శనివారం సాయంత్రం ఒక గృహప్రవేశం వుండటం వల్ల ఆదివారం ఉదయం బయల్దేరి మిషిగన్ లో వున్న సిల్వర్ లేక్ డ్యూన్స్ (ఇసుక తిన్నెలు) కి వెళ్ళాం. మాతో పాటు ఇంకో మూడు కుటుంబాలు జత కలిసాయి. మా దగ్గరి నుండి 4 గంటల ప్రయాణం. 2000 ఎకరాల ఇసుక తిన్నెలు అవి. అందులోకి రైడ్ తీసుకున్నాం. ఒక మోటారు బగ్గీలో 45 నిమిషాలు తిప్పి చూపించారు. చాలా బావుంది రైడ్. ఆ విశాలమయిన ఇసుక తిన్నెల్లో ఎత్తుపల్లాల మీద వేగంగా ప్రయాణిస్తుంటే ఎంతో సరదాగా అనిపించింది. అటు తరువాత ఎంతో ఎత్తయిన, విశాలమయిన ఆ ఇసుక తిన్నెల మీద నడుస్తూ, దూకుతూ, దొర్లుతూ, జారుతూ సిల్వర్ సరస్సు వద్దకు చేరి ఆ బీచ్ వద్ద కాసేపు ఆడుకున్నాం.
ఇహ చీకటి పడుతుందనగా కేంపింగ్ సైటుకి వెళ్ళి టెంట్లు వేసాం. ఫైర్ పిట్ లో మంట రాజేసి చలి కాచుకుంటూ ముచ్చట్లు చెప్పుకున్నాం. ఆ తరువాత ఆ మంట మీద గ్రిల్ వేసి బార్బెక్యూ చేసాం. పలువులు పలు ఆహార పదార్ధాలు తెచ్చారు కాబట్టి నుష్టుగా భుజించాం. అర్ధరాత్రికి ముచ్చట్లు చాలించి పడుకొని ఉదయం ఆరు తరువాత లేచాం. కాస్త చలిగా వుండటంతో మళ్ళీ మంట రాజేసాం. మంట కాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ అల్పాహారం ఘనంగా తీసుకున్నాం. పదింటికి మా క్యాంప్ సైటుకి ఆనుకునే వున్న బీచుకి వెళ్ళి రింగ్ బాల్, ఫ్రిస్బీ ఆడాం. వాలీబాల్ బీచ్ కి తీసుకెళ్ళడం మరిచాం. పిల్లలు ఇసుకలో ఆటలు ఆడారు. కేంపింగ్ సైటూ, బీచూ ఎంతో బావున్నాయి.
పదకొండున్నరకి కేంపుకి తిరిగివచ్చి స్నాక్స్ తినేసి మా గుడారాలు పీకేసాం. ఆ తరువాత అటునుండి బయల్దేరి మస్కెగాన్ పార్కుకి వెళ్ళాం కానీ అక్కడ వాతావరణం బావుండకపోవడంతో ఇంటికి బయల్దేరాం. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలు అయ్యింది. అలా జరిగింది మెమోరియల్ లాంగ్ వీకెండ్.
పండగ చేస్తున్నారన్నమాట.అన్నట్లు ఈసారైనా వర్షం పడిందా?
ReplyDeleteలేదండీ. ఈసారీ వర్షం పడలేదు. ఈ వేసవిలో ఇంకొన్ని సార్లు గుడారాలు వెయ్యాలి. అప్పుడయినా భీభత్సంగా వర్షం పడుతుందేమో చూస్తాను :)
ReplyDeletesex lo smooth inserting ki cream emaina unnaada ?
ReplyDeletenaku foreskin back ki velladam ledu, my wife emo pain ani arustundi.
em cheyyali ?
చర్మం వెనక్కిపోకపోతే సుంతీ కానీ లేదా మరేదయినా వైద్యపరమయిన పరిష్కారం అవసరం కావచ్చు. డాక్టరుని కానీ యూరాలజిస్టుని కానీ సంప్రదించండి.
