నాది ఎవడన్నా ఎత్తుకుపోయాడేమో :(

అస్తమానం సిస్టం ముందు బ్రతుకు వేలాడదీయటమే మన పని కాబట్టి జీవితంలో కాస్త ఏక్టివిటీ పెంచుదామని ఉదయం కూడా జిమ్ము చేద్దామని ఇవాళ బయల్దేరాను. మా ఆఫీసు దగ్గరే జిమ్ము. జిమ్ము చేసి అటునుండి అటే ఆఫీసుకి వెళ్ళేలా ప్లాన్. అంతా బాగానే వుంది కానీ లాకర్ కి లాక్ తేవడం మరచిపోయాను. సరే అని ధైర్యం చేసి నావన్నీ లాకర్లో పెట్టి మరీ ఉదయమే ఏం బరువులెత్తుతాములే అని చెప్పి సానా గదిలో కూలబడ్డాను. వేడి ఆవిర్లు వస్తుంటే నాది ఎవడన్నా ఎత్తుకెళ్ళాడేమో అన్న కంగారుతో ఆవిరి గదిలో హాయిగా వున్నానన్న సుఖం కూడా లేకుండా పోయింది. మధ్యమధ్యలో వచ్చి చూసుకున్నాను. ఎవడూ ఎత్తుకెళ్ళలేదు. సంతోషం. ఇంతకీ నేను ఖంగారు పడింది దేనిగురించి అంటారూ? గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసి కామెంటండి. కరెక్టో కాదో టపా అడుగున చూడండి!
.



.





.




.
ఇంకా క్రిందికి

.


.


.



చెడ్డీ. దొంగకి చెప్పయినా లాభమే అంటారు. నా క్రెడిట్ కార్డులు ఎత్తుకెళతారన్న భయం లేదు లెండి - ఎందుకంటే మనకు క్రెడిట్ కార్డులు లేవు కదా. ఇక డెబిట్ కార్డులో డబ్బులుంటే కదా. ఏదో పదో పరకో వుంటాయి లెండి. అంతే. డబ్బులు పెట్టుకోని దానికి డెబిట్ కార్డులెందుకు అని పిల్లకాకులకు సందేహాలు రాకూడదంతే. ఇక మిగతావంటారా మరీ అంత ముఖ్యం కాదు. చెడ్డీ లేకపోతే చేతులు ఊపుకుంటూ ఆఫీసుకి ఎలా వెళ్ళేదీ? సరే అలా వెళ్ళానే అనుకోండి ఎప్పుడన్నా మరచిపోయి అలవాటులో పొరపాటుగా ఎప్పుడన్నా  జిప్పు యమ స్పీడుగా లాగించాననుకోండి - నా గతేం కానూ!  అప్పుడు నా బాధ మళ్ళీ ఇలా నా బ్లాగులో చెప్పుకోవాల్సిందే కదా.

గుడిలో వస్త్రధారణపై ఆంక్షలు మానవ హక్కుల ఆంశమా?

ఒక టపాలో పిల్ల కాకి బ్లాగర్ క్రిష్ణ ఈ క్రింది సందేహాలు వెలిబుచ్చారు:
@ శరత్ గారు,


వారాంతం ఎంజాయ్ చేస్తున్నారా ? సరే , గుడిలో వస్త్ర ధారణ , బడిలో గే పంతులు ... మోకాలికి , బోడి గుండుకి వున్నంత సంబంధం కూడా కనిపియ్యలేదా ! ఒక్కొసారి మనకి అనవసరం అనిపించే విషయాలని మన మనసు సరిగా పట్టించుకోదు. పోలిక చెబుతా మరి.

1) గుడికి వచ్చే వారు ఇలా వుండాలి అని కట్టుబాటులు - ఒక బడిలో పంతులు గారు ప్రిఫరెన్సెస్ ఇలానే వుండాలి తమ చర్య ద్వారా చెప్పిన బడి యజమాన్యం.

2) తమ వస్త్రాలతో అసభ్యంగా వున్నారా లేదా అన్నది ముఖ్య విషయం కాకుండా , పాశ్చాత్యత , సంప్రదాయత ముఖ్య విషయం కావడం - తమ విధ్యార్దులని ఎబ్యూజ్ చేస్తుండడానికి స్ట్రెయిటా , గే నా అన్నది ముఖ్యం కాదని గుర్తించక పోవడం !

3) పాశ్చాత్య వస్త్ర ధారణలో కూడా సభ్యత వుండవచ్చని, గే కూడా సభ్యత సంస్కారాలు కలిగే వుండవచ్చని గుర్తించక పోవడం !

