భారతంలోని ఓ పిట్టకథ మీరు వినేవుంటారు. అర్జునుడు - బాణం - పిట్ట కన్ను అనే పిట్ట కథ అది. ఫోకస్ యొక్క ప్రాధాన్యతను చెప్పే కథ అది. అది సరే కానీ కొన్ని సార్లు ఎక్కువ ఫోకస్ ఎక్కువ సమస్యలని కలగజేస్తుంది. అది ఎలా అంటే ఉధాహరణకు మనం ఓ కొత్త కారు కొన్నామనుకోండి. మన దృష్టి, ఆలోచన అంతా దానిమీదే వుంటుంది. ఎక్కడ ఏ గీత దానిమీద పడుతుందో అని ఆందోళన పడుతూవుంటాం. కొత్త కారే కాదు, కొత్త పెళ్ళాం వచ్చినప్పుడు కూడా అలాగే వుంటుంది. ఎవడు, ఎక్కడ కన్నేస్తాడో, ఎక్కడ గీరేస్తాడో అని బేంబేలు పడిపోతుంటాం.
ఈమధ్య ఓ స్నేహితుడిని అతని ప్రేయసి తిరస్కరించింది. కారణం అతగాడు ఆమె మీద అతిగా ఫోకస్ పెట్టడం. అలా అతని దృష్టీ, ఆలోచనలు అస్తమానం ఆమె ప్రసరిస్తూ వుండటంతో అభద్రతా భావనకు లోనయ్యి పలు అనుమానాలతో వేధించేవాడు. ఏడాది క్రితం నేను ఇండియాకు వచ్చినప్పుడు వారికి రాజీ కుదిర్చి మావాడి లోపాలు అతనికి తెలియజెప్పి ఫోకస్ ఎక్కువగా కెరీర్ మీద పెట్టి తక్కువ ఫోకస్ ప్రియురాలిమీద పెట్టెయ్యమని సూచించాను. నా మాటలు విని అతని ప్రియురాలు అతనికి ఒక అవకాశం ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే మావాడు మాట నిలబెట్టుకోలేదు. రింగన్న పురుగులాగా ఆమె చుట్టూ తిరుగుతూ, ఆలోచనలు ఆమె చుట్టూరా పరిభ్రమింపజేస్తూ ఆమెను వేధించేవాడు. కొన్ని నెలలు చూసి విసిగి, వేసారి అతనికి చివరికి వీడ్కోలు చెప్పింది. పెళ్ళికి ముందే ఇంతగా మానసికంగా చిత్రవధ చేస్తున్నాడు పెళ్ళయితే పీకలదాకా కూరుకుపోతానని ఆమె అతని నుండి మనసు మళ్ళించింది.
ఇంకో ఉదాహరణ కూడా చెబుతాను. మా ఇంకో స్నేహితుడు తన మాజీ లవరుతో తాజాగా ప్రేమాయణం మొదలెట్టి కొన్నేళ్ళుగా నడిపిస్తున్నాడు. ఇతనికీ పెళ్ళయ్యింది, పెద్ద పెద్ద పిల్లలున్నారు - అటు ఆవిడదీ అదే స్థితి. సరెలే వాళ్ళిద్దరూ ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు అనుకున్నాను. కాదట, విపరీతమయిన అనుమానాలతో పలు రకాలుగా మావాడు వేధిస్తున్నాడట. ఆమె ఇండియా నుండి నాకు ఫోన్ చేసి మొరబెట్టుకొని మీ స్నేహితుడిని మీరే మార్చాలి - లేకపోతే ఇక నాకు చావే గతి అని విపులంగా చెప్పింది. ఆమె చాలా మానసిక మాంద్యంలో పడిపోయింది. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు నిజంగానే కనిపించడంతో ఆందోళన చెంది ఆమెని భూమిక హెల్ప్ లైనుకి ఫోన్ చెయ్యాల్సిందిగా బలవంతంగా నచ్చచెప్పాను. మరి ఫోన్ చేసిందో లేదో నాకు తెలియదు. ఆమెతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా నాకు లేవు. అంతా విని ఓరి దరిద్రుడా అని మా ఫ్రెండు గురించి ఆశ్చర్యపోయాను. అక్కడా సమస్య అదే. ఆమెను మామూలుగా ప్రేమిస్తే బాగానే వుండేది. అతిగా ప్రేమిస్తుండటం వల్ల ఆమె మీద ఆలోచనలు ఎక్కువెక్కువయ్యి అవి అనుమనాలుగా రూపాంతరం చెంది వేధింపులుగా పరిణామం చెందాయి. మా స్నేహితునితో ఆ విషయం విపులంగా చర్చించి తనలోని లోపం ఏంటో చెప్పి కన్విన్స్ చేసాను కానీ మావాడిది కుక్క తోక వంకర టైపు కాబట్టి నా మాటలు పెద్దగా పనిచెయ్యకపోవచ్చు.
అంతెందుకు నా తొలి ప్రేమలో కూడా నేను అలాగే తలమునకలవుతూ ఆమెను పలు రకాలుగా విసిగించేవాడిని. అందుకేనేమో పెళ్ళి చేస్కుందామని నేనంటే ఆమె నన్ను లైట్ తీసుకుంది. కొన్నేళ్ళయ్యాక చూద్దాంలే అంది. దాంతో నాకు వళ్ళు మండి ఆమెని వదిలేసాను. మా ఫ్రెండ్సు కి కూడా నా ఉదాహరణ చెప్పి అలా విసిగించకండయ్యా బాబూ అని చెప్పాకానీ ఎక్కడా వాళ్ళు వింటే కదా.
Moral story: Birds of the same flock fly together and become friends.
ReplyDelete