...ఎందుకు చూసానా అనుకున్నాను. కొన్ని కొన్ని మధురస్మృతులు అలాగే ఆగిపోతే బావుంటుందేమో, కొనసాగిస్తే పేలవంగా మిగిలిపోవచ్చు.
"శరత్! నువ్వేనా?! అప్పటికీ ఇప్పటికీ నేవ్వేమీ మారిపోలేదు సుమీ!అందుకే అంతదూరం నుండే నిన్ను గుర్తుపట్టగలిగాను" అంది ఆమె చాలా ఉత్సాహంగా. ఆమె మాత్రం బాగా మారింది. బాగా లావయ్యింది. ఇంకా చాలా మార్పులు వచ్చాయి. అప్పటిదాకా నామదిలో వున్న ఆమె అందమయిన రూపం చెదిరిపోయింది. ఈమెను ఇలా చూడకుండా వుండాల్సింది అనుకున్నాను. మా హైస్కూల్ రోజుల్లో ఆమె మా స్కూల్ బ్యూటీ క్వీన్. నాతో పాటు ఎంతో మంది హృదయాలను అప్పట్లో కొల్లగొట్టింది. అందం, అహం, తెలివి కలగలిసిన ఆమెను చూస్తుంటే ఎంతో మధురంగా అనిపించేది. ఇన్నాళ్ళ వరకూ, ఇన్నేళ్లవరకూ ఆమె మధురమయిన రూపాన్ని అప్పుడప్పుడూ గుర్తుకుతెచ్చుకొని పులకించిపోయేవాడిని. ఇప్పుడు ఆ స్వప్నం చెరిగిపోయింది - వాస్తవం కళ్ళముందు అవిష్కరింపబడింది. ఏం చేస్తాం - మనస్సులో నిట్టూర్చాను.
గత ఏడాది వేసవిలో ఇండియాలో మా చిన్నమ్మాయి శారీ ఫంక్షన్ జరిపాము. ఆ సందర్భంగా వీలయినంత మంది మిత్రులనూ, బాల్య మిత్రులనూ పిలుచుకున్నాను. 8,9 తరగతులు భోనగిరిలో చదివాను నేను. ఏదోలా వాళ్ళ ఫోన్ నంబర్లు సంపాదించి వాళ్లనూ పిలిచాను. కొంతమంది వచ్చారు. ఆడవారిలో ఈమె మాత్రమే రాగలిగింది. అప్పుడు చూసాను ఆమెను.
ఆమె పేరు కూడా చాలా బావుంటుంది. అందంగా, హుందాగా. ఈమె పేరుతో సహా ఈమెను నేను కలవక ముందు జస్ట్ ఫోనులో మాట్లాడాక అందాజాగా రెండేళ్ళ క్రితం ఒక పోస్ట్ వేసాను. ఆ పోస్ట్ ఇంకా వుంచానో తీసేసానో గుర్తుకులేదు.
Sorry to know that Annai. Even I have similar experiences recently during our 10th class reunion after 25 years :).
ReplyDeleteహ్మ్. ఏం చేస్తాం బ్రదర్.
ReplyDeletehttp://skybaaba.blogspot.in/2015/05/blog-post_8.html?m=1
ReplyDelete