ఈ సినిమా 2009 లొ వచ్చింది. క్లినికల్ డెప్రెషన్ గురించి ఇదో చక్కటి సినిమా అయినప్పటికీ కొన్ని లోపాలు వున్నాయి. హెలెన్ గా ఆష్లీ జూడ్ నటించింది. ఆమె అంటే నాకు ఇష్టం. ఈ సినిమా చూడటానికి కాస్తంత ధైర్యం, ఓపికా కావాలి. వ్యధను చాలా సహజంగా చూపించారు కాబట్టి దాన్ని భరించే శక్తి చాలామందికి వుండకపొవచ్చు. బోర్ కొట్టి ఆపేస్తుండొచ్చు కానీ చివరంటా చూడగలిగితే చక్కటి ఎమోషనల్ సినిమా ఇది. మానసిక కృంగుబాటులో వుండేవారి మానసిక, శారీరక స్థితి ఎలా వుంటుందో చాలా అవగాహన కలిగిస్తుంది. మీ ఇంట్లో ఎవరయినా డిప్రెషన్ తో గానీ, ఏంగ్జయిటీ తో కానీ అతలాకుతలం అవుతున్నా మీకు ఆ విషయం అర్ధం కాకపోవచ్చు. మీ బంధువో, మిత్రుడో సఫర్ అవుతున్నా కూడా ఆ వ్యక్తి చెయ్యి దాటిపోయేంతవరకూ మీకు అనుమానం కూడా రాకపోవచ్చు. అందువల్ల ఇలాంటి సినిమాలయినా చూడటం వల్ల ఆయా సమస్యలపై అవగాహన వస్తుంది.
హెలెన్ యొక్క జీవితం చక్కగా నడుస్తుంటుంది కానీ ఎన్నో ఏళ్ళుగా తనలో వున్న విచారాన్ని నిభాయించుకోలేక క్రమంగా బయటపడుతూ వుంటుంది. ఎందుకు ఈమెకు ఇంత విచారం, ఎక్కడ లోపం జరిగింది అని భర్త విస్మయపడుతూ వుంటాడు కానీ వ్యధ చెందడానికి బయటి కారణాలు వుండక్కరలేదని అతగాడు అర్ధం చేసుకోలేకపోతుంటాడు. ఆమెకు తానేం లోపం చేసేడో అర్ధం కాక సతమతం అవుతుంటాడు. అపరిమితమయిన వ్యధను భరించలేక, జీవితం పట్ల ఏమాత్రం ఉత్సాహం, శక్తి, ఆశ లేక ఆమె ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకుంటూ వుండటంతో మానసిక వైద్యశాలలో చేరుస్తారు. మళ్ళీ ఇంటికి తీసుకువస్తారు. మొదటి భర్తతో కలిగిన టీనేజి కూతురు గానీ, భర్త గానీ ఆమె పట్ల ఎంతో ప్రేమ, ఆదరణ చూపిస్తున్నా కూడా ఆమెని సవ్యంగా అర్ధం చేసుకోలేక ఆమె ప్రవర్తనతో విసిగిపోయి దూరం అవుతుంటారు.
మందులు వాడుతూ వున్నా కూడా హెలెన్ లో మార్పు రాదు. ఆమె డిప్రెషన్ మందులకి లొంగదు. ఆమె పరిస్థితిని ఆమె స్టుడెంట్ అయిన మెటిల్డా మాత్రమే సవ్యంగా అర్ధం చేసుకొని ఆసరా ఇస్తుంది. ఆమె బై పోలార్ (డిప్రెషన్ + మానియా) డిజార్దర్ తో అవస్థ పడుతూ వుంటుంది కాబట్టి హెలెన్ సమస్యను తేలిగ్గా అర్ధం చేసుకుంటుంది. వీళ్లిద్దరి స్నేహం భర్తకు నచ్చదు. భర్తతొ విసిగిపోయి మెటిల్డా దగ్గరికి హెలెన్ వచ్చేస్తుంది. ఇద్దరూ చాలా దగ్గర అవుతారు. ఆ తరువాత ఆ ఇద్దరి జీవితాలు ఏమవుతాయి అనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బావుంటుంది.
మానసిక కృంగుబాటు వున్న మహిళగా ఆష్లీ చాలా సహజంగా నటించింది. ముగింపు వాస్తవానికి చాలా దగ్గరగా వుంటుంది. శుభం కానీ అశుభం కానీ లేకుండా అసలయిన పరిస్థితిని తెలియజేస్తూ చిత్రం ముగుస్తుంది. వాస్తవానికి, సహజత్వానికి వీలయినంత దగ్గరగా ఈ సినిమా తీసినందుకు ఆ దర్శకురాలిని మెచ్చుకోవాలి. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఆన్లయినులో లభిస్తోంది. ఈ సినిమా చూడలేని వారు ఈ క్రింది లింకులో కథ, రివ్యూలు చూస్తే ఈ సినిమా గురించి కొంతయినా తెలుస్తుంది.
బాగుందండి రివ్యూ.