4) గే అయ్యినంత మాత్రాన , బడిలో కూడా అదే యావ తో వుంటారనుకోవడం - గుడిలో పాశ్చాత్య వస్త్ర ధారణ తో వున్నంత మాత్రాన విచ్చల విడిగా వుంటారు అనుకోవడం ! ( ఈ రెండు అభిప్రాయాలు పిచ్చ తప్పు .. ఇది పాపులర్ అభిప్రాయం. స్కర్టులు వేసుకున్న పిల్ల బరి తెగించడం ఎంత నిజమో, చీర కట్టుకున్న వారు అందరూ పాతివ్రత్యం పాటిస్తారన్నది అంతే నిజం )

5) తన ప్రవృత్తి ఇది అని చెప్పుకున్న గే ని చూసి ఎవరైనా గే అయ్యిపోతారా ? ( ఆ లక్షణాలు వున్న వారు బహుశా అప్రోచ్ అవ్వచ్చు నేమో ?) వారిలో ఆ లక్షణాలు వుండాలి గాని - పాశ్చాత్య వస్త్ర ధారణ లో వున్న వాళ్లని చూడగానే మనసు చెడిపోతుందా ? ( ఆ చెడిపోయే వారు చీర కట్టుకున్న వారిని చూసి చెడిపోరా ?) రెండు సందర్భాలలో అలా మారి పోయేవారిదే తప్పు గాని, మార్చే వారు ఎవరైనా వుంటారా ?

6) స్ట్రెయిట్ లెక్చరర్లు అమ్మాయిలని వేదించడం చూసి చూడనట్టు ఊరుకునే యజమాన్యాలు, ఆ విషయాలు బయటకి పొక్కి తరువాత గొడవ అవ్వడం..

మగ వారు వస్త్రధారణ అసభ్యంగా ( పాశ్చాత్యమా లేక సంప్రదాయమా అని కాదు అసభ్యమన్నదే ప్రశ్న )వున్న పట్టించుకోని గుడి పెద్దలు ( ఒక్కో చోట చొక్కా నిషిద్ధం.. ఒక్కో చోట పై పంచే కూడా నిషిద్ధం వారే చేస్తారు ) ..

ఇవి పోలికలు. ఇక మరొక ప్రశ్న.. ఆస్తిక స్వలింగ సంపర్కులు.. పెళ్లి చేసుకుని గుడికి దర్శనం కి వెళితే ప్రవేశం లేదు అంటే అప్పుడు కూడా గుడీ కాబట్టి హక్కులు గురిచి మాట్లాడనక్కరలేదు అంటారా ? గేల హక్కులు మాత్రమే హక్కులా ? వారిని మాత్రమే మిగిలిన మగ వారి తో / ఆడవారి తో సమానంగా చూడాలా ? మగ ఆడ మధ్య సమానత్వం అక్కరలేదా ? సభ్యత ముఖ్యమా ? సంప్రదాయత ముఖ్యమా ? సంస్కారం ముఖ్యమా లేక సెక్సువల్ ప్రిఫెరెన్స్ ముఖ్యమా ?

దయ చేసి ప్రతి పాయింటుకి సమాధానం ఇవ్వండి.

నా సమాధానం/వివరణ:

1. గుడి అయినా బడి అయినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా లేదా అన్నది చూడాలి. తిరుపతి గుడి వస్త్రధారణ ఆంక్షలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేం. కొన్ని పబ్ లల్లో సూట్ వేసుకొనే రావాలంటారు. అలాంటివాటిని హక్కుల ఉల్లంఘనగా భావించలేం. అలాంటి ఆంక్షల్లొ ఔచిత్యం తప్పితే, మితిమీరితే హక్కుల ఉల్లంఘన జరగవచ్చు. గే ప్రొఫెసర్ అని వెలివేయడం హక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుంది కాబట్టి మనం ప్రొటెస్ట్ చేస్తాం.

2. ఒక డాక్టర్ మంచి పరిజ్ఞ్ఞానం వుండి కూడా చింపిరి గడ్డంతోనూ, చింపిరి దుస్తులతోనూ వచ్చాడనుకోండి - అతని చికిత్స పై మీకు గౌరవం వుంటుందా? ఇదీ అంతే. ఒక ప్రదేశం యొక్క ఔన్నత్యం నిలపడం కోసం అలాంటి ఆక్షలు విధిండంలో పొరపాటు ఏమీ లేదు. అలాంటి ఆంక్షలు సాధారణంగా చాలాచోట్ల వివిధ వేదికలలో కనపడుతున్నదే.

