ముఖ్యమంత్రిగా శర్మిళ (అయితే బావుండును)

అవినీతి గురించి కాస్సేపు పక్కన పెట్టేసి మాట్లాడేసుకుందాం.  మన రాష్ట్రానికి ఇంతవరకూ మహిళా ముఖ్యమంత్రిగా ఎవరూ రాలేదు. అందువల్ల అలా శర్మిళ వస్తే కొత్తగా, ఓ చరిత్రగా వుంటుంది. వచ్చే అసంబ్లీ ఎన్నికలు దాటిపోయేంతవరకు కూడా జగన్ జైల్లో వుండి వైకాపా ఘనంగా గెలిస్తే శర్మిళ కు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ చాలా వుంటుంది. శర్మిళ ఉత్సాహవంతురాలు, ప్రతిభావంతురాలు. ఓపికా, శక్తీ మరియు సామర్ధ్యం ఆమెకు వున్నాయి. పరిపాలన దక్షత వుందో లేదో కానీ ఆ కుర్చీలో కూర్చుంటే అదే వస్తుంది లెండి.  యువ నాయకురాలు. ప్రజలని ఉత్తేజ పరచగలదు. ఆమె ఛీఫ్ మినిస్టర్ అయితే ప్రభుత్వానికి ఓ కొత్తదనం, ఉత్సాహం కలుగుతాయి. చూడటానికి కూడా చక్కగా వుంటుంది. నాకయితే జగన్ సిఎం అవుతాడనే దానికంటే శర్మిళ ముఖ్యమంత్రి అవుతారనుకుంటేనే ఉత్సాహంగా వుంది. ప్లీజ్ జగన్ - మీరు జైల్లోనే వుండండి. అలా జైల్లో వుంటే వైకాపా మీద సానుభూతి పెరిగి, పాపం ఆడకూతుర్లు అంతగా కష్టపడుతున్నారని వోటర్లకి జాలి కలిగి వైకాపాని ఘనంగా గెలిపించొచ్చు.

అలా ఆమె ముఖ్యమంత్రి అయ్యేకా  తన సోదరుడు జగన్ని జైళ్ళ శాఖా మంత్రిగా చేసేయ్యొచ్చు. అలాంటి శాఖ వుందో లేదో నాకు తెలియదు. అది లేకపోతే లేదా అది వున్నా కూడా దానికి తోడుగా జగనుకి హోం మినిస్ట్రీ ఇస్తే  భలే బావుంటుంది.  జైల్లోంచే ఎంచక్కా లా అండ్ ఆర్డర్ కాపాడొచ్చు. మరి విజయమ్మ పరిస్థితి ఏంటని మీరు అడగవచ్చు. ఆమె భవిశ్యత్తు ఎన్నడో ఊహించి అప్పట్లోనే ఓ టపా వ్రాసిపడేసా కదా. వైకాపాకి బోల్డన్ని  ఎంపీ సీట్లొచ్చాయనుకోండీ కింగ్ మేకర్ ఎవరు అవుతారు? జైల్లో వున్న జగన్ కాడూ. అప్పుడు మరో వైపు అఖిలేశ్ యాదవ్ కూడా కింగు మేకరవుతాడు లెండి. ఈ ఇద్దరు మేకర్ల మధ్య పోటీ వుంటుందన్నమాట. ఎవరి కింగు కోసం వారు పోరాడుతారు.  విషయం అర్ధమయ్యింది కదా. కొండకి తాడు కట్టి లాగితే కొండ ఒహవేళ రాకపోయినా కనీసం గవర్నర్ గిరీ అయినా రావచ్చు కదా. అలా ఆంధ్రాకి గవర్నరుగా విజయమ్మ వచ్చే అవకాశాలు లేవా ఏంటీ? బ్రదర్ అనిల్ గురించి మాత్రం నన్ను అడక్కండి. మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు.  దేవాదాయ శాఖ ఇస్తే సరిపోతుంది. ఏమంటారు? మీరు ఏ గనుల శాఖో సూచిస్తుండొచ్చు. అవునా?

