ప్రతీదాంట్లోనూ అప్పుడప్పుడూ, ఎప్పుడోఒకప్పుడూనూ వైరాగ్యం రావడం సహజమేననుకుంటాను. అలాగే బ్లాగర్లకీ, బ్లాగు కామెంటర్లకీ, రీడర్లకీ అలాగే (తాత్కాలిక) వైరాగ్యం అప్పుడో, ఇప్పుడో వస్తుందనుకుంటాను. అది మోతాదు ఎక్కువయ్యితే వాళ్ళు బ్లాగులనుండి దూరంగా పారిపోతుంటారు. నాక్కూడా అప్పుడప్పుడు వైరాగ్యం వస్తుంది కానీ మళ్ళీ ఓ బోల్టేసుకొని పదండి ముందుకు, తోసుకు, పూసుకు అని వచ్చేస్తుంటా.
నాకు కూడా పలు కారణాల వల్ల (తాత్కాలిక) శ్మశాన వైరాగ్యం బ్లాగుల్లో కలిగింది. అలాంటప్పుడు కొంతకాలం విరామం ఇచ్చి మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో బ్లాగుల్లోకి దుమికేస్తుంటాను కానీ ఈసారి అలా కాకుండా మరోలా చెయ్యదలిచాను. ముక్కు దురదపెడితే మందేసుకోవాలి కానీ కోసుకొవడమేంటీ అనిపించింది. అందుకే కొద్దిరోజుల పాటు తెలుగు అగ్రిగేటర్లూ, బ్లాగులూ చూడకుండా నా బ్లాగు మాత్రమే వ్రాద్దామనుకుంటున్నాను. మహా అయితే నా 100 ఉత్తమ బ్లాగుల బ్లాగు చూసుకుంటానేమో. ఎప్పుడన్నా ఎక్సెప్షన్స్ వుంటాయండోయ్. లేకపోతే ఏ బ్లాగులోనన్నా నేను కనపడితే ఇక్కడున్నారేంటీ అని మీరు నిలదీయగల్రు. చూద్దాం ఇలా ఎన్ని రోజులో.
ఎందుకూ ఈ విరక్తి అంటారా? ఆ ఏముందీ బ్లాగుల్లో ఎక్కువ భాగం ఎదవ గోలా, ఎదవ రాతలూ తప్పించీ. వైరాగ్యంలో అలాంటి మాటలే వచ్చేస్తాయి మరి :) ఎలాగూ మంచి బ్లాగులయితే నా సంకలినిలో వుంటాయి కదా. అవి చాలు నాకు ప్రస్థుతానికి. ఇంకేమన్నా మంచి బ్లాగులుంటే చెప్పండి - అందులో జత చేసుకొని చూసేసుకుంటా.
చాలా కష్టం మాష్టారు .. ఈ బ్లాగింగ్(చదవడం & వ్రాయడం) వ్యసనం పేకాట , మందు .. వ్యసనలకు కంటే ఏమీ తక్కువ కాదు ..
ReplyDeleteఇప్పుడే అర్ధం అయ్యింది.మీరు ఏ "ఎదవ గోల,ఎదవ రా తలు" చదివి ఇంత వైరాగ్యం చెందారో. రామచంద్ర ప్రభో !! మమ్మల్ని కరుణించి మాకు కొన్ని మంచి blogs ప్రసాదించు తండ్రి!
ReplyDeleteఏ ఎదవగోల గురించి మీ ఈ గోల? :D
ReplyDeleteజనాబ్... ఏదోవొక వ్యసనం లేకుంటే జీవితం మరింత ఖాళీగా వుంటుంది. ఆలోచించండి.
గురూ గారూ...నాకు బ్లాగ్ లేదు..మీరు ఈ విషయాన్ని మీ బ్లాగ్లో చెప్పి మన శాస్త్రవేత్తలను నిద్రలేపండి...
