- Hawaii Vacation by 2017. గత వారాంతం హవాయీ దీవుల పటాలు ఎక్కించాను. 2017 లో మా కుటుంబంతో కలిసి కనీసం రెండు వారాలు అయినా అక్కడ గడపాలనేది మా వాంఛ.
- Lexus GX 350 SUV by October 26, 2016 if not by April 2016. ఈమధ్య సరదాగా ఓ రెండు Lexus షోరూములు చూసివచ్చాం. ఇప్పటికిప్పుడే కొనాలని కాదు లెండి. కొన్నట్టుగా ఊహించుకోవడం కోసం - రంగు, రుచీ (జోకు), వాసనా అనుభూతి చెందడం కోసం. మా ఆవిడేమో కొనదల్చుకోకపోతే చూట్టం ఎందుకూ అనీ - చూస్తేనే మున్ముందు కొనగలం అనీ నేనూనూ. మొత్తమ్మీద మూతి విరిచేసి వచ్చేసింది లెండి. నా స్నేహితులు RX మోడల్ సూచించారు కానీ నాకు GX నచ్చింది. ధర ఎక్కువే కానీ నచ్చేసింది. అది కొన్నట్లు ఊహించుకోవడానికి కూడా సంకోచించాను. నా అంతరాత్మని అడిగాను. ఇష్టమయినది కాస్త కష్టమయినా కొనాల్సిందే అంది. నీకెందుకూ నే చూసుకుంటాగా అంది. సరేలే దానికి లేని నొప్పి నాకెందుకూ అని విజన్ బోర్డ్ మీదికి ఎక్కిచ్చేసా.
[అయితే ఒక ముఖ్యమయిన వ్యక్తి నుండి ఇంకో సూచన వచ్చింది. బెంజ్ 4matic SUV. వచ్చేవారం బెంజ్ షోరూమ్ కి వెళ్ళి ఆ ఫోటోలు తీసుకువచ్చి ఇది తీసేసి అది పెట్టేస్తాను. నా ఇష్టం కంటే ఒక్కోసారి నాకిష్టమయిన వాళ్ళ ఇష్టాన్నే నేను ఇష్టపడుతాను :) ]
ఈమధ్య మా ప్రాంతీయ వాట్సాప్ గ్రూపులో Lexus గురించిన చర్చ మొదలయ్యింది. మా ఇంటికి కొంచెం దూరంలో US లోనే పెద్ద Lexus షోరూమ్ ప్రారంభోత్సవం జరిగింది. చూడటానికి వెళ్ళాం. నా మిత్రులు కూడా వెళ్ళి చూసొచ్చారు. అబ్బో ఫైవ్ స్టార్ హోటల్ లాగా వుంది. కస్టమర్లు వేచి వున్నప్పుడు వినియోగించుకోవడానికి ఎన్ని సదుపాయాలో! 41 ఎకరాల స్థలంలో 16 ఎకరాలు కేవలం అమ్మే కార్ల కోసమే. ఒకతని డ్రీమ్ ప్రాజెక్ట్ అది. చక్కటి విజన్ తో తన కల నెరవేర్చుకున్నాడు.
http://www.dailyherald.com/article/20150715/news/150719310/
అప్పుడు కూడా మళ్ళీ GX నచ్చింది. ఈలోగా LOA (Law Of Attraction) నాకు సూచించిన మిత్రునికి కూడా అంతకు ముందు RX నచ్చినా ఇప్పుడు GX నచ్చింది కానీ ధర ఎక్కువగా వుండటంతో Audi కారు తీసుకుంటా అన్నారు. మేమంతా GX కే ప్రోత్సహించడంతో, వాళ్ళవిడకీ అదే నచ్చడంతో రైఠో అన్నాడు. +ve ఫ్రీక్వెన్సీలు ఇతరుల మీదకు కూడా ప్రవహిస్తుంటాయంటారు. దానికి ఉదాహరణ ఇదేనేమో.
http://www.dailyherald.com/article/20150715/news/150719310/
అప్పుడు కూడా మళ్ళీ GX నచ్చింది. ఈలోగా LOA (Law Of Attraction) నాకు సూచించిన మిత్రునికి కూడా అంతకు ముందు RX నచ్చినా ఇప్పుడు GX నచ్చింది కానీ ధర ఎక్కువగా వుండటంతో Audi కారు తీసుకుంటా అన్నారు. మేమంతా GX కే ప్రోత్సహించడంతో, వాళ్ళవిడకీ అదే నచ్చడంతో రైఠో అన్నాడు. +ve ఫ్రీక్వెన్సీలు ఇతరుల మీదకు కూడా ప్రవహిస్తుంటాయంటారు. దానికి ఉదాహరణ ఇదేనేమో.
ఇంకో ఉదాహరణ: LOA గురించి ఒక దగ్గరి మిత్రుని ఇంట్లో ఒక శుక్రవారం రాత్రి వివరించాను. అతను బెంచ్ మీద వుండి ఒక ఫుల్ టైమ్ జాబ్ ఇంకా రాక కాస్త ఫస్ట్రేషనులో వున్నారు. మరుసటి రోజు శనివారం. సెలవు రోజు అయినా సరే అతని ఉద్యోగం ధ్రువపడింది. అతనూ విస్మయం చెందాడు - నా గురించి ఆలోచించారా అని నవ్వుతూ అడిగాడు. మరీ వెంటనే అలా తెలుస్తుందని ఊహించలేదు కానీ అతనికి ఆ జాబ్ వచ్చినట్లే భావించాను. ఇవి కో-ఇన్సిడెన్సులా లేక నిజమా నాకు తెలియదు. +ve మైండ్ సెట్ వల్ల అన్నీ అద్భుతాలే అనిపిస్తున్నాయేమో మరి!
