నేనో నాస్తికుడిని, హేతువాదిని కానీ లా ఆఫ్ ఎట్రాక్షన్ నమ్మేస్తుంటా. ఏంటో! నేను అనుకున్నవి నిజంగా జరిగినా జరగకపోయినా జరిగినట్టు అనిపిస్తుంటాయి. అందువల్ల జీవితం బాగానే నడుస్తోంది కాబట్టి అలా కానిచ్చేద్దాం.
కొన్నినెలల క్రితం పుస్తకాలు వ్రాద్దామనుకున్నా కానీ దానివల్ల లాభం లేదని త్వరలోనే అర్దం అయ్యింది. మరింకేదో వుంది. అదేంటి. కొన్నాళ్ళు అలా వదిలేసాక నా నవల్స్, స్టోరీ అయిడియాలూ తెలుగు సినీ పరిశ్రమకి అంటగడితే ఎలా వుంటుందా అన్న అలోచన వచ్చింది. ఇక అటువైపు అడుగులు వేయడం మొదలెట్టాను. సాధారణంగా అయితే ఇలాంటివి సాధ్యం కాకపోవొచ్చు కానీ LOAలో చిత్రంగా అన్నీ కలిసివస్తుంటాయి. మనం కొద్దిగా అటువైపు అడుగులు వేస్తుండాలి అంతే. మార్గం దానంతట అదే పరుచుకుపోతుంది. అలా అని చెప్పి తెగ హైరానా పడిపోకూడదు. లా ఆఫ్ డిటాచ్మెంట్ (LOD) కూడా ముఖ్యం. అట్రాక్షన్, డిటాచ్మెంట్ బ్యాలన్స్ చేసుకోవాలి - లేకపోతే ఫలితాలు రావు.
Ask, Beleive & Receive. ఇదీ LOA లో ముఖ్యమయిన థియరీ. నేనో గొప్ప సినీ రచయితగా/దర్శకుడిగా కావాలని ఆశిస్తున్నా, అలా అయ్యానని విశ్వసిస్తున్నా. ఇక తగిన సమయంలో అవకాశాలు వచ్చేస్తాయి లెండి. బాబ్బాబూ, నన్ను మీరు కూడా అలా భావించండీ. ఇదేమన్నా జరిగేపనా కాదా అన్నది కొద్దిరోజుల్లో అర్ధం అవుతుంది లెండి. ఒకవేళ కాకపోతే మరో మంచి ప్రయత్నానికి ఇది దారితీస్తుంది. ఏదీ అనవసరం కాదు. తరచుగా ఏం జరుగుతోందీ, ఎంతవరకూ వచ్చిందీ తెలియజేస్తుంటాలెండి.
మీ సలహాలూ, సూచనలూ అందజేయండి. LOA మీద ఆసక్తి వుంటే గూగుల్ చెయ్యండి. The Secret పుస్తకం, వీడియో చూడండి. లాజిక్ పక్కన పెట్టి ప్రయత్నించి చూడండి. బావుంది అనిపిస్తే కొనసాగించండి. బాగోలేదు అనిపిస్తే పక్కకు పెట్టెయ్యండి. ప్రయత్నించి చూస్తే పోయేదేమి వుంది. నాకు అయితే హాయిగా వుంది, సరదాగా వుంది. ఎన్నెన్ని నా జీవితంలో అవిష్కరించుకున్నానూ...!
సమయం లేదు మిత్రమా, అర్ధరాత్రి కావొస్తోంది - ఇక పడుకోవాలి, మళ్ళీ కలుద్దామేం.
నాకు తెలిసిన ఒక సినీ మత్తు విషయం
కొన్నేళ్ళ క్రిందటి సంఘటణ ఇది. అయిదారేళ్ళకి పూర్వం జరిగింది. ఈ విషయం అప్పట్లో టూకీగా వ్రాసే వుంటాలెండి కానీ డ్రగ్స్ విషయం ప్రస్థావించకపోయి వుండకపోవొచ్చు. ఒక కత్తిలాంటి యువ స్నేహితురాలు ఫోనులో నాకు ఒక విషయం చెప్పింది - ఒక యువ హీరో తనతో కొంత సమయం గడిపేసాడనీ. నమ్మలేకపోయాను. అంత గొప్ప (నటనలో కాదులెండి) యువ హీరో ఈమెతో గడపడం ఏంటా అని. కానీ ఆమె డైనమిజం బాగా తెలిసిన నేను ఆమె చెప్పింది నిజమయ్యే వుంటుందిలే అనుకున్నా. పనిగట్టుకొని నాకు అలా అబద్ధం చెప్పల్సిన అవసరం ఆమెకు లేదు. నేను అంటే ఆమెకు చాలా గౌరవం, అభిమానం. పైగా ఆ యువ హీరో అలాంటి టైపే. అలా అలా దొరికిన అమ్మాయిలనీ, హీరోయిన్లనీ అలా అలా వాడేస్తుంటాడు అనే రూమర్స్ వున్నాయి. . సో, అదంతా నిజమే అయివుంటుంది అనుకున్నా.
అతడి సమర్ధత గురించి పూసగుచ్చినట్లు వివరించింది. అతని సమర్ధత (ముఖ్యంగా సమయం) వెనుక కారణం డ్రగ్స్ అయివుంటుంది అని ఆమె సందేహించింది. ఈమె తాగి వుంది కనుక తట్టుకునేసిందిట అతగాడిని. డ్రగ్స్ తీసుకుంటే అలాంటి సమర్ధత పెరుగుతుందా లేదా అన్నది నాకు తెలియదు. ఆ యువ హీరో/విలన్ పేరు డ్రగ్స్ కేసు విషయంలో బయటకి రాకుండా పెద్దలు తొక్కిపట్టేసారని వార్తల్లో చూస్తుంటాను. నిజమే అనిపిస్తుంది మరి నేను విన్నదాని ప్రకారం.
