ఇంకా నాకు డయాబెటిస్ రాలేదు కానీ రాకుండా చూసుకోవాలి కదా. అందుకే ఈ మధ్య (మళ్ళీ) అహారంలో కొన్ని మార్పులు చేసాను. కార్బోహైడ్రేట్స్ కాస్త తగ్గించాలనేది నా లక్ష్యం. పళ్ళూ, కూరగాయలూ బాగా తినాలి. భేష్ కానీ కూరగాయలు, ఆకులూ తినాలంటే రుచి దొరకవే. సలాడ్ డ్రెస్సింగులో కూడా ఫ్యాట్ బాగా వుంటుంది. అవి వేసుకున్నా నాకు అంత రుచిగా అనిపించదు. రోజూ తినలేము.
కొన్ని సార్లు సూపులు గట్రా కొనుక్కువచ్చి ప్రయత్నించాను. కొన్ని రోజులు గ్రీన్ స్మూతీస్ ప్రయత్నించాను. కొన్ని కారణాల అవి కుదరలేదు. ఇక అలాక్కాదని కట్ చేసిన కూరగాయలు దొరుకుతాయి కదా. వాటితో పాటుగా ఇంట్లో వున్న నచ్చిన కూరను కలిపి కొన్ని నీళ్ళు కలిపి ఉడికిస్తున్నా. అలా చక్కటి వెజిటబుల్ సూప్ తయారవుతోంది. అందులో కలిపేది నాకు నచ్చిన కూరనే కాబట్టి రుచికరంగా వుంటోంది. అప్పుడప్పుడు నాకు ఇష్టమయిన పచ్చడి కూడా కలిపేసి తింటాను. అలా ఒకటి రెండు రవుండ్లు లాగించాకా కొద్దిగా వరి అన్నం తీసుకుంటాను. ఉదాహరణకు నిన్న మా ఇంట్లో కంది పప్పు కూర చేసింది మా ఆవిడ. అదీ, ఆవకాయా కూరగాయ ముక్కలకు కలిపి నీళ్ళు పోసి మరిగించాను. చక్కటి సూప్ తయారయ్యింది. దీనికి ముందు ఇంకో పని చేస్తుంటాను. కట్ చేసిన ఆకుకూరలను ఒక రవుండ్ లాగిస్తుంటాను. వాటిని కూడా కూరతోనో, చట్నీతోనో నంజుకుతింటాను.
ఇవాళ శుక్రవారం కనుక ఇంట్లో నాన్ వెజ్ కూర వుండి వుంటుంది. అదియునూ కూరగాయలతో కలిపి (నాన్) వెజ్ సూపు చేసుకోవాలి. ఈ వ్రాసినదంతా రాత్రి భోజనం గురించి. పనిరోజుల్లో మధ్యాహ్నం చపాతీలు, పళ్ళూ తింటాను. ఉదయం స్నాకుగా మొలకెత్తిన లేదా నానబెట్టిన శనగలు తింటాను. ఇహ వారాంతాలు ఆహార నియంత్రణ పెద్దగా చెయ్యను. అలా అని అతిగా కూడా తినను.
బావుందండీ మీdinner. మేము కూడా ప్రయత్నంచే ధైర్యం చేయొచ్చా?
ReplyDeleteఏవిటో సార్...
ReplyDeleteవండుకున్నోడికి ఒకటే కూర, అడుక్కున్నోడికి అరవై కూరలన్నట్లు...
పాపం వండిన అనిత మేడమ్ గారికేమో కేవలం కందిపప్పు కూర. మీకు మాత్రం అన్ని కూరగాయలతో షడ్రుచులా... భలే ఉంది సర్ మీ యవ్వారం.
jeevithame oka prayogasaala laa vnde meeku.
ReplyDeleteBetter consult a Doctor. This kind of self-dietician tricks may not be good for health and prove to be counter productive.
ReplyDelete@ నాగరాణి
ReplyDeleteఎంచక్కా
@ అజ్ఞాత
మనలో సృజనాత్మకత వుంటే ఎన్నో రుచులు ఎన్నో రకాలుగా సృష్టించుకోవచ్చు :)
@ అజ్ఞాత
నిజం చెప్పారు :) ఎన్నెన్నో ప్రయోగాలు ఎన్నిట్లోనో చేసేస్తుంటాను కానీ అన్నీ బయటకి చెప్పలేము కదా :)
@ శివరాంప్రసాద్
ప్రతీ దానికి అలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేము లెండి.
sarat anna, you're trying to go in the right way, and there's a slight different approah you must take to get nutrition.
ReplyDeletefrozen vegetables are not good for health and hawe 0 nutrition. plus boiling already boiled curry means you lose the nutrition that's there in the curry totally too.
better, buy fresh veggies n then take 5-10 mins to chop them add some garam masala powder + dhaniya powder + salt to it and make your soup, add some fresh lemon juike after you take it off from stowe ( heating with lemon is not proper) so you kan absorb the iron in the veggies.
also, along with fruits/veggies, you must eat complex carbohydrates ( meaning grains with top layer intact aka unpolished grains , like whole wheat, brown biyyam alias mudi biyyam/dampudu biyyam, it's available in whole foods or whole markets in the US, please try ) for not getting sugar. plus mudi biyyam lo you get all B vitamins. Buy 1 kg first to see if you will continue it.
ReplyDeleteeat atleast 200 gms fruits a day, as fruits give you fiber and also lighten the mood ( trust me on this ). you must take variety of fruit , not just 1 type, in a day. Oranges are a must for witamin - c , it makes your mood happy, plus it's essential to absorb iron, as iron is essential for strength, so is an orange as it's inter-linked.
No, don't buy orange juice in boxes plus lot of preservatives.. it's heated to high temperatures so that bacteria in it is killed for longer storage.( yes, they show on idiot box how boxed juices are made ). result is almost 0 nutrition. as the vital nutrient vitamin - c is lost when heated.
Eat fresh oranges instead, atleast 2-3 in a day, plus another seasonal fruit you like. This also helps uplift your mood plus nutrition, more than soups. As they are not altered by heat etc, you get max nutrition from fruit.
please follow these and tell me how your life is better. :-)
your well-wisher tambi.