3. పాశ్చాత్య దుస్తుల్లో సభ్యత వుండవచ్చు కానీ సాంప్రదాయం వుండదు. గుడులల్లో సాంప్రదాయం కూడా ముఖ్యమే. మా ఆవిడ (ఒహవేళ) బయట బికినీలు వేసుకొని తిరిగినా నాకు అభ్యంతరం వుండదు కానీ ఆలయాలకూ, తెలుగు ఫంక్షనులకూ వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంటే బావుంటుందని సూచిస్తాను. ఓ రెండు నెలల క్రితం చికాగోలో ఓ తెలుగు పాప పుట్టినరోజు ఫంక్షనుకి వెళ్ళాము. అక్కడికి వచ్చిన స్త్రీలందరూ, ఆ పాప తల్లితో సహా ఒక రకమయిన దుస్తుల్లో వస్తే మా ఆవిడను ఒక్కదాన్ని మరో రకం దుస్తుల్లో చూసి ఆశ్చర్యం కలిగింది. మా ఆవిడ కట్టుకున్నది చీర!

4. నిజమే కానీ గుడుల్లో సాంప్రదాయకంగా వుండాలని కోరడం హక్కుల ఉల్లంఘన క్రిందికి రాకపోగా అది సబబు అనిపించుకుంటుంది. బడుల్లో సాంప్రాదాయిక ప్రవృత్తి మాత్రమే వుండాలనుకోవడం ఔచిత్యం కాదు.

5. ఎక్కడయినా చెడు తలపులు రావచ్చు. అయితే ఆ తలపులు తగ్గించడం వారి ఉద్దేశ్యం కావచ్చు. సాంప్రదాయిక మయిన వాతావరణంలో అలాంటి ఆలోచనలకు ఆస్కారం తక్కువగా వుంటుంది.

6. మగవాడికి ఛాతిమీద ఆఛ్ఛాదన లేకపోయినా అసభ్యం అనిపించుకోదు కదా. మరీ ఇక్కడ కూడా సమాన హక్కులు డిమాండ్ చేసి ఆడాళ్ళు కూడా అలాగే వుండాలని కోరడం బావోదేమో ;)

స్వలింగ సంపర్కుల ఆలయ ప్రవేశం మీద నిషేధం హక్కుల ఉల్లంఘన క్రిందికే వస్తుంది. అందరి హక్కులూ హక్కులే. కాకపోతే అన్నింటికీ అందరూ స్పందించలేరు, పోరాడలేరు కాబట్టి నాలాంటి వారు గే హక్కుల విషయలో ఎక్కువగా స్పందిస్తుంటారు. గుడుల్లో సభ్యత, సంస్కారం రెండూ ముఖ్యమే. సంస్కారం సెక్సువల్ ప్రెఫరెన్సును బట్టి వుండదు - వ్యక్తిత్వాన్ని బట్టి వుంటుంది.

డెట్రాయిట్ బ్లాగర్లతో జరిగిన నా సమావేశం

కొత్తపాళీ: రెండేళ్ళ క్రితం డెట్రాయిట్ తెలుగు సాహితీ సమావేశాల్లో కొత్తపాళీని కలిసాను. వారు మంచి స్నేహశీలిగా, సరదాగా అనిపించారు. అప్పట్లో బ్లాగులకి నేనింకా కొత్తనే కనుక వారి ప్రముఖత్వం (మంచిగా, చెడ్డగా(?!)) నాకు అంతగా తెలియదు. అప్పటి నుండి వారితో పెన్ను స్నేహం అనగా ఈమెయిల్ స్నేహం నడుస్తూనే వుంది. బ్లాగు మరియు పుస్తక ధర్మ సందేహాలు ఏమయినా వుంటే వారిని అడుగుతుంటాను - వారు ఆలస్యం కాకుండా తీర్చేస్తూవుంటారు. గత ఏడాది జరిగిన డెట్రాయిట్ తెలుగు సాహితీ సమావేశాలకి నేను వెళ్ళలేకపోవడం వల్ల మరో సారి వారిని ముఖాముఖి కలుసుకునే అవకాశం తప్పింది. ఒకసారి డెట్రాయిట్ మీదుగా నేను కెనడా వెళ్ళానని తెలిసి ఈ సారి అలా వెళితే తమకు తెలియపరిస్తే డెట్రాయిట్ బ్లాగర్లతో సమావేశం ఏర్పాటు చేద్దామనీ, ఆ విధంగా మనం అందరం కలవ్వచ్చని వారు సూచించారు. నేను సరే అన్నాను.

డెట్రాయిటులో వారి రంగుటద్దాల కిటికీ పుస్తక అవిష్కరణ సభకీ వెళదామనుకున్నాను కానీ కుదరలేదు. అదే విషయాన్ని వారికి తెలిపాను. మీరు ఎప్పుడూ వస్తామనో, కలుద్దామనో అంటారు కానీ మీరు రారు అని అలిగినంత పని చేసారు. దానితో ఈ సారి కెనడాకి వెళ్ళేటప్పుడు ఎలాగయినా కొత్తపాళీని కలుస్తూ వెళ్ళాలని కంకణం కట్టుకున్నాను.

