అస్తమానం సిస్టం ముందు బ్రతుకు వేలాడదీయటమే మన పని కాబట్టి జీవితంలో కాస్త ఏక్టివిటీ పెంచుదామని ఉదయం కూడా జిమ్ము చేద్దామని ఇవాళ బయల్దేరాను. మా ఆఫీసు దగ్గరే జిమ్ము. జిమ్ము చేసి అటునుండి అటే ఆఫీసుకి వెళ్ళేలా ప్లాన్. అంతా బాగానే వుంది కానీ లాకర్ కి లాక్ తేవడం మరచిపోయాను. సరే అని ధైర్యం చేసి నావన్నీ లాకర్లో పెట్టి మరీ ఉదయమే ఏం బరువులెత్తుతాములే అని చెప్పి సానా గదిలో కూలబడ్డాను. వేడి ఆవిర్లు వస్తుంటే నాది ఎవడన్నా ఎత్తుకెళ్ళాడేమో అన్న కంగారుతో ఆవిరి గదిలో హాయిగా వున్నానన్న సుఖం కూడా లేకుండా పోయింది. మధ్యమధ్యలో వచ్చి చూసుకున్నాను. ఎవడూ ఎత్తుకెళ్ళలేదు. సంతోషం. ఇంతకీ నేను ఖంగారు పడింది దేనిగురించి అంటారూ? గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసి కామెంటండి. కరెక్టో కాదో టపా అడుగున చూడండి!
.
.
.
.
ఇంకా క్రిందికి
.
.
.
చెడ్డీ. దొంగకి చెప్పయినా లాభమే అంటారు. నా క్రెడిట్ కార్డులు ఎత్తుకెళతారన్న భయం లేదు లెండి - ఎందుకంటే మనకు క్రెడిట్ కార్డులు లేవు కదా. ఇక డెబిట్ కార్డులో డబ్బులుంటే కదా. ఏదో పదో పరకో వుంటాయి లెండి. అంతే. డబ్బులు పెట్టుకోని దానికి డెబిట్ కార్డులెందుకు అని పిల్లకాకులకు సందేహాలు రాకూడదంతే. ఇక మిగతావంటారా మరీ అంత ముఖ్యం కాదు. చెడ్డీ లేకపోతే చేతులు ఊపుకుంటూ ఆఫీసుకి ఎలా వెళ్ళేదీ? సరే అలా వెళ్ళానే అనుకోండి ఎప్పుడన్నా మరచిపోయి అలవాటులో పొరపాటుగా ఎప్పుడన్నా జిప్పు యమ స్పీడుగా లాగించాననుకోండి - నా గతేం కానూ! అప్పుడు నా బాధ మళ్ళీ ఇలా నా బ్లాగులో చెప్పుకోవాల్సిందే కదా.
mee bava oka video create chesadu, chusara ?
ReplyDeletehttp://www.dailymotion.com/video/xe1c2i_yyyyyyy_people
Disclaimer :
Ee video chusi meeku emi jarigina deeniki "pra pi sa sa" bhadhyata vahinchadu.
Ekalingam gaaru sorry chepparu.
naakkuda etuvanti sambandham ledu.
@ భద్రి
ReplyDeleteఇంటికెళ్ళాక చూస్తా. అది ఇక్కడ చూస్తే మా బాస్ నాకు సారీ చెబుతాడేమో!
> నాది ఎవడన్నా ఎత్తుకుపోయాడేమో
ReplyDelete> చెడ్డీ
ఎండాకాలం కదా, టోపి అనుకుని చెడ్డిని తలమీదపెట్టుకుని వెళ్ళారేమో చూడండి :-D j/k
@ పానీపూరి
ReplyDeleteఅలా టోపీగా పెట్టుకొని వెళ్ళుంటే దానితో పాటు సువాసన కూడా ఉచితంగా లభించేదే!
ఐనా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ గా వదిలేస్తే ఎలాండీ స్వైన్ ఫ్లూ మాస్క్ అనుకుని ఎవడైనా `పెట్టుకు`పోతే...
ReplyDelete