కొత్తపాళీ: రెండేళ్ళ క్రితం డెట్రాయిట్ తెలుగు సాహితీ సమావేశాల్లో కొత్తపాళీని కలిసాను. వారు మంచి స్నేహశీలిగా, సరదాగా అనిపించారు. అప్పట్లో బ్లాగులకి నేనింకా కొత్తనే కనుక వారి ప్రముఖత్వం (మంచిగా, చెడ్డగా(?!)) నాకు అంతగా తెలియదు. అప్పటి నుండి వారితో పెన్ను స్నేహం అనగా ఈమెయిల్ స్నేహం నడుస్తూనే వుంది. బ్లాగు మరియు పుస్తక ధర్మ సందేహాలు ఏమయినా వుంటే వారిని అడుగుతుంటాను - వారు ఆలస్యం కాకుండా తీర్చేస్తూవుంటారు. గత ఏడాది జరిగిన డెట్రాయిట్ తెలుగు సాహితీ సమావేశాలకి నేను వెళ్ళలేకపోవడం వల్ల మరో సారి వారిని ముఖాముఖి కలుసుకునే అవకాశం తప్పింది. ఒకసారి డెట్రాయిట్ మీదుగా నేను కెనడా వెళ్ళానని తెలిసి ఈ సారి అలా వెళితే తమకు తెలియపరిస్తే డెట్రాయిట్ బ్లాగర్లతో సమావేశం ఏర్పాటు చేద్దామనీ, ఆ విధంగా మనం అందరం కలవ్వచ్చని వారు సూచించారు. నేను సరే అన్నాను.
డెట్రాయిటులో వారి రంగుటద్దాల కిటికీ పుస్తక అవిష్కరణ సభకీ వెళదామనుకున్నాను కానీ కుదరలేదు. అదే విషయాన్ని వారికి తెలిపాను. మీరు ఎప్పుడూ వస్తామనో, కలుద్దామనో అంటారు కానీ మీరు రారు అని అలిగినంత పని చేసారు. దానితో ఈ సారి కెనడాకి వెళ్ళేటప్పుడు ఎలాగయినా కొత్తపాళీని కలుస్తూ వెళ్ళాలని కంకణం కట్టుకున్నాను.
మార్చి నెలలో కెనడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అదే విషయాన్ని వారికి తెలిపి మీకు వీలయితే కలుద్దాము అని చెప్పాను. ఆ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు లోగా మీటింగ్ ఏర్పాటు చేస్తే నాకు సౌకర్యంగా వుంటుందని తెలిపాను. కుటుంబంతో సహా వచ్చేస్తున్నాననీ తెలిపాను. కాలాస్త్రి శ్రీ ఈ విషయాలు సమన్వయం చేసి ఆ శనివారం ఉదయం 10 గంటలకు తమ ఇంట్లోనే మనం కలుద్దాము అని తెలిపారు.
కాలాస్త్రి శ్రీ: వీరు కూడా నాకు రెండేళ్ళ క్రితం డెట్రాయిట్ సాహితీ సమావేశాలలో కలిసారు. చాలా చక్కగా మాట్లాడారు. మంచి స్నేహశీలిగా అనిపించారు. గత ఏడాది డెట్రాయిట్ సాహితీ సమావేశాలకి వెళ్ళలేకపోవడంతో వారిని మరో సారి కలిసే అవకాశం కుదరలేదు. కొత్తపాళీ పుస్తకావిష్కరణ సభకి నన్ను తప్పని సరిగా రమ్మని ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేకపోయాను. ఫిబ్రవరిలోనో, మార్చి లోనో షికాగో లో మేము వుండే ప్లేసుకు దగ్గర్లోనే వారు వచ్చారు. అక్కడ వారి మిత్రులు వున్నారు. అక్కడికి వెళ్ళి వారిని మా ఇంటికి తీసుకువచ్చాను. ఓ గంట తెలుగు బ్లాగుల గురించి ముచ్చట్లు పెట్టుకున్నాము. మా ఆవిడ గారెలు చేసి పెడితే లాగించాము. భోజనానికి వారిని వుండమన్నాను కానీ వారికి తమ స్నేహితులతో గుడికి వెళ్ళే పని వుండటంతో కుదరలేదు. మా చిన్నమ్మాయి వారిని ఇంకాస్సేపు వుండమని బాగా కోరింది. కానీ వారికి పని వుండటం మూలాన వెళతానంటే వారిని వారి స్నేహితుల ఇంటి వద్ద దిగబెట్టి వచ్చాను.