మార్చి నెలలో కెనడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదే విషయాన్ని వారికి తెలిపి మీకు వీలయితే కలుద్దాము అని చెప్పాను. ఆ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు లోగా మీటింగ్ ఏర్పాటు చేస్తే నాకు సౌకర్యంగా వుంటుందని తెలిపాను. కుటుంబంతో సహా వచ్చేస్తున్నాననీ తెలిపాను. కాలాస్త్రి శ్రీ ఈ విషయాలు సమన్వయం చేసి ఆ శనివారం ఉదయం 10 గంటలకు తమ ఇంట్లోనే మనం కలుద్దాము అని తెలిపారు.

కాలాస్త్రి శ్రీ: వీరు కూడా నాకు రెండేళ్ళ క్రితం డెట్రాయిట్ సాహితీ సమావేశాలలో కలిసారు. చాలా చక్కగా మాట్లాడారు. మంచి స్నేహశీలిగా అనిపించారు. గత ఏడాది డెట్రాయిట్ సాహితీ సమావేశాలకి వెళ్ళలేకపోవడంతో వారిని మరో సారి కలిసే అవకాశం కుదరలేదు. కొత్తపాళీ పుస్తకావిష్కరణ సభకి నన్ను తప్పని సరిగా రమ్మని ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేకపోయాను. ఫిబ్రవరిలోనో, మార్చి లోనో షికాగో లో మేము వుండే ప్లేసుకు దగ్గర్లోనే వారు వచ్చారు. అక్కడ వారి మిత్రులు వున్నారు. అక్కడికి వెళ్ళి వారిని మా ఇంటికి తీసుకువచ్చాను. ఓ గంట తెలుగు బ్లాగుల గురించి ముచ్చట్లు పెట్టుకున్నాము. మా ఆవిడ గారెలు చేసి పెడితే లాగించాము. భోజనానికి వారిని వుండమన్నాను కానీ వారికి తమ స్నేహితులతో గుడికి వెళ్ళే పని వుండటంతో కుదరలేదు. మా చిన్నమ్మాయి వారిని ఇంకాస్సేపు వుండమని బాగా కోరింది. కానీ వారికి పని వుండటం మూలాన వెళతానంటే వారిని వారి స్నేహితుల ఇంటి వద్ద దిగబెట్టి వచ్చాను.  

కొద్ది రోజుల తరువాత నేను కెనడా వెళుతున్నాననీ మీకందరికీ వీలయితే దారిలో డెట్రాయిట్ బ్లాగర్లని కలిసి వెళతానని వారికి చెప్పాను. నా కుటుంబంతో సహా వచ్చేసి అటునుండి సరాసరి కెనడా వెళతామని చెప్పాను. కొత్తపాళీ తోనూ, ఇంకో బ్లాగర్ తోనూ మాట్లాడి ఆ శనివారం ఉదయం తమ ఇంటిలోనే సమావేశం అవుదామనీ వారు తెలియపరిచారు.

అంతా అంతా సవ్యంగానే వుంది. భేశ్ కదూ. కాదు. నా కష్టాల్, నష్టాల్ అప్పటినుండే మొదలయ్యాయి. ఓ ప్రహసనానికిది అంతం కాదిది ఆరంభం మాత్రమే. అస్సలేమయ్యింది అన్న విషయం సరదాగా మరో టపాలో!

కొత్తపాళీ & శ్రీ: మీరు ఈ టపాలు చదువుతున్నారా? చదువుతుంటే కనుక హాజరు వేసుకోండి :)

గేర్ రాడ్ ఎక్కడ?

మేము టోరొంటోలో వుంటున్నప్పుడు నా స్నేహితుడు ఒకరు తొలిసారిగా డ్రైవింగ్ టెస్టుకి వెళ్ళాడు. ఒక లావు పాటి ఎగ్జామినర్ ఈ పరీక్ష నిర్వహించడం కోసం అతనితో పాటుగా కారులో కూర్చున్నది. మొదటి సారి డ్రైవింగ్ టెస్టు కాబట్టి మనవాడు సహజంగానే ఖంగారు పడ్డాడు. కార్ స్టార్ట్ చేసిన తరువాత గేర్ రాడ్ కోసం వెతికాడు. కొద్ది క్షణాలకే చెయ్యి తియ్యి అని కఠినంగా వినిపిస్తే ఎగ్జామినర్ వైపు చూసాడు, ఆమె ఆగ్రహంతో వుంది. గేర్ రాడ్ కోసం ఎక్కడ వెతికాడో అర్ధమయ్యి బలంగా నాలిక కరచుకున్నాడు.

