"ఈ శనివారం - ఎన్నాళ్ళుగానో వేచిన ఉదయం - కాదు కాదు మధ్యాహ్నం. మగవారి
కలల పంటలు కాదు కాదు వంటలు పండే రోజు. మగజెంట్స్ అందరూ మా ఇంట్లో ఈ
శనివారం సాయంత్రం వంటొండాలని ఆడలేడీస్ అందరూ (కాకపోతే కొందరు లెద్దురూ)
డిసైడ్ చేసిండ్రు. అంచేత ఆ రోజు మధ్యాహ్నం లంచ్ గించు ముగించుకొని మా
ఇంటికి వచ్చి మీ పాకశాస్త్ర ప్రావీణ్యతను వెలుగులోకి తేండి. మన
ప్రావీణ్యతలను మహిళాలోకం పరీక్షించి బహుశా బహుమతులు ఇస్తే ఇస్తారు. లేదా
అభినందన పత్రాలు ఇవ్వొచ్చు. వాటిని గెలిచిన వారు మెడలో తగిలించుకొని
తిరగవచ్చు లేదా మీ ఇంట్లో (మా ఇంట్లో కాదు) గోడకి అతికించుకోవచ్చు. నాకు
ప్రధమ బహుమతి రాకపోతే అలుగుతానని ఆల్టిమేటం ఇచ్చేస్తా. అందరం వరుసగా
వంటలొండేసరికి రాత్రి అవుతుంది. ఆ తరువాత మన వంటలు ఆడాళ్ళు తిన్నాక
వాళ్లంతా క్షేమంగా వుంటే(నే) పిల్లలూ, మనమూ తినేద్దాం.
నేను చేమగడ్ద పులుసు మరియు/లేదా కోడిగుడ్డు పులుసు వండుతాను. ఇలాగే మిగతా అందరూ చెప్పిన వంట చెప్పకుండా తలో వంటా తాము బాగా ప్రావీణ్యం వున్నది తెలియపరిస్తే బావుంటుంది. (హింట్: నాన్ వెజ్ కూరలకి ఎక్కువగా మార్కులు పడే అవకాశం వుంది. ఈ సదవకాశాన్ని మీరందరూ ఎంచక్కా ఉపయోగించుకోండి). ఇంటిదగ్గర వండి తెస్తామంటే ససేమిరా కుదర్దని మహిళా లోకం ఖండితంగా చెప్పింది. బోగస్ మగ వంటకాలు వుండొచ్చని వారి అనుమాన పెనుభూతం. అంచేతా అలాంటి ఆలోచనలు మానేసి శుబ్బరంగా మా ఇంటికి వచ్చి వండేసెయ్యండి. వంటలు ఏమాత్రం రాని మగ మహారాజులు ఏ 'కుకింగ్ ఫర్ డమ్మీస్' పుస్తకమో చదివి ప్రయోగాలు చెయ్యొచ్చు లేదా సింపుల్గా ఏ పచ్చి పులుసో, రసమో, టమాటో రసమో చేసిపడెయ్యొచ్చు. వారికి కన్సోలేషన్ ప్రైజ్ వస్తే రావచ్చు. అంచేతా అందరూ వచ్చేసెయ్యండి - వండేసెయ్యండి - వండేసెయ్యండంతే!
మిగతా వివరాలు నెమ్మదిగా మీకు అందరికీ ఫోన్లు చేసి తెలియజేస్తుంటాను. ఈలోగా మీకేమయినా సందేహాలూ, ఫందేహాలూ వుంటే కడిగేసెయ్యండి కాదు కాదు అడిగేసెయ్యండి."

నాకు వంటలు బాగానే వండటం వచ్చని నాకు నామీద వున్న సదభిప్రాయం (మిగతావారి సదభిప్రాయాలు అడక్కండేం) అయితే ఇంట్లో అరుదుగా మాత్రమే ప్రయత్నిస్తాను. ప్రయత్నించినా చెడగొడతాను. హమ్మో నా వంట మా ఆవిడకి నచ్చేసిందంటే ఇంకేమన్నా వుందా - రోజూ నన్నే వండెసెయ్మనే ప్రమాదం లేదూ - హందుకే. మా ఆవిడ ఇండియా ట్రిప్పుకి గట్రా వెళ్ళినప్పుడు మాత్రం ఎంచక్కా చక్కగా వండుకొని తినేస్తాను.
ఇహపోతే ఈ శనివారం నేను వండే కూరలేంటో చూసారు కదా. చేమగడ్ద పులుసు లేదా కోడిగ్రుడ్ల పులుసు. నాకు పులుసు కూరలు అందునా ఆ కూరలు అంటే మహా ఇష్టం లెండి. ఈ వారం వంటల్లో మన కూరలు అద్దిరిపోవాలి. మన బ్లాగర్ల పరువు నిలబడాలి. అందుకే ఆ కూరలు ఎలా ఘుమఘుమ లాడేట్టు వండాలో చెప్పి కాస్తంత పుణ్యం కట్టుకుందురూ లేదా వంటల సైట్లు అయినా సూచించండి. మొత్తమ్మీద మనకు ప్రధమ బహుమతి రావాలి. రాకపోతే నేరం నాది కాదు మీదే!
