మేము టోరొంటోలో వుంటున్నప్పుడు నా స్నేహితుడు ఒకరు తొలిసారిగా డ్రైవింగ్ టెస్టుకి వెళ్ళాడు. ఒక లావు పాటి ఎగ్జామినర్ ఈ పరీక్ష నిర్వహించడం కోసం అతనితో పాటుగా కారులో కూర్చున్నది. మొదటి సారి డ్రైవింగ్ టెస్టు కాబట్టి మనవాడు సహజంగానే ఖంగారు పడ్డాడు. కార్ స్టార్ట్ చేసిన తరువాత గేర్ రాడ్ కోసం వెతికాడు. కొద్ది క్షణాలకే చెయ్యి తియ్యి అని కఠినంగా వినిపిస్తే ఎగ్జామినర్ వైపు చూసాడు, ఆమె ఆగ్రహంతో వుంది. గేర్ రాడ్ కోసం ఎక్కడ వెతికాడో అర్ధమయ్యి బలంగా నాలిక కరచుకున్నాడు.
ఈ విషయం విన్న తరువాత అతనితో "గేర్ రాడ్ వుండేది మగవారికి కదా" అన్నాను. కార్ గేర్ రాడ్ కోసం మా స్నేహితుడు ఎక్కడ వెతికి వుంటాడో, ఆ పరీక్షా ఫలితం ఏమయ్యిందో, ఆ పరిస్థితిలో ఆడ ఎగ్జామినర్ బదులుగా మగ ఎగ్జామినర్ వుండి వుంటే ఏమయ్యివుండేదో ఇక మీరు తేలిగ్గా ఊహించెయ్యవచ్చు.
తస్సదియ్య..another so called sleezy post :)
ReplyDeleteగబ్బు పిల్లోడా
ReplyDeleteకొండొకచో స్లీజీ పోస్ట్...
ReplyDeleteఇలాంటిదే ఇంకో జోకు.
ReplyDeleteబస్సు డ్రైవర్, కండక్టర్ నిటు హాల్టు చేస్తూ బస్టాండులో పక్క పక్కనే పడుకున్నారట. రాత్రి డ్రైవరుకు బస్సు నడుపుతూ గేరు మార్చినట్టు కల. ఏం జరిగి ఉంటుందో ఊహించండి!
@ అజ్ఞాతలు
ReplyDeleteమరీ అందరిలా నేనూ ఎప్పుడూ మడికట్టుకొని వ్రాస్తే బావుండదు కదా. అందుకే ;)
@ అజ్ఞాత
నేను వ్రాసింది జోకు కాదు - నిజ్జంగా జరిగిందే :)
అమెరికాలో కార్లకు గెర్రాడ్లు ఉండవు, అన్నీ ఆటోమాటిక్ గేర్లే, జస్ట్ ఎక్సెలేటర్ ఇస్తే చాలు పికప్ అందుకుంటాయని విన్నాను. నిజమేనా?
ReplyDeleteమీరు విన్నది నిజమే. చాలావరకు కార్లకు ఆటో ట్రాన్స్‌మిషన్ వుంటుంది. అయితే పార్కింగ్, న్యూట్రల్, డ్రైవ్ గేర్లు ఎలాగూ మార్చాల్సి వుంటుంది కనుక గేర్ రాడ్ వుంటుంది. అలాగే అవసరమయిన సమయాల్లో మాన్యువల్ గా వేయడానికి కూడా గేర్లు వుంటాయి.
ReplyDeletebaagunnadandi...nenu mee blog ni chadavadam idey tolisari...mee abrakadabra bawagaari blog nunchi vachhanu...
ReplyDelete