వారం క్రితం నా బరువు 55.3 కిలోలు. ఈరోజు 54.1 కిలోలు. అనగా 1.2 కిలోల బరువు తగ్గాను. పళ్ళూ, ఆకు కూరలూ బాగా తీసుకున్నాను. నోరు కట్టేసుకున్నానా? అబ్బే. నా ఆహార పరిమాణం పెద్దదే కాకపోతే కాలరీలే తక్కువా. రోజూ ఆఫీసు నుండి వచ్చి ఉత్సాహంగా ఆకు కూర వండేసుకుంటా. సరదాగా దాంట్లో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటా. అలా నేను వండేసుకున్న కూరలు ఎంత కమ్మగా వుంటాయనీ. కాకపోతే మా వాళ్ళు నా కూర జోలికి రారనుకోండీ - అది వేరే విషయం. అలా కూర వండాకా అన్నంలో కూర కలుపుకొని తినడానికి బదులుగా కూరలో అన్నం కలుపుకుని తింటా :)
ఇక నుండి రోజూ నా కూర ఫోటోలు షేర్ చేస్తా లెండి. ఏం ఆకుకూర అని నన్ను అడుగొద్దు సుమా. మా ఆఫీసు దగ్గరిలోని వాల్‌మార్ట్ కి వెళ్ళి కనపడ్డ ఆకుకూరలన్నీ పట్టుకొస్తా - పేర్లు నాకు తెలియవు, గుర్తుండవు. చెకవుట్ దగ్గర పేర్లడిగినా హు నోస్ అంటుంటా? ఒకే రోజు కనీసం మూడు రకాల ఆకులు వేసి వండేస్తుంటా. అంతేనా ఇంకా ఆ కూరలో వంటింట్లో వుండే తినదగ్గ పదార్ధాలు ఏవేవో వేస్తుంటా. కూర అయిపోయాక అంటు మిగలకుండా తినేస్తుంటా.
నా చిన్నప్పుడు నేనూ, నాకంటే 3 ఏళ్ళు చిన్నదయిన నా మేనకోడలూ కలిసి ఇంట్లో తినదగ్గ పదార్ధాలు అన్నీ వేసి వంట వండేవాళ్ళం. దానికి కిచిడీ తరహాలో డిచికీ అని పేరు పెట్టాం. ఏదీ మీరూ ఓ సారి డిచికీ వండి ఎలా వుందో మాకు చెబుదురూ!? దానికి రిసెపె పెద్దగా ఏమీ లేదు - ఇంట్లో వున్నవన్నీ తలో కాస్తా వేసి వండెయ్యడమే. అది తినబుల్ గా లేకపోతే బాధ్యత మీదే సుమా.
నా బరువు ఉపలక్ష్యం 52 కిలోలు. దాన్ని చేరుకోవడానికి గాను విజువలైజేషన్, సెల్ఫ్ టాక్ పద్ధతులు ఉపయోగిస్తున్నా. ఆల్రెడీ బరువు తగ్గినట్లూ, పొట్టతగ్గినట్లూ ఊహించేస్తున్నా, ఫీల్ అవుతున్నా, నటించేస్తున్నా. పొట్ట లోపటికి లాక్కుని నడుస్తున్నా. వాతాపి జీర్ణం లాగా కొవ్వు జీర్ణం అని బొజ్జ నిమురుకుంటున్న్నా. సన్నగా కట్టెపుల్లలా వుండే మగాళ్ళ నడుములు చూసి అది నా నడుమే అనుకుంటున్నా. ఈ రోజు నుండీ కొవ్వు శాతం కూడా లేక్కేస్తున్నా, ఇవాళ 21.5% వుంది. దానికి 19 కి తగ్గించాలనేది నా ఉపలక్ష్యం. 13 కి తగ్గించాలనేది నా ప్రధాన లక్ష్యం.

ఇలాగే రోజూ మూడు పూటలూ ఆకు కూరలు తిని నా స్నేహితుడు Jr. NTR లా తగ్గిపోయాడు.
ReplyDeleteఅయ్యా, నాది ఎప్పటినుంచో పెద్ద ధర్మ సందేహం - మీరు తీసుకున్నంత ఇదిగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే బతకలేమా?
అవునా!.. ఆకుకూరలు డైట్ తో మరీ అంత సన్న బడొచ్చా ??? ఇలా ఐతే నేనూ మొదలు పెడుతా.. చెప్పుకోవలంటే సిగ్గుగా ఉంది..నేను ప్రస్తుతం భూమికి భారంగా ఒక 76కిలోలకి పెరిగి పోయాను.. నా ఎత్తు 5.6" మాత్రమే.... తగ్గాలి.. తగ్గాలి.. నేను తగ్గుతున్నాను.. తగ్గుతున్నాను .. తగ్గాను.. ఇంకో నెలలో తగ్గి పోతాను.. తగ్గి పోతాను..
