నిన్న సాయంత్రం అఫీసు నుండి వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతూనే ఘుమఘుమ వాసనలతో ముక్కు అదిరింది. సాధారణంగా అలాంటి మసాలా వాసనలు వారాంతం వస్తుంటాయి మా ఇంట్లో. మా ఆవిడ వంట ఏం వండుతోందా అని చూసా - మటన్. అందుకు సంతోషించాలో, విచారించాలో అర్ధం కాక కాస్సేపు మనస్సు మొద్దుబారింది. ఉదయమే కొన్నాళ్ల వరకు నాన్ వెజ్ బాగా తగ్గించాలని తీర్మానించుకున్నా కానీ సాయంత్రమే నాకు ఇష్టం అయిన కూర మా ఆవిడ వండేసింది. పైగా మన పొలంలొ పండిన మెంతి కూర కలిపి వండా అంది. ఇక ఆగుతానా?
గత కొన్ని వారాలుగా నేను ఏం తింటే నా శరీరంలో కొవ్వు శాతం పెరుగుతోందో జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తున్నాను. చేపలూ, మటనూ మితంగా తిన్నా కూడా 2-3 % పెరుగుతోంది. చికెన్ మితంగా తినడం వల్ల ఎక్కువగా పెరగడం లేదు. నా పద్ధతిలో మితంగా అంటే మూడు ముక్కలే లెండి. అది కూడా తగ్గించి కేవలం ఓ ముక్కతో సరిపెట్టుకోవాలని నిన్న ఉదయం నిశ్చయించుకున్నా గానీ జిహ్వ చాపల్యం వల్ల మళ్ళీ మూడు ముక్కలు లాగించేసా. ఈ ఉదయం చూసుకుంటే ఫ్యాట్ 2% పెరిగి కూర్చుంది. నిన్న ఉదయానికి కష్టపడి 19% తెచ్చిందల్లా ఇవాళ ఉదయం 21% అయిపోయింది. ఇలా ఈ హెచ్చుతగ్గులతో నా ఉపలక్ష్యం అయిన 17% ఇంకా ఆమెడ దూరంలోనే వుండిపోతోంది.
ఈ వారాంతం మళ్లీ ఓ పుట్టినరోజు వేడుక వుంది. అప్పుడూనూ, వారాంతమూనూ, మిగిలిన ఈ రోజులూనూ సవ్యంగా అహార నియంత్రణ పాటిస్తే వచ్చే వారానికల్లా 17% కి దిగిపోవచ్చు. ప్రయత్నిద్దాం. సమస్యేంటో తెలుసు - అందుకోసం ఏం చేయాలో తెలుసు కాబట్టి ఇంది కాబట్టి కాస్త కష్టపడితే అనగా కాస్తంత నా నోరు కట్టేసుకుంటే నా సబ్ గోల్ చేరుకోవచ్చు. నిజానికి మాంఛి వెయిట్ ట్రెయినింగ్ వ్యాయామాలు చేస్తుంటే గనుకా మెటబాలిజం ఎక్కువయ్యి ఎక్కువ తిన్నా హరాయించుకుపోతుంది కానీ అవి ఇప్పుడు ఎక్కువగా చెయ్యలేను కాబట్టి నోరు కట్టేసుకోవడమే నా ముందున్న ముఖ్యమయిన మార్గం. దానికి తోడుగా స్వల్పంగా బరువు వ్యాయామాలు మొదలెడుతున్నాను. అవి చెయ్యకుండా ఆహారం తగ్గిస్తే కొవ్వుతో పాటుగా కండ కూడా కరిగిపోతుందిట.
Appude menthi kura crop vachhinda...super .... :)
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteఆదివారం అందరం మా పొలం (గార్డెన్) కి వెళ్ళి నీళ్ళు పెట్టి మెంతి కూర పీక్కొని తెచ్చుకున్నాం. మా పొలం చూడటానికి వచ్చిన బందువులకు కూడా పంచేసాం. అంతకుముందు ముందు వారం ఉల్లి ఆకులు కోసుకువచ్చాం.
మెంతి కూర క్యాబేజ్ కూడా బావుంటుంది
ReplyDelete@ మౌళి
ReplyDeleteక్యాబేజీ కూర నాకు నచ్చదు - అందుకే ఈ సంగతి మా ఆవిడకి చెప్పను :)
Are the non veg stuff like chicken & mutton are tastier in US than here...I didn't find it in my personal experience.
ReplyDeleteమన నాటుకోడి కి ఉన్నంత రుచి ఎక్కడా రాదండి. వీళ్ళు వేసి పెంచే చికెన్ లకి అంత సీన్ లేదు. మనవే బాగుంటాయి.
Deleteనిజమే. నాటు కోడి రుచి బావుంటుంది. ఇండియాలో వున్నప్పుడు మా ఇళ్ళళ్ళో ఎంచక్కా కోళ్ళను పెంచీ పోషించీ, కోసీ, తినేసుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చాక ఇండియా విజిటుకి వెళ్ళినప్పుడు గ్రామాల్లోని చుట్టాలింటికి వెళ్ళినా వారు కూడా బ్రాయిలర్ కోళ్ళు కోసి వండిపెడుతూవుండటంతో అసంతృప్తిగా అనిపించింది. అలా లాభం లేదని నాటు కోడి కూరే కావాలని కాస్త క్లోజయిన బంధువులకు చెప్పి మరీ చేయించుకున్నాను.
Deletehttp://voiceofchikkolu.blogspot.in/
ReplyDelete