ReplyDeleteస్మూత్‌నెస్ కోసం వాజ్‌లైన్ లాంటి జెల్లీలను వాడొచ్చు. అయితే పెట్రోలియం బేస్డ్ జెల్లీల కంటే వాటర్ బేస్డ్ జెల్లీలు ఆరోగ్యానికి మంచిది. మెడికల్ షాపులో వాటర్ బేస్డ్ జెల్లీ కోసం అడగండి.
maa friend emo, force gaa insert cheyi nee foreskin cut avutundi appudu free ga untundi ani cheptunnaadu.
Deleteantha violence nenu oohinchukolenu.
foreskin moththam remove cheyakunda adi munduki venakki velletattu emanna surgery untundaa ?
sunthi cheyinchukunte moththam foreskin theesestaremo ani doubt gaa undi.
foreskin theeseste sensitivity undadanta kadaa ?
@ అజ్ఞాత
Deleteబలవంతంగా వద్దులెండి. ముందు చర్మం పూర్తిగా తీసివెయ్యకుండా కూడా పరిష్కారాలు వుంటయ్. మీ పరిస్థితిని బట్టి ఏది మంచి పరిష్కారమో యూరాలజిస్ట్ సూచిస్తారు. ఒకసారి వెళ్ళి కలవండి.
సుంతీ వల్ల సున్నితత్వం కాస్త తగ్గినట్లనిపించినా దానివల్ల కొన్ని ప్రయోజనాలూ వుంటాయి. సమర్ధత పెరగడం అందులో ఒకటి.
మీరు మరో సమరం అయిపోయే లాగ ఉన్నారు.ఇలాటి సమస్యలపైన ఒక బ్లాగ్ తెరిచేయండి.
ReplyDelete@ మధు
ReplyDeleteఅబ్బే, నాకు అర్హతలు లేవు కాబట్టి నేను ఇచ్చే ఉచిత సలహాలు మన వాళ్ళకి ఆనవు లెండి. మన వాళ్ళకి ఏదయినాగానీ, ఎలాంటిదయినా కానీ శంఖంలో పోస్తే కానీ తీర్ధం అనిపించుకోదు. అయితే ఎవరన్నా ఏదన్నా అడిగితే మాత్రం స్పందిస్తుంటాను.
పలు హార్మోన్స్ విషయాల్లో నాకు ఈమధ్య కొంత అవగాహన వస్తోంది కాబట్టి, ప్రజానీకంలో వాటి గురించి చాలా తక్కువ అవగాహన వుంది అని అర్ధమవుతోంది కాబట్టి అందుగురించి అప్పుడప్పుడు వ్రాస్తూనే వున్నా కూడా పెద్దగా ఎవరికీ ఎక్కడం లేదనుకుంటా.
ఎంటో అన్నాయ్, ఈ మధ్య నీ బ్లాగుల్లో సుత్తి ఎక్కువయ్యింది.. ఆసక్తి కరమైన టాపిక్కులు రావటం లేదు...
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteనిజమే. ఏదొ వ్రాస్తున్నా అంటే వ్రాస్తున్నా. జీవితంలోనే హుశారు తక్కువయినప్పుడు అలాగే వుంటుంది. కొన్ని వారాల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చు - అప్పుడు చూద్దాం. ఈమధ్య తీరిక కూడా తక్కువయ్యింది.
weekend kudaa maanesaare blog raayadam?
ReplyDeleteసాధారణంగా వారాంతాలు నేను బ్లాగు వ్రాయను. పలు రకాల కార్యక్రమాలతో, బాధ్యతలతో, పనులతో తీరికే చిక్కదు. పని రోజుల్లోనే వ్రాస్తుంటాను. అయితే ఈ రోజుల్లోనూ పని ఎక్కువ కావడం, వ్రాయాలనే ఆసక్తి తక్కువ కావడం తదితర కారణాల వల్ల పెద్దగా వ్రాయడం లేదంతే.
ReplyDeletehello,gaayab ipoyaare okesaari?
ReplyDeleteఏమో...వ్రాయబుద్ధవడం లేదంతే. జనాలకి ఇష్టం అయినా కాకున్నా ఇదివరకు నాకోసం అయినా వ్రాసుకునేవాడిని కానీ...
ReplyDeletecheppalsinavanni cheppesaaraa?
Deleteచెప్పాలంటే ఎన్నో వున్నాయి, ఎన్నో వుంటాయి కానీ ఇక చెప్పింది చాల్లే అని అనుకుంటున్నా.
Delete