కొద్ది రోజుల తరువాత నేను కెనడా వెళుతున్నాననీ మీకందరికీ వీలయితే దారిలో డెట్రాయిట్ బ్లాగర్లని కలిసి వెళతానని వారికి చెప్పాను. నా కుటుంబంతో సహా వచ్చేసి అటునుండి సరాసరి కెనడా వెళతామని చెప్పాను. కొత్తపాళీ తోనూ, ఇంకో బ్లాగర్ తోనూ మాట్లాడి ఆ శనివారం ఉదయం తమ ఇంటిలోనే సమావేశం అవుదామనీ వారు తెలియపరిచారు.
అంతా అంతా సవ్యంగానే వుంది. భేశ్ కదూ. కాదు. నా కష్టాల్, నష్టాల్ అప్పటినుండే మొదలయ్యాయి. ఓ ప్రహసనానికిది అంతం కాదిది ఆరంభం మాత్రమే. అస్సలేమయ్యింది అన్న విషయం సరదాగా మరో టపాలో!
కొత్తపాళీ & శ్రీ: మీరు ఈ టపాలు చదువుతున్నారా? చదువుతుంటే కనుక హాజరు వేసుకోండి :)
తర్వాత ఏం జరిగింది? :)
ReplyDeleteidedo...pedda kelukudu yavvaaram laagunde
ReplyDeletekompadeesi...'Gay'lukudu kaado kadaa
ReplyDeleteగే భందం బలపడిందా?
ReplyDelete@ ఏకలింగం
ReplyDeleteచెబుతాగా :)
@ అజ్ఞాత
కెలుకుడు కానీ గెలుకుడు కానీ ఏమీ లేవండీ. సరదాగా నా బుల్లి బుల్లి కష్టాలు వున్నాయంతే.
@ అజ్ఞాత
ReplyDeleteఅహబ్బా. నేను గే అయినంత మాత్రాన అందరూ గేలే వుంటారుటండీ. మీరు హెట్రో/ స్ట్రెయిట్ అయినంత మాత్రాన మీరు అందరూ వ్యతిరేక లింగం వారితో జత కూడుతారా! కాదు కదా. ఇది గే టాపిక్కో, లేదా మరో కులుకుడు టాపిక్కో కాదు మాహాప్రభో.
> మా ఆవిడ గారెలు చేసి పడితే లాగించాము
ReplyDelete> అస్సలేమయ్యింది అన్న విషయం సరదాగా మరో టపాలో
> సరదాగా నా బుల్లి బుల్లి కష్టాలు వున్నాయంతే
ఆ గారెల్లో రాళ్ళు/చట్నిలో పుల్లలు పళ్ళల్లో ఇరుక్కుని, ఇంటికి వచ్చి toothpick తో పళ్ళు "గెలుకుడు / కెలుకుడు" మొదలెట్టిఉంటారు? j/k
హతవిధీ శరత్ కాలం గారి బ్లాగులో తెలుగు తప్పుగా రాయడమా?
ReplyDeleteమీ బ్లాగులోనే అక్షర దోషాలు వున్నాయంటే ఇంక బ్లాగులోకంలో బూతులు రాసినా పట్టించుకోరు ఎవరూ
ఇది తొమ్మిదో వింత
ఎనిమిదో వింత ఏంటంటే మార్తాండ బ్లాగులు రాయడం ఆపివేయడం
>>మా ఆవిడ గారెలు చేసి పడితే లాగించాము
పెడితే అని రాయాలి కదండీ
కొద్ది చప్పగా వుంది..