ఆ తరువాత కొన్నేళ్ళకి ఆమె వ్యవహారాలు మరీ శృతిమించిపోతున్నాయని, నా హితోపదేశాలు వినడం లేదని దూరం పెట్టాను. తరువాత కొన్నేళ్ళకి ఆమె కూడా మత్తుమందులకు బానిస అయ్యిందని అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసింది. ప్చ్! నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. నా మాట వినే స్థితి ఆమె ఎప్పుడో దాటిపోయింది. అప్పుడో ఇప్పుడో ఆమె గురించి చూచాయగా తెలుస్తూవుంటుంది. తను హైదరబాదులోనే వుంటుంది. ఏవేవో చేస్తూవుంటుంది.

ఈ సమాచారం ఎక్కడ లభిస్తుంది?
తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన వారందరి కాంటాక్ట్ నంబర్లు ఎక్కడ లభిస్తాయి, ఎలా లభిస్తాయి? అలాంటి వివరాలు లభించే పుస్తకం కానీ వెబ్‌సైట్ కానీ ఏదయినా వుంటుందా? మా సంఘం వారిది ఏదయినా పుస్తకంలో అలాంటి సమాచారం దొరుకుతుందా? దయచేసి ఈ సమాచారం మీకు తెలిస్తే చెప్పండి.
ఎలా అని ఆలోచించకుండా వుండటం ఎలా? ఎలా?
నీళ్ళు ఎలా వున్నాయో పరీక్షించాకా (after testing waters) రచనల మీద ఒక అంచనాకి వచ్చేసా. వీడియోలు రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో రచనలు చేయడం కానీ చదువరులకు చదవడం కానీ కష్టం గానే వుంది. జనాభా, సాంకేతికతా ఒక వైపు వెళుతుంటే నేను తిరోగమిస్తున్నానా అనిపించింది. నా మటుకు రచనలు చేయడంలో ఆనందం వున్నా శ్రమ కూడా ఎక్కువే. చాలా ఓపికా, తీరికా కావాలి. ఇదివరలో అన్ని రచనలు ఎలా చేసేనా అని నాకే అనిపిస్తుంటుంది. రచనలు చదవడం వరకు ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా కాగితం పుస్తకాలు. అందులోనూ కొత్త పుస్తకాలు అయితే ఆ వాసన, అనుభూతే వేరు. అయితే ఈ కాలం జనభా చదవడం తగ్గించేస్తున్నారు.
మరో వైపున నా యూట్యూబ్ ఛానల్ విషయంలో మంచి అభివృద్ధి వుంది. ఒక అల్లరి అమ్మాయీ, ఒక కత్తిలాంటి యువతీ నాతో కలిసి వీడియోలు ప్రెజెంట్ చెయ్యడానికి సిద్ధంగా వున్నారు. వచ్చే నెల నుండి అవి మొదలవుతాయి. ప్రస్తుతానికి నావే ట్రయల్ వీడియోలు వేస్తున్నా. చూద్దాం ఇది ఎలా కొనసాగుతుందో. చాలా ఆలోచనలు వున్నయ్. చూడాలి మరి. యూట్యూబ్ విషయంలో ఏదయినా కలిసి వస్తే బావుండును అనుకున్నా. ఆశ్చర్యకరంగా ఒక్కరేంటీ, ఇద్దరు రెడీ అయిపోయారు. సో ఫార్ సో గుడ్.
అబ్బో ఆ రకంగా చాలా కలిసి వస్తున్నాయి. మీకు ఓ ప్రశ్న అనిపించవచ్చు రచనల్లో కలిసిరాలేదేం అని. ఏదో రకంగా కలిసిరావాలని కోరుకున్నా అంతే. కేవలం రచనల్లోనే కలిసిరావాలని గిరిగీసుకోలేదు. అలా అనుకొని ఇక అది మరచిపోయి ఇటు కెలికెసా, అటు కలిసి వచ్చింది. ఎందుకో తెలుసా? కొన్ని నెలలుగా నేను నేర్చుకున్న గుణపాఠాలు ఏంటో తెలుసా? లా ఆఫ్ డిటాచ్మెంట్ ప్రాధాన్యత. ఏదన్నా మనకు జరిగిపోవాలని అనుకొవాలి కానీ ఆనీ ఒహటే తాపత్రయపడకూడదు. గట్టిగా అనుకొవాలి, వివరంగా వ్రాసిపెట్టుకోవాలీ, ఇక వదిలెయ్యాలి. అది మరచిపోయి హాయిగా గడిపెయ్యాలి. మనం అనుకున్నది తగిన సమయంలో జరిగిపోతుంది. నాకు అయితే సాధారణంగా రెండు మూడు నెలల్లో అవి సాక్షాత్కరిస్తాయి. ఒక రెండు ముఖ్యమయినవి దారిలో వున్నాయి. అవీ తగిన సమయంలో ప్రత్యక్షం అవుతాయి. నేను చెబుతున్నది మీకేమన్నా అర్ధం అవుతోందా? ఏదో లెండి - నా మనస్ఖలనం ఇది. వదిలేద్దురూ.
ఇంకా చాలా వాటిల్లో ఎలా జరుగుతుంది అనే ఆలోచన ఆపలేకుండా వున్నా. ఇన్నేళ్ళుగా ఏదయినా జరగాలి అనుకుంటే ఎలా ఎలా అని ప్రతి క్షణం ఆలోచించడం అలవాటయిన మనస్సుకి అలా ఎలా అని ఆలోచించకూడదూ, తడిగుడ్డ వేసుకొని పడుకోవాలీ అంటే నా మనస్సుకి అది సులభంగా లేదు. అందుకే ఈ పోస్ట్. ఆ విషయం నా మనస్సులో బాగా ఇమిడిపోవాలనీ. ఏదయినా మనకు కావాల్సింది జరిగిపోవాలని కోరుకోవాలి. జరిగిపోతున్నట్లే విశ్వసించాలి. ఫలితాలను అందుకోవాలి. అంతే కానీ ఎలా ఎలా అని ఆలోచించొద్దు. అయితే ఇక్కడొ ట్రిక్ వుంది. మరీ తడిగుడ్ద వేసుకొని పడుకోవడం కాదు లెండి. తేలికపాటి చర్యలు తీసుకుంటూవుండాలి.