ఈ విషయం విన్న తరువాత అతనితో "గేర్ రాడ్ వుండేది మగవారికి కదా" అన్నాను. కార్ గేర్ రాడ్ కోసం మా స్నేహితుడు ఎక్కడ వెతికి వుంటాడో, ఆ పరీక్షా ఫలితం ఏమయ్యిందో, ఆ పరిస్థితిలో ఆడ ఎగ్జామినర్ బదులుగా మగ ఎగ్జామినర్ వుండి వుంటే ఏమయ్యివుండేదో  ఇక మీరు తేలిగ్గా ఊహించెయ్యవచ్చు.

Zits :))

మీ ఇంట్లో టీనేజ్ పిల్లలున్నారా?

షికాగో ట్రిబ్యూన్ న్యూస్ పేపర్ తెప్పించుకుంటాను నేను. అందులో జిట్స్ అనే కామిక్ స్ట్రిప్ బాగా నవ్వు తెప్పిస్తుంది. టీనేజీ పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలు ఎలా వుంటాయో అందులో బాగా వ్యంగ్యంగా చిత్రీకరిస్తుంటారు. మా టీనేజి అమ్మాయి ని వాటితో పోలుస్తూ వుంటే చాలా వరకు నిజమయ్యి భలే నవ్వొస్తుంటుంది నాకు.

మీరూ సరదాగా ఓ లుక్కెయ్యండి మరి :)

"Zits is the worst name for a comic strip since Peanuts."

—Charles Schulz
 
Zits is an award winning comic strip written by Jerry Scott (creator of Baby Blues and one-time cartoonist for Nancy) and illustrated by Jim Borgman about the life of 15-year-old high school freshman Jeremy Duncan.

Jeremy lives with his parents, Walt and Connie, who both possess boring jobs and spectacular ignorance (according to Jeremy, anyway). He dreams of 'making it big' as a rock musician, but feels like he lives in the shadow of his highly successful college brother Chad.

Many strips deal with relationships with his friends, the sensible Hector and the extremist Pierce, not to mention his on-off girlfriend Sara. Notably for a teen strip, many of the comics also deal with Connie and Walt, and many of the Crowning Moments Of Funny come from their perspectives.

As a comic strip, Zits works incredibly well — teenagers will easily recognize their parents' constant presence in Walt and Connie, while adults will both remember their own teenage years and recognize their own children in Jeremy's laid-back nature.
 

నా కళ్ళద్దాలెక్కడ?

మా ఆవిడకి సాధారణంగా దొరికిపోను కానీ నా కళ్ళద్దాలు కనపడకుండా పోయినప్పుడు మాత్రం దొరికిపోతుంటాను. ఏదన్నా ముఖ్యమయిన పని మీద బయటకి వెళ్ళాల్సివచ్చినప్పుడే నా స్పెక్ట్స్ కనిపించకుండా పోతాయి. వాటికోసం వెతుకుతూ ఇల్లంతా చిందులేసినా అవి నాకు దొరకవుగాక దొరకవు. అదేంటో మా ఆవిడ వెతికితే మాత్రం వీజీగా దొరుకుతాయి.

నా అద్దాలు తప్పిపోయినప్పుడు యథాశక్తిగా కాస్సేపు వెతుకుతాను. సరిగ్గా చూపు ఆనకనే కదా అద్దాలు పెట్టుకొనేది - ఆ ఆద్దాలే తప్పిపోతే నా నానా కష్టాలు మీ భగవంతునికే ఎరుక :(  వెతికి వెతికి ఇక లాభం లేదని మా ఆవిడకి నా మొర వెళ్ళబుచ్చుకుంటాను. ఈ భాగోతం మామూలే కదా అని తను చూస్తున్న సీరియల్ నుండి తల కూడా తిప్పదు. ఈ చెవిన విని ఆ చెవిన పారేస్తుంది. సీరియళ్ళ కోడళ్ళ కష్టాల ఆక్రందనలు చెవుల్లోకి ఎక్కుతాయి కానీ పతి దేవుని అద్దాల కష్టాలు ఎన్నటికి తలకెక్కాలీ? మా ఆవిడ ప్రస్తుతం స్పందించుటలేదు అని నిర్ధారణ అయిన తరువాత ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తుంటాను.

మొదటి ప్రత్యామ్నాయం - మా పెద్ద పాప. నా అద్దాలు వెతుకు స్నీ అని అరుస్తాను. అలాగే డాడీ అని గూగుల్లో 'శరత్ - స్పెక్ట్స్' అని వెతుకుతుంది. నో రిజల్ట్స్ డాడీ అని తను మళ్ళీ కేకేస్తుంది. ఇహ దానితో పని కాదని చెప్పి మా చిన్న గడుగ్గాయిని నా అద్దాలు వెతకమని బ్రతిమలాడుతాను. పాపం అది మూడులో వుంటే బాగానే కష్టపడి వెతుకుతుంది కానీ సాధారణంగా దానికి కూడా దొరకవు. ఇహ మూడు లేకపోతే హూ కేర్స్, వాటెవర్, ఐ డోంట్ కేర్ అనో అనేసి నన్ను దులిపేసుకుంటుంది. ఇక లాభం లేక, బిక్క మొఖం వేసుకొని మా ఆవిడ చెంత కూర్చొని బేల ముఖం వేసుకొని నా గోడును వెళ్ళబోసుకుంటాను.

