అలా అనుకున్నా - అలాగే జరిగింది!?

10 రోజుల క్రితం. మా ఆవిడ ఐఫొన్ 6+ స్క్రీన్, LCD పగిలిపోయాయి. బయట అడిగితే $220 అన్నారు. వుడ్‌ఫీల్డ్ మాల్‌లోని Apple స్టోరులో కనుక్కుందామని వచ్చాము. ఎంత అని అడిగాము. $320 దాకా అవుతుండొచ్చు - పూర్తిగా పరీక్షించి చెబుతాము అని మళ్ళీ రమ్మనమని అప్పాయింట్మెంట్ ఇచ్చారు. ఓ అరగంట అయ్యాకా మళ్ళీ వెళ్ళాం. టెక్నీషియన్ పరీక్షిస్తున్నాడు. నాకేమీ ఖర్చు కావొద్దని మనస్సులో గట్టిగా అనుకున్నాను - అలా జస్ట్ ఒకటి రెండు నిమిషాలు విశ్వసించాను. ఇంతలోకే ఇప్పుడే వస్తాను అని అతను లోనికి వెళ్ళి వచ్చాడు. ఎంత అవుతుంది రిపెయరుకి అని మా ఆవిడ అడిగింది. జీరో అన్నాడు. నమ్మలేనట్లుగా 0? అని అడిగింది. అవును 0 అన్నాడు! నన్ను నేను నమ్మలేక ఎందుకలాగా అని అడిగా. "ఈ రోజు కొన్నిసాంకేతిక సమస్యలు వున్నాయి - అందుకే లోపలికి వెళ్ళి కనుక్కొని వచ్చాను.  ఉచితంగా ఇస్తున్నాం. సరి అయిన రోజు మీరు వచ్చారు" అన్నాడు నవ్వుతూ. మా ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ ఇచ్చాడు. బిల్లు మీద సంతకం చేయించుకున్నాడు. బిల్లు $320 కానీ అది మినహాయింపు ఇచ్చారు కాబట్టి చివరికి బిల్లు 0 అని దాంట్లో వుంది! అతనితో కరచాలనం చేసి, బహుళ ధన్యవాదాలు చెప్పి బయటకి వచ్చాం.  

నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఇది నేను నమ్మాలా వద్దా? భ్రాంతియా, నిజమా? సెలక్టివ్ రీజనింగా, కాదా? నాకు తెలియదు. జరిగింది అదండీ. ఎవరు ఎలా అయినా అనుకోవచ్చు. నా +ve ఫ్రీక్వెన్సీ అతని మీదికి ప్రసరించిందా లేదా విశ్వం సహకరించిందా? ఏమో, నా దగ్గర అయితే వివరణలు లేవు.

ఇది  మా అమ్మాయికి చెబితే ఆ షాపులో వున్న MacBook ఉచితంగా వచ్చేసినట్టు విశ్వసించూ అని ఒకటే పోరూ!అది ఎప్పటినుండో అది కొనివ్వమని అంటోంది. నేనేం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు.  నువ్వు నమ్మితే కొన్ని నెలల తరువాత వస్తుండొచ్చు అని నచ్చజెబితే రేపే రావాలి అంటుంది ఆ గడుగ్గాయి. నేనేం చెప్పేదీ?  నా దగ్గర జవాబు వుంటే కదా. నేనూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, పరీక్షిస్తున్నా. మొత్తం మీద తను విజన్ బోర్డ్ తెచ్చుకున్నాక ఆ ఫోటో దానిమీద పెట్టి ఎక్స్‌పెక్ట్ చెయ్యడానికి అంగీకరించింది. అలా పెట్టేసుకోగానే సరిపోదు - అందుకు తగ్గట్టుగా చర్యలు - అనగా ఇంకా బాగా చదువుకోవడం వగైరాలు వుండాలనీ చెప్పాను.

అంతకుముందు కొద్ది రోజుల క్రితం రెండు సార్లు చాలా చిన్న వాటి మీద పరీక్షిస్తే అవి జరిగాయి. దాంతో నేను అయోమయం చెంది, కాస్త కంగారు పడి, కలయా వైష్ణవ మాయయా అనుకుంటూ మళ్ళీ ఇప్పుడు మాత్రమే అలా చేసి చూసాను. మళ్ళీ ఇంతవరకూ అలా టెస్ట్ చెయ్యలేదు లెండి. ఎందుకంటే చెయ్యాలని అనిపించలేదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా ఒక కారణం లెండి. మరీ అర్జంటుగా అవసరం అయినప్పుడు ఆ ఆయుధం బయటకి తీసి చూద్దాం. ప్రస్థుతానికయితే చాలా స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక ప్రణాలికల కోసం విజువలైజేషన్ ద్వారా ఆశిస్తున్నా, విశ్వసిస్తున్నా, కృషి చేస్తున్నా, ఎదురు చూస్తున్నా. అవి సిద్ధిస్తే చాలు. 

