ఎలా వుంటుందంటారూ? అలాగే వుంది నాకు. ఒకదాని తరువాత మరొకటీ అద్భుతంగా నా జీవితంలోకి అవిష్కరింపబడుతున్నాయి. కలయో వైష్ణవ మాయయో అనే సామెత చందంగా అలా అలా పరుగులు పెడుతోంది నా జీవితం. నిజమో లేక నా భ్రాంతినో తెలియదు మరి. అలా అని అన్నీ అనుకోగానే నా వళ్ళో వచ్చిపడటానికి నేనేమీ మానవాతీతుడిని ఏమీ కాదు కదా. తగిన విధంగా తగిన సమయంలో జరిగిపోతున్నాయి. ఏం జరిగాయి అంటే ఎన్నని చెప్పనూ? ఇంకా ఎన్నో జరగాల్సివుంది. అవి కూడా జరిగేస్తాయి. కోరికలకు అంతు వుంటుందా? ఇంకా కొన్ని ముఖ్యమయిన మార్పుల కోసం వేచి వున్నా. తగిన సమయం తీసుకుంటూ అవి కూడా ముందు పడుతున్నాయి.
లా ఆఫ్ ఎట్రాక్షన్ సిద్దాంతం పాటిస్తున్నప్పటి నుండీ ఇదీ వరుస. విమర్శకులు సెలక్టివ్ థింకింగ్ అంటారు. కావొచ్చు. నాకూ మహత్మ్యాల మీద నమ్మకం లేదు కానీ... ఏంటో నాకే నమ్మశక్యం కానంతగా... ఏదో లెండి, అదో ఇదో ఏదో ఒకటి, ఏదో ఒక విధంగా మనకు మంచి జరుగుతున్నా లేక జరిగినట్లు అనిపిస్తున్నా మంచిదే కదా. నామీద నాకు నమ్మకం, ఆత్మ విశ్వాసం, ఉత్సాహం దినదిన ప్రవర్ధమానం అవుతూవుంటే కాదనగలనా?
తాజాగా ఒక ఉదాహరణ ఇస్తానేం. చిన్నప్పటినుండీ నేను ఎలర్జీలతో అవస్థపడుతూ వస్తున్నా. ఈమధ్య వాటి గురించి కొన్ని పోస్టులు కూడా వ్రాసేగా. ఏ ఎలర్జీలు లేకుండా హాయిగా జీవితం గడిపెయ్యాలని ఆశించాను, అలా ఊహించాను (విజువలైజ్ చేసాను). అంతే. నా ఎలర్జీలకు నేను తీసుకుంటున్న ఆహారం ఏమో అనే ఆలోచన కలిగింది. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొద్దిరోజుల్లోనే నాకు ఏం పడట్లేదో తేలిపోయింది. గుడ్డు, గ్లుటెన్ పడట్లేదు. మానివేసాను. హాయిగా వుందిప్పుడూ. మరి?
అలా ఒక్కొక్క సమస్యా తేలిపోతూవుంటే, ఒక్కొక్క సుఖమూ వళ్ళోకి వచ్చి పడుతూ వుంటే నా సామి రంగా ;)
అదండీ సంగతి. అలా అనుకున్నవన్నీ జరిగిపోతూ బాగా బ్యుజీ అయిపోయాన్నేను. అందుకే కొన్ని నెలలుగా వాటితో ఉక్కిరిబిక్కిరి అయిపోయి బ్లాగు వ్రాయడమూ కుదర్లేదు. కొన్ని ముఖ్యమయిన మార్పులు: కొత్త (మంచి) ఉద్యోగం, కొత్త ప్రాంతం, కొత్త ఇల్లు (రెంటల్). ఈ వేసవిలో మరికొన్ని ముఖ్యమయిన మార్పులు నా జీవితంలో జరిగేస్తాయి. అవేంటో చెప్పాలా? అబ్బా ఆశ, దోశ, అప్పడం, వడా :)) ఇంకా ఒకటి ముఖ్యమయినది ఒకటి మిగిలి వుంది. ధనార్జన.
No comments:
Post a Comment