ఎప్పుడూ జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకుంటే ఏం పోయింది అని గయ్ మంటుంది. నేను సవినయంగా జాగ్రత్తగానే పెట్టుకున్నాను కానీ ఎక్కడ జాగ్రత్త చేసి పెట్టానో గుర్తుకు వచ్చి ఛావడం లేదు అని తెలియజేసుకుంటాను. నాకెప్పుడూ నీ అద్దాలు వెతకడమే పనా అని కూర్చున్నచోటునుండి కదలకుండా, సీరియల్ సీరియస్సుగా చూస్తూ అరుస్తుంది. నేను వ్యూహాత్మక మౌనం పాటిస్తూ చేతులు నులుపుకుంటూ అలాగే బిక్క మొఖం కంటిన్యూ చేస్తుంటాను. అప్పుడు నా మీద జాలి కలిగి చూస్తున్న సినిమానో, సీరియల్లో త్యాగం చేసేసి నా అద్దాలు వెతకడానికి ఉపక్రమిస్తుంది.

అంతటితో ఈ శరత్ కష్టాలు తీరతాయని అనుకుంటున్నారా? అబ్బే లేదు. ఇది అంతం కాదిది ఆరంభం మాత్రమే. నా బలహీన క్షణాలు మా ఆవిడకి తెలుసు కదా. అలా అలా అలవోకగా అద్దాలు వెతుకుతూ ఎన్ని రోజులుగానో నా మీద పేర్చుకున్న ఆగ్రహం, విసుగు, కోపం లాంటివి వుంటే అవన్నీ తాపీగా నామీద తీర్చేసుకుంటుంది. మామూలుగా నయితే నేను ఇంట్లో కూడా ఎవరినీ మాట మాట్లాడనీయకుండా నా తొడ కొడుతూ వుంటాను కదా. ఇప్పుడయితే ఏమని అన్నా కుక్కిన పేనులాగా పడివుంటాను. ఇదే అదనుగా నా మీద మాటలతో తీర్చుకోవాల్సిన ప్రతీకారాలన్నీ తీర్చేసుకుంటుంది. ఎప్పటెప్పటి విషయాలో ఆడాళ్లకి భలేగా గుర్తుంటాయి. అవన్నీ ఇదే అదనుగా ప్రశ్నిస్తుంది. నేను ఏమన్నా ఎదురు తిరిగి మాట్లాడితే ఆమె నా అద్దాలు వెతకదు కదా. అందుకే ఆ వాగ్బాణాలు మౌనంగా భరిస్తూ మనస్సులో బుసలు కొడుతూవుంటాను. అనువు కానప్పుడు అధికులమనరాదు కదా!  

అదేంటోనండి - నా కళ్ళద్దాలు మా ఆవిడకి వీజీగా దొరికేస్తుంటాయి. ఇక్కడే వున్నాయి కదా - సరిగ్గా వెతుక్కొని చావడం రాదు. ఈ సారి నుండయినా జాగ్రత్తగా పెట్టుకో - మరో సారి అద్దాలు వెతికేది లేదు అంటూ వార్నింగు సుభాషితాలు పలుకుతూ అద్దాలు నా చేతికి ఇస్తుంది. ఆమెకు కనపడిన చోటే ఎన్నో సార్లు నేను వెతికినా నాకు అవి కనపడవు ఎందుకో మరి.

కార్డ్‌లెస్ ఫోను దొరకకపోతే దానికి బేస్ నుండి పేజ్ చేయవచ్చు కదా. అలాగే ఈ అద్దాలు తప్పిపోతే దొరకడానికి అలాంటి పేజింగ్ సిస్టం ఎవరయినా కనిపెడితే ఎంత బాగుండును. నా కష్టాలు కొన్ని అయినా తీరేవి కదా.

ఈ చిత్రం ఏమిటో, ఎవరిదో మీకు ఈపాటికి తెలిసేవుంటుంది...


తెలియకపోతే ఊహించండి. లేటెస్ట్ వార్తలు చూడండి. అయినా అర్ధం కాకపోతే అడగండి. నా అభిమాన నటిది ఈ చిత్రం! అందుకే బ్లాగులో వేసుకున్నా!

పానీపూరీ, డల్లాస్ నాగ్ లను టెక్సాస్ లో కలిసిన విధం బెట్టిదన...

