ఈ మధ్య కొన్ని సైకలాజికల్ సమస్యల ఇతివృత్తాలున్న సినిమాలు చూసాను. అందులో ఈ Girl, Interrupted
(1999) సినిమా ఒకటి. సుసానా కేసెన్ అనే ఆమె 18 నెలలు మానసిక వైద్యశాలలో గడిపింది. ఆమె అనుభవాలను ఒక పుస్తకంగా వెలువరించింది. దానిని ఈ సినిమాగా తీసారు. హీరోయినుగా అందగత్తె వియోనా రైడర్ చాలా చక్కగా నటించింది. అయితే అస్కార్ అవార్డ్ మాత్రం ఇంకో నటి అంజెలీనా జోలీకి వచ్చింది. చాలామందికి ఓ సోషియో పాత్ గా అంజెలీనా జోలీ నటన నచ్చేస్తుంది.నర్సుగా వూపీ గోల్డ్‌బెర్గ్ నటన కూడా చాలా బావుంటుంది.
ఇది 1960 లోని కథ. ఒకసారి సుసానా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడంతో తల్లితండ్రులు ఆమెని మానసిక వైద్యశాలలో చేరుస్తారు. అక్కడ మిగతావారికి ఎలాంటి సమస్యలు వుంటాయి అనేది ఆసక్తికరం. మన తెలుగు సినిమాల్లో చూపించేలా మాత్రం అది వుండదు. సుసానాకి బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డరుగా భావించి చికిత్స చేస్తుంటారు. బ్రిటనీ మర్ఫీ అనే ఇంకో అందమయిన అమ్మాయి డైజీగా నటించింది. ఆమెకు బలూమియా అనే ఈటింగ్ డిజార్డర్ వుంటుంది. అయితే అది ఆమెకు ఎందుకు వచ్చివుండవచ్చు అనే విషయాన్ని చాలా అంతర్లీనంగా అందులో సూచిస్తారు. అదేంటో ఇక్కడ చెప్పడం బావోదు. సినిమాలో ఆమెకు సంబంధించిన ఒక సన్నివేశం నన్ను నిర్ఘాంతపరచింది. అంత స్పష్టంగా అలాంటి సన్నివేశాలు అలా చూపించేస్తారని అనుకోలేదు. అది ప్రణయ సన్నివేశం అనుకునేరు. కాదు. ఈ సినిమాలో చూపించినట్లుగానే ఆమె నిజ జీవితంలోనూ జరగడం గమనించదగ్గ విషయం.
అక్కడ వున్న ఒక అమ్మాయికి బాగా అబద్ధాలు ఆడే రుగ్మత వుంటుంది. ఆమె సుసానాకి రూమ్మేట్. ఇలా పలు మానసిక రుగ్మతలు వున్న ఆ అమ్మాయిల మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఈ సినిమా చూస్తే కొన్ని రుగ్మతల మీద అయినా కాస్త అయినా అవగాహన కలుగుతుంది. సుసానా మొదట్లో ఆ వైద్యశాలలో కొంతకాలమే వుంటా అనుకుంటుంది కానీ 18 నెలలు వుండాల్సివస్తుంది. సైకియాట్రిస్టులు ఆమెకు కౌన్సిలింగ్ చేస్తుంటారు కానీ నర్స్ వెలరీ (వూపీ) తెలియజెప్పిన పద్ధతిలో నడుస్తూ తన భావాలను, ఆలోచనలను వ్రాతల్లో, పెయింటిగుల్లో వ్యక్తపరుస్తూ స్థిమితపడుతూ వుంటుంది. ఆ తరువాత ఆమె మనో రుగ్మత తొలగిపోయిందని చెప్పి ఇంటికి పంపించేస్తారు. నిజంగా తనకి ఆ మెంటల్ డిజార్డర్ వుండిందా అని విస్మయ పడుతూ కారులో ఇంటికి వెళుతూవుంటుంది.
మానసిక సమస్యలు, సంఘర్షణల ఇతివృత్తాలు నచ్చేవారికి, ఎమోషనల్, డార్క్ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చాలామంది అందమయిన అమ్మాయిలు సినిమా అంతా వుంటారు కాబట్టి ఈ సినిమా ఆకర్షణీయంగా కూడా వుంటుంది. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను ఈ క్రింది లింకులో చూడవచ్చు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో కూడా ఆన్లైనులో అందుబాటులో వుంది.