ఉదాహరణకు...ఇన్నింటిలో ఏ ఉదాహరణ ఇమ్మంటారూ? సరే, నా ఉద్యోగం. జనవరి 20, 2017 న నా ఉద్యోగం ఊడిపోతోందని తెలుసు. కొన్ని కారణాల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు. ఎందుకు నేను అనుకున్న విధంగా రావట్లేదా అని పరిశోధించాను. అప్పుడు తెలిసిందీ లోపం. ఇంకా రాలేదేంటీ, ఇంకా రాలేదేంటీ, ఏ ఎంప్లాయారూ ఇంకా ఈమెయిల్ గానీ, కాల్ గానీ ఇవ్వలేదేంటీ అని హైరానా పడిపోవడం నా పొరపాటు అని అర్ధం అయ్యింది. అంతే ఇక ఆ బెంగ వదిలేసాను. సరి అయిన సమయంలో అదే వస్తుందిలే అని నమ్మేసి ఆల్రెడీ కొత్త ఉద్యోగం వచ్చేసినట్లుగానే భావించాను. ఈమెయిల్స్, కాల్స్ పదే పదే చెక్ చేయడం వదిలేసాను. అసలు కొద్ది వారాల్లో నాకు ఉద్యోగం ఊడుతుంది అన్న విషయమే మరచిపోయాను. ఏదో అదపాదడపా మాత్రం కొన్ని కొత్త ఉద్యోగాలకు అప్లయ్ చేసాను.
వారాలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి. గంటలూ గడిచిపోయాయి. నిమిషాలూ గడిచిపోయాయి. ఆరోజు జనవరి 20 న ఆ సంస్థలో చివరి రోజు. ఒకవైపు ఒబామా దిగిపోతున్నాడు. మరోవైపు నేనూ దిగిపోతున్నా. అందరూ నాకు ఘనంగా వీడ్కోలు ఇస్తున్నారు. రేపటి నుండి ఉద్యోగం లేదు. బెంగ? నో ఛాన్స్. మరికొంతమంది కోలీగ్స్ ఆ రోజు లంచ్ కి తీసుకెళ్లారు. భోజనం మధ్యలో ఫోన్ కాల్. అదేంటో మీరు ఊహించుకోవొచ్చు. ఎప్పుడు వస్తావూ అని అడిగారు. నెల తరువాత అన్నా. ఫిబ్రవరి 20న కొత్త ఉద్యోగంలో చేరాను. ఎలా వుంది ఇదీ?
ఇంకో తాజా ఉదాహరణ ఇమ్మంటారా? పూర్తి వివరాలు చెప్పలేను - వెరీ పర్సనల్ కాబట్టి. ఇరవైరెండు ఏళ్ళకు పైగా ఒక విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా. పరిష్కారం కావాలంటే అయిపోతుంది కానీ ఏదీ తగిన పరిష్కారం కాదు. అందుకే తటపటాయింపు. ఎగదీస్తే గోహత్యా, బిగదీస్తే బ్రాహ్మణహత్యా లాగా 22 ఏళ్ళపాటు కొట్టుమిట్టాడాను. అలా రెండూ కాకుండా మధ్యేరకంగా సూపర్ పరిష్కారం కావాలని రెండు నెలల క్రితం కోరుకున్నా కానీ పెద్దగా ఆ విషయం ఆలోచించకుండా వుండేందుకు ప్రయత్నించా. ఊహించని విధంగా చాలా తేలికపాటి గొప్ప పరిష్కారం నిన్న అనుకోకుండా లభించింది. ఓసోస్, ఇంత దానికోసం ఇరవై రెండు ఏళ్ళ నుండి కిందామీదా పడ్డానా సంభ్రమం చెందాను. అవి నాకు తెలియని విషయాలు కావు గానీ డాట్స్ కనెక్ట్ కాలేదు ఇప్పటివరకూ. అదండీ సంగతి. ఇలా అనుకుంటే అలా కలిసివస్తాయంతే. అంతే ఆ పరిష్కారం వెంటనే అమల్లో పెట్టేసేనోచ్ :) వావ్. వ్వాటె రిలీఫ్!
ఎన్ని ఉదాహరణలు వున్నా ఇంకా చాలా విషయాల్లో ఎలా అని నా మనస్సు బెంగపడుతూనే వుంటోంది. ఎలా అనే ఆలోచనను తగ్గించడం ఎలా? ఇదిగో ఇలానే. ఇలా వ్రాసుకుంటే క్లారిటీ వస్తుందీ, మనస్సులోకి విషయం బాగా సింక్ అవుతూంది. అద్గదీ సంగతి. ఇంక చాల్లెండి ఈ రోజుకి, మరీ ఎక్కువ కక్కేసుకున్నా బాగోదు! వెగటు కలుగుతుంది.

ఆ సమావేశంలో చివరికి మిగిలింది నేనొక్కడినే!
గత ఏడాది డెట్రాయిటులో జరిగిన తెలుగు మహాసభలకి వెళ్ళాం. అందులో సాహితీ సమావేశం జరపాలా వద్దా అన్న మీమాంస తరువాత మొత్తం మీద అది జరిగింది. సాహితీ సమావేశాల కంటే ముందు ఆ గదిలో పాటల రచయిత చంద్రబోస్ గారి కార్యక్రమం జరిగింది కాబట్టి దానికి వచ్చినవారు కొంతమంది ఇంకా అక్కడే వున్నారు. అందులో మా మిత్రుడి కుటుంబం, మా కుంటుంబం కూడా వున్నారు. తరువాత సాహితీ సమావేశం అని విని మావాళ్ళూ, మా మిత్రుని కుటుంబం అక్కడి నుండి పారిపోయారు. ఇక మా మిత్రుడు, మా మామగారు, నేను ఇంకా వేళ్ళ మీద లెక్కబెట్టగలిగినంత మందిమి వున్నాం.
