...And Then There Were None


...పుస్తకం చదువుతున్నా. వ్రాసిందెవరనుకున్నారు? అగాధా క్రిస్టీ. ఆమె మిస్టరీ నవలలు చిన్నప్పుడెప్పుడో కొన్ని చదివాను. చిన్నప్పుడు డిటెక్టివ్, మిస్టరీ నవలలు చాలా చదివేవాడిని లెండి.  మళ్లీ చాలాకాలం తరువాత ఆమె రచన చదవడం.  ఇప్పటికి ఆ పుస్తకం కొన్ని పేజీలు చదివా. ప్లాట్ నెమ్మదిగా బిగుస్తోంది. అందులోని పాత్రలన్నీ ఇండియన్ దీవికి చేరుకుంటాయి. ఆ తరువాత ఏమవుతుందో నాకు ఇంకా తెలియదు. ఎప్పుడెప్పుడు తరువాయి పేజీలు చదివెయ్యాలా అని ఆతృతగా వుంది.

ఈమధ్య గుడ్ రీడ్స్ డాట్ కాం వాళ్ళు జీవితంలో చదివెయ్యాల్సిన 100 పుస్తకాలు ప్రకటించారు. అందులో కొన్ని అయినా చదివెయ్యాలి అని కంకణం కట్టుకున్నా.  అందులో సూచించిన పుస్తకం ఇది.ఈ లిస్టులో మీరు చదివేసిన, నచ్చిన పుస్తకాలు వుంటే సూచిద్దురూ. వీలయితే తెప్పించుకుని చదివేస్తాను.

http://www.goodreads.com/list/show/69635

అన్నట్లు ఈ పుస్తకం నేను చదివాక ఎవరికయినా కావాలా? US లో వున్నవారు అడ్రసు చెబితే అందులో ఒకరికి బుక్ పోస్ట్ చేస్తాను. బదులుగా మీరు కూడా ఓ పుస్తకం వీలయితే నాకు పంపిద్దురూ.

5 comments:

  1. Welcome Back , Good to see you after a long time

    ReplyDelete
  2. @ అజ్ఞాత
    ధన్యవాదాలు :) చూద్దాం ఇదెంత కాలమో.
    సంకలిని, హారం సంకలినులు మూత పడిపోవడం కూడా బ్లాగింగ్ మీది నిరాసక్తికి కొంత కారణం.

    ReplyDelete
  3. Nice book. The suspense was maintained till the end. I read it 10 years back and can still recollect it. Many films were based on the concepts in this book. Hope you enjoy it.

    ReplyDelete
  4. Welcome back. That's a good book indeed !
    How are you doing, by the way ?

    $iddharth.

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    ఈ మధ్య పుస్తకాలు అసలే చదవక ఏదో కోల్పోయిన భావం కలుగుతోంది. అందుకే మళ్ళీ పారాయణం మొదలెట్టా. అగాధావి ఇంకేం మంచి రచనలున్నాయో సూచించండి.

    @ సిద్ధార్ధ్
    నా పరిస్థితి రోలర్‌కోస్టర్ ప్రయాణంలా వుంది :) పల్లంలో వున్నప్పుడు కనుమరుగు అవుతున్నా పైకి వచ్చినప్పుడు ఇదో ఇలా బ్లాగుల్లో కనపడుతున్నా. కాస్త బ్యుజీ కూడా అయిపోయాను.

    ReplyDelete