ఈమధ్య లౌకిక ఆధ్యాత్మికుడినిగా మారుతున్నాగా. సెక్యులర్ స్పిరిచువాలిటీని తెలుగులో అలాగే అంటారా లేక వేరే పదం వుందా? అలా అని దైవ భక్తి, మరొ జన్మలు, మహత్మ్యాలు వంటి వాటి పట్ల విశ్వాసం ఏమీ లేదు. కానీ పది మందితో కలిసి చేసే ప్రార్ధనలూ, సాంప్రదాయాలూ, సంస్కృతీ ముచ్చట గొలుపుతున్నాయి. లౌకిక ఆనందంతో పాటుగా కొంత అయినా అలౌకిక ఆనందం కూడా కావాలనిపిస్తోంది.
ఇహనుండీ వీలయిన ప్రతి ఆదివారం ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. హిందూ, క్రిస్టియన్, బౌద్ధ, నాస్తిక కేంద్రాలు దర్శించాలనుకుంటున్నాం. ఒక మానవతా వాద కేంద్రం కొంత దూరంలో వుందని ఈమధ్యే తెలిసింది లెండి. హిందూ కేంద్రాలలో కూడా ఎన్నో వున్నాయి కదా, షిర్డీ సాయితో పాటుగా, రామక్రిష్ణా మిషన్, చిన్మయ మిషన్ వున్నాయి. అవి కాకుండా పలు గుడులు, గోపురాలూ వున్నాయి.
నా చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి ఆధ్యాత్మిక కేంద్రాలు తిరుగుతూ ఆ చర్చలు వింటుండేవాడిని. నాన్నగారితో కలిసి నాస్తిక సభలకు వెళుతూ ఆ చర్చలు వింటుండేవాడిని. అయితే మా పిల్లలకు పెద్దగా ఏదీ దక్కకుండా అయ్యింది. ఆ శూన్యతను ఈమధ్యే గమనిస్తున్నాను. అందుకే వాళ్లనీ తీసుకెళుతున్నాను. మరీ మూఢత్వంలోకి వెళ్ళకుండా సెక్యులర్ స్పిరుచువాలిటీ అంటే ఏంటో తెలియజేస్తున్నా. ఆ తరువాత వారి ఇష్టం. ఇటు ఎథీస్ట్ కార్యక్రమాలు లేకపోవడమూ, ఆధ్యాత్మిక కేంద్రాలకి పెద్దగా వెళ్ళక పోవడం వల్ల రెంటికీ చెడుతున్నాం. అందుకే బుద్ధ, సంఘ, ధర్మల యొక్క శరణు కోరుతున్నాను. స్పిరిచువల్ కార్యక్రమాల్లొ పాల్గొంటూనే హేతుబద్ధంగా వుండగలిగేలా చూస్తున్నా. నాలాంటి వారు ఒకరో ఇద్దరో ఇలా మారగానే నాస్తికులు అందరూ చివర్లో ఇలాగే అవుతారని కాదులెండి. నా కేసు చాలా డిఫరెంటూ.
నిన్న గుడికి వెళ్ళాంగా. గురువారం షిర్డీ భక్తులకి ముఖ్యమయిన రోజు. మాకు దగ్గర్లోని ఓ చిన్న గుడికి వెల్దామంటే సాయి భక్తురాలయిన మా ఆవిడ గంట దూరంలోని సాయి గుడికే వెళదామని పట్టుబట్టింది. వెళ్ళాం. అక్కడి కార్యక్రమాలు అన్నీ ముచ్చటగా తిలకించాను. నా చిన్నప్పుడు మా దగ్గరి వూర్లో మా అమ్మగారితో కలిసి మల్లన్న దేవుడి గుడిలో గడిపిన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పట్లో అలా గుడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే గడిపి వచ్చేవారం. ఆ దేవుడి మహిమలు అక్కడి భక్తులు పరవశంతో చెప్పుకునేవారు. కాస్త చీకటి పడ్దాక పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో చెక్క భజనలు చేస్తూ మల్లన్నని కీర్తించేవారు. అలా మనసికంగా, శారీరకంగా, అలౌకికంగా ఎంతో సాంత్వన పొందేవారు. ఇక్కడ కూడా అలాంటి చురుకయిన భజనలు వుంటాయేమోనని చూస్తున్నా కానీ ఏవీ? అన్నీ కూర్చొని పాడే భజనలే కానవస్తున్నాయి. శారీరకంగా కదులుతూ భజనలు చేస్తుంటే వచ్చే ఆనందమే వేరు అనుకుంటా కానీ ఇక్కడి హిందువులు ఎవరూ ఆ విషయం పట్టించుకుంటున్నట్లుగా లేదు. ఎవరినయినా ఈ సందేహం అడగాలి. కాలంతో పాటుగా భక్తి కూడా బహు సున్నితం అయినట్లుగా వుంది.
ఇలా వ్రాస్తున్నానని చెప్పి పూర్తిగా భక్తుడిగా మారుతున్నా అని కాదండోయ్. అలౌకికత్వాన్ని కూడా కొంత బ్యాలన్స్ చేసుకోవాలనుకుంటున్ననంతే. ఇప్పటికిలా అనిపిస్తోందీ - ఇలా చేద్దాం. రేపటి నాడు ఏమనిపిస్తుందో - నేనేమవుతానో మరి - చూద్దాం.
anivarya maina manchi parnamam
ReplyDeletehello sir, no posts these days? whats wrong?
ReplyDeleteNo Posts from long time ? is every thing ok
ReplyDelete@ అజ్ఞాతలు
ReplyDeleteనా గురించి మీరు కనుక్కుంటున్నందుకు సంతోషంగా వుంది. ధన్యవాదాలు. కొన్ని కారణాల వల్ల కొంత కాలంగా నేను ఓకే గా లేను. అయితే మరికొన్ని వారాల్లో నా పరిస్థితి మెరుగు పడే సూచనలు వున్నాయి. అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. ఇదివరకులా కాకుండా ఈ మధ్య నేను కూడా 'సగటు బ్లాగరు' ను అయిపోయినందువల్ల ఇదివరకులా నా సంగతులు అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే చాలా విచారంలో వున్నా కానీ కొన్ని వారాల్లొ బయటపడుతాలెండి.
సమతూకాన్ని పాటించడం ప్రస్తుత పరిస్థతులలో అత్యంత అవసరంగా కనిపిస్తుంది,హ,హ...
ReplyDeleteఅందరికి అని కాదుకాని, నా వరకు నాకైనా....
మీరు మీ విచారం నుంచి త్వరగా కోలుకోవాలని, ఉత్తమ బ్లాగరై పోవాలని ఆశిస్తూ...
@ ట్రీ
ReplyDeleteఉత్త బ్లాగరు నుండి ఉత్తమ బ్లాగర్ అయిపోవాలంటారా :)