నా బ్లాగు మిత్రులు నన్ను కలవడనికి వస్తున్నారని తెలిసిన ఇతర మిత్రులు ఈ విషయం పై ఆసక్తి ప్రదర్శించారు. పైగా ఇదివరకెప్పుడు చూడని స్నేహితులను కలవడం పై ఎలాంటి ఉత్సూత వుంటుందో వ్యాఖ్యానించారు. ఎప్పుడెప్పుడు బ్లాగ్మిత్రులు వస్తారా అని ఎదురుచూస్తూవుంటే అక్కడ వున్న ఇతర మిత్రులు సరదాగా కామెంట్లు వేసారు.  

పానీపూరి ని నేను బస చేస్తున్న ఇంటికే రమ్మని ఆహ్వానించాను. వారు ఇదివరకు నా ఫోటో కానీ, వీడియో కానీ చూడలేదట. నేను కూడా వారిని చూడటం ఇదే ప్రధమం. వారి కలం పేరు వున్నంత సరదాగా వారు అనిపించలేదు. వారి కలం పేరుకి, బ్లాగు వ్యక్తిత్వానికీ, నిజమయిన వ్యక్తిత్వానికి తేడా వుంది. నిజ జీవితంలో వారు కాస్త రిజర్వుడుగా, ఫార్మల్ గా అనిపించారు. ఫార్మల్ గా మా మధ్య సంభాషణ నడిచింది. వారి గురించి నేను, నా గురించి వారు ప్రాధమిక విషయాలు తెలుసుకున్నాం.    

మేము మాట్లాడుకుంటుండగానే మధ్యలో డల్లాస్ నాగ్ వచ్చారు. వారి పేరుకి తగ్గట్టె హుశారుగా వున్నారు. చలాకీగా మాట్లాడారు.  పానీపూరీ, నాగ్ ల పరిచయం కూడా అప్పుడే. ఇక ముగ్గురం బ్లాగర్లం కలిసాము కాబట్టి బ్లాగుల మీద, బ్లాగర్ల మీద, బ్లాగుల్లో సమకాలీన రాజకీయాల మీద అందరం సరదాగా ముచ్చటించుకున్నాం.   అయితే మా వాళ్లంతా అనుకోకుండా వేరే చోటికి వెళ్ళే ప్రొగ్రాం పెట్టేయడంతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాము. మా బ్లాగర్ల సమావేశాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. ఇహ చాలు, మీ సమావేశం ముగించి బయలుదేరండి అన్న నా హై కమాండ్ ఆజ్ఞ విని హడావిడిగా కబుర్లు ఆపాము. నాకు వేరే ప్రోగ్రాం లేకపోయివుంటే మా ముచ్చట్లు ఇంకా ఎంతకాలం సాగివుండేవో. తనివి తీరని ముచ్చట్లతో అలా ముగ్గురం అర్ధాంతరంగా వీడ్కోలు తీసుకున్నాం. మిగతా విషయాలు ఫోనులో మాట్లాడుకోవాలని అనుకున్నాం.  

మా బుల్లి (వీడియో) బ్లాగర్ అమ్మలు ని ఇద్దరికీ పరిచయం చేసాను కానీ తను బ్యుజీగా వుండటం వల్ల మమ్మల్ని అంతగా లెక్కచేయలేదు. నా మిగతా కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసాను.  కొంతమంది ఇతర మిత్రులని కూడా పరిచయం చేయగలిగాను. మా సమావేశానికి ఏర్పాట్లు చేసి, మా అవసరాలు కనుక్కున్న నా మిత్రుడు రెడ్డి (గారు) కి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.  సమయాతీతమవుతున్న హడావిడిలో మేము ఫోటోలు తీసుకోవడం మరచేపోయాము.  

పేరులోనేముందో లేదో కానీ రివర్సు వుండొచ్చు... జాగ్రత్త!

టొరొంటోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు టర్కిష్ కోలీగ్ వుండేవాడు. పిల్లలకు పేరు పెట్టేముందు ముందూ, వెనకా అన్నీ చూడాలనీ, లేకపోతే పిల్లలకు స్కూలులో ఇబ్బందులు ఎదురవుతాయనీ చెప్పాడు. పేరుని రివర్సు చేసి లేదా అటు తిప్పీ, ఇటు తిప్పీ పిల్లల స్నేహితులు ఆటపట్టిస్తారనీ చెప్పాడు.  వాళ్ళమ్మాయికి తెలియక ఒక పేరు పెట్టాడట. దానిని రివర్స్ చేసి బడిలో పిల్లలు వెక్కిరించేవారుట. ఆ విధంగా ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోయిందంట. కాలేజీలో కూడా అలా అవస్థల పాలయ్యిందంట.

