నీళ్ళు ఎలా వున్నాయో పరీక్షించాకా (after testing waters) రచనల మీద ఒక అంచనాకి వచ్చేసా. వీడియోలు రాజ్యం ఏలుతున్న ఈ కాలంలో రచనలు చేయడం కానీ చదువరులకు చదవడం కానీ కష్టం గానే వుంది. జనాభా, సాంకేతికతా ఒక వైపు వెళుతుంటే నేను తిరోగమిస్తున్నానా అనిపించింది. నా మటుకు రచనలు చేయడంలో ఆనందం వున్నా శ్రమ కూడా ఎక్కువే. చాలా ఓపికా, తీరికా కావాలి. ఇదివరలో అన్ని రచనలు ఎలా చేసేనా అని నాకే అనిపిస్తుంటుంది. రచనలు చదవడం వరకు ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా కాగితం పుస్తకాలు. అందులోనూ కొత్త పుస్తకాలు అయితే ఆ వాసన, అనుభూతే వేరు. అయితే ఈ కాలం జనభా చదవడం తగ్గించేస్తున్నారు.
మరో వైపున నా యూట్యూబ్ ఛానల్ విషయంలో మంచి అభివృద్ధి వుంది. ఒక అల్లరి అమ్మాయీ, ఒక కత్తిలాంటి యువతీ నాతో కలిసి వీడియోలు ప్రెజెంట్ చెయ్యడానికి సిద్ధంగా వున్నారు. వచ్చే నెల నుండి అవి మొదలవుతాయి. ప్రస్తుతానికి నావే ట్రయల్ వీడియోలు వేస్తున్నా. చూద్దాం ఇది ఎలా కొనసాగుతుందో. చాలా ఆలోచనలు వున్నయ్. చూడాలి మరి. యూట్యూబ్ విషయంలో ఏదయినా కలిసి వస్తే బావుండును అనుకున్నా. ఆశ్చర్యకరంగా ఒక్కరేంటీ, ఇద్దరు రెడీ అయిపోయారు. సో ఫార్ సో గుడ్.
అబ్బో ఆ రకంగా చాలా కలిసి వస్తున్నాయి. మీకు ఓ ప్రశ్న అనిపించవచ్చు రచనల్లో కలిసిరాలేదేం అని. ఏదో రకంగా కలిసిరావాలని కోరుకున్నా అంతే. కేవలం రచనల్లోనే కలిసిరావాలని గిరిగీసుకోలేదు. అలా అనుకొని ఇక అది మరచిపోయి ఇటు కెలికెసా, అటు కలిసి వచ్చింది. ఎందుకో తెలుసా? కొన్ని నెలలుగా నేను నేర్చుకున్న గుణపాఠాలు ఏంటో తెలుసా? లా ఆఫ్ డిటాచ్మెంట్ ప్రాధాన్యత. ఏదన్నా మనకు జరిగిపోవాలని అనుకొవాలి కానీ ఆనీ ఒహటే తాపత్రయపడకూడదు. గట్టిగా అనుకొవాలి, వివరంగా వ్రాసిపెట్టుకోవాలీ, ఇక వదిలెయ్యాలి. అది మరచిపోయి హాయిగా గడిపెయ్యాలి. మనం అనుకున్నది తగిన సమయంలో జరిగిపోతుంది. నాకు అయితే సాధారణంగా రెండు మూడు నెలల్లో అవి సాక్షాత్కరిస్తాయి. ఒక రెండు ముఖ్యమయినవి దారిలో వున్నాయి. అవీ తగిన సమయంలో ప్రత్యక్షం అవుతాయి. నేను చెబుతున్నది మీకేమన్నా అర్ధం అవుతోందా? ఏదో లెండి - నా మనస్ఖలనం ఇది. వదిలేద్దురూ.