మొత్తం మీద వేదిక మీద వున్నవారి కంటే కింద వున్నవారే తక్కువ మంది వున్నారు. సమావేశాలు మొదలయ్యక మా మిత్రుడు జారుకున్నాడు. మా మామగారికి ఇలాంటివి కాస్త ఆసక్తే. వారు అయినా చివరంటా వుంటారేమో అనుకున్నా. వారూ కాస్సేపు విని తల విదిలించి వెళ్ళిపోయారు. మిగతావారూ వెళ్ళిపోయారు. మిగిలింది నేను ఒక్కడినే. ఫోటోలు తీసేపని నాదే, అందుకే :)) ఎందుకయినా సరే, చివరంటా వున్నా కాబట్టి కొత్తపాళీ గారు వేదిక నుండి దిగివచ్చి అందుకు గానూ నాకు అభినందనలు తెలియజేసారు!
(మా మిత్రుడి) ఇంటికి వెళ్లాక మా మామగారు తన అమూల్యాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు - సాహితీ సమావేశాలు అంత బోరింగ్ గా వున్నాయ్యేంటీ అని. విని నేను తల పంకించాను. కొత్తపాళీ గారి ఉపన్యాసం దాకా మీరు వుండాల్సింది - బావుంటుంది అన్నా. వారు చివరికి ఉపన్యసించారు లెండి. మా మామగారికి ముందు ఇద్దరి ఉపన్యాసాలు వినేసరికే అయిపోయింది - ఓపిక.
అసలే సాహితీ సమావేశాలు - వాటినీ మరీ చప్ప చప్పగా చేయడంలో మనాళ్ళు ఉద్దండులు. 'ఆ చెప్పేవేవో ఆసక్తి కరమయినవి చెప్పొచ్చు కదా, ఆసక్తికరంగా చెప్పొచ్చు కదా' అన్నారు మా మామ గారు. నిజవే.

Advertisement:
ARVY IT Solution: Training delivery options from public to in-company and distance learning. Courses: Hadoop, Anaplan, SAP Bods, SAP Bods, SAP HANA, SAP BI/Lumaira.
అనుకున్నవన్నీ అలా అలా జరిగిపోతూవుంటే...
ఎలా వుంటుందంటారూ? అలాగే వుంది నాకు. ఒకదాని తరువాత మరొకటీ అద్భుతంగా నా జీవితంలోకి అవిష్కరింపబడుతున్నాయి. కలయో వైష్ణవ మాయయో అనే సామెత చందంగా అలా అలా పరుగులు పెడుతోంది నా జీవితం. నిజమో లేక నా భ్రాంతినో తెలియదు మరి. అలా అని అన్నీ అనుకోగానే నా వళ్ళో వచ్చిపడటానికి నేనేమీ మానవాతీతుడిని ఏమీ కాదు కదా. తగిన విధంగా తగిన సమయంలో జరిగిపోతున్నాయి. ఏం జరిగాయి అంటే ఎన్నని చెప్పనూ? ఇంకా ఎన్నో జరగాల్సివుంది. అవి కూడా జరిగేస్తాయి. కోరికలకు అంతు వుంటుందా? ఇంకా కొన్ని ముఖ్యమయిన మార్పుల కోసం వేచి వున్నా. తగిన సమయం తీసుకుంటూ అవి కూడా ముందు పడుతున్నాయి.
లా ఆఫ్ ఎట్రాక్షన్ సిద్దాంతం పాటిస్తున్నప్పటి నుండీ ఇదీ వరుస. విమర్శకులు సెలక్టివ్ థింకింగ్ అంటారు. కావొచ్చు. నాకూ మహత్మ్యాల మీద నమ్మకం లేదు కానీ... ఏంటో నాకే నమ్మశక్యం కానంతగా... ఏదో లెండి, అదో ఇదో ఏదో ఒకటి, ఏదో ఒక విధంగా మనకు మంచి జరుగుతున్నా లేక జరిగినట్లు అనిపిస్తున్నా మంచిదే కదా. నామీద నాకు నమ్మకం, ఆత్మ విశ్వాసం, ఉత్సాహం దినదిన ప్రవర్ధమానం అవుతూవుంటే కాదనగలనా?
తాజాగా ఒక ఉదాహరణ ఇస్తానేం. చిన్నప్పటినుండీ నేను ఎలర్జీలతో అవస్థపడుతూ వస్తున్నా. ఈమధ్య వాటి గురించి కొన్ని పోస్టులు కూడా వ్రాసేగా. ఏ ఎలర్జీలు లేకుండా హాయిగా జీవితం గడిపెయ్యాలని ఆశించాను, అలా ఊహించాను (విజువలైజ్ చేసాను). అంతే. నా ఎలర్జీలకు నేను తీసుకుంటున్న ఆహారం ఏమో అనే ఆలోచన కలిగింది. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొద్దిరోజుల్లోనే నాకు ఏం పడట్లేదో తేలిపోయింది. గుడ్డు, గ్లుటెన్ పడట్లేదు. మానివేసాను. హాయిగా వుందిప్పుడూ. మరి?
