దాదాపు నాలుగు రెట్ల బోనస్

మా ఫర్మ్ లో పెద్దగా బోనస్ ఇవ్వరు లెండి. ఆయినా సరే క్రితం సారి కంటె రెండు రెట్ల బోనస్ అయినా వస్తుందని ఆశించాను. అయితే దాదాపుగా నాలుగు రెట్ల బోనస్ వచ్చింది. నిజమో భ్రమో కానీ లా ఆఫ్ ఎట్రాక్షన్ పనిచేస్తున్నట్లుగానే వుంది. ఇంకా ఇలాంటివే ఎన్నో మెరుగుదలలు. ఇలాగే 2016  నుండి డబ్బు ఇక వరదలై నా ఖాతా లోకి పారాల్సి వుంది. 

నా బరువు ఎంచక్కా 53 కిలోలు సరాసరిగా వుంటోంది. బాడీ ఫ్యాట్ ఎంతవుందో ఈ మధ్య తీరికలేక చూసుకోలేదు. బరువు అంతకంటె తగ్గొద్దని మా ఆవిడా, మా స్నేహితులూ కోరారు. సో సరాసరిగా అక్కడితో ఆపేసా. క్రిస్మస్ సెలవుల తరువాత ఇక ఫ్యాట్ ఇంకా బాగా తగ్గిస్తాను. 

కంప్యూటర్ వాడకం తక్కువయ్యింది కాబట్టి ఐఫోన్ 6S ప్లస్ నుండి బ్లాగు వ్రాయడం ప్రాక్టీసు చేస్తున్నా. అందువల్ల ఇలా కొంత కాలం నా పోస్టులు క్లుప్తంగా వుంటాయీ. 

4 comments:

  1. guruvu garu mee company domain enti bhayya..are profits that good !!! ???? whats your technology ?

    ReplyDelete
  2. మాది పెద్ద కంపెనీ కాదూ, పెద్దగా బోనస్సులూ వుండవూ. అందువల్ల ఈ సారి నాకు వచ్చిన బోనస్సు కూడా గొప్పదేమీ కాదు కానీ విశేషం ఏవిటంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపుగా నాలుగు రెట్లు. కనీసం రెట్టింపు వస్తుందని విజువలైజ్ చేసుకున్నా. అయితే అంతకు మించి వచ్చింది. అదీ విషయం. అందుకోసం అన్నీ కలిసి వచ్చాయి. అలా అన్నీ కూడా ఊహించినదానికంటే గొప్పగా జరుగుతున్నాయి. అదీ సంతోషం. లా ఆఫ్ ఎట్రాక్షన్ పాటిస్తే అలాగే జరుగుతుందంటారు. నిజమేనేమో!

    ReplyDelete
  3. Law of attraction lo okko sari okkate oohinchukovala?
    For ex. Naa Diabetes, obesity, sleeplessness...
    Koncham vivaristara? Nenu mee law of attraction follow a daaniki prayatnistunna...

    ReplyDelete
  4. @ లక్ష్మి

    ఎన్నయినా ఊహించుకోవచ్చు. అలా అని అదే పనిగా ఆలోచన అఖ్ఖర్లేదండి. అప్పుడప్పుడు చాలు. అయితే మరీ ముఖ్యమయిన ఒకటి రెండింటిలో మాత్రం మనకు బర్నింగ్ డిజైర్ వుండాలి. వాటిపట్ల మనం తరచుగా ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి సెల్ఫ్ టాక్, విజువలైజేషన్ వగైరా పద్ధతులు ఉపయోగిస్తుండాలి.

    ReplyDelete