ReplyDeleteచిన్నప్పుడు పేద్ద మనుషులని చూసి.. ఛీ ఛీ ఇంత వికారంగా ఉన్నారేమిటి అనుకునేవాడిని.. నాకేల ఈ దుర్దశ.. :(:( .. కష్ట సాధ్యమైన ఈ పనికి మీకు తోడుగా నేనూ మొదలు పెడుతున్నా గురూజి.. ఇంతకు ముందే మొదలు పెడుతున్నా అన్నట్టు గుర్తు.. కానీ నాకీమద్య మతిమరపు బాగా ఎక్కువైంది.. గురూజీ.. ఈసారి ఎక్కడికక్కడ పోస్టిట్ లపై వ్రాసుకుంటూ ముందుకు సాగుత.. ఈ విషయంలో నా అంతర్ముఖత్వం పెరగాలని కోరుకుంటున్నా.. ఈ విషయం పై రోజూ ఇలా బ్లాగుల్లో ముచ్చటిస్తే బాగుంటుంది గురూజీ.. మీరేమంటారు..
@ Bonagiri
ReplyDeleteదాదాపుగా నాకు తెలిసిన నా వయస్సు వాళ్లందరూ (ఒకరిద్దరు మినహా) డీయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ మొదలయిన వ్యాధులతో బాధపడుతున్నారు. నాకు అవి లేవు - రావు. కారణం ఏమిటంటారూ? ఎలాగోలా బ్రతకొచ్చులెండి - కాదనను కానీ ఈ శరత్తు దర్జాగానే బ్రతుకుతాడు. అద్దీ లెక్కా. మన చేతుల్లో లేని వాటిని గురించి మనం ఏం చేయ్యలేకున్నా చేతుల్లో వున్నవాటినయినా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎంచక్కా నాకు ఇష్టం అయిన కూరలు, నాకు నచ్చిన పద్ధతిలో చేసుకు తింటున్నాను. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా, కూర వండేసుకుందామా అని ఆత్రంగా వుంటుంది. ఇందులో పొరపాటు ఏముందంటారూ?
అన్నట్లు మీది భోనగిరి అయితే చెప్పండి. 8,9 అక్కడే చదివా.
@ కాయ
ReplyDeleteఅహ్హా. ఎంచక్కా తగ్గొచ్చు. కూరగాయల్లో, ఆకుకూరల్లొ క్యాలరీలు చాలా తక్కువ వుంటాయి. వ్యాయామం చాలా మంచిదే అయినా దాని వల్ల పెద్దగా బరువు తగ్గరు - ఎందుకంటే అందువల్ల పెద్దగా కాలరీలు కరగవు. అహార నియంత్రణ ద్వారా కాలరీలు తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు తింటే కడుపూ నిండుతుంది, క్యాలరీలూ తగ్గుతాయి. అయితే ఇందులో సరి అయిన ప్రొటీన్ లభించదు - అది కూడా చాలా ముఖ్యం కాబట్టి నేనయితే రోజూ ఒక పెగ్గు err... గ్లాసు ప్రోటీన్ డ్రింక్ తాగుతాను.
రోజూ ఇక్కడ అదే పనిగా చర్చించడం కష్టం కానీ మీకు ఆసక్తి వుంటే నా సక్సెస్ వాట్స్ఆప్ గ్రూపు లో మీరు చేరొచ్చును. అది ఆరోగ్యానికి సంబంధించినది కాదు కానీ లక్ష్యాలకు సంబంధించినది. నా బరువు, బొజ్జా తగ్గడం కూడా నా లక్ష్యాలే కాబట్టి నా పురోగతి ఎప్పటికప్పుడు అందులో చర్చిస్తుంటా. నా బ్లాగాభిమానులు ముగ్గురు అందులో వున్నారు.
Hello Sharat Bhai
DeleteHow to join your success WhatsApp group?. Please advise
I am interested.
@ ఆలీ భాయ్
Deleteనా ఈమెయిల్ ఐడి sarathn at hotmail dot com కి మీ ఫొన్ నంబర్ పంపించండి లేదా ఇక్కడే ఇక్కడే ఇచ్చినా చాలు. నా గ్రూపులో మిమ్మల్ని చేరుస్తాను. ఇంకో ముగ్గురు బ్లాగ్ మిత్రులు అందులో వున్నారు.
మీరు ఇచ్చిన నంబరుతో ఏదో సమస్య వుంది. వాట్సాప్ లో రావడం లేదు. మీ ఫోనులో వాట్సాప్ వుందా? అది ఇండియా నంబరు కాదనుకుంటా కదా. ఒకసారి నాకు ఈమయిల్ చెయ్యండి.
Deletebaabooy mee baruvu kathalu chadivee chadivee maaku bhayam pattukundi . maakem vndo, vasthundo ani*
ReplyDelete@ అజ్ఞాత*
ReplyDeleteఫిట్టుగా వుండాలనుకోవడం మంచిదే కదండీ. మీరూ ప్రయత్నించండి.
@ రవి శంకర్
ReplyDeleteత్వరలో మీ నంబర్ ఆ గ్రూపుకి జత చేస్తాను.