ఇక శర్మిళకి దీటుగా ఇతర పార్టీల్లో మంచి మహిళా నాయకత్వం ముందుకు రావాలంటే తెలుగుదేశంలో చంద్రబాబు కోడలూ, బాలక్రిష్ణ కూతురూ, లోకేశ్ భార్యా అయిన బ్రాహ్మిణికి మాత్రమే ఆ స్పార్క్ వుంది. అలాగే కాంగ్రెసులో పురంధేశ్వరి. పురంధేశ్వరి, బ్రాహ్మిణి మరియు శర్మిళలో ఎవరు ఏపికి ప్రధమ మహిళా ముఖ్యమంత్రి అయినా సంతోషమే నాకు. అయితే మొదటి ఇద్దరూ (రాష్ట్ర) రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. తెరాస కవిత అంటే నాకు కంపరంగా వుంటుంది. ఎందుకూ అంటే ప్రతి దానికీ లాజిక్కులు ఏం చెబుతాం. ఆమె నాకు నచ్చలేదంతే.  మీకు నచ్చితే తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిణిగా ఆమెను ప్రతిపాదించండి మరి.

19 comments:

  1. Bhayya,,
    nuvvadigavani kastapadi telugulo raaste post tho saha delete chesav.. neetho kateef

    ReplyDelete
  2. మనలో మాట....శర్మిళ అందంగా ఉంది కదండి!:-)

    ReplyDelete
  3. @ అజ్ఞాత
    తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం వుంటుంది సోదరా!

    @ పద్మార్పిత
    కదా :)

    ReplyDelete
  4. శర్మిళ ఉత్సాహవంతురాలు, ప్రతిభావంతురాలు. ఓపికా, శక్తీ మరియు సామర్ధ్యం ఆమెకు వున్నాయి....
    ayyaa meeko namaskaaram...avichoosi cm gaa maa nettina kurcho pettakandi...

    ReplyDelete
  5. మొదటిసారి ఒక మిషనరి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిణి అయినట్లు ఉంటుంది.

    ReplyDelete
  6. షర్మిల కంటె భారతీరెడ్డి అయితే బాగుంటుంది.

    ReplyDelete
  7. @ kvsv
    మరి ఇంకా ఆమెలో మీకు ఏం కావాలండీ? జగన్ (వైకాపా) అంటే మీకు మహా సిరాకు అని తెలుసు కానీ మీది ఇంతకూ ఏ పార్టీనో నాకు అర్ధమయ్యింది కాదు. ఏ పార్టీ అయినా సరే గానీ మొత్తం మీద ఈసారి మహిళా ముఖ్యమంత్రే కావాల్నని డిసైడ్ చేసిన. పోనీ మీకు ఎవరు కావాలో ఎంచుకోండి :)

    @ అజ్ఞాత @ 20 నవంబర్ 2012 2:02 సా
    ఎలాగో అలా లెండి. చచ్చినోడికి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లుగా...

    @ అజ్ఞాత @ 20 నవంబర్ 2012 2:25 సా
    ఊహు. భారతి రెడ్డి సామర్ధ్యం మీద కానీ, జనాకర్షణ శక్తి మీద కానీ నాకయితే నమ్మకం లేదు. ఆమె తెర వెనకే వుండటం బెటర్.

    ReplyDelete
  8. Annay. nuvvu undedhi america lo kadha. enni matalaina chebuthavu. Papam jaanalu chacchi urukuntaaru.

    ReplyDelete
  9. @ లడ్డు
    మనాళ్ళ ముఖ్యమంత్రిని నేనేమయినా నియమిస్తున్నానా ఏంటి తమ్ముడూ. ఎన్నుకునేదీ వారే - ఫలితం అనుభవించేదీ - మంచయినా చెడయినా వారే కదా. మధ్యలో మనం తమాషా చూస్తూ వుంటాం అంతే.

