రెండు మూడు నెలల తరువాత ఓ నెల కోసం నేను ఇండియా వచ్చే అవకాశాలు వున్నాయ్. ఆ సమయంలో వీలయినంత వరకు చక్కని ఆశ్రమాలలో ప్రకృతికి, ప్రశాంతతకు దగ్గర్లో నివసించాలని వుంది. అలా అని డబ్బులు బాగా వసూలు చేసే సంస్థలు వద్దు. నిరాడంబరంగా వుండే, వ్యాపార ధోరణి లేని ఆశ్రమాలు సూచిద్దురూ. నెట్టులో వెతికితే కొన్ని కనపడ్డాయి కానీ మీకు తెలిసినవి మరి కొన్ని వుండొచ్చు కదా అని ఈ విధంగా కోరుతున్నాను.
ఈ సారికి మాత్రం తెలుగు ప్రాంతం ఆశ్రమాలే దర్శించదలుచుకున్నాను.
శాంతి ఆశ్రమం గురించి దివ్యా వీడ్ వ్రాసిన ఉత్తరాలు ప్రస్థుతం చదువుతున్నాను:
http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india
శాంతి ఆశ్రమం గురించి దివ్యా వీడ్ వ్రాసిన ఉత్తరాలు ప్రస్థుతం చదువుతున్నాను:
http://www.wattpad.com/story/1275774-letters-from-shanti-ashram-india
ReplyDeleteమీ ఇల్లండి !
జిలేబి
స్వామి నిత్యానంద ఆశ్రమం.
ReplyDelete@ జిలేబి
ReplyDeleteసర్లెండి.
@ అజ్ఞాత
అబ్బే. అలాంటి వ్యాపారాత్మక ఆశ్రమాలు అంతగా నచ్చవ్ నాకు.
ఏప్రిల్ ఫస్ట్ న పోస్ట్ పెట్టారు. అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేయడం లేదు కదా... హిహిహి
ReplyDeleteహేమిటి గురువు గారు..చాన్నాళ్ళకు తలుపు తీశారు.. అది కూడా ఆశ్రమం అంటూ.. సంసార సుఖాలు తుచ్ఛం అని ఏమైనా అనిపిస్తోందా ఏమి..
ReplyDeleteసరే వినండి..
పచ్చటి అడవి మధ్యలో ఆశ్రమం.. కాటేజీలు..
పక్కనే చెరువు..వాతర్ ఫాల్సు (ఉన్నాయని విన్నాను..నేను వెళ్ళలేదు అక్కడికి).. కొంత దూరం (30 నిముషాల్లో) వెళ్తే ఒక అన్ని సదుపాయాలు ఉన్న ఊరు.... ఆశ్రమం చవక కూడా.. రోజుకు 40 మాత్రమే తీస్కుంటారు.. ఫుడ్డు బెడ్డు అంతా అందులోనే.. ఈ ఆఫర్ మీకు నచ్చిందా ??.. ఐతే అది ఎక్కడుందో కావాలంటే.. ఇక్కడ కామెంటు పెట్టండి..
@ అజ్ఞాత
ReplyDeleteఈ పోస్ట్ వేసిన రోజు ఏప్రిల్ 1 అని గుర్తేలేదండీ. అప్పుడప్పుడూ ఆశ్రమ వాసం పై నా ఆసక్తిని నేను ఈ బ్లాగులో తెలియపరుస్తూనేవున్నా.
@ కాయ
చాల్రోజులకు!
ఈ మెటీరియలిస్టిక్ జీవితం బోరుకొట్టి రియలిస్టిక్ జీవితం పై ఆసక్తి వస్తుంటుంది. మూలాల్లోకి వెళ్ళాలనిపిస్తుంది. అలా అని సంసార బాధ్యతలని పూర్తిగా వదులుకోలేం కదా. అందుకని మధ్యమధ్యలో అలా విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ పునరుత్సాహంతో రొటీన్ జీవితంలో గడుపవచ్చును కదా.
మీరు చెప్పిన ఆశ్రమం ఆసక్తికరంగా వుంది. వివరాలు తెలియజేయండి. మిగతా వాటితో పాటు అదీ పరిశీలిస్తాను. అడవి మధ్యలో ఆశ్రమం అంటె భలేగా వుంటుంది కానీ మిగతా విషయాలు కూడా నచ్చాలి కదా.
గురువు గారు.. అంటే మరి.. అక్కడెక్కడో ఏం వెళ్తారు లే అని.. ఇక్కడే టెన్నెస్సీ లో ఈషా ఆశ్రమం గురించి నేను చెప్పింది.. నాకు భలే నచ్చింది..
ReplyDelete@ కాయ
ReplyDeleteటెన్నెస్సీ ఇషా ఆశ్రమం గురించి ఇదివరలో మీలాంటి శ్రేయోభిలాషులు ఒకరు సూచిస్తే పరిశీలించాను. ప్రోగ్రాం కాస్ట్ ఎక్కువ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు చూసాను కానీ రెసిడెంట్ ప్రొగ్రాంస్ ఏమీ దొరకలా. మళ్ళీ తీరిగ్గా చూడాలి. సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి గురించి గొప్పగా విన్నాను. వారి వ్యాసాలు కొన్ని చదివాను - వీడియోలు కొన్ని చూసాను. కాస్త నచ్చారు - కాస్త నచ్చలేదూ.
నాకు పెద్దగా అలాంటి రిజార్ట్ టైప్ ఆశ్రమాలు నచ్చవ్ కానీ కమర్షియల్ వాటిల్లో ఇది కాస్త నయమేమో. ఇండియా ఈసారి వెళ్ళలేకపొతే మీరన్నట్లుగా చవక అయితే పరిశీలిస్తాను. మా దగ్గరి నుండి తొమ్మిది గంటల డ్రైవ్. ఓకే.
ramanasramam ,tiruvannamalai chala baguntundi
ReplyDeleteరమణాశ్రమం గురించి, రమణ మహర్షి గురించి చాలా చదివాను. చలం (రచయిత) అక్కడికే వెళ్ళారుగా :) అయితే అక్కడి ఆశ్రమంలో బస దొరకడం కష్టమనుకుంటా. బయట వుంటూ ఆ ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటాను. అలా నాకు ఇష్టం లేదు. ప్రస్థుతానికి తెలుగు మాట్లాడే ప్రాంతాలే ఇష్టపడుతున్నాను. తరువాతి సారికి ఇతర ప్రాంతాలు చూస్తాను.
ReplyDelete