నాకు తెలిసిన ఒక కల్కి భక్త కుటుంబం వుంది. ఆ కల్కి అవతారుడు చెయ్యి కదిపినా, వేలు కదిపినా, కాలు కదిపినా సరే వాళ్ళకు అందులో ఏదో ఒక అద్భుతం కనిపిస్తూవుంటుంది. ఇప్పుడు నేనూ అదే స్థితిలో వున్నానేమో :) ఏమయినప్పటికీ ఏ దొంగ బాబాలనో, స్వాముల వారినో నమ్మి మోసపోకుండా నన్ను నేను నమ్మితే, అది అద్భుతంగా అనిపిస్తే, అది నన్ను, మా కుటుంబాన్నీ, నా శ్రేయోభిలాషులనూ సంతోషంగా వుంచితే, ముందుకే నడిపిస్తే మంచిదే కదా. నా హేతువాద మనస్తత్వం ఇవన్నీ మిరకిల్స్ అని ఒప్పుకోవడం లేదు కానీ వీటి వెనుక ఏదో లాజిక్కు వుండి వుంటుంది - Selective Thinking, Selective Reasoning, Filtering, Psychological Frequency etc. LOA గురించి చాలామంది చెప్పేదంతా నమ్మట్లేదు - నాకు నమ్మకం అనిపించినంత మేరకు మాత్రమే తీసుకుంటున్నా. ఏవో కొన్ని లోపాలున్నాయని మిగతాదంతా త్రోసిపుచ్చడం సరి అయినది కాదు కదా.
ఏంటో ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళాను. మిగతావి మరోసారి వ్రాస్తాను.
గురువు గారు.. మనమిద్దరం CASINO వెళ్దామా ఒకసారి.. వస్తే ఇద్దరికీ చెరి సగం..లేక.. పోతే చెరి సగం..
ReplyDelete@ కాయ
ReplyDeleteLOA ను దానికోసం వినియోగించేవాళ్ళు కూడా వున్నారు కానీ ఏమో మరి. ఒకామెకు $144 మిలియన్లు లాటరీలో వస్తే ఇలానే వచ్చిందని చెప్పింది. దీని గురించిన అనుభవాలు చదివితే కొద్దిమంది తాము సాధించినట్లు చెబుతుంటారు. అవి ఎంతవరకు నిజమో తెలియదు. కొంతమందికి ఏదో అనుకోని రూపేణా చెక్కులు వస్తున్నట్టూ చెబుతారు. లాటరీలను ఆశించినా కూడా చాలామందికి ఎందుకు రావో కొన్ని వివరణలు కూడా కొందరు ఆ ఎక్స్‌పర్ట్స్ వివరించారు. ముఖ్యంగా అంతః చేతనలో అలాంటి నమ్మకం వుండదు కాబట్టి రాదంటారు.
LOA అంటే ఒట్టిగానే ఆశించడం,విశ్వసించడం కాదు, దానికి తగ్గట్టుగా అది చెప్పే స్టెప్స్ వేస్తూ వుండాలి, కృషి చేస్తూ వుండాలి. అయితే దీన్ని సాలిడ్ గా నమ్మే వాళ్ళు మనం ఏది దృఢంగా విశ్వసిస్తే అది సాకారం అవుతుందీ అంటారు.
బాగుంది అండి! మీ లెక్సస్ కోరిక తీరాలని మరోసారి కోరుకుంటున్నాను. మీ టపా చూసాక అర్లింగ్ టన్ లెక్సస్ ఒకసారి రావాలనే కోరిక పెరుగుతోంది, సర్వీస్ కోసమైనా ఒకసారి వెళ్ళొస్తాను
ReplyDeleteదీపావళి శుభాకాంక్షలు
@ అరుణ్
ReplyDeleteధన్యవాదాలు. తప్పకుండా చూసి వెళ్ళండి. వీలయితే మా ఇంటికీ వద్దురూ. దగ్గరే. మీరు అడిగిన పుస్తకం, ఇంకా ఇతర పుస్తకాలూ ఏమయినా మీకు నచ్చితే పట్టుకెల్దురు గానీ.
మసాజ్ కుర్చీల్లో మాత్రం కూర్చోకండి. ఇక కదల్లేరు. అంటే ఇక వదల్లేరూ అని అర్ధం :)
అన్నట్లు మీరు ఏవయినా పిల్లల ఫంక్షన్స్ చెయ్యలనుకున్నా అక్కడ చెయ్యొచ్చు. ఆ సౌకర్యం కూడా వుంది.
అయ్యో నేను వద్దామనుకునేదే ఆ మసాజ్ కుర్చీల కోసం :)
ReplyDeleteఅటువైపు వచ్చే ప్లాన్ ఉంటే తప్పక మీకు మెస్సేజ్ పెడతాను. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు.