ఈమధ్య మాంఛి ఉత్సాహం మీద వున్న కదా. రోజూ రెండు సార్లు బరువులు ఎత్తుతున్నాను కానీ బాడీ బ్యుల్డింగ్ గురించి వ్యాసాలు చదివి నీరసించిపోయాను. అవి చదివాక నా శరీరాన్ని ఓవర్ ట్రైనింగ్ చేస్తున్నానేమోనని అనుమానం వచ్చింది. వారానికి మూడు రోజులు మాత్రమే వెయిట్ ట్రైనింగ్ చేస్తే బావుంటుందని ఆ వ్యాసాల్లో సెలవిస్తున్నారు. అందువల్ల నా ఉత్సాహానికి కాస్త అడ్డుకట్ట వెయ్యాల్సివస్తోంది. రోజు విడిచి రోజు చేస్తూ వారాంతాలు రెండు రోజులు విరామం ఇస్తే బావుంటుంది.
ఇదివరలో జిమ్ము చేసేప్పుడు కూడా బరువులు ఎత్తడం కంటే ప్రతి సెట్టుకీ, ప్రతి వ్యాయామానికీ మధ్య ఇవ్వాల్సిన విరామమే నీరసం తెప్పించేది. దూకుడుగా జిమ్ములో పంపు కొట్టడమే ఇష్టం కానీ వాళ్ళేమో నెమ్మదిగా, నిదానంగా లిఫ్ట్ చెయ్యమంటారు. ఒక సెట్టు అయ్యాక ఒక నిమిషం కానీ అర నిమిషం కానీ ఆగమంటారు. అలాగే వ్యాయామానికీ వ్యాయామానికీ మధ్య కొంత విరామం ఇమ్మంటారు. మొత్తానికి అలా విరామం ఇవ్వడానికి ఈసారి అలవాటు పడి తాపీగా బరువులు ఎత్తుతున్నా కానీ రోజుకి రెండు సార్లు బరువులు ఎత్తాలని దురదగా వుంటోంది. వీళ్ళేమో అంతొద్దు అంటున్నారు. వ్యాయామం అతిగా చేస్తే వచ్చే వచ్చే అవలక్షణాలు ఇవండీ. ఇందులో కొన్ని నాకూ అనిపిస్తున్నాయి. అలసిన కండరాలు రికవర్ కావడానికి 48-72 గంటలు పడుతుందిట. అందుకే రోజు విడిచి రోజు చేస్తూ మరియు వారానికి ఒక సారయినా రెండు రోజులు ఇలాంటి వ్యాయామానికి విశ్రాంతి ఇవ్వాలంటున్నారు. అందుకే ఎందుకయినా మంచిదని, పెద్దల మాట చద్దన్నం మూట కదా అని వాళ్ళ మాటలని వింటున్నా. అందుకే ఇవాళ జిమ్ముకి సెలవిచ్చి పడేసా. రేపటి నుండి కూడా రోజూ ఒక్కసారే జిమ్ముకి వెళ్ళాలి అనుకుంటున్నా. అందుకు మధ్యాహ్నం వేళ సరిపొతుంది కాబట్టి ఉదయం మరీ పెందరాళే లేవఖ్ఖర్లేదిక.
ఓవర్ ట్రైనింగ్ లక్షణాలు:
Credits: http://www.bodybuilding.com
Probably a typo on your part - you don't need break between repititions (or reps). You need a break between sets.
ReplyDelete@ అజ్ఞాత
ReplyDeleteనిజమే పొరపాటు వ్రాసాను. సవరిస్తాను. ఒక్కో సెట్టుకీ, ఒక్కో వ్యాయామానికీ మధ్య అని వుండాలి.
ఆరుపలకలకి ట్రై చేస్తున్నారా? ;)
ReplyDelete@ వేణూ రాం
ReplyDeleteఅవునండీ :) ప్రస్థుతం నా శరీరానికి వున్న ఆస్తి ఫ్యామిలీ పాక్. దానినుండి ఆరు పలకలకి నా శారీరక ఆస్తిని పెంచాలనేది నా చిరు కోరిక. చూస్తూ వుండండి.
@ఓవర్ ట్రైనింగ్ లక్షణాలు:....ok...mari daani maata Emitee??jk..
ReplyDelete