ఎండలో నిలబడితే విటమిన్ డి దొరుకుతుంది కానీ ఉదయం పది గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల తరువాత మాత్రమే అందుకోసం ఎండలో గడపడం శ్రేయస్కరం అని చెబుతుంటారు కదా. లేకపోతే డి సంగతేమో కానీ వడదెబ్బ బాగా తగలవచ్చు. అయితే అది ఇండియాలో సంగతి. ఇక్కడ ముఖ్యంగా చలి రాష్ట్రాల్లో ఎండ తక్కువ కాబట్టి ఇక్కడ మధ్యాహ్నమే ఎండలో పచార్లు చెయ్యాలి. పైన ఒజోన్ పొర సరిగ్గా లేకపోవడం వలన అనుకుంటా ఇక్కడి ఎండకు డి విటమిన్ సంగతేమో గానీ తొందరగా నల్లబడిపోతుంటాం. విటమిన్ డి కోసం అని మధ్యాహ్నం భోజన వేళలో షికాగో డవున్ టవున్ రవుండ్లు చుట్టేస్తుంటాను. అసలే మన అందం అంతంత మాత్రం - దానికి తోడుగా ఈ నల్లబడుతూ వుండటంతో నల్లోళ్ళాగా అయిపోతున్నానా అని బెంగెట్టుకుంది. ఆ మాత్రలు మింగుతూనే వున్నా అనుకోండి కానీ సహజ సిద్ధంగా సూర్యరశ్మితో వచ్చే ఆరోగ్యం ఇంకా మంచిది కదా.
విటమిన్ డి లోపం ఎన్నో అనర్ధాలకి కారణం అవుతోందని అర్ధం అవుతోంది. ఈ చలిదేశాలలో వున్నవారికి ఎంతోమందికి ఈ సమస్య వుంది కానీ అది వున్నట్లుగా చాలామందికి తెలియదు. 60% జనాభాకి పైగా ఈ సమస్య వున్నట్లు ఓ అంచనా. మా ఇంట్లోనే నలుగురిలో ముగ్గురికి లోపం వుంది. పెద్దమ్మాయికి ఇంకా ఆ పరీక్ష చేయించలేదు కాబట్టి ఖచ్చితంగా తెలియదు కానీ తనకూ ఆ లోపం ఖచ్చితంగా వుండొచ్చని భావిస్తూ మాత్రలు వేయిస్తున్నాం. ఈ నెల జరిగే రక్త పరీక్షల్లో నిర్ధారణగా తెలుస్తుంది. కొత్త ప్రమాణాల ప్రకారం విటమిన్ డి పరీక్షల్లో 50 నుండి 70 ng/ml of 25(OH)D వరకు వుండాలిట. హృద్రోగులకూ, క్యాన్సర్ రోగులకూ 70 - 100 వుండాలిట. గత రక్త పరీక్షల్లో నాకు 48, మా ఆవిడకి 22, మా చిన్నమ్మాయికి 18 కవుంట్ వుంది. అందుకే మేము ముగ్గురమూ ఆ మందులు వాడేస్తున్నాం. కొన్ని నెలలుగా ఆ మాత్రలు వాడుతున్నా కాబట్టి నా పరిస్థితి అప్పుడు, ఇప్పుడు ఫర్వాలేదు.
ఈ దేశాల్లో ఎండని పూర్తిగా నమ్ముకుంటే విటమిన్ D జరిగేపనికాదనీ, అందుకుతోడుగా విటమిన్ డి మాత్రలు లేదా డ్రాప్స్ వాడుతూవుండాలని మా వైద్యుడు సెలవిచ్చాడు.
Studies indicate that for proper health, serum vitamin D levels should be a minimum of 50 ng/mL (125 nmol/L), with optimal levels falling between 50-80 ng/mL (125-200 nmol/L). These values apply to both children and adults.
Source: http://www.vitamindcouncil.org/about-vitamin-d/vitamin-d-deficiency/am-i-vitamin-d-deficient/
Studies indicate that for proper health, serum vitamin D levels should be a minimum of 50 ng/mL (125 nmol/L), with optimal levels falling between 50-80 ng/mL (125-200 nmol/L). These values apply to both children and adults.
Source: http://www.vitamindcouncil.org/about-vitamin-d/vitamin-d-deficiency/am-i-vitamin-d-deficient/
ఎండలో తిరిగితే తిరిగారు కానీ sun block వాడ్డం మరువకండి
ReplyDelete@ నారాయణస్వామి
ReplyDeleteమీరు అక్కడే పొరపడ్డారు. సన్‌స్క్రీన్స్ వంటికి వ్రాసుకుంటే విటమిన్ డి రాదుట. అసలు ఈ విషయం కూడా టపాలో ప్రస్థావిద్దామనుకుంటూనే మరచిపోయాను. అనవసరంగా సన్‌స్క్రీన్ ఎక్కువగా ప్రమోట్ చేస్తూ విటమిన్ డి లోపానికి కారణభూతులవుతున్నారని సరికొత్త వాదనలు. స్కిన్ క్యాన్సర్లు గనుక వస్తే గిస్తే తెల్లోళ్ళకి వస్తాయేమో గానీ మన గొధుమ వర్ణం వాళ్ళకి అంతగా వచ్చే అవకాశం లేదనుకుంటా. అసలు మనం ఎండలో తిరిగేదే తక్కువ - ఇహ పైపూత పూసుకుంటే D వచ్చేది అంతంతే.
Naku vitamin d level increase ayyaka tablets apesanu... malli d level thaggindi so continuing again
ReplyDeleteఏమండీ శరత్తు గారు,
ReplyDeleteఆ మధ్య 'పంటా' పైరు ల తో కసరత్తు చేసి మీ ఆరోగ్యం కుదుట పడి వుంటుందని అనుకున్నా. మళ్ళీ రోగాల గురించి మొదలెట్టేరు!,
అయినా , సూర్య, 'రశ్మి' తో సిగ్గు పడి పోవాలి గాని, సిక్కోచ్చిందంటారేమిటి ?
చీర్స్
జిలేబి.
అన్నోయ్, ఈమధ్య మావోడొకడు కళ్ళుతిరిగి కిందడిపోతే, డాట్రుగారొచ్చి డి-విటమిన్ తక్కువుందని చెప్పాడు. లో బిపితో పడతారనుకున్నా గానీ, డి విటమిన్ కి కూడా పడిపోతారని తెల్వ... జాగర్త!
ReplyDeleteMidday Sun is Good for Health....will get more Vitamin D ata
ReplyDeletehttp://thyroid.about.com/b/2005/05/25/midday-sun-is-good-for-health.htm
@ అజ్ఞాత
ReplyDeleteడి ఓ రేంజిలోకి వచ్చాకా వేసవిలో ఆ మాత్రలు తీసుకోవడం ఆపివేస్తూ శీతాకాలం మళ్ళీ మొదలెట్టడం మంచిదేమో.
@ జిలేబీ
:)
@ బుల్లబ్బాయ్
అలా కూడా జరుగుతుందా! నాకు ఇప్పటివరకూ తెలియదు.
@ అజ్ఞాత
ReplyDeleteతెల్లోళ్ళకి పావుగంట మధ్యాహ్నపు ఎండ సరిపోతుంది కానీ మన రంగుకి అరగంట అయినా కావాలి.