ఆ రోజు మా పాకశాస్త్ర ప్రావీణ్యం ఎలా వెలిగిపోతుందో, జడ్జిలు ఏమంటున్నారో, తిన్నవాళ్ళ పరిస్థితి ఏంటో లైవ్ బ్లాగింగ్ చేద్దునా ?

super ahe...
ReplyDelete@ లడ్డు
ReplyDeleteతింటే నా చేతి వంటలే తినాలి... కి కి కి.
వెంటనే యూ ట్యూబ్ లో లాగిన్ అయి...వారెవా డాట్ కాం వాళ్ల వీడియోలు, సంజీవ్ కపూర్ వీడియోలు చూసేయండి. మోస్ట్ డిపెండబుల్......నేను వాళ్ళనే ఫాలో అవుతాను
ReplyDeleteఆల్ ది బెస్టూ! మంచి మార్కులు, బహుమతీ ప్రాప్తి రస్తూ
mari aada gents, maga ladies eppudo...
ReplyDeletewho won the competition finally ? :)
ReplyDelete@ సుజాత
ReplyDeleteవారెవా (డాట్ కాం) మా ఆవిడ కూడా తరచుగా చూస్తూ ప్రయోగాలు చేస్తూవుంటుంది. కొన్ని వారాల క్రితం నేను కూడా అందులో కోడిగుడ్డు బిర్యానీ చూసి మా ఆవిడ చేత చేయించాను. ఆవకాయ బిర్యానీ కోసమూ, ఉలవచారు బిర్యానీ కోసమూ అందులో వెతికా కానీ కనపడలా!
@ అజ్ఞాత @ 26 నవంబర్ 2012 6:25 ఉ
అలాంటిది మీరు ఏర్పాటు చేసుకోండి.
@ అజ్ఞాత @ 29 నవంబర్ 2012 1:56 ఉ
ReplyDeleteమరీ ఎక్కువమందిని పిలవలేదు లెండి. ఆరు ఫ్యామిలీలను పిలిస్తే నాతో కలిపి నలుగురు నలభీములు మాత్రమే వచ్చారు. మిగతా వారు హాజరు వేసుకొని వెళ్ళిపోయారు - వేరే పార్టీలు వుండటం వల్ల. వంటలు చేసిన వారిలో చంద్ర - రొయ్యల బిర్యానీ, సాంబారూ, మధు - మటనూ, వెజ్ బిర్యానీ, శివ - పకోడీ, సేమ్యా చెయ్యగా నేను చేమగడ్డ పులుసు చేసాను. వాటిల్లో రొయ్యల బిర్యానీ కాస్త మాడి రుచి చెడిపోయింది. సాంబారు సూపర్గా వచ్చింది. మిగిలిన సాంబార్ మూడు రోజులు నేను తిన్నాను. వెజ్ బిర్యానీ కూడా బాగా వచ్చింది. సేమ్యాలో కాస్తంత షుగర్ తగ్గినా కూడా రుచికరంగా వచ్చింది. అయితే అనుకోకుండా ఆడాళ్ల ప్రశంసలు అన్నీ నా చేమగడ్డ కూరకే పడ్డాయి. ఈ కార్యక్రమం మేనేజ్ చేసిన మేమే అవార్డులు ఇచ్చుకోవడం పద్దతి కాదు గనుక మధుకి మొదటి అవార్డ్, చంద్రకి రెండవ అవార్డ్, హాజరీ వేసుకొని ఎంచక్కా అంట్లు తోమి వెళ్ళిన బాలాజీకి మూడవ అవార్డ్ ఇవ్వబడింది. ఆ మూడు అవార్డులూ మా అమ్మలు (చిన్నమ్మాయి) పెయింట్ చేసింది. ఇతరులు ఎవరూ ఊహించని విధంగా అమ్మలు ఆ విధంగా అవార్డులు డిజైన్ చేసి ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యమూ, ఆనందమూ పొందారు.
అయితే నా వంటకి ఎందుకయినా మంచిదని చంద్ర సహకారం తీసుకున్నాను. అందువల్ల నా వంట బాగా కుదిరిందంటే కొంత క్రెడిట్టు అతనికీ చెందుతుంది. అలా అలా మగాళ్ల వంటల కార్యక్రమం ఆడవాళ్ళ ఆటపట్టింపులతో సరదాగా, సంతోషంగా, హడావిడిగా జరింది.
క్ర్రీడాస్పూర్తి ప్రదర్శించారు గురువు గారు.
ReplyDeletewow. Great brother.. Home sweet home ... ila appudappudu kalasi itlanti activities chestunte chala bavuntundi ,,
ReplyDeleteMagha gents ante yemito.Gents ante magavallu kada.Double gender use.
ReplyDelete@ ప్రశాంత్
ReplyDeleteమీరు కాస్త సైడు పక్క కూడా ఆలోచించాలండీ బాబూ. మీరు చెప్పింది నాకు తెలియక కాదు. కొదరు తెలిసీ తెలియక రెండు పదాలూ సైడు పక్కనే వాడుతారు. మీరు ఇది హాస్యంగా తీసుకోవాలి మరి.