ఈ సినిమా నాకు చాలా నచ్చిన సినిమా! వినోనా రైడర్ బాగానే నటించినా, నిజానికి అవార్డ్ స్థాయి నటన మాత్రం ఇందులో యాంజెలీనాదే! వూపి గోల్డ్ బర్గ్ కారెక్టర్ నటిగా ఏ సినిమాలో ఐనా మార్కులు బాగానే కొట్టేస్తుంది. నిజానికి వినోనా పాత్ర మామూలు మనిషి పిచ్చాసుపత్రికి వచ్చినట్లుగా ఉంటుంది కొన్ని సన్నివేశాల్లో!ఆమెకు డిజార్డర్ లేనట్లుగానే, చివర్లో ఆమె భావించినట్లు గానే అనిపిస్తూ ఉంటుంది సినిమా అంతా!
ReplyDeleteయాంజెలీనా కోసం నేను రెండు సార్లు చూసాను ఈ సినిమా!
నెట్ ఫ్లిక్స్ లో ఉందని మొన్ననే చూశాను. ఇప్పుడు మీరు రాశాక ఇంకోసారి చూడాలనిపిస్తోంది.
ఇంత సింపుల్ గా రాసి వదిలేశారే? ఇంకా విశ్లేషించడానికి బాగా అవకాశం ఉన్న సినిమా కదా ఇది?
Wow ,, your narration and review is very good..
ReplyDeleteAnother such good movie.. Veronica decides to die .. http://www.imdb.com/title/tt1068678/ ,
@ సుజాత
ReplyDeleteనిజమే. ఈ సినిమా గురించి ఎంతయినా చర్చించొచ్చు. ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మందికి ఆసక్తి వుండదేమో అని అలా సింపుల్గా వ్రాసేసా కానీ 6 మంది ఈ పోస్ట్ బావుందని రియాక్షన్స్ లో వ్యక్తపరిచేసరికి కాస్తంత విస్మయం చెందాను. నేను ఒకేసారి ఈ సినిమా చూసాను. లోతుగా పరిశీలించి వ్రాయాలంటే రెండు మూడు సార్లు అయినా చూడటం బావుంటుంది. ఈ సినిమా గురించి ఇతరుల చర్చలూ, అభిప్రాయాలూ IMDb సైటులోనూ, నెట్‌ఫ్లిక్స్ సైటులోనూ చదివాను - ఆసక్తికరంగా వున్నయ్.
@ అజ్ఞాత
ReplyDelete'Veronica decides to die' మూవీ ఇంకా చూడలేదు. కేవలం నెట్‌ఫ్లిక్స్ ఆన్‌లైనులో లభ్యం అవుతున్నవి మాత్రమే చూడగలుతున్నాను కాబట్టి ఇలాంటివి ఇతర మంచి సినిమాలు కొన్ని వున్నా కూడా చూడలేకపోతున్నాను. ఈ సినిమా గురించి ఇదివరకే తెలిసినప్పటికీ వివరంగా IMDb లో ఇప్పుడే చూస్తున్నాను. చక్కటి చిత్రంలా అనిపిస్తోంది. ఆ చిత్రం లోని ఈ క్రింది డైలాగులు నాకు తెగ నచ్చేసాయి :)
Veronika: "Well, let's see. After you decide that I'm depressed, or whatever, you'll put me on meds, right? Well I know hundreds of people on them and they're all doing just fine. Really. I'll go back to work on my new anti-depressants, have dinner with my parents and persuade them I'm back to being the normal one who never gives them any trouble. And one day some guy will ask me to marry him. He'll be nice enough. That'll make my parents very happy. The first year we'll make love all the time, and in the second and third less and less. But just as we're getting sick of each other, I'll get pregnant. Taking care of kids, holding onto jobs, paying mortgages, It'll keep us on an even keel for a while. Then about ten years into it he'll have an affair because I'm too busy and I'm too tired. And I'll find out. I'll threaten to kill him, his mistress... myself. We'll get past it. A few years later he'll have another one. This time I'm just going to pretend that I don't know because somehow kicking up a fuss just doesn't seem worth the trouble this time. And I'll live out the rest of my days sometimes wishing my kids could have the life that I never had. Other times secretly pleased they're turning into repeats of me. I'm fine. Really."