నేను నాస్తికుడిని ఏంటో నాకు కీర్తనలూ, భజనలల్లో మునిగిపోవాలనే ఆరాటం ఏంటో నాకేం అర్ధం కావడం లేదు. మా అమ్మగారు నా చిన్నప్పుడు మల్లన్న దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళేది. అక్కడ భజనలు చేస్తూ పద్యాలు పాడుతూ భక్త సందోహం ఎంత సంతోషంగా ఊగిపోయేవారో నాకు గుర్తుకువస్తుంటుంది. ఏ దేవాలయాలకయినా మా ఆవిడకి తోడుగా వెళ్ళినప్పుడు అక్కడి కీర్తనలు పాడుతున్నప్పుడు వారితో కలిసి పాడుతూ పరవశం చెందాలని అనిపిస్తుంది కానీ నేను నాస్తికుడిని అని గుర్తుకుతెచ్చుకొని మనస్సు భోజనశాల వైపు మళ్ళిస్తూవుంటాను. పోనీ దేవుడి మీద విశ్వాసం గట్రా వస్తోందా అంటే అదేమీ లేదు. ఎథీస్టులకు కూడా కీర్తనలు, భజనలు వుంటే ఎంత బావుండును. మా చుట్టు పక్కల ఎథీస్టులు వారానికి ఓ రోజు ఓ రెండు గంటలు రెస్టారెంటులో కూర్చొని మాట్లాడుకొనివెళ్ళడమే ఎక్కువ. ఆ సమావేశాలకి కూడా నేను వెళ్ళలేదనుకోండి.
అలాంటి భజనలు, కీర్తనల కోసం వెతగ్గా మాకు దగ్గర్లోని హరే రామ, హరే క్రిష్ణ సంఘం వారు దొరికారు కానీ వారి భక్తివ్రిక్ష సమావేశాలకి వెళ్ళడానికి నేను తటపటాయిస్తూవస్తున్నాను. కీర్తనల్లో, ఆధ్యాత్మిక చర్చల్లో మునిగితేలాలని వున్నా కూడా వారు దైవ భోధనలు కూడా చేస్తారనేది నా తటపటాయింపు. ఈ మధ్య హోలీనేం (క్రిష్ణ ?) ఫెస్టివల్ నాలుగు రోజులు వుంది రమ్మనమని ఈమెయిల్ వచ్చింది. అలాగే వచ్చే నెల కీర్తనల కళ గురించి ఓ వారం శిక్షణ వుంది. దానికి వెళితే కీర్తనల్లొ ఊగిపోవడం ఏంటీ, వాటిల్లో నిపుణిడినే కావచ్చు, మీకూ బోధించవచ్చు అనుకుంటా :) . ప్రభువు మీద భక్తి లేకుండా అలా వెళ్ళొచ్చా అనే గిల్టీనెస్ కూడా వుంది. అందుకే ఏం తోచక ఇలా మీతో పంచుకుంటున్నా.
ఇక్కడ తెలుగు, దేశీ నాస్తికులూ, హేతువాదులూ (నాకు తెలిసినవారు) లేకా, ఇలా ఆధ్యాత్మిక సంఘాలతో కలవలేకా రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నాను. మామూలు స్నేహితులతో బాటుగా మన విశ్వాసానికి చెందిన మిత్రులతొ కూడా గడిపితే మనకూ, మన పిల్లలకూ ఇంకాస్త పరిపూర్ణత చేకూరుతుంది. అలాంటి లోటు మిగతావారు ఏం గుర్తిస్తారో తెలియదు కానీ నాకు అయితే ఆ మాత్రం శూన్యత అర్ధం అవుతూనే వుంది.
హ్మ్ వాళ్ళందరూ భక్తులు అన్నది మీ నమ్మకం కావచ్చు. నాకయితే ఆస్తికులు, నాస్తికులు ప్రత్యేకంగా వేరు వేరు గా ఇంతవరకు కనిపించలేదు.
ReplyDeleteమొదట మీ మనసుకి నచ్చినట్టు చేయండి. ఒకప్పుడు దేవుడిని నమ్మేవారు, ఆ తరువాత నమ్మడం మానేశారు. ఇప్పుడు కూడా మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కేవలం కీర్తనలు నచ్చి వెళ్తున్నారు, అంతే కదా.