    ReplyDelete
  10. షర్మిల ముఖవర్చస్సు, హావభావాలు ఆమె తండ్రి YS రాజశేఖరరెడ్డిని పోలి ఉంటాయి. అందుకే ఆమె జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది. అసలీ విషయం లో జగన్ కన్నా ఈమె చాలా బెటర్. భారతి తో పోలిస్తే షర్మిల ముఖం లో ఆహ్లాదం బాగా కనబడుతుంది. కానీ భారతి మాత్రం ఒక బిజినెస్ వుమెన్ లా ఉంటుంది. అలాగే మాటతీరు కూడా, భారతి తో పోలిస్తే షర్మిల మాటతీరు, ముఖం లో భావవ్యక్తీకరణ బాగుంటుంది.

    ReplyDelete
  11. "మైండ్ గేం" ఆడకండి సార్

    ReplyDelete
  12. మొగున్ని జనల మీదకి వదిలి కొన్ని ప్రత్యేక పర్మిషన్లు ఇచ్చి మరీ ఆంధ్రా జనాన్ని కిరస్తానులుగా మార్చే బృహత్తర కార్యం మొదలవుతుందప్పుడు...ఇహ చూస్కో...

    ReplyDelete
  13. గురువు గారూ,

    అందమైన ఆడవారంటే మీకెంత అభిమానం గురువు గారు..షర్మిళ, బ్రాహ్మణి, ఆంటీ పురంధేశ్వరి గారు కొంచెం చూడ ముచ్చటగా ఉన్నంత మాత్రాన మంత్రుల్ని చేసేస్తారా.. ఉద్యమచుక్క ఫైర్ బ్రాండ్ అయినా ముక్కు కొంచెం డాడీ లా ఉందని పక్కన పెడతారా.. ఇదెక్కడి నాయం.. అయ్ లవ్వు లేడీస్ అనే మీరు.. ఇట్లా చేయటం బాగలేదు.. కవితక్కకీ ఎదో పదవి ఇవ్వాల్సిందే..

    ReplyDelete
  14. @ మిర్చి బజ్జి
    సరిగ్గా చెప్పారు.

    @ సాయికుమార్
    :)

    @ నర్సింహ
    ష్!

    ReplyDelete
  15. @ కాయ
    తల కొట్టుకునేందుకు ఏ రాయి అయితేనేం అంటారు కానీ అలాంటప్పుడు కాస్తంత అందమయిన రాయిని చూసుకుంటేనే బెటరంటాను నేను. అదో తుత్తి.

    తెలంగాణా ముఖ్యమంత్రిగా మీరు అవుతారా అంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ 'మీ (తెలంగాణా ప్రజల) దయ - నా ప్రాప్తం' అందటగా మీ కవితమ్మ - గ్రేటాంధ్రాలో చదివా ఆ న్యూస్ మరి.

    ReplyDelete
  16. హహ..అంత తెలివి తక్కువదేం కాదు ఆమె.. మీరు ఎంత సమైక్యవాది అయినా ఇట్లా ప్రచారాన్ని ప్రచారం చేయడం ఏంటో..

    ReplyDelete
  17. sharmila is nice to see, but she imitates the voice of Rajendra Prasad in jambalakidipamba.

    ReplyDelete
  18. @ రంగనాయకులు
    నేను ఇంతవరకూ ఆమె ఫొటోలు చూడటమే గానీ వీడియోలో కానీ టివి లో కానీ ఆమె వాయిస్ వినలేకపోయాను. వీడియోలు చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నా ఇంకా కుదర్లేదు.

    ReplyDelete
  19. @Ranganayakulu,

    It's not Rajendra Prasad in Jambalakidi pamba ( he didn't act in that movie), its rajendra prasad in the movie 'madam'.

    Both Vijayamma and sharmila's voices are like that. so irritating & not even funny. RP was better, he had a funny touch to it.

    ReplyDelete