13 comments:

  1. ..ధ్యాన స్థితిలో ఇలాంటి శక్తులు వస్తాయని ఆధ్యాత్మిక గురువులు చెప్తుంటారు..

    ReplyDelete
  2. మరి ఇద్దరం ఒకరోజు కూచుని బాగా సాధన చేద్దామా గురూజి.. మనకేమైన నిధి దొరుకుతుందేమో!!..

    అవును సరే..మరి మీరిప్పుడు నాస్తికులు మైనస్ అతీంద్రీయ శక్తులు అనుకోవచ్చా మరి!!.. మిమ్మల్ని బాపన్ పూజారి వేషంలో చూడాలని కోరుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తునా గురూజి..

    ReplyDelete
  3. @ కాయ

    ధ్యాన స్థితి అంటే గుర్తుకు వచ్చింది. ఇదివరలో నా ఆత్మ నా దేహం నుండి విడిపోయి లోకాన్నంతా బర్డ్ వ్యూలో చూస్తున్నట్లుగా, ఏంటీ జనన మరణాలూ, ఎమోషన్సూ, వగైరాలూ, అంతా తుఛ్ఛం, తుఛ్ఛం అని కాస్సేపు అనిపించేది. తల విదిలించుకొని ఏంటిలా అనుకునేవాడిని. కొద్దిమంది భక్తులకు చెబితే అలాంటి స్థితి చాలా అసాధారణమయినది అని, సాధారణ మానవులకు అతీతమయినది అని చెబితే కామోసు అనుకున్నా. తరువ్వాత్తరువాత తెలిసింది అది depersonalization disorder అనీ. నాలాగే చాలామంది స్వాములోర్లకి ఇలాంటి అనుభవాలు కలుగుతుంటయ్. తాము అతీతులం అనుకొని ఎంచక్కా ఓ ఆశ్రమం పెట్టేస్తుంటారు. సద్గురు (ISHA) కు కూడా అలాంటి అనుభవాలే కలగగా ఆ తరువాత అలా అయిపోయారు అని ఎక్కడో చదివాననుకుంటున్నాను.

    ReplyDelete
  4. హహహ నాకూ అప్పుడప్పుడూ ఇలాంటివి జరగాలని అనుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడూ అద్భుతాలేమీ జరగలేదు, ఇంకా కొంచెం గట్టిగా అనుకోవాలేమో మరి.

    ReplyDelete
  5. @ కాయ

    నేనేంటో నాకే అర్ధం అవట్లా :))

    LOA మొదలుపెట్టినప్పటి నుండి అలాంటివి జరుగుతుంటాయని అంటారు. ఒక హేతువాదిగా అవి Selective Reasoning అనుకుంటాను. ఎన్నడో పెట్టేస్తా ఆశ్రమం - శరతానందనయిపోతాను. మా స్నేహితుడు సీతారామానంద అమెజాన్ అడవుల్లో ఆశ్రమం పెట్టాలని తెగ ఆలోచిస్తున్నాడు. నేనూ చేరేస్తానేమో - ఇలాంటి బ్రతుకంతా తుఛ్ఛం - తుఛ్ఛం అంటూ, అనుకుంటూ (పవన్ కల్యాణ్ జనసేన స్పీచ్ స్టయిల్లో).

    ReplyDelete
  6. శ్రీ సీతారామానందుల వారికీ జై!!! శ్రీ శరతాననుదుల వారికీ జై!!!
    :)

    ReplyDelete
  7. @ అరుణ్
    అప్పుడో వాట్స్ఆప్ గ్రూపు మొదలెట్టి మాలాంటి సన్నాసుల్నందరినీ ఓ చోట చేరుస్తాం :))

    ReplyDelete
  8. డిసార్డర్ అని సరిపెట్టుకున్నరేమో... ధ్యానం చేస్తే కొత్త విషయాలు ఏమైనా అవగతం అవుతాయేమో కదా.. మన పెద్దాయన కీ ఇలా బర్డ్‌వ్యూ స్థితి చిన్నప్పుడు పేద్ద వాగులో ఈత కొడ్తుంటే కలిగిందని చెప్పాడు.. తుచ్చం తుచ్చం అనడం వేరు.. అనిపించడం వేరు..అలా అనిపించే ఆంగిలూ వేరు.. నాదబ్రహ్మ ఒకసారి ప్రయత్నించి చూడండి..