అలా ఒక్కొక్క సమస్యా తేలిపోతూవుంటే, ఒక్కొక్క సుఖమూ వళ్ళోకి వచ్చి పడుతూ వుంటే నా సామి రంగా ;)
అదండీ సంగతి. అలా అనుకున్నవన్నీ జరిగిపోతూ బాగా బ్యుజీ అయిపోయాన్నేను. అందుకే కొన్ని నెలలుగా వాటితో ఉక్కిరిబిక్కిరి అయిపోయి బ్లాగు వ్రాయడమూ కుదర్లేదు. కొన్ని ముఖ్యమయిన మార్పులు: కొత్త (మంచి) ఉద్యోగం, కొత్త ప్రాంతం, కొత్త ఇల్లు (రెంటల్). ఈ వేసవిలో మరికొన్ని ముఖ్యమయిన మార్పులు నా జీవితంలో జరిగేస్తాయి. అవేంటో చెప్పాలా? అబ్బా ఆశ, దోశ, అప్పడం, వడా :)) ఇంకా ఒకటి ముఖ్యమయినది ఒకటి మిగిలి వుంది. ధనార్జన.
వైట్ హవుజ్ లో మా అమ్మాయి పాదయాత్ర
కాస్త క్యాచీగా వుంటుందేమో అని పాదయాత్ర అన్నా లెండి. చాలా ఏళ్ళ క్రితం మా కుటుంబం తో కలిసి వైట్ హవుజ్ చూసాను. గేటు దగ్గరి నుండి లెండి. అప్పుడు మా చిన్నమ్మాయికి మూడు నాలుగేళ్ళు వుంటాయేమో. తనకి అందులోకి వెళ్ళి చూసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. గత ఏడాది తను 8వ తరగతి. తన స్కూల్ వాళ్ళు వాషిగ్టన్ డి సి కి మూడు రోజులు తీసుకువెళ్ళి గొప్ప గొప్ప ప్రదేశాలు అన్నీ లోపలికి తీసుకువెళ్ళి చూపించారు. అందులో ఇది కూడా ఒకటి.
అందులోకి వెళ్ళి చూడగలగలగడం సాధారణంగా అంత సులభం కాదు అని చాలామందికి తెలిసేవుంటుంది.
తిరిగి వచ్చాక అడిగాను. ఎలా వుందీ అనీ. IKEA లాగా వుంది అంది!?
హు! ఇన్నేళ్ళ తరువాతా...!
(కొన్ని నెలలుగా నేను ఏమయిపోయానూ - ఎందుకు వ్రాయట్లేదూ అనే ధర్మసందేహం కొద్దిమందికి అయినా వుండి వుంటుంది. సంతోషకరమయిన సంగతులతో త్వరలో వివరిస్తా. ఈ పోస్టులో ఒక సంగతి నేను వివరించినట్లుగా నాకు అన్నీ మంచిగా అనుకున్నట్లుగా జరుగుతూ వుంటే తబ్బిబ్బు అయిపోతూ తీరిక లేక వ్రాయలేదండీ. క్లుప్తంగా అదీ :) ఇంకా కొన్ని ముఖ్యమయిన మార్పులు కూడా సంభవించాలి. అవీ జరిగిపోతాయి లెద్దురూ. కంగారు ఏమీ లేదు. )
ఇవాళ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. మా ఆవిడ ఏం వండిపెట్టిందో చూసాను. ఎగ్ బిర్యానీ. ఒక వైపు సంతోషం - మరో వైపు విచారం. కోడి గుడ్డు నాకు మాహా ఇష్టం కానీ నా వంటికి సరిపడ్టం లేదేమో అని ఈమధ్య పక్కకు పెట్టి ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నా. ఎలెర్జీ, ఇంటొలెరాన్స్ లక్షణాలు లేకుండా కొద్దిరోజులుగా లక్షణంగా వుంటున్నా. అయితే ఏ కారణం వల్ల అలా వుండగలుగుతున్నానో నాకు ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే పాలు, గ్లుటెన్ (గోధుమ వగైరా) మరియు కోడి గుడ్డు తో చేసిన పదార్ధాలు పక్కకు పెట్టేకా వంటికి కాస్త హాయిగా వుంది. అయితే నా ఇబ్బందులకు ఆ మూడూ కారణమా లేక ఒకటా రెండా అన్నది ఇంకా స్పష్టత లేదు. దాందేముంది, ఓ స్పష్టత తెచ్చుకుందాం అని ఎగ్ బిర్యానీ లాగించాను.
కాస్సేపయ్యాకా ఓ మిత్రునికి ఫోన్ చేసా. మాట్లాడుతుంటే అస్సలు నాకు ఊపిరి తీసుకోవడమే కష్టంగా అనిపించసాగింది. నోట్లోంచి మాట రావడమే గగనం అవసాగింది. పరిస్థితి అర్ధం అయ్యింది - కొంత క్లారిటీ వచ్చింది. నాది ఎగ్ ఎలెర్జీ కాదు కానీ ఎగ్ ఇంటోలరాన్స్. అయితే తెల్లతో వస్తోందా లేక పసుపుతో వస్తోందా అన్నది తెలియదు. చాలావరకు తెల్ల తోనే సమస్య అంటుంటారు. అదే అవాలని ఆశిస్తాను. ఎందుకంటే నాకు పసుపు పచ్చ ఇష్టం మరీ. అందుకోసం మళ్ళీ తిని చూడాలి.
ఎన్నో ఏళ్ళ నుండి ఇలా అవస్థ పడుతుంటే డాక్టర్లు ఏవేవో మందులు ఇస్తారు కానీ ఒక్కరన్నా ఏదయినా ఆహారం పడట్లేదేమో చూడకూడదా అని చెప్పలేదు. పదిహేనేళ్ళ క్రితం నేనే పట్టుబట్టి ఎలెర్జీ స్కిన్ టెస్ట్ చేయించుకున్నా. నెగటివ్. ఇహ నాది నాన్ ఎలెర్జిక్ రినిటిస్ అని తీర్మానించేసారు. అప్పటినుండీ ఇప్పటిదాకా ఎవేవో నాజల్ స్ప్రేలు వాడుతూ బండి నడిపిస్తున్నా. వాటితో విసిగిపోయి ఇహ ఈ డాక్టర్లతో కాదు అనుకొని నేనే పరిశోధించడం మొదలుపెట్టా. అనుమానం అనిపించిన కొన్నింటికి దూరం పెట్టాక హాయిగా వుంది. మళ్ళీ ఈ రోజు ఆ చిరాకులు మొదలయ్యాయి. ఎందుకో మీకు తెలుసు. ఆగండి - అజలస్టైన్ నాసల్ స్ప్రే కొట్టుకొని వస్తా. అది అంటీ హిస్టమిన్ స్ప్రే.
