అతను నా ముఖ్య స్నేహితుడు. ఆ రాత్రి అతడిని తీసుకొని ఒక చక్కని బార్ అండ్ రెస్టారెంటుకి వెళ్ళాను. టెర్రస్ మీద కూర్చొని బిర్యానీ, బీరూ ఆర్డర్ చేసాను. అతను తాగడు - నేను తాగుతాను. క్వార్టర్ బీరు ఖాళీ చేసాకా విషయానికి వచ్చాను. ఇప్పటివరకూ, ఇన్నాళ్ళుగా మా ఇంట్లో తలలో నాలుకగా మెలిగినందుకు, మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడికి వలే సహాయ సహకారాలు అందించినందుకు బహుళ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అతను సహజంగానే సంతోషించాడు. మరో గ్లాసు చల్లని బీరు లాగించి, మరో చికెన్ లెగ్గు తినేసి ఓ సారి త్రేన్చి అప్పుడు అసలు విషయానికి వచ్చాను. మా ఇంట్లో ఇహ అలాంటి పద్ధతి చాలించమన్నాను. అతను ఖంగుతిన్నాడు. అతను నానుండి ఇలాంటి మాటలు ఊహించలేదు. ఎందుకంటే మేము క్లోజ్ ఫ్రెండ్స్.
అతను మా ఇంట్లో ఎందుకు మారాలో అతనికి వివరించాను. "ఇప్పటిదాకా నేను సింగిల్ ని. ఏదో ఎలాగో నడిచిపోయింది - ఇబ్బంది లేదు. రేపు పొద్దున పెళ్ళయ్యాక నాకు ఓ పెళ్ళమంటూ వస్తుంది. ఆమె దగ్గర కానీ, మా ఇంట్లో గానీ, వాళ్ళింట్లో గానీ నాకు ప్రాధాన్యం వుండాలి గానీ నీకు కాదు. ఎంతయినా కొత్త పెళ్ళాం మరియు తొలి పెళ్ళాం. జెలసీ వస్తుంది. మన మధ్య తేడాలు వస్తాయి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది". అతగాడు అర్ధం చేసుకున్నాడు.
కట్ చేస్తే పెళ్ళి రోజు. పెళ్ళి పనుల్లో, మా ఇంట్లో అతని హడావిడి తగ్గలేదు. మా ఇంట్లో ముఖ్యమయిన వ్యక్తివలె పెళ్ళి పనులు చక్కబెట్టడం చక్కని విషయమే కదా. మిగతావాళ్ళు ఎందరు వున్నా అతను వేరు. అన్ని పనులూ స్వయంగా పూనుకొని భుజాన వేసుకొని చేస్తాడు. అందువల్ల అతని హడావిడి సబబే కాబట్టి నేను నొచ్చుకోలేదు. మర్నాటి నుండి తను ఎక్కడ వుండాలో, ఎలా వుండాలో అక్కడే వున్నాడు, అలాగే వున్నాడు. అటుపై మా మధ్య కొన్ని వేరే సమస్యలు వచ్చాయి - సామరస్యంగా పరిష్కరించుకున్నాం కానీ ఇలాంటి సమస్యలు ఏమీ రాలేదు.
అంతకుముందు మా ఇంట్లో మా అమ్మా నానలు ఒక్కరే వుండేవారు. నేనేమో చదువుల నిమిత్తం వేరే చోట్ల వుండేవాడిని. ఇతను మా ఇంటికి తరచుగా వచ్చి మా అమ్మా నానలతో మాట్లాడుతూ వారి అవసరాలు కనిపెడుతూ, వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాడు. పరిస్థితి ఎలా తయారయ్యిందంటే నేను ఊరి నుండి వచ్చినా కూడా నాకంటే అతనికే మా ఇంట్లో ప్రాధాన్యత ఎక్కువయ్యింది. మంచి స్నేహితుడు కాబట్టి నేను నొచ్చుకోలేదు - పైగా గర్వించాను - అంత బాగా మంచి స్నేహితుడు నాకు దొరికినందుకు. కానీ... అంత మంచి పేరు, నమ్మకం ఎలా మా ఇంట్లో ఎలా సంపాదించాడో నాకు అర్ధం కాక తల కాస్సేపు మాత్రం గోక్కునేవాడిని. అలా మా ఇంటికి అంత తరచుగా వెళ్ళేంత ఓపికా, తీరికా ఎలా దొరికేవో నాకు అర్ధం అవకపోయేది.