ఏమిటా పేరు అని మరో కోలీగు అడగనే అడిగేసాడు. వద్దులే బావుండదులే అన్నాడు మా టర్కిష్ కోలీగ్. ఫర్వాలేదులే, మనమే కదా వున్నాం, చెప్పు, చెప్పు అని ఆ కోలీగ్ ప్రోత్సహించాడు. సరే అని అప్పుడు చెప్పాడు మా టర్కిష్ కోలీగ్ తన కూతురి పేరు.  SUNA

మా పెద్దమ్మాయి ఇండియాలోనే పుట్టింది కాబట్టి అక్కడే పేరు పెట్టాము కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందీ ఇంతవరకు ఎదురుకాలేదు.    మా రెండో అమ్మాయి టొరొంటోలో పుట్టింది.  పేరు పెట్టేటప్పుడు మా కోలీగ్ చెప్పిన విషయాలు దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా పెట్టాము. ఇప్పటి వరకయితే ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు.

పై ఫోటోలొని పేరు మీకు అర్ధమయ్యిందా? బల్బ్ వెలిగిందా లేదా :))   

తిరుపతికి ఇకపై స్కిన్ టైట్ వస్త్రాలు నిషిద్ధం - కాని సిబ్బంది పనులు మాత్రం అసహ్యం

అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. 

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/jun/4/latest/4new26

అందులో ఇలా వుంది...

...అయితే ఒకవైపు టి.టి.డి. పాలకమండలి ఈ రకమైన మార్గ దర్శక సూత్రాలను భక్తులకు నిర్దేశిస్తుంటే, ఆలయంలో దర్శనంకోసం వరుసలో నిల్చునే భక్తులను నియంత్రించే మిషతో సిబ్బంది మాత్రం మహిళాభక్తుల పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. దేవుని దర్శించుకోవడానికి పిల్లా జెల్లలతో వచ్చే మహిళా భక్తులను ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి, అది కూడా కావాలని చేతులు వేసి మంచీ మర్యాదా లేకుండా దురుసుగా ప్రవర్తించే భద్రతా సిబ్బంది చేష్టలు చెప్పనలవి కాదు. మరి ఇటువంటి సంఘటనలపై చర్యలు ఏవని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా శుక్రవారంనాడే చిత్తూరు జిల్లానుంచి పాపను ఎత్తుకుని దైవ దర్శనానికి వచ్చిన ఒక మహిళను ఒక స్కౌట్ నడుంపై గిల్లిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఎంతో మనోవేదనకు గురైన ఆ మహిళ ఇదేం పద్ధతి అని ప్రశ్నించినా తగిన సమాధానం ఆలయ పెద్దలనుంచి రాలేదు. ఆమె చివరికి కన్నీళ్లపర్యంతమై కలియుగ దైవాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగింది. 

ఈ వార్త చూసాక నాకొక విషయం గుర్తుకువచ్చింది. ఓ మూడేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఆస్తికురాలయిన నా భార్య కోరిక మేరకు ఆమెకు తోడుగా నాస్తికుడిని అయిన నేను కూడా తిరుపతి, తిరుమల దర్శించుకున్నాను. ఆలయాల్లో వుండే మంచి విషయాలనూ, మోసాలనూ గమనిస్తూ వెళ్ళాను. తిరుమల గుడిలో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులను అదుపుచేసే ఆలయ పోలీసు ఒకరు అవసరం లేకున్నా మా ఆవిడ భుజం మీద చేతులు వేసి నొక్కుతూ ముందుకు తోసాడు. ఆమె నెమ్మదిగా నడుస్తున్నా, నిలబడే వున్నా ఏమో అనుకోవచ్చు.  కానీ ముందు వున్నవారితో కలిసి వడివడిగా నడుస్తూనే వున్నా కూడా కావాలని ఆ పోలీసు గుడిలో ప్రవర్తించిన పద్ధతిని జీర్ణించుకోలేకపోయాను. మా ఆవిడ అసహనం వ్యక్తపరచి ముందుకు సాగిపోయింది. అతను ఏమీ ఎరుగనట్లే ముఖం తిప్పుకున్నాడు. తిరుమల గుడిలో సంస్కృతి ఇదే నేమోనని మిన్నకుండిపోయాను. ఎవరికయినా ఆ విషయం ఫిర్యాదు చేద్దామనుకున్నా కానీ ఆస్తికులకు లేని దురద నాస్తికుడిని అయిన నాకెందుకులే అని దులిపేసుకున్నాను.  ఒక సారి అనుభవం అయ్యింది కాబట్టి ఈ సారి ఏ గుడికి అయినా ఇండియాలో తోడుగా వెళ్ళాల్సివస్తే అప్రమత్తంగా వుంటాను.