ReplyDeleteబ్లాగులో బొత్తిగా మనోల్లాసం తగ్గించేసావేంది, అన్నాయ్?
ReplyDelete@ ద ట్రీ
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషం. వీలయితే ఆ సినిమా చూడండి.
@ బుల్లబ్బాయ్
హ హ. ప్రస్థుతం నాకే మనోల్లాసం తగ్గింది. ఇంకా మీకేం పంచనూ :)
why did you delete post on thyroid?
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteమీరు ఇలా అడుగుతారని తెలీక :)
మా ఫ్యామిలీకి సంబంధించిన టపాలు ఎక్కువ కాలం ఉంచదలుచుకోక అలా తీసేస్తుంటాను. అయితే అది డ్రాఫ్టుగా సేవ్ చేసాను కాబట్టి మీరు అడిగారు కాబట్టి కొద్దిగా ఎడిట్ చెసి మళ్ళీ ఇప్పుడే పబ్లిష్ చేసాను. కొద్ది రోజులు అయ్యాక మళ్ళీ తీసివేస్తాను.
off topic. do not have your personal email.
ReplyDeletecan you suggest any books to read during early pregnancy that has good info??
Bhayya,
ReplyDeleteInni telisi, intha chaduvukuni, hennnoo choosi ...hanta nerchukuni .. nuv kuda sivarakhariki depression anesaventi bhayya..
innallu nee valla vadinaku depression anukunna kaanee neekee ila avutundanukoledu. Ettaantonivi!!! itta aipoyyaventi??
@ అజ్ఞాత
ReplyDeleteనాకు తెలియదండీ.
ఎవరికయినా తెలిస్తే ఆ పుస్తకాలు సూచించగలరు.
@ అజ్ఞాత సోదరా @ 12 నవంబర్ 2012 6:12 సా
ReplyDeleteనాకు ఈ సమస్య కొత్త కాదు. పెళ్ళికి ముందు నుండీ వున్నదే. అప్పటి పరిస్థితి గురించి ఆత్మకథ లాంటి ఫిక్షన్ 'ఉరి' నవలగా వ్రాసాను. ఆసక్తి వున్నవారు కినిగే సైటులో అది చదవచ్చు. ఎన్నో తెలుసు కాబట్టే బాగా నిభాయించుకువస్తున్నాను. కొన్ని సార్లు పరిస్థితుల ప్రాబల్యం వల్ల తట్టుకోలేక కాడి క్రిందకు పడేస్తుంటాను. మళ్ళీ కోలుకుంటుంటాను. ఇప్పుడు మళ్ళీ మందుకు వాడుతున్నా... నెమ్మదిగా కోలుకుంటున్నా. నా మెదడులో సెరటోనిన్ న్యూరోట్రాన్స్మిట్టర్స్ లెవల్స్ పెరుగుతున్నాయి. అందుకేనేమో స్పిరుచువలిటీ తక్కువవుతోంది .. స్పిరిట్ ఎక్కువవుతోంది :)
ఎన్ని విషయాలు తెలిసినా, ఎన్నో చూసినా నా చేతుల్లో ఏమీ లేదు బ్రదర్. నాది సాధారణ వ్యధ కాదు. క్లినికల్ డిప్రెషన్. యోగా, ధ్యానం, వ్యాయామం మొదలయినవి అన్నీ సాధారణ వ్యాకులతకి పనిచేస్తాయి కానీ నాలాంటి మేజర్ డిప్రెషనుకి పని చెయ్యడం చాలా తక్కువ. మనో బలానికీ దీనికీ సబంధం లేదు. మెదడులో వున్న న్యూరాన్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. రోజూ ఓ మాత్ర వేసుకుంటే సాధారణంగా సరిపోతుంది.
నా సమస్యకి మూల కారణం గుర్తించడానికి మా కుటుంబ వైద్యుడూ, నేనూ కృషి చేస్తున్నాం. ఈ శనివారం తనతో చర్చలు వున్నాయి. కొత్త ల్యాబ్ రిజల్టులూ వస్తాయి. బ్రేక్ థ్రూ వుంటుందేమో అని చూస్తున్నాను. నా సమస్యకి కారణం థైరాయిడ్ గ్రంధి కానీ పిట్యూటరీ గ్రంధి కానీ అయివుండవచ్చు. ఈ శనివారం నాకు కొంత క్లారిటీ అయినా రావచ్చు. చాలామంది వైద్యులు అటువైపుగా పరిశీలించరు కానీ ప్రతి అయిదుగురిలో ఒక్కరికి పిట్యూటరీ సమస్య వుంటుందిట.
మనలో చాలా మంది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలావరకు లక్షణాలకే చికిత్స తీసుకుంటుంటాం. అలా కాకుండా రూట్ కాజ్ తెలుసుకోవడానికి కృషి చెయ్యాలి. అంత ఓపిక, తీరిక, ఆసక్తి డాక్టర్లకి వుండదు కాబట్టి మనమే పరీశీలించాలి, పరిశోధించాలి, చొరవ తీసుకోవాలి.