ఇంకా చాలా వాటిల్లో ఎలా జరుగుతుంది అనే ఆలోచన ఆపలేకుండా వున్నా. ఇన్నేళ్ళుగా ఏదయినా జరగాలి అనుకుంటే ఎలా ఎలా అని ప్రతి క్షణం ఆలోచించడం అలవాటయిన మనస్సుకి అలా ఎలా అని ఆలోచించకూడదూ, తడిగుడ్డ వేసుకొని పడుకోవాలీ అంటే నా మనస్సుకి అది సులభంగా లేదు. అందుకే ఈ పోస్ట్. ఆ విషయం నా మనస్సులో బాగా ఇమిడిపోవాలనీ. ఏదయినా మనకు కావాల్సింది జరిగిపోవాలని కోరుకోవాలి. జరిగిపోతున్నట్లే విశ్వసించాలి. ఫలితాలను అందుకోవాలి. అంతే కానీ ఎలా ఎలా అని ఆలోచించొద్దు. అయితే ఇక్కడొ ట్రిక్ వుంది. మరీ తడిగుడ్ద వేసుకొని పడుకోవడం కాదు లెండి. తేలికపాటి చర్యలు తీసుకుంటూవుండాలి.
ఉదాహరణకు...ఇన్నింటిలో ఏ ఉదాహరణ ఇమ్మంటారూ? సరే, నా ఉద్యోగం. జనవరి 20, 2017 న నా ఉద్యోగం ఊడిపోతోందని తెలుసు. కొన్ని కారణాల వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు. ఎందుకు నేను అనుకున్న విధంగా రావట్లేదా అని పరిశోధించాను. అప్పుడు తెలిసిందీ లోపం. ఇంకా రాలేదేంటీ, ఇంకా రాలేదేంటీ, ఏ ఎంప్లాయారూ ఇంకా ఈమెయిల్ గానీ, కాల్ గానీ ఇవ్వలేదేంటీ అని హైరానా పడిపోవడం నా పొరపాటు అని అర్ధం అయ్యింది. అంతే ఇక ఆ బెంగ వదిలేసాను. సరి అయిన సమయంలో అదే వస్తుందిలే అని నమ్మేసి ఆల్రెడీ కొత్త ఉద్యోగం వచ్చేసినట్లుగానే భావించాను. ఈమెయిల్స్, కాల్స్ పదే పదే చెక్ చేయడం వదిలేసాను. అసలు కొద్ది వారాల్లో నాకు ఉద్యోగం ఊడుతుంది అన్న విషయమే మరచిపోయాను. ఏదో అదపాదడపా మాత్రం కొన్ని కొత్త ఉద్యోగాలకు అప్లయ్ చేసాను.
వారాలు గడిచిపోయాయి, రోజులు గడిచిపోయాయి. గంటలూ గడిచిపోయాయి. నిమిషాలూ గడిచిపోయాయి. ఆరోజు జనవరి 20 న ఆ సంస్థలో చివరి రోజు. ఒకవైపు ఒబామా దిగిపోతున్నాడు. మరోవైపు నేనూ దిగిపోతున్నా. అందరూ నాకు ఘనంగా వీడ్కోలు ఇస్తున్నారు. రేపటి నుండి ఉద్యోగం లేదు. బెంగ? నో ఛాన్స్. మరికొంతమంది కోలీగ్స్ ఆ రోజు లంచ్ కి తీసుకెళ్లారు. భోజనం మధ్యలో ఫోన్ కాల్. అదేంటో మీరు ఊహించుకోవొచ్చు. ఎప్పుడు వస్తావూ అని అడిగారు. నెల తరువాత అన్నా. ఫిబ్రవరి 20న కొత్త ఉద్యోగంలో చేరాను. ఎలా వుంది ఇదీ?