    ధ్యానం వల్ల మీ ఆనందం ఎక్కువైతే.. శరత్ + ఆనందం = శరతానంద స్వామీజీ..

    ReplyDelete
  9. మీ అనుభవం మాత్రం భలే ఉంది. ఇలా యాదృశ్చికంగా జరుగుతాయేమో ! చిన్న చిన్న విషయాలను కూడా ఎంజాయ్ చేయాలి. పెద్ద పెద్ద లాటరీలు గెలిచినా కూడా ఖర్చుపెట్టేసిన తర్వాత మన మానసికస్థితిలో మార్పు ఏమీ ఉండదు. కోటి రూపాయలు వస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని అనుకుంటారు కానీ ఆ తర్వాత కోరికల లిస్ట్ లోకి ఇంకొకటి వచ్చి చేరతాయి. నేను నగలు, చీరలు,వస్తువులు గురించి, ఎపుడూ కోరుకోలేదు. నేను చచ్చిపోయినా గుర్తుండిపోయేలా ఏమయినా చేస్తే బాగుండునని ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాను. చాలా వరకూ ఫెయిల్ అవుతున్నాయి. ఏదో ఒకరోజు గెలవకపోతానా అని ట్రై చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఏమీ సాధించకుండా చచ్చిపోయినా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మళ్ళీ వచ్చే జన్మలో అయినా మొదలుపెడతాను కదా అని పాజిటివ్ ధాట్ తోనే ఉన్నాను.

    ReplyDelete
  10. నేను ఎన్నిసార్లు మనసులో అనుకున్నా దానికి పూర్తిగా విరుద్దంగా జరుగుతుంది...నాకు ఆకర్షణ సిద్ధాంతం ప్రయత్నిచడం సరిగా రావడం లేదేమో!!! :(

    ReplyDelete
  11. @ కాయ
    పెద్దాయన (ఓషో) కి కూడానా. సో, నేను స్పెషలే అన్నమాట :)

    ధ్యానం యొక్క ప్రయోజనాలు నాకు ఎన్ని తెలిసినా కూడా అప్పుడో ఇప్పుడో (ఓషో ధ్యానాలతో సహా - నటరాజ్ మొదలయినవి - నాదబ్రహ్మ చెయ్యలేదు) చెయ్యడమే తప్ప క్రమం తప్పకుండా చెయ్యాలని ఎన్నేళ్ళనుండో అనుకుంటున్నా నావల్ల అయ్యింది కాదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులని దారిలోకి తెచ్చుకుంటున్నా - ఆగండాగండి - దీని పని కూడా పడదాం.

    @ నీహరిక
    మీ ప్రయత్నాలు సరి అయినవో కాదో నాకు తెలియదు కానీ మీ పట్టుదల మాత్రం మెచ్చుకోతగ్గది.
    కోరికలు తీరకుండా చచ్చిపోతే దయ్యాలం అవుతామని అంటారు. అంతపని చెయ్యకండి :)

    @ రాము
    మళ్ళీ బేసిక్సూ, సెల్ఫ్ టాక్ బేసిక్సూ బాగా చదివి ప్రయత్నించండి. కుదిరితే ధ్యానం చెయ్యండి. ఆ తరువాత మీరు విశ్వాసంతో ప్రయత్నిస్తే అది సాకారం అవుతుంది లేదా అలా అనిపిస్తుంది :)

    ReplyDelete
  12. Came back your blog nearly after 2 yrs gotta read all posts now.

    ReplyDelete
  13. @ రాఘవ్
    వెల్కం బ్యాక్ :) చదివెయ్యండి ఎంచక్కా. ఈ ఏడాది నా వ్యక్తిగత జీవితంలో రెండు అద్భుతాలు జరిగాయి. అవి అంతర్లీనంగా వివరించాను నా పోస్టుల్లో. అవి మీకేమయినా ఉపయోగపడవచ్చేమో చూడండి. ఆ అద్భుతాల సహాయంతో వచ్చే ఏడాది నుండీ నా జీవితంలో మహాద్భుతాలు సాధించే క్రమంలో వున్నాను.

    ReplyDelete