ReplyDeleteవినాయకుడు సినిమా లో, ఇదే స్టొరీ . హీరోయిన్ కి దేవుడి మీద నమ్మకం ఉండదు కాని త్యాగరాజు కీర్తనలు పాడుతుంది, తనకి కీర్తనలు, సంగీతం అంటే ఇష్టం. ఇప్పుడు కూడా మీ మనసు సంగీతానికి ఆకర్షితమవుతుంది కాని దేవుడికి కాదు. సో మీరు వెళ్ళచ్చు.
మీరు పరవశం చెందుతుంది ఆ కీర్తనలు/భజనలలోని సంగీతానికి మాత్రమే!
ReplyDeleteనేను కూడా చాలా సార్లు ప్రశ్నించుకుంటు ఉంటాను, భక్తి పాటలు విన్నప్పుడు ఒక రకమైన అధ్బుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఎందువలన అని. అది సంగీతానికి ఉన్న మహిమ కాని దేవుడి కీర్తనల మహిమ కాదు అని అంతరంగం చెపుతుంది. కాని చెంపలు వెసుకుని అంతరంగం గళం నొక్కేస్తూ ఊంటాను.
:))
ఎట్లాగూ రచయితలు కాబట్టి మీరే నాస్తికులకోసం ఓ నాలుగు భజనలూ కీర్తనలూ రాసెయ్యండి :)
ReplyDeleteకళలన్నీ భగవదారాధనలో పెంపొందినవే. ఎందుకంటే ఏ కళ వెనకైనా ఉన్నది ప్రేమ అనే మూలకం. ప్రేమికులు కానివారు కళాకారులు కాలేరు. భగవద్భక్తిలో ఉన్నదీ ప్రేమే. కనుక కళనూ, భగవద్భక్తినీ వేఱుచేసి చూడలేం. సంగీతం భాష లేకుండా అలరించదు. కానీ భాష అనేది భావం లేకుండా ఉండదు. కాబట్టి కీర్తనలూ, భజనలూ విన్నప్పుడు కలిగే ఆనందం భగవద్భావన వల్ల కలిగేదే. అది కేవల సంగీతం అనుకోవడం పొఱపాటు. ఆధ్యాత్మిక బాణీలకు లౌకిక సాహిత్యాన్ని జోడిస్తే అవి ఒరిజినల్ ఆంత ఆస్వాదనీయంగా ఉండవు.
ReplyDeleteI think... wanting to bow-before-someone/something is a weakness. Yes. We are not the only species with this funny weakness. But rarely do we find a "bowable" thingie and so we make up God and then call him awesome, omnipotent etc... and bow.
ReplyDeleteఆసియాలో హీనయానం కన్నా మహాయనం ఎందుకు భారత్, శ్రీలంకల్లో పాపులర్ అయ్యింది అంటే ఇక్కడి ప్రజలు పూజాదికాలు నిర్వర్తించడంలో ఒకరకమైన సంతృప్తిని పొందడానికి మిగిలినవాళ్ళకన్నా ఎక్కువగా అలవాటుపడిపోయారుకాబట్టట. ఎక్కడొ చదివినట్లు గుర్తు.
శరత్ గారు ఇలాంటి ఆలోచనలు చాలామందిలోను ఉంటాయి. నేనయితే నాస్తికత్వం తో అనదం లభిస్తే నాస్తికుడిగా ఉండమంటాను. భక్తి వల్ల ఆనందం పొందగలిగితే భక్తుడిగా ఉండమంటాను. రెండింటి వల్ల మరింత సంతోషంగా ఉంటే రెండింటిని ఆస్వాదించవచ్చు . ఒక మిత్రుడితో ఇలాంటి చర్చే జరిగింది .చదువుకునే రోజుల నుంచే ఆతను నాస్తికుడు, కమ్యునిస్ట్ .. నన్ను మార్క్స్ ఇజం నడి రోడ్ మీద వదిలేసింది మానసికంగా ఆందోళనతో ఉన్నప్పుడు ఏం చేయాలో అది చెప్పలేదు .. గుడి చెప్పింది అన్నాడు ఈ మధ్య గుడికి వెళుతున్నాను మానసికంగా బాగుంది అన్నాడు .( అలా అని ఆతను వెళ్ళే గుడిలో మహత్యం ఉంది అనే ప్రచారం చేయలేదు ) మనకు తెలిసిన ఒక వ్యక్తితో మాట్లాడితే సంతోషంగా ఉంటుంది అలానే కొందరిని చూస్తే ఆందోళన మొదలవుతుంది . అలాంటప్పుడు మనకు సంతోషం కలిగించే వారి తో ఉండి ఆందోళన కలిగించే వారిని వదిలేస్తే సారి
ReplyDeleteమీకో రహస్యం చెబుతా. నిజానికి వీరభక్తులలో కూడా దేవుడి కంటే ప్రసాదం మీదే కన్ను ఉంటుంది. వారి కంటే ముందు మనమే మేక్కేయడం అన్నిటి కంటే శ్రేష్టం.