ఆ తరువాత ఎప్పుడో అసలు విషయం చెప్పాడు. ఒక ఉదాహరణ చెబుతాను. ఒకసారి వచ్చినప్పుడు మా పేరేంట్స్ దగ్గర్లో లేనిది చూసి ఫ్యాన్ ప్లగ్గు వైర్ కనపడకుండా ఊడగొట్టేవాడుట. మళ్ళీ రెండు రోజుల తరువాత ఇంటికి వస్తే ఫ్యాన్ సరిగా పని చెయ్యట్లేదని మా పేరెంట్స్ అతనికి చెప్పేవారు. అతను క్షణాల్లో అది బాగుచేసేవాడు! అలా అలా మా ఇంట్లో అతను సమర్ధుడు అనిపించుకున్నాడు. అంత సమర్ధత నాకెక్కడ ఏడ్చిందీ?
అంత ఓపిగ్గా, తీరిగ్గా పదేపదే మా ఇంటికి ఎందుకు వచ్చేవాడో కూడా తరువాత ఎప్పుడో, ఎలాగో తెలిసింది ;) మా పేరెంట్స్ కి తోడుగా ఇంట్లోనే పని అమ్మాయి వుంటుండేది. పలు కారణాల వల్ల తరచుగా ఆ పనిఅమ్మాయిలు మారుతుండేవారు. ఉదాహరణకు మా పేరెంట్స్ ఇంట్లో ఎక్కడో వసారాలో కూర్చునేవారు. ఇతను పడక గదిలోకి వెళ్ళి టేబుల్ ఫ్యాన్ తుడిచే నెపంతో పని అమ్మాయిని నీళ్ళూ, పాత గుడ్డా తెమ్మని చెప్పేవాడు. ఒక్కోసారి వాళ్ళింట్లో కాస్త పనులు వున్నాయని చెప్పి మా ఇంటి పనిమనిషిని వాళ్లింటికి తీసుకెళ్ళేవాడు. మా వాళ్ళు వద్దు అనలేకపోయేవారు.
పైన పేర్కొన్న విషయాలు వాస్తవం అయినప్పటికీ కేవలం వాటి వల్లే మా పేరెంట్స్ ఆదరాభిమానాలు పొందాడని కాదు. నిజంగానే మంచి మిత్రుడు. మా పేరెంట్స్ అంటే అతనికి మంచి గౌరవమూ, శ్రద్ధానూ.
దీనినే స్వామి కార్యం - స్వకార్యం అందురు
ReplyDelete$iddharth
@ $iddharth
ReplyDelete;)
two birds for one shot
ReplyDeleteis he your "friend" or just friend... confused..
ReplyDelete@ అజ్ఞాత7 మే, 2015 2:25 [PM]
ReplyDelete:)
@ A. Kalidasu
మీ వ్యాఖ్యతో నేను కన్‌ఫ్యూసూ. మీ ప్రశ్న నాకు అర్ధం కాలేదు.
I guess he meant..... is he your "close" friend or just a straight friend ? ;-)
ReplyDeleteహహ. ఓ అదా సంగతీ, ఇప్పుడు అర్ధమయ్యింది. థేంక్స్. స్ట్రెయిట్. Just friend.
ReplyDeletemee vaadu keka kadha . Ento alanti avudias kontha mandhike vasthai.
ReplyDeleteఅబ్బో మా వాడు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవడమే కాకుండా బోలెడన్ని అవకాశాలని సృష్టించుకునేవాడు. కాకపోతే కొన్నేళ్ళ నుండి శుగర్ వచ్చి 'వృద్ధనారీ పరివ్రత' అయిపోయేడు :)
ReplyDelete