ReplyDeleteవిషయానికొస్తే ...ముందుగా ఈ ఈనాడు వార్తను చూడండి ...
http://eenadu.net/story.asp?qry1=12&reccount=28
ఇప్పుడు ఈ వివరణ చూడండి ....ఈ రెండు వెబ్సైట్ల ఐ పి అడ్రెస్స్లు చూడండి...
నేనిక్కడ వాటిని జతపరచలేను..అందుకే మీరే చూడండి..
మీ కంప్యుటర్ లో కమాండ్ ప్రాంప్ట్ కి వెళ్ళండి... అక్కడ మీరు ఈ కింది విధంగా టైప్ చేయండి..
ping ihatebalayya.com
ping ihatechiru.com
పైన పోలిసు వారు చెప్పిన విధంగా, ఆ రెండు వెబ్సైట్లు ఒకే వ్యక్తి కి సంబంధించినవి..కానీ ఐ పీ లూ మాత్రం..వేర్వేరు విధాలుగా ఉంటాయి... ఇది ఎలా సాధ్యం?
దీంట్లో గొప్ప విషయం ఉందో లేదో నాకు తెలియదు ..నాకు వచ్చిన చిన్న సందేహాన్ని మన బ్లాగ్ మేధావులు ఏదైనా తీర్చగలరేమోనని...
ajnata:
ReplyDeletethey can host 2 sites any where in the world.. they can host chimanjeevi's in india & balboy's in Aussies. its not a home address.. if u want to know the owner ? i tink u've to pay..
కాయ గారూ,
ReplyDeleteనేను డబ్బులు కట్టైనా మన పోలీసులు చెప్పేది నిజమా కాదా అన్నది నిర్ధారణ చేసుకోవాలి అనుకుంటున్నాను. వాటి వివరాలు చెపుతారా. అంటే, ఎవరు డబ్బులు తీసుకుని ఆ ఐ పి ఓనర్ వివరాలు చెప్పగలరో, వారి వివరాలు నాకు మీరివ్వగలరా?
ఏమిటి గురువు గారు.... ఈ మద్య బొత్తిగా నల్ల పూస అయిపోయారు... జ్యొతిష్య రత్న చెప్పినట్లు .. మీరు కూడా సూపర్ మూన్ బాధితులా ఏంది ?... ఆ ఎఫెక్ట్ తో మీకు చిక్కులు ఏమైనా ఏర్పడ్డాయా ?
ReplyDelete@ కాయ
ReplyDeleteనెల క్రితమే చెప్పినట్లుగా న్యూయార్కులో వెకేషనులో వున్నాం. ఇవాళ న్యూజెర్సీ వెళుతున్నాం. శనివారం కానీ, ఆదివారం కానీ షికాగోకి తిరిగివస్తాం.
ohhooo... aite Have a safe & joyful trip guru gaaru
ReplyDeleteintakii Canada( Toronto) vastunnara?
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteకెనడాకి ఈ ట్రిప్పులో అయితే రావట్లేదండీ.
@ కాయ
ReplyDeleteథేంక్స్.
స్వామీ ... వెకేషనా? హనీమూనా? "అమ్ములు"కి తమ్ముడి కోసం కృషి చేస్తున్నారా? ఎన్ని రోజులు మీ టపా కోసం ఎదురు చూడాలి? తొందరగా ఏదో ఒకటి కెలకండి స్వామీ..జనాలు వైటింగ్ ఇక్కడ.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteవున్నానా లేనా అని పింగ్ చేసి చూస్తున్నారా :) వెకేషను నుండి వచ్చేసి తీరికలేని పనిలో పడిపోయాను. అందుకే నా వైపు నుండి నిశ్శబ్దం.
puzzle:
ReplyDeleteఒక ఫేక్ కి ఇంకో ఫేక్ ఫోన్ చేసి మాటాడ్డ౦ కుదురుద్డా?
please answer !
దాందేముంది - ఫేక్ ఫోన్లతో శుబ్బరంగా మాట్లాడెయ్యొచ్చు.
ReplyDeletesarath gaaru..
ReplyDeletemiru kevvvu...answer