ఏం డాక్టర్లో ఏమో - ఇలాంటి కొన్ని విషయాల్లో వారి మీద నమ్మకం సన్నగిల్లుతోంది.
మొత్తమ్మీద చిన్నప్పటి నుండీ నేను పడుతున్న ఒక అవస్థకి సులభ పరిష్కారం దొరికేసింది. ఇలాంటివే ఎన్నో మంచి విషయాలు వరుసగా నా జీవితంలో జరిగిపోతున్నాయి మరి. అవన్నీ మీతో నేను పంచుకోవద్దూ? అన్నీ కాకపోయినా కొన్ని అయినా ;)
అప్పుడు 50 కోట్లు - ఇప్పుడు 5000 కోట్లు
మన విజయాలకూ, అపజయాలకూ మూలం మన మనస్సులో బలంగా నాటుకుపోయిన విశ్వాస వ్యవస్థ. మన మనస్సులోని ఆయా విశ్వాసాలు మంచివా చెడ్డవా సరి అయినవా కావా అనే విషయం పక్కన పెట్టేస్తే మనం మనలోని బిలీఫ్ సిస్టం ని బట్టి నడుస్తూవుంటాం. మనలోని విశ్వాస వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? చిన్నప్పటి నుండీ మనకు మనం లేదా మనకు ఇతరత్రా అందే సూచనలు, అనుభవాలను బట్టి అది ఏర్పడుతుంది. మనం విజయాలు సాధిస్తూ వున్నామూ, సంతోషంగా వుంటున్నామూ అని అనుకుంటున్నట్లయితే చాలావరకు బిలీఫ్ సిస్టం బాగానే వుంటుండొచ్చు. లేదూ జీవితంలో ఇబ్బందులు వుంటుంటేనూ ఎదురవుతుంటేనూ లోపం చాలావరకు మనలోని బిలీఫ్ సిస్టం లో వుంటుండొచ్చు.
అంటే అస్సలు మన గురించి మనకు ఏం అంచనా వుంది? అస్సలు మన గురించి మనం ఏం అనుకుంటున్నాం. మన గురించి మన ఇంట్లో వాళ్ళకి ఏం ఇమేజ్ వుంది? మన చుట్టూరా వున్న వాళ్ళలో ఏం ఇమేజ్ వుంది? ఇతరత్రానూ, ఇంట్లో వాళ్ళనూ కాస్సేపు పక్కన పెట్టేస్తే మన గురించి మనలో ఏం నమ్మకం వుంది? ఆగండి. ఒక రెండు నిమిషాలు తర్కించుకోండి. డబ్బే ప్రధానం కాదు కానీ ఉదాహరణకు ఇప్పుడు డబ్బునే తీసుకుందాం. మీ జీవిత కాలంలో ఎంత డబ్బుని సంపాదించగలరు? సరదాగా వ్యాఖ్యల్లో చెప్పండేం. షద్ హెమిస్టెట్టర్ వ్రాసిన పుస్తకం చదవక ముందూ, లా ఆఫ్ ఎట్రాక్షన్ పుస్తకాలు చదవకముందు నన్నే గనుక ఇలాంటి ప్రశ్న వేస్తే మీలో చాలామందిలాగా ఒక రెండు నిమిషాలు బుర్ర గోక్కొనీ కనాకష్టంగా ఓ యాభం కోట్లు సంపాదిస్తానేమో అని గొణిగేవాడిని. మరి ఇప్పుడు? ఒక 5000 కోట్లు. ఎలా? ఏమో నాకేం తెలుసూ? నా నమ్మకం అలాంటిది. నా ఆత్మ విశ్వాసం అలాంటిది. నాలో సరికొత్తగా బలపడుతున్న నమ్మకపు వ్యవస్థని బట్టి ఆ అంకె ఇంకా ఎంతో మారవచ్చును.
ఎలా అన్న సంగతి తరువాత. మనలో అంత కెపాసిటీ వుందనే నమ్మకం వుంటే మనం చాలా వరకు ఆ అంచనాలను అందుకోగలం. ఆ నమ్మకం మనలో ఏర్పడాలి అంటే ఏం చెయ్యాలి? మనలోని ప్రోగ్రామింగ్ మార్చుకోవాలి. గత ఏడాది కాలంగా నేను చేస్తున్నదీ, పరీక్షిస్తున్నదీ అదే. డబ్బు విషయాల్లో ఇంకా కాదు గానీ మిగతా విషయాల్లో ఈ సిద్దాంతాలని పరీక్షిస్తూ అద్భుతమయిన విజయాలని నాకు నేనే నమ్మని విధంగా సాధిస్తూ వస్తున్నా. పరీక్ష కోసం చిన్న చిన్న విషయాలనే ఎంచుకున్నా కానీ అవి చక్కటి ఫలితాలు సాధించడంతో నాలో నాకు మంచి నమ్మకం ఏర్పడింది. ఇక 2017 నుండీ సంపాదనలో ఈ ప్రోగ్రామింగ్ పద్ధతులు ఉపయోగిస్తా. చూద్దాం, అవి ఎలా జరుగుతాయో. ఇవాలంటే రేపే ఫలితాలు సిద్ధిస్తాయి అనికాదు. మనలో చిన్నప్పటినుండీ నాటుకు పోయిన నెగెటివ్ వ్యవస్థ మారడానికి కొంత సమయం పడుతుంది, అవి ఫలితాలు ఇవ్వడానికి ఇంకొంత సమయం పడితే పట్టొచ్చు కానీ మనం సరి అయిన దారిలోనే వున్నామా లేదా అన్నది మనకు తెలుస్తూనే వుంటుంది.