ReplyDeleteప్రెజెంట్ సార్!
ReplyDeleteరెండవ టపా కోసం ఎదురు చూస్తాను.
పిల్లకాకి బ్లాగులో మీరు చూసారా ఈరోజు ఏం జరిగిందో?
ReplyDeleteఅన్నట్టు నేనెమీ ఫక్తు శాఖాహరిని కాదు, అక్కడ అవసరం అయ్యి మొదటిసారి/ ఆఖరి సారి మాంసాహరం తిన్నాను. రుచిగానే వున్నాయి. అన్నట్టు నేను తిన్నది పాము గుడ్డు అని నన్ను ఏడిపించుకు తిన్నారు మా స్నేహితులు అక్కడ
ముందు అతను ఫక్ తూ అని రాసి మళ్ళీ ఫక్తు అని సరిచేసాడు వోలమ్మో...
@ పానీపూరి
ReplyDeleteనా పళ్ళు నేను కెలుక్కుంటే సమ్మగానే వుంటుంది లెండి కానీ ఈ విషయంలో మా ఆవిడ నా బుర్ర కెలికేసింది. అన్నట్లు ఈ టపా సిరీస్ కీ మీకూ కూడా కొద్దిగా లంకె వుంది :) వివరాలు త్వరలో.
@ అజ్ఞాత
అయ్బాబోయ్. నా బ్లాగులో అక్షరదోషాలు వుండవని మరీ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. వీలయినంతగా చూసుకుంటాను అలాగే మీలాంటి వారు సూచించినప్పుడు సవరించుకుంటాను. తన బ్లాగులో అక్షర దోషాలు వుండవని ఛాలెంజ్ చేసి చెప్పిన వారు ఒకరు మాత్రం నాకు తెలుసు - తెలుగోడు - ఆబ్రకదబ్ర.
@ మంచు
ఫ్లాష్ బ్యాక్ కదా. అలాగే వుంటుంది. మొత్తం చదివాక నేను కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పదం పాడినట్లు మీకు అనిపించినా ఆశ్చర్యం లేదు.
@ శ్రీ
:)
@ అజ్ఞాత
పిల్ల కాకి కృష్ణ మరీ పిల్లాడిలా చేస్తున్నాడంటారు :) సవరించుకున్నాడన్నారుగా - వదిలేద్దురూ.
కొత్తపాళీవారికి, శ్రీగారికి, కొంత పానీపూరి గారికి ఆతృత ... ఇంకెన్ని క్యారెక్టర్లు వస్తాయో
ReplyDeleteఎంటి మీరు ఇంకా అధ్యక్ష పదవిలొ కొనసాగుతున్నారా..మిమ్మల్ని తొండి చేసి దింపెసారని మీరు ఎప్పుడూ ఆరొపిస్తూవుంటారు.
ReplyDeleteRef: http://telugublogworld.blogspot.com/2010/07/bulldozer-of-telugu-blogs.html
బావుంది, బావుంది తరువాత?
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఅంతా తొండి.. వా :( నేనేమీ అలా రాయలేదు బాబు. లేని పోని అభాండాలు. నేనొప్పుకోను అంతే!
@ మంచు
ReplyDeleteఈ అన్యాయం నేను సహించను. కె బ్లా స అధ్యక్షునిగా నన్ను పీకి పారేసేదాకా ఆందోళన చేస్తూనేవుంటాను.
అన్నట్లు ఆ ఇంగ్లీషు టపాను ఎవరయినా తెనుగీకరించి ప్రచురిస్తే బావుండును. అందులో అన్నీ కరెక్ట్ కాదు గానీ చాలావరకు నిజమే. 8 ఎవరోగానీ సరదాగా వ్రాసారు!
@ సౌమ్య
తరువాయి టపా చదవండి మరి :)