ReplyDeleteDon't feel guilty, just grab what you can :)
@ మౌళి
ReplyDeleteనిజమే. భక్తులందరిలో నిజమయిన భక్తి ఎంతమందికి వుంటుంది లెండి. నలుగురితో పాటు నారాయణా, పదిమందితో కలిసి గోవిందా అనే వారే ఎక్కువ. వారికంటే ఒక విధంగా నేనే నయమేమో.
@ అజ్ఞాత
నేను దేవుడిని ఇంతవరకూ ఎప్పుడూ నమ్మలేదండీ. నా చిన్నప్పుడు మా అమ్మ గుడులకూ, గోపురాలకూ తీసుకువెళితే పరిశీలిస్తుండేవాడిని అంతే. మరో వైపు మా నాన్న గారు నాస్తిక హేతువాద సభలకూ, సమావేశాలకూ తీసుకువెళుతుండేవారు. కొంతకాలం తరువాత మా నాన్న గారి మతం పుచ్చుకున్నాను.
వినాయకుడు సినిమా చూసాను కానీ మీరు చెప్పింది గుర్తుకులేదు.
@ జలతారు వెన్నెల
సాధారణంగా సంగీతం పాడటానికీ భక్తితో పాడటానికీ కొంత తేడా వుంటుందనుకుంటా. నిజంగా భక్తితో పాడితే అందులో వుండే అంకితత్వం, (ప్రభువు మీద) గురి, నిష్కల్మషత్వం వగైరాలు మనస్సుకి మరింత పూర్ణత నిస్తాయి. అయితే కొంత సాధనతో భక్తి లేకున్నా కూడా ఫోకసుతో ఆలాపిస్తే ఇతరులు కూడా అలాంటి పూర్ణతను అనుభవించవచ్చు అనుకుంటా. చూడాలి.
@ నారాయణ స్వామి
ReplyDeleteనాస్తిక 'మతం' మొదలెట్టమంటారు :)
@ తాడేపల్లి
నిజమే. భక్తి లేకుండా భక్తి పాటలు పాడితే అంత పరిపూర్ణ ఆనందం లభించకపోవచ్చు. అయితే నా ప్రత్యేక పరిస్థితి వల్ల కొంత రాజీ పడి, మరి కొంత కృషి చేసి వీలయినంతగా 'లౌకిక' (!?) తాద్మాత్యం పొందే ఆలోచన నాకు వుంది. నాలో భక్తి లేకున్నా నిజాయితే ఎక్కువ. ఆ గుణంతో చాలామంది సాదాసీదా భక్తులని అవలీలగా దాటేయగలను. ఆ క్రమంలో ముందు ముందు భక్తి భావనలు నాలో ఏర్పడ్డా ఆశ్చర్యం లేదు. చెట్టు ముందా, విత్తు ముందా అనేటువంటి పరిస్థితి నాది అయివుండవచ్చు. లేదా భక్తి అంటే విరక్తి అయినా కలగవచ్చు. ఏదయినా సరే నాలో స్పష్టత వస్తే మంచిదే కదా - ఇలా ద్వైదీ భావనలు లేకుండా. అయినా సరే స్పష్టత రాకపోయినా కూడా ఇలా బ్యాలన్స్ చేసుకుంటూ అలా వెళ్ళిపోగలను. నా బ్లడ్ గ్రూపు AB కి తగ్గట్టుగా నాలో ఓ స్ప్లిట్ పర్సనాలీటీ వున్నట్లుంది. ఒక్కోకప్పుడు ఒక్కో వ్యక్తిత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇదీ.