కొన్నిసార్లు ఈ పద్ధతులు పాటిస్తూ అనుకున్న విధంగా జరగట్లేమిటా అనుకునేవాడిని. కొన్ని ప్రయత్నాల తరువాత ఊహించని ఫలితాలు ఎదురయ్యేవి. ఏంటా అని చూస్తే మిగతా ప్రయత్నాల్లో నేను లక్ష్యానికి చేరువ అవుతూ వస్తున్న సంగతి బోధపడింది. ఈ రకంగా నేను ఈ విషయాల గురించి బ్లాగులు వ్రాయడం కూడా నాలోని నమ్మకపు వ్యవస్థను బలీయం చేసుకోవడానికే. ఎవరికయినా ఈ వ్రాతలు ఏమాత్రం అయినా ఉపయోగపడితే అది నాకు బోనస్ క్రింద లెక్క. పోస్టులు వ్రాయాలంటే ఎంతో కొంతా ఆయా విషయాల గురించి ఆలోచించాలీ, పుస్తకాలు తిరగెయ్యాలీ అలా అలా నాకు ఉపయోగకరం. వ్రాస్తూ వుంటే, వ్రాయడం కోసం పరిశోధిస్తూ వుంటే నాలో నాకు ఈ విషయాల గురించి ఇంకా ఇంకా స్పష్టత వస్తుంది.
సో, మనలోని నెగెటివ్ నమ్మకపు వ్యవస్థలను మైండ్ ప్రొగ్రామింగ్ ద్వారా మార్చుకోవచ్చు. అదెలాగో తరువాయి పోస్టుల్లో చర్చిద్దాం.
హార్డ్ డిస్క్ లాంటి మన మనస్సు
మన మనస్సు హార్డ్ డిస్క్ లాంటిదని What to say when you talk to your self అనే పుస్తకంలో షడ్ హెల్మ్స్టెట్టర్ అంటారు. మన చిన్నప్పటినుండీ మనకు పలు విధాలుగా సూచనలు అందుతూ వుంటాయి. అవన్నీ కలిసి పలు ప్రొగ్రాములుగా (బిలీఫ్ సిస్టంలుగా) తయారవుతాయి. అలా ఆ కంప్యూటర్ (మనం) ఆ ప్రోగ్రాముల పరంగా పనిచేస్తుంది. అలా అమకు అంది వచ్చే సూచనల్లో మంచివి తక్కువే వుంటాయి, చెత్తవి ఎక్కువే వుంటాయి. అలా మన మనస్సు చాలా వరకు నెగటివ్ భావాలతోనే నిండిపోతుంది. కొన్ని సార్లు మనకు తెలియకుండానే బయటినుండి పలు సంకేతాలు, సూచనలు అందుతూ వుంటాయి. అవి మన అంతః చేతనలో రికార్డ్ అవుతూ వుంటాయి. అలా ఇంటా బయటా, మనంలో మనం, మన గురించి ఇతరులూ అనుకునే విధాన్ని బట్టి అంటున్న విధాన్ని బట్టి మన వ్యక్తిత్వం రూపొందుతూ వుంటుంది.
మనం అదృష్టవంతులం అయివుండి చిన్నప్పటినుండీ మనకు పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ అందుతూ వున్నట్లయితే భలేగా వుంటుంది కానీ అది సత్యదూరం కదా. పోనీ పెళ్ళి అయ్యేంతవరకు అందరూ మనని మొనగాడు అన్నా పెళ్ళయ్యాక పెళ్ళాం వచ్చి దద్దమ్మ అని తీసిపారెయ్యొచ్చు. లేదా ఇంట్లో అంతా పెళ్ళాం పిల్లలతో సహా తనని గొప్పవాడు అనుకున్నా కొత్త ఉద్యోగం చేరాక తన మేనేజర్ ఒక చీడ పురుగులా చూస్తుండవచ్చు. పాజిటివ్ పరిస్థితి వుంటే ఫర్వాలేదు కానీ నెగెటివ్ పరిస్థితి వుంటే అదంతా మన సబ్కాన్షియస్ మనస్సులో సింక్ కాకుండా వుండేలా చూసుకోవాలి. అలా మన మీద మనం విశ్వాసం కోల్పోతే అది ఎంత చెరుపు చేస్తుందో మీరు ఊహించవచ్చును.
మనల్ని ఆత్మన్యూనతకి గురిచేసేవాళ్లకి దూరం చేసుకోవడం ఉత్తమం. కొంతమంది శ్రెయోభిలాషులం అనే పేరిట మనల్ని కించపరుస్తూ హితబోధలు చేస్తూ తామేదో గొప్ప దేశసేవలు చేసినట్లుగా భావిస్తూవుంటారు. అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వుందాం. స్నేహితుడో లేక కోలీగో మనలో నెగెటివ్ భావాలు ఎక్కిస్తూ వుంటే గనుక దూరంగా వుండొచ్చు కానీ అదే మన తల్లిదండ్రులో, భార్యా పిల్లాలో అయితే వస్తుంది చిక్కు. ఇక భార్యనో లేదా భర్తనో అయితే ఇంకా క్లిష్టంగా వుంటుంది పరిస్థితి. దూరంగా వుండలేం - దగ్గరగానూ వుండలేం :)) చాలామంది భార్యలూ భర్తలూ తమ పార్ట్నర్ ల గురించి చాలా క్యాజువల్ గా చులకనగా మాట్లాడేస్తూ తమ పార్ట్నర్ లలో అలాంటి విశ్వాస వ్యవస్థని రూపొందిస్తుంటారు.