ఇంకో తాజా ఉదాహరణ ఇమ్మంటారా? పూర్తి వివరాలు చెప్పలేను - వెరీ పర్సనల్ కాబట్టి. ఇరవైరెండు ఏళ్ళకు పైగా ఒక విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నా. పరిష్కారం కావాలంటే అయిపోతుంది కానీ ఏదీ తగిన పరిష్కారం కాదు. అందుకే తటపటాయింపు. ఎగదీస్తే గోహత్యా, బిగదీస్తే బ్రాహ్మణహత్యా లాగా 22 ఏళ్ళపాటు కొట్టుమిట్టాడాను. అలా రెండూ కాకుండా మధ్యేరకంగా సూపర్ పరిష్కారం కావాలని రెండు నెలల క్రితం కోరుకున్నా కానీ పెద్దగా ఆ విషయం ఆలోచించకుండా వుండేందుకు ప్రయత్నించా. ఊహించని విధంగా చాలా తేలికపాటి గొప్ప పరిష్కారం నిన్న అనుకోకుండా లభించింది. ఓసోస్, ఇంత దానికోసం ఇరవై రెండు ఏళ్ళ నుండి కిందామీదా పడ్డానా సంభ్రమం చెందాను. అవి నాకు తెలియని విషయాలు కావు గానీ డాట్స్ కనెక్ట్ కాలేదు ఇప్పటివరకూ. అదండీ సంగతి. ఇలా అనుకుంటే అలా కలిసివస్తాయంతే. అంతే ఆ పరిష్కారం వెంటనే అమల్లో పెట్టేసేనోచ్ :) వావ్. వ్వాటె రిలీఫ్!
ఎన్ని ఉదాహరణలు వున్నా ఇంకా చాలా విషయాల్లో ఎలా అని నా మనస్సు బెంగపడుతూనే వుంటోంది. ఎలా అనే ఆలోచనను తగ్గించడం ఎలా? ఇదిగో ఇలానే. ఇలా వ్రాసుకుంటే క్లారిటీ వస్తుందీ, మనస్సులోకి విషయం బాగా సింక్ అవుతూంది. అద్గదీ సంగతి. ఇంక చాల్లెండి ఈ రోజుకి, మరీ ఎక్కువ కక్కేసుకున్నా బాగోదు! వెగటు కలుగుతుంది.
tarachu gaa vrayandi, mimmalni meeru tittukovadam baagaledu please, please increase the frequency of your writings- oka chaataka pakshi
ReplyDelete@ శ్రీ
ReplyDeleteనామీద బాగా శ్రద్ధతో ఇచ్చిన మీ వ్యాఖ్య నన్ను ఆలోచింపజేసింది. ధన్యవాదాలు. మీరు ఎవరో కానీ నా శ్రేయోభిలాషులు. సంతోషంగా వుంది.
ఇకపోతే నన్ను నేను తిట్టుకుంటున్నానా? అప్పుడప్పుడూ ఆత్మవిమర్శ కద్దు నా పోస్టుల్లో. ఇదివరలో అంటే ఒకటి రెండు ఏళ్ళకు ముందు నిజమే నన్ను నేను బాగా తిట్టుకునేవాడిని. ఇప్పుడు నన్ను నేను సెబ్బాసో అని తెగమెచ్చుకుంటూ వున్నానే! అన్నీ ఎంచక్కా కలిసివస్తున్నాయని అందరిముందూ ఆనందిస్తున్నానే! అయినా మీకు అలా అనిపిస్తోందంటే ఆలోచించదగ్గ విషయమే. తప్పకుండా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుంటా అండీ.
తరచుగా వ్రాయమన్నారు కదా. అది మాత్రం ప్రస్థుతానికి కుదరదేమో కానీ ప్రయత్నిస్తా...
Sarath Garu,
ReplyDeleteI remember you were dreaming about Lexus car as per law of attraction curious to know what happened to it
weight loss aa? change telusthondi photo lo.*
ReplyDelete@*
ReplyDeleteనేను కావాలనుకున్నట్లుగా పెరుగుతూ తగ్గుతూ వుంటాను. అందులో ఇబ్బంది ఏమీ లేదు. య్యా. కాస్త సన్నబడ్డా ఈమధ్యా.
mee eduruga memu vunna feeling,meeto matladutuu vunna feeling techharu sir, thanq , nenu kooda 'secret' meela follow avvataniki try chestanu.
ReplyDelete