వైట్ హవుజ్ లో మా అమ్మాయి పాదయాత్ర

కాస్త క్యాచీగా వుంటుందేమో అని పాదయాత్ర అన్నా లెండి. చాలా ఏళ్ళ క్రితం మా కుటుంబం తో కలిసి వైట్ హవుజ్ చూసాను. గేటు దగ్గరి నుండి లెండి. అప్పుడు మా చిన్నమ్మాయికి మూడు నాలుగేళ్ళు వుంటాయేమో. తనకి అందులోకి వెళ్ళి చూసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. గత ఏడాది తను 8వ తరగతి. తన స్కూల్ వాళ్ళు వాషిగ్టన్ డి సి కి మూడు రోజులు తీసుకువెళ్ళి గొప్ప గొప్ప ప్రదేశాలు అన్నీ లోపలికి తీసుకువెళ్ళి చూపించారు. అందులో ఇది కూడా ఒకటి.

అందులోకి వెళ్ళి చూడగలగలగడం సాధారణంగా అంత సులభం కాదు అని చాలామందికి తెలిసేవుంటుంది. 

తిరిగి వచ్చాక అడిగాను. ఎలా వుందీ అనీ. IKEA లాగా వుంది అంది!?  

3 comments:

  1. అయితే నానా అవస్థపడి అనుమతులు తెచ్చుకొని వెళ్ళక్కరలేదంటారు?

    ReplyDelete
  2. థీమ్ మార్చినట్లున్నారు. కింద background తెల్లగా తేలిపోయినట్లు ఉంది కదా. దీనిని మార్చుకోవచ్చు. నేను మార్చాను. చూడండి. praggna.blogspot.in

    ReplyDelete
  3. @ అన్యగామి

    అర్దం తెలీదు గానీ మీ పేరు బావుంది. అబ్బే. దాని మాటలేమీ పట్టించుకోమాకండేం :))

    @ శ్రవణ్ బాబు
    చూస్తానండి. థేంక్స్.

    ReplyDelete