మనం పలు ఉద్యమాల గురించి వింటూ వుంటాం కానీ ఈ పేషెంట్ల ఉద్యమం నాకు కొత్తగా అనిపించింది. అదీ థైరాయిడ్ పేషెంట్ల ఉద్యమం. నేనూ ఆ పేషెంటునే కాబట్టి ఈ ఉద్యమంలో చేరిపోయి ఆ పిటిషన్ నేనూ సైన్ చేసాను. ఒక అంచనా ప్రకారం 40% ప్రజలలో ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ హార్మోన్ అపసవ్యతలు ఎంతో కొంతయినా వుంటాయి కానీ చాలామంది వైద్యులకి ఈ విషయాల మీద క్షుణ్ణమయిన అవగాహన లేకపోవడం వలన పది శాతం పేషెంట్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు.
అందువల్ల మిగతా వారందరూ చికిత్సకు లోను కాకుండా పలు లక్షణాలతో బాధపడుతున్నారు. డాక్టర్లలో, వైద్యసంస్థలలో ఈ విషయంలో మార్పు కోరుతూ రోగులు ఉద్యమిస్తున్నారు. మీకు కూడా థైరాయిడ్ సమస్య లక్షణాలున్నా కూడా మీ వైద్యుడు సరిగా నిర్ధారించడం లేదు అనుకుంటే ఈ పిటిషన్ చదివి సంతకం చెయ్యండి. మీ వైద్యుడితో మీరు తెలుసుకున్న విషయాలు చర్చించండి. అయినా సరే మీ మాట పట్టించుకోక పాత పద్ధతుల్లోనే మిమ్మల్ని విశ్లేషిస్తుంటే కనుక మీరు మరో వైద్యుడిని చూసుకోవడం మంచిదేమో మరి.
http://www.thyroidchange.org/
Your Voice is Needed
Please Sign and Share to Unite for Change
The patient petition, "Patients with Thyroid Dysfunction Demand Better Care," is an initiative to increase awareness and improve the overall care of thyroid dysfunction. Our voices can effect change worldwide!
ఇహపోతే థైరాయిడ్ మరియు ఎడ్రినల్ హార్మోన్లు ఓ రెండు వారాలుగా నేను తీసుకుంటున్నాను. గత మూడు రోజులుగా నాలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది కానీ అది భ్రాంతో (ప్లేసిబో ఎఫెక్ట్?) నిజమో తెలియదు. తాత్కాలికమో, శాశ్వతమో తెలియదు. చూద్దాం. పూర్తిగా గుణం కనిపించడానికి నెలన్నర అయినా పడుతుంది.
నెలన్నర అయ్యాక కూడా అది ప్లేసెబో ఎఫెక్టో కాదో మీకు ఎలా తెలుద్తుంది? బ్రెయిన్ స్కాన్లూ గట్రా తీయించుకొన్నా కూడా..., ప్లేసెబో ఎఫెక్ట్ వలన ఉత్సాహం పెరిగి, అలా వచ్చిన ఉత్సాహం వలన బ్రెయిన్ మాపింగ్ తదనుగుణం గా రావచ్చు గదా? ప్లేసెబో ఎఫెక్ట్ వలన కలిగే స్కాన్ పాటర్న్ కీ అసలు మందు పని చేసిన పాటర్న్ కీ తేడా ఉంటుందా?
ReplyDeletehttp://www.istream.com/t/tv/andariki+ayurvedam
ReplyDeleteగురువు గారు..సంతకం పెట్టమంటే సలహా లిస్తావెంట్రా అనుకోకుండా కింద విషయం ప్రయత్నించి చూడండి.. చిన్న పేద్ద సూచన...
ReplyDeleteపెద్ద గురువుగారు చెప్పినట్లు మెడిటేషన్ చేయండి. అంటే కళ్ళు మూస్కుని కూచోడం కాకుండా.. డైనమిక్ మెడిటేషన్‌లు చేయండి... ఆరోగ్యం లో తేడా నెమ్మదిగా తెలుస్తది..
లోపలి నుంచి కూడా నరుక్కురండి..కింద లింకు లో నాదబ్రహ్మ మెడిటేషన్ ట్రై చేసి చూడండి.. నాకు భలే అనిపిస్తుంది ఈ మెడిటేషన్...
http://www.osho.com/Main.cfm?Area=Meditation&Language=English
@ బొందలపాటి
ReplyDeleteఈ సారి మా డాట్రు గారిని ప్లేసిబోలు వ్రాసిమ్మని అడుగుతాలెండి - సీపు అండ్ బెస్టూనూ :))
కొద్ది శాతం మందికి ప్లేసిబోలు నిజంగానే ప్రభావం చూపవచ్చు అనేది నాకున్న అవగాహన. అయితే అనుభవజ్ఞుడయిన రోగికి ఏది నిజంగా పనిచేస్తోందో లేదో త్వరగానే తెలుస్తుందనుకుంటా. ఉదాహరణకు నేను ఎన్నో రకాల చికిత్సలూ, మందులూ ప్రయోగించి చూస్తుంటాను. కొద్ది వారాల్లో నాకు అర్ధం అవుతూవుంటుంది.
@ అజ్ఞాత
ReplyDeleteహ్మ్. మీరు సూచించిన వీడియో ఇంకా చూడలేదండి. గుర్తు వుండటం లేదు. చూస్తాను.
@ కాయ
శిష్యా, సలహా ఎలా వుంది అంటే జ్వరం వచ్చిన వాడిని లేచి గంతులేస్తే తగ్గుతుంది అన్నట్లుగా వుంది. అయా మెడిటేషన్లు నాకూ ఇష్టమే కానీ నా ఆరోగ్యం ఇంకాస్త కుదుట పడ్డాక మాత్రమే అవి కుదురుతాయి. అవి చెయ్యాలంటే ఓపిక, ఆసక్తీ, శక్తీ ముందు వుండాలి కదా నాయనా?
ఏమయినప్పటికీ నాకు సలహాలు ఇవ్వడానికి సంకోచించకండి. అన్నీ పాటించలేకపోవచ్చు కానీ కొన్నయినా కుదరవచ్చు.
అన్నట్లు పనిలో ఈమధ్య తీరిక లేక టపాలు వ్రాయలేకపోతున్నా. ఇకపై అప్పుడప్పుడు మాత్రమే కుదురుతుందేమో.
సరే అలాక్కానివ్వండి. ఖాళీగా ఏ పనీ చేయకుండా కూడా మెడిటేషన్లో ఉండవచ్చని మన ఓషో చెప్పిండు మరి. అలా ఉండగలగటమే మెడిటేషన్ అని చెప్తున్నాలు.
ReplyDeleteమా పాత కంపనీ లో కామెంట్లు పెట్టకుండా ఏదో మాయ చేశారు ఐటీ వాళ్ళు. మళ్ళీ మొదలు పెట్టాను అని నేను సంబర పడుతుంటే మీరు చేతులెత్తేస్తే ఎట్టా గురువుగారు.
@ కాయ
ReplyDeleteఅన్న స్టెప్పేస్తే మాస్ అనే పాట లాగా మనం బజ్జుంటే చాలు ధ్యానమే అవుతుంది. డైనమిక్ మెడిటేషన్లు అంటే కష్టం గానీ మామూలు మెడిటేషన్లకు ఏముంది లెండి. అప్పుడప్పుడు ఆ పేరు చెప్పి శవాసనం వేస్తుంటాను - అనగా కునుకు తీస్తుంటాను.
మీకు కామెంట్ల దురద తీరాలంటే ఇంకా చాలా బలాగులు వున్నయ్ కదా. ఆడుకోండి.