శాంతి ఆశ్రమం నుండి ఉత్తరాలు
ఇరవై ఏళ్ళ క్రితం దివ్యా వీడ్ అనే అమెరికన్ తన తల్లితండ్రులకు శాంతి ఆశ్రమం నుండి వ్రాసిన ఉత్తరాలు ఇంటర్నెట్ లో పెట్టింది. నిన్ననే ఆ ఉత్తరాల సంకలనం పూర్తి చేసాను. చక్కగా అనిపించాయి ఆమె వ్రాతలు. ఒక అమెరికన్ దృష్టికోణంలో ఇక్కడి ఆశ్రమ అనుభవాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. ఈ ఆశ్రమం కాకినాడకి రెండుగంటల దూరంలో (పీఠాపురానికి గంట దూరం అనుకుంటా) తొటపల్లి హిల్స్ గ్రామలో వుంటుంది.
http://www.wattpad.com/user/DivyaWeed
నాకు దేవుడు, మోక్షం వగైరాల మీద ఇంకా విశ్వాసం లేదు కానీ సెక్యులర్ స్పిరిచువాలిటీ (లౌకిక ఆధ్యాత్మికత అనొచ్చా?) మీద ఆసక్తి బహుమెండు. భక్తి లేదు కానీ ప్రార్ధనలు, భజనలు, ధ్యానం అంటే ఇష్టం. ఎంటో ఈ ద్వైదీ భావాలు. నేనెప్పుడు నాకు అర్ధం అవుతానో ఏంటో. శాంతి ఆశ్రమం గురించి చదివా కాబట్టి దాని గురించి వివరాలు సేకరిస్తున్నాను. ఇవాళే ఆ ఆశ్రమ నిర్వాహకులు అంజనేయులు గారికి ఫోన్ చేసాను. ఒక రెండు వారాలు వుంటాను అని అన్నాను. జూన్, జులైలో అక్కడ కాస్త వేడిగా వుంటుంది కాబట్టి కోటగిరి ఆశ్రమం నాకు బావుండగలదని తెలిపారు. దివ్య రచనలు చదవడం వల్ల నాకు కోటగిరి ఆశ్రమం గురించి తెలుసు. ఊటీకి దగ్గర్లోని పర్వత ప్రాంతం అది. శాంతి ఆశ్రమం శాఖ అక్కడ వుంది. నాకు ఆశ్రమాలే నచ్చుతాయనుకుంతే పర్వత ఆశ్రమాలు ఇంకా బాగా నచ్చేస్తాయి. కానీ అక్కడికి ఆశ్రమ వాసం పేరిట వచ్చే ధనవంతులయిన యాత్రీకులే ఎక్కువని దివ్య తన ఉత్తరాల్లో వివరించింది.
http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india
ఇహపోతే ఆశ్రమ వాసం అంతా ఈసారి ఒక్క ఆశ్రమంలో చెయ్యాలా లేక వారానికో ఆశ్రమం తిరగాలా, ఒక్కడినే వెళ్ళాలా లేక కుటుంబంతో వెళ్ళాలా లేక ఆసక్తి చూపించే బంధుమిత్రులు ఎవరయినా వుంటే వారితో కలిసి వెళ్ళాలా అనేవి నా ధర్మ సందేహాలు.
శాంతి ఆశ్రమానికే తప్పనిసరిగా వెళతా అని కాదు. ఇంకా మిగతా ఆశ్రమాల వివరాలు కూడా సేకరిస్తాను. ఇలా ఆశ్రమవాసం మీద ఆసక్తి చూపిస్తున్నా అని పూర్తిగా సన్నాసి అయిపోయా అనుకోకండి. దేనిదారి దానిదే సుమీ. ఒక్కోక్కప్పుడు ఒక్కోదానిమీద ఆసక్తి మెండుగా వుంటుందంతే.
ఓషో మరియు చలం లకు అభిమాని.
Subscribe to:
Post Comments (Atom)
Good bro.. although short term,you are focusing all your research time,energy,effort for what you like.. many of us just wish for some things (like photography,farming,camps etc) and will not even start by telling our self that we are too busy or some other reason.. all the best bro.. welcome to India and enjoy ,,,
ReplyDeletenaku ippatiki anipistundi meeru inko sari civils try chesi vundalsindi.. not to remind your past.. just saying ,, meeru karya sadhakulu :) (Go getters) Cheers..
ReplyDelete@ అజ్ఞాత5 ఎప్రిల్ 2014 1:19 AM
ReplyDeleteధన్యవాదాలు :)
నిజానికి నేను నా పెళ్ళికి ముందే పుట్టపర్తి వెళతానని చెప్పి ఇంట్లో వారి అంగీకారం పొంది మా ఊరి బస్ స్టాండుకి కూడా వెళ్ళాను. పుట్టపర్తికి వెళ్ళదలుచుకున్నది సాయి బాబా మీది భక్తితో కాదు - ప్రశాంత జీవనం, స్పిరుచువాలిటీ దొరుకుతుందనే ఆశతో. అప్పుట్లో వేరే ఆశ్రమాలు నాకు ఎక్కువగా తెలియవు. అయితే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వచ్చి నాకు నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ తరువాత సాంఘిక సేవలోకి వెళదామని ఒక ఏడాది గ్రామీణ అభివృద్ధి మీద శిక్షణ తీసుకొన్నాక ఒక అమ్మాయి నన్ను ప్రేమలోకి దింపి జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చింది :)
నాకు దీర్ఘకాల ఆశ్రమ జీవనమే చెయ్యాలని వుంది కానీ బాధ్యతలూ, అనురాగాలూ అంతపని చెయ్యనివ్వవు కదా. ముందుముందు కుదరవచ్చు. ముందు కొంతకాలం వెళ్ళి చూస్తే ఆ జీవనం లోటుపాట్లు తెలుస్తాయి. చదవడం వల్ల ఇప్పటికే కొన్ని తెలుస్తున్నాయి. ఉదాహరణకు: ఆశ్రమాలు పెట్టిన వారు మంచివారు అయినప్పటికీ వారి తదనంతర నిర్వాహకులు సాధారణంగా సాధారణమయిన వారే అవచ్చు. అందువల్ల నిజంగా ఆశ్రమవాసం చెయ్యడం కన్నా చెయ్యాలని అనుకోవడమే బావుంటుండొచ్చు. ఇలాంటి నిజాలు తెలియడం వల్ల ఎక్కువగా అంచనాలు పెట్టుకోకుండా ప్రయత్నించొచ్చు.
@ అజ్ఞాత
ReplyDeleteనేను సివిల్స్ కి ప్రిపేర్ అయిన విషయం మీకు బాగానే గుర్తుందే :) దాని గురించి బ్లాగులో ఎప్పుడు వ్రాసేనో నాకు గుర్తుకులేదు.
నా చిన్నప్పటి తెలివితేటలు చూసి నేను భవిశ్యత్తులో కలెక్టర్ అవుతానని కొందరు అనుకునేవారు - బిల్లు కలెక్టరు కూడా కాలేకపోయాను :))
@ అజ్ఞాత
ReplyDeleteకొన్ని కారణాల వల్ల మీ కామెంట్ ప్రచురించలేదు. మీరు ఇచ్చిన లింక్ కి ధన్యవాదాలు. అందులోని విషయం సాధారణ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది కానీ క్లినికల్ సిచువేషనులో ఉపయోగపడదు.