@ మినర్వా
ReplyDeleteఅలా కూడా అయ్యొండొచ్చు. మనల్ని మనం అర్పించేసుకోవడంలో అదో సంతృప్తి వుంటుంది కాదూ.
దైవత్వం మీద నమ్మకం లేకపోయినా ఆ పూజాదికాలూ, పద్ధతులూ, కీర్తనలూ, సమావేశాలూ ఇష్టంగా అనిపిస్తాయి. నాస్తికత్వంలో అవేమీ పాటించక బోర్ కొడుతోంది. నేను ఇండియాలో వున్నప్పుడు కొంత నయంగా వుండేది. ఆ సభలూ, సమావేశాలకి వెళ్ళేవాడిని. మేధావుల పరిచయాలూ, ప్రసంగాలూ, చర్చలూ, సాన్నిహిత్యం దక్కేవి. విజయవాడ నాస్తిక కేంద్రం ఒక ఆశ్రమంగా చక్కగా అనిపించేది. ఇక్కడికి వచ్చాక కనీసం అవి కూడా దక్కకుండా అయిపోయింది - ఒక్కసారి తప్ప - ఏడాది క్రితం నరిశెట్టి ఇన్నయ్య గారిని ఇక్కడ కలుసుకొని మాట్లాడగలిగాను.
@ బుద్ధా మురళి
ReplyDeleteనేను రెండింటితోనూ సంతోషంగా వున్నా అనిపిస్తోంది. ఇందులో వున్నది అందులో లేదు - అందులో వున్నది ఇందులో లేదు. ఆస్తికత్వంలోని తిరోగమనత్వం , మూఢనమ్మకాలు, దైవ భావన, ఛాందసత్వం వగైరాలు నాకు నచ్చవు. నాస్తికత్వం కొన్ని రకాలుగా నిస్తేజంగా అనిపిస్తుంది. స్టేటిక్కుగా, బోర్ గా అనిపిస్తుంది. ఈ రెండింటినీ తగు పాళ్ళలో నాకు అనువైన విధానంగా మలుచుకోవడమే నాకు మంచిది కావచ్చు. నిజానికి ఓషో మార్గం ఇలా బావుంటుంది కానీ అది ఇక్కడ ఎక్కువ లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి వెతుక్కోవాల్సివస్తోంది.
@ జై గొట్టిముక్కల
దేవాలయాలకి దేవుడి కోసం వెళ్ళేవారికన్నా అమ్మాయిల కోసమూ, ఆహారం కోసమూ వెళ్ళేవారే ఎక్కువుంటారని తెలుసు :)
గుడులకీ చాలామంది పలు రకాల కొర్కెలతో వెళతారు. తమ దేవుడిని తమ స్వార్ధపరమయిన విన్నపాలతో విసిగిస్తారు. అలా చూస్తే నేను నయం కాదూ? స్పిరుచువాలిటీ కోసం తప్ప గొంతెమ్మ కోర్కెలను కోరడం కోసం వెళ్ళడం లేదు కదా :) మీరు సూచించినట్లే చేసేద్దాం.
ఆస్తికులవ్వాలి బాబూ...మీరు ఆస్తికులవ్వాలి....మీరూ ఓ నిత్యానంద స్వామి అవ్వాలి....:p
ReplyDeleteReally liking your blog a lot these days, Sarat.Your humor n the topics you're choosing on nature,farming,deism,health - I can't wait to read your next posts.
ReplyDeleteI was very blue yesterday and reading your blog cheered me up good time ! Thanks a lot !
@ kvsv
ReplyDeleteహ హ. అప్పుడు నేను అరెస్టు కాకుండా చూసే బాధ్యత మీదే సుమీ.
@ అజ్ఞాత
సంతోషం. ఇంకా ఎన్నో ఆనందకరమయిన, వైవిధ్యమయిన విషయాలు జరుగుతున్నాయి కానీ వాటిని అందరితో పంచుకోవడానికి అనుమతి లేదు. నా ప్రస్థుత పరిధులమేరకే ఆంశాలు ఎన్నుకొని వ్రాస్తున్నాను.