భర్తలు భార్యలకి అలా ఇచ్చే సూచనలు ఎలా వుంటాయో ఉదాహరణలు ఇవ్వలేను కానీ భార్యలు అలా ఇచ్చే సూచనలు చాలా చెప్పగలను ఎందుకంటే నేనూ ఓ భర్తను కాబట్టి అలాంటివి బాగా పరిశీలిస్తుంటాను. "మా ఆయనకి అవన్నీ ఏమీ తెలియవండీ". నా మొఖం. అలా పదే పదే అంటే ఇంకేం తెలుసుకుంటాడూ? "మా ఆయన అవన్నీ పట్టించుకోడండీ. మీరు వున్నారు చూసారూ భలే కేర్ తీసుకుంటారండీ". అవతల వాళ్ళాయన మనస్సులో గుర్..మంటూవుంటాడు. అలా పదే పదే అలా విన్నాకా ఎంత పట్టించుకున్నా ఇంతేలే అని లైట్ తీసుకుంటాడు! "మా ఆయన ఇంట్లో అస్సలు ఒక్క పని కూడా చేయడండీ" ఇది మా ఇంట్లో. ఇలా పదే పదే విన్నాకా ఆ చేసే కొద్ది పనులూ కూడా చెయ్యబుద్దికాక మానేసి దర్జాగా కూర్చుంటున్నాను. ఏదయినా చెయ్యాలనుకున్నా 'ఛ, నీకు అంత దృశ్యం లేదు' అని నా మనస్సు నన్ను బుజ్జగిస్తూవుంటుంది. పోన్లే పాపం అని దానిమాట వింటూ వుంటాను. అలా అని నేనూ తక్కువేమీ కాదు. ఇదివరలో అమాయకంగా అవో ఇవో అనేవాడిని. తెలిసి వచ్చాకా తగ్గిస్తూవస్తున్నా.
కొంతమంది ఇళ్ళల్లో వాళ్ళ పిలలని కించపరచడం ఫాషన్ గా భావిస్తుంటారు. "మా చిన్నోడు సూపరండీ, మా పెద్దోడే శుంఠ". అలా పదిసార్లు విన్నాకా వాళ్ళ పెద్దోడు గ్యారంటీగా శుంఠన్నర అయిపొతాడు. ఎందుకంటే అతడిలో ఏర్పడే బిలీఫ్ సిస్టం ఇక తనని ఎదగనివ్వదు. ఏదన్నా తాను గొప్పపనులు చెయ్యాలనుకున్నా అంతః చేతన హెచ్చరిస్తుంది, తానేంటో గుర్తు చేస్తుంది. "మా వాడికి చదువు అస్సలు వంటపట్టదండీ" ఇంకేం పడుతుందీ? బాగా బక్కగా వున్న తమ పాపని చూపిస్తూ "మా అమ్మాయి ఎంత తిన్నా లావు కాదండీ" అంటారు. ఇంకేం అవుద్దీ?
అంచేతా...మనం చాలా క్యాజువలుగా అలా మాట్లాడి మరచిపోయినా ఎదుటివారిలో అవి ఎలాంటి ప్రభావాన్ని చూపగలవో గుర్తుంచుకోవాలి. మా చిన్నమ్మాయి కాస్త బరువు ఎక్కువ. తగ్గించే ప్రయత్నాల్లో వున్నాం. తను బరువు తగ్గుతున్నట్లుగానే సంకేతాలు అందిస్తూ వుంటాను. నువ్వు లావుగా వున్నావు లాంటి మాటలు మాట్లాడను. క్రితం వారం కంటే, క్రితం నెల కంటే బక్కగా అవుతున్నట్లుగానే సూచిస్తుంటా.
ఎదుటివారిలో నిజంగా నెగటివ్ భావాలు వున్నా కూడా వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడొచ్చు. ఉదాహరణకు భవానీ శంకరం పెద్దగా సంపాదించట్లేదు. అతని భార్య రమణి కి అతన్ని బాగా సంపాదించేలా చెయ్యాలని వుంటుంది. "నీకు సంపాదించడం చేతకాదు, పక్కింటి ఆయన అయితే ఎంత బాగా సంపాదిస్తాడో" అని అందనుకోండీ. భవానీ లో 'ఓహ్ నాకు సంపాదించడం చేతకాదు' అనే నమ్మకం బలీయం అవుతుంది. అలా కాకుండా "పక్కింటి ప్రసాద్ బాగా సంపాదిస్తున్నాండండీ, మీరు మరో మూడేళ్ళల్లో అతని మించిపోవాలి. మించిపోతారు. మీమీద నాకు ఆ నమ్మకం వుంది, ఇక ఆ ఇక ప్రయత్నాలు ప్రారంభిద్దురూ" అని భవానీ శంకరం యొక్క బలహీన క్షణంలో రమణి గోముగా రిక్వెస్ట్ చేసిందనుకోండీ. దృశ్యం మీరే ఊహిద్దురూ :)) రెచ్చిపోడూ?!
అలా కాకుండా రమణి ఇలా అందనుకోండీ. "పక్కింటి ప్రసాద్ బాగా సంపాదిస్తున్నాండండీ, మీరు అతడిని అతని మించిపోవాలి. మించిపోతారు. మీమీద నాకు ఆ నమ్మకం వుంది, ఇక ఆ ఇక ప్రయత్నాలు ప్రారంభిద్దురూ". ఈ డైలాగుల్లో ఒక లోపం వుంది. పై డైలాగునీ ఈ డైలాగునీ కంపేర్ చేసి చూడండి. పైన మూడేళ్ళు అని టైం ఫ్రేము పెట్టింది. ఇక్కడ అలా లేదు. అది పొరపాటు. ఎన్నడో ఒకనాడు అంటే అది ఎన్నడో లాగానే మిగిలిపోతుంది. ఎన్నడో ఒకనాటికి కదా, తొందరేమీ లేదు కదా అని భవానీ తడిగుడ్డ వేసుకొని పడుకుంటాడు. మనం లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు కానీ, ఇతరులకు పెట్టినప్పుడు కానీ తగిన సమయం నిర్దేశించకపోతే పెద్దగా ప్రయోజనం వుండదట.
Subscribe to:
Posts (Atom)