ఇక కొవ్వు కరిగించాల్సిందే!

అయిదు రోజుల క్రితం నా కొవ్వు శాతం చూసుకున్నప్పుడు 21.5 వుంది. నా వయస్సు వారికి 18 కి లోపుగా వుంటే చక్కగా వుంటుంది. అందువల్ల దాన్ని 17 కి దించే పనిలో పడ్డాను. తినే తిండి మీదా, నా బరువు మీదా నాకు కంట్రోల్ వచ్చింది కాబట్టి ఇక ఈ ఉపలక్ష్యం నాకో పెద్ద సమస్య కాబోదు. అయితే అటుపై 13% కి దించాలి. అది కాస్త సవాలే. చూద్దాం. విజువలైజేషనూ, సెల్ఫ్ టాకూ మొదలయిన టెక్కునిక్కులు ఉపయోగించి ఎంచక్కా నేను అనుకున్న చిన్న చిన్న విజయాలు సాధిస్తున్నా. నా అంతరాత్మ ఆదేశాలను (సబ్‌కాన్షియస్ మైండ్ సజెషన్స్) సరిగా వింటూ పాటిస్తూ ఎదుగుతున్నాను.

నా ప్రస్తుత కొవ్వు ఏవరేజి శాతంలోకి వస్తుంది. నా వయస్సుకి బాడీ ఫ్యాట్ 18% కి లోపుగా వుంటే ఫిట్ అన్నమాట. అందుకే ప్రస్తుతానికి 17 శాతానికి టార్గెట్ చేస్తున్నాను. 14 కి లోపుగా వుంటే ఆటగాడి శరీరం అన్నమాట. అందుకే అటుపై 13 కి టార్గెట్ చేస్తాను. అప్పుడు 2 ప్యాక్ అయినా బయటపడొచ్చు. అటుపై చాలా కష్టం కానీ 9 కి ప్రయత్నిస్తే 6 ప్యాక్ రావచ్చు. అంత దృశ్యం నాకు లేదు కానీ 13 సాధించాక వీలయితే అటు ఆలోచిస్తా.

ఈ తిప్పలన్నీ ఎందుకు మహాశయా, హాయిగా ఓ రెండు సినిమాలు వేసుకొని చూస్తూ కూర్చోక అంటారా? అలా మీరు కానివ్వండి. నాకు మాత్రం ఇష్టం అయింది కష్టంగా వుండదండీ - ఉత్సాహంగా, సవాలుగా వుంటుంది.

2 comments:


  1. సైజ్ జీరో చూస్తె ఏమన్నా అవిడియా వస్తుందేమో నండీ !

    జిలేబి

    ReplyDelete
  2. @ జిలేబీ
    బరువు గురించి నాకు ఎవరి ఐడియాలూ అఖ్ఖరలేదండీ! ఎవరికయినా కావాలంటే నేనే ఇస్తాను.

    అనుష్క నాకసలే నచ్చదూ - పైగా తనని ఊబకాయంలో చూడటమా! నా వల్ల కాదండీ. ఇంట్లో వాళ్ళు ఆ సినిమాకు వెళదామా అని అడిగారు. నే ఛస్తే రానూ అన్నా. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నా నమ్మకం. సినిమాలకి అందమయిన హీరోయిన్లని చూడటానికి వెళతారు కానీ ఒబేస్ హీరోయిన్లని చూడటానికి కాదు. అలాగే విక్రమ్ ది అదేదో కురూపి సినిమా అప్పుడు కూడా అదే అనుకున్నా. ఏవో కొన్ని నిమిషాలు అంటే భరించొచ్చు కానీ సగం సినిమా అలా వికారంగా వుంటే నేనయితే చూడలేను.

    ReplyDelete