సలాడ్ సాంబార్?!

"రైస్ పెట్టనా లంచ్ కి?" అని ఉదయం అడిగింది నా భార్య
"వద్దు"
"కీన్వా?"
"వద్దు"
"మరి?"
"సాంబార్ పెట్టు"
"సాంబార్?"
"అవును. సాంబార్ పెట్టు. సలాడ్ కొనుక్కొని తింటాను" అన్నాను.

మధ్యాహ్నం భోజన సమయంలో కాస్సేపు చికాగో నగరంలో పాదయాత్ర చేసి మా ఆఫీసుకి దగ్గర్లో వున్న వాల్‌మార్టులో ఇటాలియన్ స్టైల్ సలాడ్ కొనుక్కుని మళ్ళీ ఆఫీసుకు వచ్చాను. ఆ సలాడుని సాంబారులో ముంచుకొని తింటుంటే భలేగా అనిపించింది. మొత్తం సలాడ్ ప్యాకెట్ (285 గ్రాములు) తింటే పొందేవి 50 క్యాలరీలే. ఈ రోజుకి 25% ఫైబర్ దాని ద్వారా లభించింది. 

అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇలా ఆ సలాడ్ కానీ మరే గ్రీన్ సలాడ్ కానీ ముంచుకొని తినకుండా సాంబారులో ఇడ్లీల లాగా నానవేస్తే ఇంకా రుచికరంగా వుంటుందేమో అనిపించింది. ఇంటికి వెళ్ళాకా ఆ ప్రయోగం చేసి చూడాలి. ఆ రుచి ఎలా వుండొచ్చంటారూ?

నిజానికి ఇలా సలాడ్ కొనుక్కోకుండా ఇంటిదగ్గర నుండే సిద్ధం చేసుకొని రావచ్చు కానీ దానికి ఇంకా సమయం పడుతుంది. 

4 comments:

  1. Salad greens crunchy గా వుండాలి కదా.. మరి మీరు సాంబార్ లో నానేస్తే బాగోదేమో?
    అయినా తప్పదు, ఒక్కసారి ఐడియా వచ్చిందా చెయ్యాల్సిందే తప్పదు అనుకుంటే, proceed. You can write a book "My experiments with salad greens"

    ReplyDelete
  2. @ తుళ్ళూర్ పాండు
    సరేలెండి. నా ప్రయోగాలు ఒక్క సలాడ్ల మీదేనా? "My experiments with me" అనే పుస్తకం వ్రాయాల్సి వుంటుంది. సాయంకాలం సమయం లేక ఆ ప్రయోగం చెయ్యలేదు.

    ReplyDelete
  3. Annai adhi nenu already try chesanu long back. Chaala ghoramina result vachhindhi. Anyhow I don't liked it. I wish you best of luck.

    ReplyDelete
  4. అంతకూ నానబెడితే నచ్చకపోతే ముంచుకు తినేస్తా లెద్దురూ. అలా అయితే నాకు ఎలాగూ నచ్చుతోంది కదా.

    ReplyDelete