మీ దాంట్లోనే ముందుగా వచ్చేసింది. హారంలో ఒక పోస్టు రాసిన రెండు గంటల తరువాతనే రెండవ పోస్టు వస్తుంది అని గుర్తుకువుంది.

    ReplyDelete
  9. పోస్ట్ రాసిన నిమషం లోపలే నా సంకలిని లో కనపడుతుంది,

    "ఇది ఓపెన్ చాలెంజ్ , వేగవంతమైన సంకలిని అని ఎవరన్న కాప్షన్ పెట్టుకుంటే మార్చుకోవడం మంచిది"

    మీరన్నది కరక్టే , నా సైట్ లో ఏదో లోపం కనపడుతోంది
    రేపు ఆలోచించి మార్పులు చేస్తా

    ReplyDelete
  10. పతొడికీ అండర్‌ వేరే,
    పతోడూ దాని బజార్లో ఉతుక్కోవాలని ఉబలాటపడేఓడే

    ReplyDelete
  11. పతోడూ... పెద్ద పత్తిత్తే....

    ReplyDelete